స్స్స్ ……
బుజ్జిజానకి : నవ్వుకుని , అమ్మ చూస్తోందా మహేష్ ……
చూస్తున్నారా అని చిన్నగా అడుగుతావేంటి అమ్మకూచీ …… , అసలు అమ్మ అమ్మ …… అంతులేని ఆనందాలతో ఉప్పొంగిపోతుంటేనూ …… , పెద్ద ….. దేవతమ్మ చెప్పలేదా ఈ విషయం అంటూ బాబును నాపై పడుకోబెట్టుకున్నాను .
బుజ్జిజానకి : దేవతమ్మానా లేదే …… , నువ్వు చెబుతుంటేనే కళ్ళ ముందు అమ్మ మెదులుతోంది మహేష్ …… లవ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ , మహేష్ మహేష్ ….. నాకూ బాబులానే నీగుండెలపై పడుకోవాలని ఆశగా ఉంది .
అంతలో మహీ మహీ …… అంటూ ఇరుగుపొరుగు ఆడవారు లోపలికివచ్చారు , హమ్మయ్యా ….. ఇప్పటికైనా కళ్ళు తెరిచావు సంతోషం , నువ్వు చెప్పిన దేవతలు వచ్చారా …… ? .
బుజ్జిజానకి : నాతోపాటు లేచి కూర్చుని , వచ్చారు అంటీలూ – బామ్మలూ …..లోపల ఉన్నారు .
నీకోసం టిఫిన్స్ తీసుకొచ్చాము – ఆఫీసస్ టైం వెళ్ళాలి సాయంత్రం కలుస్తాము అంటూ ప్రక్కన క్యారెజస్ ఉంచి చాలా సంతోషం అనిచెప్పి వెళ్లారు .
ఇక బామ్మలు ఊరికే ఉంటారా ….. , మహీ ….. ఎవరీ అబ్బాయి ? .
బుజ్జిజానికికి అర్థమైపోయి నవ్వుకుంది , నా బెస్ట్ ఫ్రెండ్ బామ్మలూ …..
బామ్మలు : ఈ సమయంలో ఫ్రెండ్స్ అయినా అబ్బాయిలతో కలవనేకూడదు .
బుజ్జిజానకి : బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు బామ్మలూ …… , ప్రాణ స్నేహితుడు – well wisher – మై స్వీట్ హార్ట్ – మై everything ….. మొత్తంగా చెప్పాలంటే నా దేవుడు అంటూ నాచేతిని చుట్టేసింది గట్టిగా ……
బామ్మలు : అవాక్కయ్యారు ……
వచ్చారా ఇంకా రాలేదే అనుకున్నాను అంటూ అమ్మమ్మ బయటకువచ్చారు .
బామ్మలు : అధికాదే మహి చూడు ఎలా హత్తుకుందో ……
అమ్మమ్మ : దేవుడని చెప్పింది కదా ….. నాకెలాంటి తప్పూ అనిపించడం లేదు రండి కాఫీ తాగి వెలుదురుగానీ ……
బామ్మలు : మనవళ్ళను కాలేజ్ కు రెడీ చెయ్యాలి , ఎవరో దారిన వెళుతూ ఈ విషయం చెబితేనూ జాగ్రత్తపడమని చెప్పేందుకు వచ్చాము .
అమ్మమ్మ : దేవుడి ప్రక్కన ఎంత సేఫ్ గా – ధైర్యంగా – సంతోషంగా ఉందో చూడండి అంటూ మాఇద్దరి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
బామ్మలు : అంతేనా ….. ? .
అమ్మమ్మ : అంతే అంటూ కాస్త కటువుగానే బదులిచ్చారు .
బామ్మలు : ఇంతదానికి కోపం దేనికి , ఏదో జాగ్రత్త అని చెబుతున్నాము , పిల్లలను కాలేజ్ కు పంపాలి తరువాత వస్తాము అనిచెప్పి గుసగుసలాడుకుంటూ వెళ్లిపోయారు .
