థర్డ్ MISSION 7 28

అమ్మమ్మ : దెబ్బకుదెబ్బ …… ముద్దుకుముద్దు , నీకూచీ ఎక్కడెక్కడ ముద్దులుపెట్టిందో అక్కడే కాదు నీకిష్టమైన చోటల్లా ముద్దులు పెట్టేయ్యి నీవెనుక నేనుంటాను ……
యాహూ యాహూ ….. అంటూ గెంతులేస్తున్నట్లు గాజులు – పట్టీల సౌండ్స్ మరియు సంతోషపు నవ్వులు వినిపిస్తున్నాయి .
అమ్మమ్మ : మహేష్ అర్థమయ్యిందా ….. ? , దెబ్బకుదెబ్బ ….. ముద్దుకుముద్దు , వెళ్లు వెళ్లు …… మీఇద్దరికోసం వేడివేడిగా పాలు తీసుకొస్తాను అంటూ నుదుటిపై ముద్దుపెట్టి పంపించారు .
స్వీట్ షాక్ లో హాల్లోకి వచ్చిచూస్తే , ఏమీ తెలియనట్లు బుద్ధిగా సోఫాలో కూర్చుంది అమ్మకూచీ …… , లోలోపలే ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిసిపోతోంది .

బుజ్జిజానకి : మహేష్ వచ్చావా ? , అమ్మమ్మ పర్మిషన్ తీసుకున్నావా ? రారా రారా ….. పక్కన కూర్చో అంటూ చిలిపినవ్వులతో ప్రక్కకు ఆహ్వానిస్తోంది .
ఊహూ అంటూ వెళ్లి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాను .
తియ్యనైనకోపంతో వచ్చి నాప్రక్కన చేరి చేతిని చుట్టేసింది అమ్మకూచీ …… , లోపలికి రాకుండా బెట్టు చెయ్యడమే కాకుండా ఇప్పుడు దూరంగా కూర్చుంటావా పైగా అమ్మమ్మకు కంప్లైంట్ చేస్తావా అంటూ చేతిపై – నడుముపై గిల్లేసి , మెలికలు తిరుగుతుంటే చేతిపై – బుగ్గపై ముద్దులవర్షం కురిపిస్తోంది చిరునవ్వులు చిందిస్తూ ……..
స్స్స్ స్స్స్ ….. అమ్మమ్మా అమ్మమ్మా అంటూ వంట గదిలోకి పరుగులుతీసాను .
అమ్మమ్మ : మళ్లీ ఏమైంది మహేష్ ? , విన్నట్లు నవ్వుతూనే అడిగారు .
అమ్మమ్మా ….. గిల్లేస్తోంది , స్స్ స్స్స్ ….. చూడండి చూడండి ఎర్రగా ఎలా కందిపోయిందో చేతిపై – నడుముపై ……
అమ్మమ్మ : ఇంతలా గిల్లుతుందా ….. ? , బుజ్జి దెయ్యం …..
బుజ్జిదేవకన్య ……
అమ్మమ్మ : నా బంగారం …… , ఒక్కమాటకూడా పడనివ్వవన్నమాట లవ్ యు , మరి గిల్లింది కదా …… , గిల్లుడుకు గిల్లుడే శిక్ష …. వెళ్లు మహేష్ ఎక్కెక్కడ అయితే గిల్లిందో అక్కడే కాకుండా నీకిష్టమైన చోటల్లా గిల్లేయ్యి ……
చేతిపై – అమ్మకూచీ అందమైన నడుముపై …… అఅహ్హ్
అమ్మమ్మ : నీకూచీ మెత్తని నడుముపైనే కాదు వొళ్ళంతా గిల్లేయ్యి ……
వినిపించిందా అంటూ సిగ్గుపడ్డాను .
అమ్మమ్మ నవ్వులు మరియు బయటనుండి నవ్వులు ……
అమ్మమ్మా ….. గిళ్లడంతోపాటు ము ము ముద్దులు అదికూడా పె పె పెదాలతో …..
అమ్మమ్మ : నువ్వూ తగ్గొద్దు ముద్దులుకూడా వొళ్ళంతా పెట్టేయ్యి …… , ఏమిచేస్తుందో చూస్తాను .
ముద్దులు …… వొళ్ళంతా …… అంటూ వెక్కిళ్ళు వచ్చేసాయి .
అమ్మమ్మ నవ్వులతోపాటు బయటనుండి నవ్వులు …… , మంచి నీళ్ళు మంచి నీళ్ళు ….. అంటూ అమ్మమ్మతోపాటు అమ్మకూచీ కూడా పరుగునవచ్చి నీటిని అందించారు .
ఇలాకాదు కూర్చుని త్రాగితేనే తగ్గేది అంటూ చేతిని చుట్టేసి లాక్కునివెళ్లి సోఫాలో కూర్చోబెట్టి నోటికి అందించింది .
త్రాగించడానికి మరియు నెత్తిపై ప్రేమతో తట్టడం కోసం చేతులను పైకెత్తడంతో , ఇప్పటివరకూ సూర్యకిరణాలు కూడా పడనట్లు పాలరాతిలా నిగనిగలాడుతున్న సన్నటి పరువపు నడుము మరియు చీర చాటున కనీకనిపించనట్లు కవ్విస్తున్న నా హృదయస్పందన అమ్మకూచీ సౌందర్యమైన నడుమును అలా చూస్తుండిపోయాను .
మనసును గెలుచుకున్న చెలికాడు చూస్తున్నాడని మనసు తెలియజెయ్యగానే చూసి జిళ్ళుమంది , నువ్వు చూడటం కోసం కాకపోతే ఇంకెందుకు మహేష్ ఎంజాయ్ అంటూ పులకించిపోసాగింది , ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకో అన్నట్లు కదలకుండా ఉండిపోయింది .

