“నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది, సోదరా,” అని ఒక మొగ గొంతు బదులిచ్చింది. “చివరిసారి నిన్ను చూసినప్పుడు, నిన్ను రెస్క్యూ హెలికాప్టర్లో ఎక్కిస్తున్నాము. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు.”
నేను ఒక లోతైన శ్వాస తీసుకుని మెట్లు దిగడం మొదలుపెట్టాను.
“అవును, అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి కదా ?” అని జస్వంత్ అన్నాడు. “నేను ఇంకా బ్రతికి ఉన్నందుకు సంతోషిస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు మరింత సంతోషంగా వుంది. నేను వెళ్లిపోయినప్పటి నుండి నీకు కూడా కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురయ్యాయని విన్నాను.”
నేను వారి సంభాషణ వింటూ హాలులో ముందు తలుపు వైపు నడవడం మొదలుపెట్టాను. నేను మెయిన్ తలుపు వైపు తిరిగినప్పుడు, ఇద్దరు పురుషులు నిలబడి మాట్లాడుకోవడం చూశాను.
జస్వంత్ కంటే కొన్ని అంగుళాలు పొడవుగా ఉన్న భాస్కర్, వెంటనే నా వైపు చూశాడు.
“తను ఎవరు ?” అని అతను ఏమాత్రం సంకోచించకుండా అడిగాడు.
జస్వంత్ నా వైపు తిరిగి చూసి కళ్ళు తిప్పాడు.
“ఓహ్, తను అక్షర,” అని అతను అన్నాడు. “ఆమె నా స్నేహితుడి చిన్న చెల్లెలు. ఆమె కొంచెం మొండిది, అందువల్ల ఆమె నిన్ను ఇబ్బంది పెట్టకుండా చూసుకో.”
నేను జస్వంత్ దురుసైన వ్యాఖ్యని పట్టించుకోకుండా ఆ అపరిచితుడి దగ్గరికి నడిచి వెళ్లి, నన్ను పరిచయం చేసుకోవడానికి చేయి చాపాను.
“జస్వంత్ నిన్ను ఇబ్బంది పెట్టకుండా చూసుకో…” అని నేను అన్నాను. “అతను కొంచెం వెర్రి వెధవ అనుకుంటా.”
భాస్కర్ నన్ను నెమ్మదిగా పైనుండి కింది వరకు చూసి, చివరికి నా చేయి కలపడానికి తన చేయి చాచాడు.
“నేను భాస్కర్,” అని అతను అన్నాడు.
అతను నా చేయిని గట్టిగా పిండడంతో నా ముఖం వెంటనే ఎర్రగా మారింది. నేను అతనిని పూర్తిగా ఆకర్షితురాలినై చూశాను.
అతనికి గుండు గీసిన తల, ముదురు, దాదాపు నల్లటి కళ్ళు ఉన్నాయి. అతనికి చక్కగా కత్తిరించిన, నల్లటి గడ్డం ఉంది, నేను అతని శరీరం వైపు చూసినప్పుడు, అతను కూడా జస్వంత్ లాగానే కండలు తిరిగిన శరీరంతో ఉన్నట్లు గమనించాను. అతను నల్లటి, పొడవాటి చేతుల చొక్కా వేసుకున్నప్పటికీ, దాని కింద దాగి ఉన్న అతని పెద్ద, కండలు తిరిగిన ఛాతీని నేను చూడగలిగాను.
సైనిక దళంలోని వాళ్ళందరూ ఇంత మంచి ఆకారంలో ఉంటారా, లేదా ప్రత్యేక దళాల వారు మాత్రమే ఇలా వుంటారా ?
“నేను అక్షర,” అని చివరికి చెప్పాను.
చివరికి భాస్కర్ నా చేయిని వదిలేశాడు, నా చేయి నా పక్కకి పడిపోయింది. అయినా నేను ఇంకా అతనినే చూస్తూ ఉన్నాను. నన్ను నేను ఆపుకోలేకపోయాను.