అమ్మమ్మ : వీళ్ళు మారరు పట్టించుకోకండి నా బంగారు కొండలు అంటూ ముద్దులుపెట్టారు , బాబును ఎత్తుకుని బుజ్జిజానకీ …… మహేష్ కు ఆకలివేస్తోందేమో లోపల అంతా మీకోసమే ఎదురుచూస్తున్నారు టిఫిన్స్ వేడిచేస్తున్నారు , ఆత్రమేమీ లేదు రండి పైగా దారినపోయేవాళ్ళ దిష్టి కూడా తగులుతోంది లోపల మీఇష్టం ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు అనిచెప్పి క్యారీజీలు తీసుకుని లోపలికివెళ్లారు .
బుజ్జిజానకి : విన్నావుకదా లోపలికి వెళదాము పదా అంటూ నా చేతిని పట్టుకునే లేచింది .
బయట ఉంటేనే అలా మాట్లాడుకుంటున్నారు ఇక లోపలికివస్తే ……
బుజ్జిజానకి : ఏమైనా అనుకోనివ్వు , అమ్మమ్మే బాధపడదు , దేవతలూ – అక్కయ్యలకైతే సంతోషం …… , నువ్వే కదా స్నానం తరువాత వస్తానని ప్రామిస్ చేసావు ……
ప్రామిస్ ? , ప్రామిస్ అయితే చెయ్యలేదు .
చేసాడు చేసాడు నేను చూసాను అంటూ గుమ్మం దగ్గర పెద్దమ్మ కొంటెగా నవ్వుతున్నారు .
బుజ్జిజానకి : లవ్ యు దేవతమ్మా ….. , దేవతమ్మ చెప్పారంటే కరెక్ట్ ……
వద్దు అమ్మకూచీ ……
పెద్దమ్మ : వదలకు మహేష్ కూచీ ….. , ఇప్పుడు లోపలికి రాలేదంటే ఇక ఐదు రోజులూ రాడు .
బుజ్జిజానకి : అమ్మో అలా జరగనివ్వను .
పెద్దమ్మ : దేవతలందరికీ ఆకలేస్తోంది – మా బుజ్జిజానకికి ప్రేమతో తినిపించి తినాలని ఆశపడుతున్నారు పైగా తల్లులకు exam సమయం అవుతోంది .
బుజ్జిజానకి : దొరికావు , నువ్వు లోపలికి వస్తేనేకానీ నేను తినను , నాకు తినిపించి తింటేనేకానీ అక్కయ్యలు exam కు వెళ్ళరు ఆలోచించుకో అంటూ నాచేతిని చుట్టేసి ప్రక్కనే కూర్చుంది బుంగమూతితో ……
ఇక వస్తాడులే వంటలన్నీ డైనింగ్ టేబుల్ పై ఉంచుతాము అంటూ లోపలికివెళ్లారు పెద్దమ్మ .
ఇక మార్గం లేనట్లు పదా అమ్మకూచీ అన్నాను .
బుజ్జిజానకి : యాహూ ….. లవ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టింది , లవ్ యు అక్కయ్యలూ ….. మీవల్లనే అంటూ లేచి నన్నూ లేపి నాచేతిని చుట్టేసి మరొక చేతిలో ఫైల్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ లోపలికి పిలుచుకునివెళ్లారు .
లోపలికి రావడానికి కూడా ఇంతలా బ్రతిమాలించుకోవాలా ….. , తల్లి బుజ్జిజానకి పిలిచింది రాలేదు – అమ్మ పిలిచింది రాలేదు – దేవతమ్మ పిలిచింది రాలేదు …… , ఈ అల్లరి పిల్లాడిని కంట్రోల్ లో పెట్టాలి .