అదేసమయానికి బయట మెయిన్ గేట్ తెరిచిన చప్పుడు వినిపించడంతో తేరుకుని , ఎవరో వచ్చినట్లున్నారు అమ్మకూచీ అంటూ చేతిలోని బాటిల్ అందుకుని మొత్తం దించకుండా త్రాగేసి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని అప్పటివరకూ నుదుటిపై పట్టిన చెమటను తుడుచుకుని తలదించుకుని ఒరకంటితో చూస్తున్నాను .
ప్చ్ ప్చ్ …… రాకూడని టైం లో కరెక్ట్ గా వచ్చేసారు , పాపం తనివితీరా చూసుకున్నాడో లేదో అంటూ కొంటెగా నావైపే చూస్తూ మురిసిపోతోంది .

మహీ …… బయట ఉన్న అబ్బాయిని బయటనుండే పంపించేశారు చాలా సం……తో…..షం , ఏ…..కంగా లోపలకే వచ్చే…..శాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు బామ్మలు .
బుజ్జిజానకి : తనేమీ రానున్నాడు , మేమే అంటే నేను – అమ్మమ్మ – అక్కయ్యలు మరియు దేవతలూ …… ఇంతమంది ప్రేమతో బ్రతిమాలితేనే లోపలికివచ్చాడు .
బామ్మలు : అంతలా అంతమంది బలవంతపెట్టి లోపలికి పిలుచుకురావాల్సిన అవసరం ఏముంది , వచ్చేశాడు కాబట్టి ఇంకేమీ చేయలేము , బయటలా కరుచుకుని కాకుండా దూరంగా కూర్చున్నావు మంచిది ……
బుజ్జిజానకి : లేదు బామ్మలూ ….. ఇంతవరకూ ఇలా ఇంచు గ్యాప్ లేకుండా హత్తుకునే కూర్చున్నాము , నీళ్లు కావాలంటే ఇవ్వడం కోసం విడిపోయాము అంతే అంటూ నాచేతిని చుట్టేసి హత్తుకుని కూర్చుని మరింత ఉడికించింది ……
బామ్మలు : మహీ మహీ మహీ …… , బలవంతపెట్టి లోపలికి పిలుచుకోవడమే కాకుండా ఇలా ఒక్కటై కూర్చోవాల్సిన అవసరం ఏముంది ? , బాబూ దూరంగా కూర్చో బయటకు వెళ్లినా సంతోషమే .
అమ్మకూచీ చేతిని చుట్టేసి ఉండగానే కాస్త దూరంగా జరిగాను .
బుజ్జిజానకి : కోపంతో జరిగి ముందుకంటే గట్టిగా చుట్టేసింది .
బామ్మలు : అయ్యో రామా …. ? .
బుజ్జిజానకి : ఎవరిని తలుచుకున్నారు బామ్మలూ …… ? .
బామ్మలు : ఇంకెవరినీ దేవుడిని …….
బుజ్జిజానకి : ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడారు , మీకు అర్థమయ్యేట్లుగానే చెబుతాను , బామ్మలూ …… మనం ప్రార్థించకముందే వరాలిచ్చే దేవుడు స్వయంగా మీ గుమ్మం దగ్గరకే వస్తే ఏమిచేస్తారు ? బయటకు పంపించేస్తారా ….. ? .
బామ్మలు : లేదు లేదు లేదు …… , స్వయంగా ఆ దేవుడే వరాలివ్వడానికి వస్తే బయటకు ఎందుకు పంపిస్తాము భక్తితో లోపలికి స్వాగతం పలికి పూజలు చేసుకుంటాము .