జస్వంత్ భాస్కర్ ని లోపలికి రమ్మని సైగ చేశాడు.
“లోపలికి రా, సోదరా,” అని అతను అన్నాడు. “నువ్వు చాలా దూరం నుండి వచ్చావు, మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి అని నేను అనుకుంటున్నాను.”
భాస్కర్ అంగీకారంగా తల ఊపి లోపలికి అడుగు పెట్టాడు. అతను నడుస్తున్నప్పుడు అతని కండలు తిరిగిన భుజాలు కదులుతున్న తీరుని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను, అతని ప్రతి అడుగుకి అనుగుణంగా అవి కదులుతున్నాయి. అతను లోపలికి అడుగు పెట్టగానే, అతను తన చొక్కా చేతులని పైకి మడిచాడు.
వావ్…
అతని చేతులు మణికట్టు నుండి మోచేతుల వరకు పూర్తిగా టాటూలతో నిండి ఉన్నాయి. అతని కుడి ముంజేయి మీద స్పష్టంగా కనిపించే ఒక టాటూ తప్ప అవి ఏమిటో నాకు సరిగ్గా తెలియలేదు. అది ఒక గ్రెనేడ్ పేలుతున్నట్లుగా ఉన్న వివరణాత్మక టాటూ, దాని శకలాలు అతని చర్మంపై ఎగిరిపడుతున్నట్లుగా ఉంది.
అబ్బాయిల మీదుండే టాటూలు నాకు చాలా ఇష్టం, భాస్కర్ మీద వాటిని చూడటం వల్ల నేను అతని పట్ల మరింత ఆకర్షితురాలినయ్యాను. అయితే, నేను నన్ను అదుపులో ఉంచుకోవాలని నాకు తెలుసు, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, నేను జస్వంత్ యొక్క బిడ్డతో గర్భవతిని.
“భాస్కర్, మీకు త్రాగడానికి ఏదైనా తీసుకరానా ?” అని నేను అతని వైపు చూసి సిగ్గుతో నవ్వుతూ అడిగాను.
జస్వంత్ తల అడ్డంగా తిప్పాడు, స్పష్టంగా విసుగు చెందినట్లు ఉన్నాడు.
జస్వంత్ ఇప్పుడు అసూయపడుతున్నాడా ?
భాస్కర్ తల ఊపాడు.
“తప్పకుండా అక్షరా,” అని భాస్కర్ అన్నాడు. “నేను ఒక బీర్ లేదా మీ దగ్గర ఏమున్నా తీసుకుంటాను.”
నేను నా టీచర్ ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న చిన్న పిల్లలా నవ్వి, తర్వాత మెయిన్ గది నుండి వంటింటి వైపు తిరిగాను. నేను వెళ్ళగానే, భాస్కర్ ఇంకా జస్వంత్ మాట్లాడుకోవడం విన్నాను, వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారా అని వెంటనే అనుకున్నాను.
నేను త్వరగా భాస్కర్ కోసం ఒక బీర్ తీసుకుని, తర్వాత ఇద్దరు మాజీ సైనికులు సోఫాలో కూర్చున్న లివింగ్ రూములోకి వెళ్ళాను.
“ఇదిగో, భాస్కర్,” అని చల్లటి బాటిల్ ని అతనికి అందిస్తూ అన్నాను.
అతను దానిని నా నుండి తీసుకున్నాడు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తర్వాత నేను అక్కడ లేనట్లుగా జస్వంత్ తో మాట్లాడటం కొనసాగించాడు.
“సరే, ఆ ఒక్క రాత్రి ఎడారిలో ఏమి జరిగిందో నీకు గుర్తుందా ?” అని అతను అడిగాడు. “నేను ఆ చెత్త సంఘటనని ఎప్పటికీ మరచిపోలేను. నేను దాని గురించి ప్రతి రోజూ ఆలోచిస్తాను.”