లవ్ టు అంటీలూ ……
బుజ్జిజానకి : రాకపోతే దేవతలు టిఫిన్ చెయ్యరు – అక్కయ్యలు exam కు వెళ్ళరు అని చెబితేనేకానీ రాలేదు అత్తయ్యలూ ….. , మీకోసం వచ్చాడు .
అంటీలు : మొదట మురిసిపోయారు ఆ వెంటనే అన్నీ నాటకాలు ……
అక్కయ్యలు : మాకోసం వచ్చావా తమ్ముడూ ……
ఊహూ ….. దేవతలకోసం అంటూ తలదించుకునే కళ్ళతో సైగచేసాను .
అక్కయ్యలు : ఒక చిన్న చిన్న అపద్దo …… పొంగిపోయేవాళ్ళం అంటూ నా బుగ్గలపై గిల్లేసి చూసారా దేవతమ్మా ….. ఎప్పుడూ అమ్మలూ అమ్మలూ …… , అవునమ్మలూ …… తమ్ముడిని లోపలికే రానివ్వరు అనుకున్నామే పైగా రాత్రి చెంపలు చెళ్లుమనిపించారు కదా …….
మేడమ్ : అవునా ….. ? .
అమ్మమ్మ : అవునా …… ? .
అక్కయ్యలు : దేవతమ్మా ….. మీకుకూడా తెలియదు కదా మీరు అవునా ? అని అనలేదేంటి ? .
పెద్దమ్మ : నవ్వుకుని , ఇప్పుడు అంటాను అవునా …. ? .
అంటీలు : అంత కోపంతో దెబ్బతగిలేలా కొట్టినా ….. అల్లరి ఏమైనా ఆపాడా అడగండి , బాధపడకపోగా థాంక్యూ సో మచ్ ఫర్ టచ్ అంటూ మమ్మల్నే కవ్వించాడు .
అవునా అవునా అవునా ….. అంటూ నవ్వులు ఆగడం లేదు .
అంటీలు : అసలు రాత్రి ఏమిచేశాడో తెలుసా ? .
పెద్దమ్మ : పెద్ద తప్పే చేసి ఉంటాడు లేకపోతే దేవతలు ఊరికే శిక్షిస్తారా ఏమిటి ? , ఒక్క దెబ్బతో ఆగి ఉండాల్సినది కాదు అంటూ నావైపు కన్ను కొట్టారు .
లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .
బుజ్జిజానకి – అక్కయ్యలు : దేవతమ్మా ….. ఇలానే మీరు ప్రతీసారీ అగ్నికి ఆజ్యం పోస్తూ మరింత రెచ్చగొడుతున్నారు అమ్మలను అంటూ చుట్టూ చేరారు .
పెద్దమ్మ : చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది మహేష్ కూచీ – తల్లులూ ….. , ఎంత దూరమైతే అంత దగ్గరవుతారు ……
బుజ్జిజానకి : దేవతమ్మ చెబితే జరిగి తీరుతుంది అక్కయ్యలూ అంటూ చిరునవ్వులు చిందిస్తున్నారు , సమయం వచ్చినప్పుడు మీరూ ఆజ్యం పొయ్యాలి మరి ……
అక్కయ్యలు : ఇప్పుడు చూడండి , అమ్మలూ ….. రాత్రి జరిగినదానితో లోపలికే రానివ్వరు అనుకుంటే ఆలస్యమయ్యింది అంటూ కోప్పడుతున్నారు .
అంటీలు : మనందరినీ …… డిస్టర్బ్ మరియు మనతో మాట్లాడనంతవరకూ ఎక్కడికైనా వెళ్ళవచ్చు రావచ్చు , తల్లి బుజ్జిజానకి కాదు కాదు చెల్లి జానకి సంతోషం కంటే ఇంకేమి కావాలి …… , ఆ అల్లరి పిల్లాడు లోపలికి వచ్చినందుకు చెల్లి జానకి ఎంతలా ఆనందిస్తుందో చూడండి .