బుజ్జిజానకి : నేను – అమ్మమ్మ చేస్తున్నది కూడా అదే బామ్మలూ అంటూ నాచేతిని వదిలి ఏకంగా నన్ను ప్రాణంలా చుట్టేసి బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టింది .
అమ్మకూచీ తియ్యనైన మాటలకు అంతులేని ఆనందంతో తలదించుకునే ఎంజాయ్ చేస్తున్నాను , ఇక కౌగిలింతకు – ముద్దుకు …… ఆకాశంలో తేలిపోతున్నాను .
నా పరిస్థితి తెలిసినట్లు తియ్యదనంతో నవ్వుకుంటోంది అమ్మకూచీ ……
బామ్మలు అయితే అలా షాక్ లో ఉండిపోయారు .

నా స్నేహితులకు అర్థమయ్యేలా ఎంత చక్కగా వివరించిందో నా మహేష్ కూచీ ….. అంటూ చిరునవ్వులు చిందిస్తూ వచ్చి మాఇద్దరి కురులపై ముద్దులుపెట్టారు అమ్మమ్మ …… , అర్థమయ్యిందా ఫ్రెండ్స్ ? ……
బామ్మలు : లోపలికి రానిచ్చారు సరేనే కానీ ముద్దులు …….
అమ్మమ్మ : మీకింకా అర్థం కాలేదులే రండి వేడివేడిగా కాఫీ తాగి వెలుదురుగానీ అంటూ మాకు దిష్టి తీసి లోపలికి పిలుచుకునివెళ్లారు , మహేష్ – మహేష్ కూచీ ….. పాలు అంటూ అందించి వెళ్లారు .

అమ్మకూచీ దగ్గరకుచేరి ప్రేమతో హత్తుకోవడం తియ్యదనాన్ని పంచినట్లు పాలు త్రాగుతూనే రెండుమూడుసార్లు సోఫాలో కాస్త కాస్త దూరం జరిగాను .
బుజ్జిజానకి : దేవుడా అంటూ ముందుకంటే ప్రేమతో గట్టిగా హత్తుకోవడంతో నన్ను నేను మైమరిచిపోయాను , బుద్ధిగా కూర్చో ఇక జరగలేవులే జరిగితే కిందకు పడిపోతావు ……
అధికాదు అమ్మకూచీ ….. బామ్మలు .
బుజ్జిజానకి : బామ్మల సంగతి అమ్మమ్మ చూసుకుంటారులే , అంత అర్థమయ్యేలా వివరించినా అర్థం చేసుకోకపోతే మన తప్పేమీ లేదు అంటూ బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టింది చప్పుడొచ్చేలా ……
అదేసమయానికి కాఫీ త్రాగుతూ హాల్లోకి వచ్చిన బామ్మలకు కళ్ళు బైర్లు కమ్మినట్లు , మేము వెళ్ళొస్తామమ్మా ….. మీ దేవుడిని ఇలాగే ప్రేమతో చూసుకోండి .
తప్పకుండా తప్పకుండా అంటూ బుజ్జిజానకి – అమ్మమ్మ ఒకేసారి అని నవ్వుకున్నారు .
అమ్మమ్మా ….. మళ్లీ ఎక్కడికి వెళుతున్నారు ? , కాసేపు ప్రశాంతంగా కూర్చోండి .
అమ్మమ్మ : ఇదిగో ఈ కాఫీ కప్స్ ను కడిగేస్తే ఫ్రీ , మా మహేష్ వలన జీవితాంతం గుర్తుపెట్టుకునే సంతోషాలను కళ్లారా చూశాను అంటూ వంట గదిలోకివెళ్లారు ఆనందిస్తూ ……..

