ఇంటి యజమాని 11 112

మరాఠి లక్ష్మి నన్ను పూర్తిగా విశ్వసించింది.. నేను చెప్తే వెళ్ళరు అంది.. సరే నీ ఆఫీస్ కి పద, నేను నీతో వస్తా అని ఇద్దరం సంతోష్ ఆఫీస్ కి వెళ్ళాం, లక్ష్మి ని అక్కడ కూర్చో పెట్టి, షేజియా ని పిలిచి, రికవరీ టీంని బయట నిలబడమని ఆపేసాం.. వాళ్ళ DMD కి ఫోన్ చేసి, ఈ కంపెనీ మేము తీసుకుంటున్నాం, ఎక్స్చేంజ్ లో చెప్పాక, మిమ్మల్ని సెటిల్ చేస్తాం అని చెప్పా.. సార్ మీరు సెటిల్ చెయ్యకండి, ఆ లోన్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నాడు.. నాకు లోన్ కావాలసి నప్పుడు నేనే చెప్తా, ఇప్పటికి ఈ అకౌంట్ క్లోజ్ చేద్దాం అని చెప్పా.. అతను షేజియాకి ఫోన్ చేసి చెప్పాడు.. షేజియా నాకు బై చెప్పి సాయంత్రం ఫోన్ చేస్తా అని బయలు దేరింది. వాళ్ళంతా వెళ్ళాక తుఫాన్ వెలిసినట్లైంది అందరికీ.. లక్ష్మి, ఆమె తల్లి తండ్రులు నా చేతులు పట్టుకుని మళ్ళీ గద్గద స్వరం తో దేవుడే మిమ్మల్ని పంపించాడు, ఏ జన్మలో ఋణమో ఈరోజు వీళ్ళ తాకిడి మేము విషం త్రాగి చద్దామని అనుకున్నాం, మీరు మమ్మల్ని కాపాడారు అన్నారు… నేను లక్ష్మి, ఈ ఫాక్టరీ 30 కోట్లకి పైగా ఉంటుంది.. నేను లోన్ పే చేసాక కూడా దీనిలో నీకు భాగం వస్తుంది.. నువ్వు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు, సంతోష్ తయారు చేసిన ఈ కంపెనీ ని అభివృధి చెయ్యి. నేను నీతో ఉంటాను… నమ్మకం ఉంటే ఇప్పుడు నన్ను ఫాక్టరీ లోకి తీసుకుని వెళ్ళి నాకు అంతా చూపించు అన్నాను.. అప్పటికే పెద్దాయనకి నా మీద నమ్మకం గౌరవం కలిగింది.. నేను రంజిత కి ఫోన్ చేసి, పూణె లో ఇల్లు ఒకటి కావాలి ఏర్పాటు చెయ్యమని చెప్పా.. అలాగే పూణె లో ఒక కంపెనీ కొనడానికి ఫైనల్ చేసామని కూడా చెప్పా.. గవర్న్మెంట్ తో అగ్రిమెంట్ చేసిన రెండు వారాల్ల్లో పని ప్రారంభించినందుకు సంతోషించింది.. అలాగే గవర్న్మెంట్ లో ఇంఫార్మ్ చేస్తా అని చెప్పింది.. నాకు ఇల్లు చూసి పెట్టడానికి డిపార్ట్మెంట్ వాడు కాసేపటికి ఫోన్ చేసాడు.. అతనికి నాకు కావాల్సింది చెప్పా.. తర్వాత మరాఠీ లక్ష్మి నన్ను ఫాక్టరీ లోకి తీసుకుని వెళ్ళి మొత్తం చూపించి ప్రాసెస్ అంతా ఎక్స్ ప్లైన్ చేసింది.. ప్రాసెస్ మీద పూర్తి పట్టు ఉంది మరాఠి లక్ష్మికి.. లంచ్ చేసాక, జీతాలు ఇవ్వటం లేదని వెళ్ళిపోయిన వర్కర్లు అందరినీ పిలిచాం.. రెండు రోజుల్లో అందరికీ జీతాలు ఇస్తామనీ రేపటి నుండీ పనికి రమ్మనీ చెప్పాం.. సాయంత్రం 4:30 కి మా వాళ్ళు చెన్నై నుండి వచ్చేసారు… మా వాళ్ళు వచ్చాక లక్ష్మి వాళ్ళకి నేనెవరో, మా గ్రూప్ ఏంటో, వాళ్ళు ఎంత సేఫ్ హాండ్స్ లో ఉన్నారో అర్థం అయ్యింది.. అశొక్ కుమార్, ప్రియాంక మరాఠీ మూలాలు ఉన్న వాళ్ళు, పెద్ద వాళ్ళకి అంతా అర్థం అయ్యేట్లు