బుజ్జిజానకి : అమ్మ చెల్లినా …. ? అత్తయ్యలూ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అంటూ సోఫాలో కూర్చున్న ముగ్గురినీ వెనకనుండి హత్తుకుని బుగ్గలపై ముద్దులుకురిపిస్తున్నారు , నావైపు చూసి నీవికూడా ……
అఅహ్హ్ …… అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పడబోయాను .
అంటీలు : తల్లులూ తల్లులూ తల్లులూ …….
అక్కయ్యలు : పట్టేసుకున్నాము అమ్మా తమ్ముడిని అంటూ నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు నవ్వుకుంటూ ….
అంటీలు : తల్లులూ నో ముద్దులు ……
అక్కయ్యలు : తమ్ముడు పెట్టలేదు అమ్మలూ మేమే ముద్దులుపెట్టాము …..
అంటీలు : కండిషన్స్ క్లారిటీగా పెట్టి ఉంటే బాగుండేది .
అందరూ నవ్వుకున్నారు .
అమ్మమ్మ : చిరునవ్వులు చిందిస్తూనే ….. , తల్లులూ – బుజ్జితల్లులూ ….. ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాము తరువాత మీఇష్టం …… , రండి రండి అంటూ డైనింగ్ టేబుల్లో కూర్చునేలా చేశారు , బాబును డైనింగ్ టేబుల్ మధ్యలో కూర్చోబెట్టారు .
అక్కయ్యలు : ఫీల్ అయ్యింది చాలు తమ్ముడూ అదిగో ఎదురుగా నీ దేవతలు – ప్రక్కనే నీకూచీ అంటూ చెవులలో గుసగుసలాడి కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చున్నారు – మేము వడ్డిస్తాము మేము వడ్డిస్తాము అంటూ లేచారు .
పెద్దమ్మ : exam ఉంది కాబట్టి నో అంటూ కూర్చోబెట్టి , అమ్మమ్మ – దేవతలు వడ్డించారు .
బుజ్జిజానకి : దేవతలూ – అమ్మమ్మా ….. మీరూ కూర్చోండి అందరమూ కలిసి తిందాము .
దేవతలు : లవ్ టు జానకీ …… , ముందైతే నీకు తినిపించనివ్వు అంటూ ప్రేమతో గోరుముద్దలు తినిపించి చుట్టూ కూర్చున్నారు .
జానకీ అన్న ప్రతీసారీ అమ్మకూచీ కళ్ళల్లో అందమైన మెరుపు …… , నీవల్లనే అంటూ నావైపు ఆరాధనతో చూస్తోంది .
ఎంజాయ్ అంటూ ఆనందించాను , న్యూ ఇయర్ రోజు నుండీ ఎదురుచూస్తున్నాను దేవ …. అంటీల చేతి వంటల రుచుకోసం ….. మ్మ్ మ్మ్ మ్మ్ అద్భుతం అంతే అమ్మమ్మా వడ్డించండి వడ్డించండి .
అక్కయ్యలు : పాపం అమ్మలు …… తింటున్నారు తప్ప పొగడటం లేదని ఆశతో చూస్తున్నారు , తమ్ముడు పొగడ్తలకు ఆనందించాలో కోప్పడాలో తెలియక ఎలా లోలోపలే ఎంజాయ్ చేస్తున్నారో చూడండి .
అంటీలు : అలాంటిదేమీ లేదులే ……
బుజ్జిజానకి : దేవతల దగ్గరకే వెళ్లి అమ్మ చేతివంట గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏమిటి అంటూ ముద్దులుపెట్టింది .
పెద్దమ్మ : అవునవును చెప్పాలా ఏమిటి …… , మహేష్ కు అయితే ఈ ముగ్గురు దేవతల మెప్పుకోసం తప్పదు అందుకే తెగ పొగిడేస్తున్నాడు .