బుజ్జిజానకి : లవ్ …… థాంక్యూ సో సో మచ్ మహేష్ , అమ్మకోసం నేను బాధపడి అమ్మమ్మను చాలా బాధపెట్టాను – నీవలన పూర్తి మారిపోయింది అమ్మమ్మను ఇలా సంతోషంగా చూస్తుంటే చాలా చాలా ఆనందం వేస్తోంది .
మీఇద్దరి సంతోషాలను చూసి అమ్మకూడా ఇలా పరవశించిపోతున్నారు అమ్మకూచీ ….. , నాకైతే చిరునవ్వులు చిందిస్తున్న ఈ అమ్మకూచీని ఇలానే జీవితాంతం చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది ఇక వేరే ఏ కోరికా లేదు .
బుజ్జిజానకి : పొంగిపోతోంది , నాకైతే ఇలానే నాదేవుడి గుండెలపై ఉండిపోవాలని ఉంది , అమ్మ – అమ్మమ్మ కూడా కోరుకునేది ఇదే …… అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
అఅహ్హ్ ….. yes yes ……
బుజ్జిజానకి : లవ్ ….. సో స్వీట్ ఆఫ్ యు అంటూ మళ్లీ ముద్దు , ముద్దుతోపాటు కొరికేసింది .
కెవ్వుమంటూ కేకవేశాను .
మహేష్ ఏమైంది అంటూ కంగారుపడుతూ వచ్చిన అమ్మమ్మ చూసి నవ్వుకుంటూ లోపలికివెళ్లిపోయారు .
స్స్స్ స్స్స్ …….