చేసి, వాళ్ళని సమాధాన పరిచారు.. అరవింద, జయశ్రీలు మా అందరికీ హోటల్లో రూం లు బుక్ చేసారు.. అందరం హోటల్ కి వెళ్ళాక, మరాఠీ లక్ష్మిని, ఫ్రెష్ అయ్యి, మీటింగ్ రూం కి రమ్మని చెప్పాం.. పెద్ద వాళ్ళు, పిల్లలు రూముల్లో ఉన్నప్పుడు, నేను డైరెక్షన్స్ ఇచ్చాను.. మహారాష్ట్ర గవర్న్మెంట్ తో అగ్రీమెంట్ చేసుకున్నాక, ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసినట్లుగా తమిళ్, శ్రీధరన్, స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఇంఫర్మేషన్ ఇస్తారు.. 20 కోట్ల రూపాయల విలువైన షేర్లు మరాఠీ లక్ష్మి కి మేము అలాట్ చేస్తాము.. అవెలాగైనా 40 – 50 కోట్లకి ఒక సంవత్సరం లో పెరిగిపోతాయి.. కంపెనీ ఎం.డి. కి అధికార నివాసం గా ఉండటానికి కంపెనీ 5 కోట్ల రూపాయల బంగ్లా ఒకటి కొని అలాట్ చేస్తుంది.. కంపెనీ సి.ఈ.ఓ. కి ఇతరులకి ఒక్కొక్క కోటి రూపాయల ఇల్లు కొని ఇస్తుంది.. మరాఠీ లక్ష్మి ఎం.డి. గా నియమించ బడుతుంది..అశోక్ కుమార్ సి.ఈ.ఓ., ప్రియాంక అతనికి సెక్రెటరీ, చందన ప్లాంట్ అంతా సెట్ చేసి చెన్నై రిటర్న్ వచ్చేస్తుంది.. హేమ ఇక్కడ ఫైనాన్స్ అంతా చూస్తుంది.. ఆమెకి కోటి రూపాయల ఇల్లు కంపెనీ ఇస్తుంది..తమిళ్ మరియు శ్రీధరన్ ఈ పనులన్నీ పూర్తి చేసి రిటర్న్ వచ్చేస్తారు.. మరాఠీ లక్ష్మి లేచి నిలబడి ఆనందం తో కొన్ని మాటలు చెప్పింది.. అందరూ ఫ్రెష్ అయ్యి వస్తే డిన్నర్ చేద్దాం అని చెప్పా.. అందరూ తమ తమ రూములకి వెళ్ళారు, శ్రీధరన్ ని, హేమ ని ఉండమన్నాను.. గవర్న్మెంట్ అగ్రీమెంట్ లో ఈ ఇన్వెస్ట్మెంట్ తీసుకుని రావాలి అని చెప్పా..అప్పటికే శ్రీధరన్ ప్లాన్ చేసే సారు.. మీ మామయ్య కి ఈ తెలివి తేటలు లెవ్వు సార్ అని నవ్వాడు.. అందరం డిన్నర్ లో కలుద్దాం అని చెప్పి నా రూం కి వచ్చేసా..అందరూ డిన్నర్ చేస్తున్నారు, పెద్ద వాళ్ళు పిల్లలు ఏమి జరిగిందో తెలియలేదు సడన్ గా అంతా హాపీ గా జరిగి పోతూ ఉండటం తో వాళ్ళు కేరింతలు కొడుతున్నారు.. ఒకరి బలహీనతని తీసుకుని వాళ్ళ ఆస్తులన్నీ కొట్టేస్తే, అలాంటివి ఎప్పటికీ నిలబడవు.. మరాఠీ లక్ష్మి నాకు పూణె లో కాలు పెట్టడానికి అవకాశం ఇచ్చింది.. ఆమెకి నా వలన మేలు కలగాలే కానీ, బాంక్ భూతాలని వాళ్ళకి చూపించి, ఆమెని వెళ్ళ గొట్టే పిరికి వాడిని కాదు నేను… నా పేరు రాజేశ్వర్.. చందన నా దగ్గరికి వచ్చి, బావా నీ రూం నంబర్ ఎంత అని అడిగింది, ఆమెకి రూం కీ ఇచ్చా.. ప్రొద్దున్నే 8:00 గంటలకి బయలుదేరి కంపెనీకి వెళ్దాం అని చెప్పి నేను నా రూం కి వెళ్ళిపోయా.. ఏదో చేద్దాం అని వచ్చా, ఏదో అయ్యింది, అంతా మన మంచికే అనుకుంటూ నా రూం కి వచ్చేసా.. డ్రింక్ ఆర్డర్ చేసి, తండూర్ ఫిష్ ఆర్డర్ చేసా.. మొదటి పెగ్ అయ్యేసరికి చందన నా రూం లోకి వచ్చింది..