అమ్మకూచీ వచ్చి ఎంజాయ్ అంటూ నాబుగ్గపై చేతితో ముద్దుపెట్టి కూర్చుంది .
అలా ఒకరికొకరు వడ్డించుకుని చిరునవ్వులు చిందిస్తూ తృప్తిగా తిన్నాము .
అమ్మమ్మను ప్రక్కకులాగి పాత్రలన్నింటినీ శుభ్రం చేసేసారు దేవతలు .
అక్కయ్యలు : నావైపు చూస్తూనే అమ్మకూచీని చుట్టేసి మాకైతే వెళ్లడం ఇష్టమేలేదు సరిగ్గా ఇప్పుడే exams ఉండాలా …… ? .
పెద్దమ్మ : పోస్ట్ ఫోన్ చేయించమంటారా తల్లులూ …… ఆర్డర్ వెయ్యండి .
అక్కయ్యలు : నిజమైతే ఎంత బాగున్నో ప్చ్ ప్చ్ ప్చ్ ….. టైం అవుతోందే అంటూ మరింత గట్టిగా చుట్టేశారు .
బుజ్జిజానకి : అక్కయ్యలను విడిచి మూడు గంటలు నేనూ ఉండలేను , అక్కయ్యలూ ….. కారులో వెళ్లి exam అవ్వగానే వచ్చెయ్యండి .
కారులో కుదరదు బుజ్జిజానకీ …… , అంటీ వాళ్ళు షాపింగ్ వెళ్లాలనుకుంటున్నారు కావాలి ……
అక్కయ్యలు : తియ్యనైనకోపంతో చూస్తున్నారు , అమ్ములు అమ్మలు అమ్ములు ……
పెద్దమ్మ : మన కారులో వెళదాము తల్లులూ ……
అక్కయ్యలు : exam అయిపోగానే అందుబాటులో ఉండాలి కాబట్టి స్కూటీలు ఇక్కడే ఉన్నాయికదా వెళతాములే దేవతమ్మా …… , తమ్ముడూ ….. మాకూ ఒకరోజు వస్తుందిలే ……
ఆరోజుకూడా దేవ ….. అంటీల కోసమే …..
అంటీలు : నీ నాటకాలకు ఫ్లాట్ అయ్యేవారు ఎవ్వరూ లేరిక్కడ ……
పెద్దమ్మ : దేవతలూ ….. అదీ అలా మీరేమాత్రం తగ్గకండి .
అమ్మకూచీ – అక్కయ్యలు …… నవ్వుకున్నారు , మహేష్ ….. అక్కయ్యలను కాలేజ్ వరకూ వదిలిరా ……
లవ్ టు బుజ్జిజానకీ ……
అంటీలు : కండిషన్స్ మరిచిపోయావా ….. ? , తల్లుల వెంట వెల్లనేకూడదు .
పెద్దమ్మవైపు ఆశతో చూసాను .
పెద్దమ్మ : అయితే నేను తోడుగా వెనుకే కాలేజ్ వరకూ వెళ్లి , లంచ్ ప్రిపేర్ చేసుకుని ఒకేసారి వచ్చేస్తాను .
బుజ్జిజానకి : లవ్ యు పెద్దమ్మా ……
మేడమ్ : బుజ్జిజానకీ ….. నేనూ ఒకసారి కాలేజ్ వరకూ వెళ్ళిరావాలి , నిన్న మధ్యాహ్నం నుండీ ఇక్కడే ఉన్నానుకదా బిల్లులన్నీ ఆగిపోయాయి నేను వెళ్లి సంతకాలు పెడితేనేకానీ ఫండ్స్ రిలీజ్ కావు .
పెద్దమ్మ : తల్లులను కాలేజ్ వరకూ అటునుండి మేడమ్ ను కాలేజ్ వరకూ వధులుతాను .
బుజ్జిజానకి : అక్కయ్యలు వెళ్ళాలి , దేవతమ్మ వెళుతోంది , మీరూ వెళ్లిపోతున్నారు …….
కాసేపట్లో మేమూ వెళ్ళాలి అంటూ అంటీలు ……
బుజ్జిజానకి : అత్తయ్యలూ ….. షాపింగ్ కు తరువాత 12 గంటలకు వెళ్ళొచ్చులే అలా వెళ్లి ఇలా వచ్చేయ్యొచ్చు ……
అంటీలు : అమ్మో ….. మా ప్రాణమైన బుజ్జిజానకికి సెలక్షన్ అంటే మినిమం రెండు గంటలైనా చాలవు ఇప్పుడే వెళ్ళాలి …… మధ్యాహ్నం నుండి డిన్నర్ వరకూ ఇక్కడే ఉంటాము బుజ్జిజానకీ ……
బుజ్జిజానకి : అయితే ok అంటూ ఆనందిస్తోంది .
మేడమ్ : అందరినీ చూస్తూ ఫుల్ గా తినేశాడేమో వెంటనే నిద్రపోయాడు .
మేడమ్ ….. మాకివ్వండి మేము చూసుకుంటాము , ఏడిస్తే కాలేజ్ దగ్గరకే తీసుకొస్తానులే ……
మేడమ్ : నువ్వూ – బుజ్జిజానకి – అమ్మ ఉండగా ఏడుస్తాడా చెప్పు అంటూ ముద్దుపెట్టి అందించారు .
ఊయలలో పడుకోబెట్టు మహేష్ అంటూ మూలన ఉంచిన ఊయలను శుభ్రం చేసి రెడీ చేశారు అమ్మమ్మ ……
Wow ఊయల …..
అమ్మమ్మ : నీ బుజ్జిజానకి ఇందులోనే ఊయల ఊగేది మహేష్ ……
డబల్ wow ……
బుజ్జిజానకి : పో మహేష్ సిగ్గేస్తోంది అంటూ అక్కయ్యలు – దేవతలను బయటవరకూ వదిలి తియ్యనైనబాధతో లోపలికివచ్చింది .
అక్కయ్యలను – మేడమ్ ను పెద్ద ….. దేవతమ్మ జాగ్రత్తగా చూసుకుంటారు , దేవతలను ….. సిస్టర్ చూసుకుంటారు , లంచ్ సమయానికి వచ్చేస్తారులే అమ్మకూచీ …… , వాళ్ళను చూడకుండా నేనూ ఉండలేను .
బుజ్జిజానకి : సో స్వీట్ …… , ప్చ్ ….. బయటకు వెళ్లకూడదు కాబట్టి ఆగిపోయాను లేకపోయుంటే అక్కయ్యలను కాలేజ్ కు వదిలి – అంటీని కాలేజ్ లో వదిలి – దేవతలతోపాటు షాపింగ్ కు వెళ్లిపోయేదానిని ……
ఐదురోజుల తరువాత నీఇష్టం అమ్మకూచీ …… కాదు కాదు అమ్మా అమ్మా …… , ఏమంటారు అమ్మమ్మా …..
అమ్మమ్మ : మీఇష్టమే నాఇష్టం అంటూ వంట గదిలోనుండి బదులిచ్చారు .
అమ్మమ్మా ….. పాత్రలన్నీ శుభ్రమైపోయాయికదా వంట గదిలో ఏమిచేస్తున్నారు ? .
ఇదిగో పాత్రలను చక్కగా సెల్ఫ్ లలో ఉంచి వచ్చేస్తాను ……
ఇంతకూ తాతయ్యగారు ఎక్కడ ? .
అమ్మమ్మ : దేవతలు రాగానే టిఫిన్ పెట్టి రోజూ వెళ్లే క్లబ్ కు తోసేసాను మన మధ్యన ఎందుకు అని – తోడుగా మీ తాతయ్య వయసువారు ముగ్గురు ఉన్నారు చుట్టుప్రక్కల …..
క్లబ్ కా ….. ? .
అమ్మమ్మ : త్రాగడానికి కాదులే ఒకేఒక్క వ్యసనం ఉంది జూదం ఆడతాడు అదికూడా కంట్రోల్ లోనే , ఇప్పటివరకూ గెలిచినదే లేదు .
అవునా ….. చూస్తూ ఉండండి ఈరోజు మాత్రం ఇంతవరకూ ఓడిన మొత్తం వడ్డీతోసహా గెలుచుకునివస్తారు ధీరుడిలా …… , పెద్దమ్మా అంటూ తలుచుకున్నాను .
అమ్మమ్మ : వెళ్లినవారు జాగ్రత్తగా వస్తే చాలు ….
ఈరోజు మాత్రం లాభంతోనే వస్తారు – మళ్లీ క్లబ్ వైపు కన్నెత్తి చూడరు చూస్తూ ఉండండి .
అమ్మమ్మ : అలా జరిగితే మా మహేష్ కు బోలెడన్ని ముద్దులు ……
నేనుకూడా నేనుకూడా అంటూ అమ్మకూచీ నాప్రక్కనే కూర్చుంది , మహేష్ చెప్పాడంటే జరిగితీరుతుంది అంటూ చేతిని చుట్టేసింది .
డిస్టన్స్ అమ్మకూచీ …… ఆ బామ్మలు వస్తారన్నారు వచ్చినా వచ్చేస్తారు .
బుజ్జిజానకి : వస్తే రానివ్వు ….. అమ్మమ్మ చూసుకుంటుంది , నీకూ ఇలాకాదు ఉండు అవునూ లోపలికి రమ్మంటే బెట్టు చేసావు ఏమిటి అంటూ దెబ్బలు కురిపించి చేతిపై – బుగ్గపై ముద్దులుపెట్టింది .
నో నో నో అమ్మకూచీ ….. , అమ్మ – అమ్మమ్మ పర్మిషన్ లేకుండా తప్పు తప్పు , అమ్మా ….. ఎంత గట్టిగా కొట్టావు ఉండు అమ్మమ్మకు రాత్రికి అమ్మకు చెబుతాను అంటూ వంట గదిలోకి వెళ్ళాను , అమ్మమ్మా ….. అమ్మకూచీ చూడు కొడుతోంది .
అమ్మమ్మ : సంతోషంతో నవ్వుకున్నారు , అవునా అయితే నీ అమ్మకూచీ ఎక్కెక్కడ కొట్టిందో అక్కడే కాదు ఎక్కడైనా కొట్టు తరువాత నేను చూసుకుంటాను , నాకు …. బుజ్జిజానకి కంటే నువ్వే ప్రాణం …….
అమ్మలా రెడీ అయిన అమ్మకూచీని ఎలా అమ్మమ్మా కొట్టడం – దేవతలకు తెలిస్తే ఇంకేమైనా ఉందా ? .
డోర్ చాటున చేరినట్లు అమ్మకూచీ నవ్వులు ……
అమ్మమ్మ : నీఇష్టం మహేష్ , నా సపోర్ట్ అయితే నీకే ……
లవ్ …. థాంక్యూ అమ్మమ్మా ….. , అమ్మమ్మా ….. దెబ్బలతోపాటు దెబ్బలతోపాటు …….
అమ్మమ్మ : దెబ్బలతోపాటు ……
దెబ్బలతోపాటు కొట్టిన చోట మరియు బుగ్గలపై ముద్దులు ముద్దులుకూడా పెడుతోంది అమ్మమ్మా …… , చేతులతో కాదు పె పె పెదాలతో ……
ఆశ్చర్యంగా అమ్మమ్మ సంతోషంతో నా బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .
అమ్మమ్మా ……