బుజ్జిజానకి : నవ్వుకుంది , మరి నేను దగ్గరదగ్గరకు జరుగుతుంటే నువ్వేమో దూరంగా జరుగుతావా అంటూ బుగ్గపై – భుజంపై కొరికేసి ప్రాణంలా ముద్దులుపెట్టింది .
స్స్స్ స్స్స్ ….. అంటూ రుద్దుకుంటూనే భుజంపై చూసుకుంటే పంటిగాట్లు ……
పళ్ళు చూయించి నవ్వుతోంది అమ్మకూచీ …… , మరి అంత కోపం వచ్చింది అప్పుడు ……
ఉండు అమ్మమ్మకు చెబుతాను , అమ్మమ్మా అమ్మమ్మా …… చూడు పంటిగాట్లుపడేలా ఎలా కొరికేసిందో అంటూ భుజంపై చూయించాను .
అమ్మమ్మ : మహేష్ …. బుగ్గపై కూడా పంటిగాట్లు , బుజ్జిరాక్షసి ……
బుజ్జిదేవత ……
అమ్మమ్మ : నవ్వేశారు , పంటిగాట్లు పెట్టి ముద్దులైనా పెట్టిందా లేదా ? .
దానికేమీ లోటు లేదు అమ్మమ్మా అంటూ సిగ్గుపడ్డాను .
అమ్మమ్మ : ఇక ఉపేక్షించి లాభం లేదు మహేష్ …… , దెబ్బకుదెబ్బ వెయ్యమంటే వద్దు అన్నావు – గిల్లుడుకు గిల్లమంటే కూడా నో అన్నావు ….. ఇప్పుడు చూడు ఏమిజరిగిందో ……. , బుగ్గపై – భుజంపై మాత్రమే కాదు నీకూచీ వొళ్ళంతా కొరుక్కుని తినెయ్యి కేకలువేస్తే నీ అంతులేని ప్రేమతో ముద్దులుపెట్టు చెల్లుకు చెల్లు …….
అమ్మమ్మా ……
అమ్మమ్మ : నాకు …. నీకూచీ …..
తెలుసు తెలుసు అమ్మమ్మా …… అమ్మకూచీ కంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం .
బయటనుండి నవ్వులు ……
అమ్మమ్మ : ప్రాణం ….. అంటూ నాబుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు , ఇకవెళ్లి నీకూచీ వొళ్ళంతా పంటిగాట్లు పెట్టేయ్యి ……
నో నో నో అమ్మమ్మా ….. , బుజ్జిదేవకన్య …… నొప్పికూడా కలిగించలేను .
ప్చ్ ప్చ్ ప్చ్ ….. అంటూ బయట నుండి సౌండ్స్ ……
అమ్మమ్మ : మా బంగారం ….. , నువ్వు ఊరుకున్నా నీకూచీ వదలదు మహేష్ …..
లవ్ టు అమ్మమ్మా అంటూ హాల్లోకి వెళ్ళాను – అమ్మకూచీని కవ్వించడానికని ప్రక్కన కాకుండా ఎదురుగా కూర్చున్నాను .
ఒక చూపు చూసింది అంతే భయపడిపోయి , నో నో నో కూల్ కూల్ అమ్మకూచీ అంటూ లేచివెళ్లి ప్రక్కనే కూర్చున్నాను .
బుజ్జిజానకి : So సో స్వీట్ అంటూ నాచేతిని చుట్టేసి నొప్పివేస్తోందా ? అంటూ హస్కీ గా అడిగింది .
జిళ్ళుమంది …… లేదు లేదు మా అమ్మకూచీ ప్రేమ గుర్తులంటే చాలా ఇష్టం .
బుజ్జిజానకి : అవునా అయితే అంటూ కొరికెయ్యబోయి ప్రేమతో ముద్దుపెట్టి నా భుజంపై వాలింది .
మ్మ్ …… లవ్ ….. థాంక్యూ అమ్మకూచీ …..
బుజ్జిజానకి : ఇలా నీ ప్రక్కనే ఉంటే హాయిగా ఉంది మహేష్ ….. , నన్ను వదిలి వెళ్లవు కదా …….
ఊపిరి ఆగిపోతు ……
బుజ్జిజానకి : అలా మాట్లాడావంటే కొరికేస్తాను అంటూ నా నడుమును చుట్టేసి పరవసించిపోతోంది .

అమ్మకూచీ వెనుక గోడపై అమ్మ – పెద్దమ్మ ….. ముద్దులుపెడుతున్న డ్రాయింగ్ హాల్ కే అందం తీసుకొచ్చింది అంటూ అమ్మకూచీ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
బుజ్జిజానకి : ఈ దేవుడు సృష్టించినది కదా అందుకే అంత అద్భుతం – నిన్న రాత్రే అందంగా అలంకరించాను , ఎప్పుడు గమనించావు ? .
ఇంట్లోకి అడుగుపెట్టగానే మొదట కళ్ళకు ఆనందాన్ని పంచింది .
బుజ్జిజానకి : ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపించాలనే అలా ఎదురుగా అతికించాను , ఈరాత్రికి ఈ ఫైల్ లో ఉన్న డ్రాయింగ్స్ కూడా అక్కడ చేరతాయి మరింత సంతోషాలను పంచుతాయి , లవ్ ….. థాంక్యూ మహేష్ అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి మురిసిపోతోంది , మహేష్ మహేష్ …… రాత్రి అమ్మ – పెద్దమ్మ ఇక్కడకు వచ్చిన డ్రాయింగ్స్ వేశావు కానీ నీదగ్గరకు వచ్చిన డ్రాయింగ్స్ ఎక్కడ ? .
అమ్మకూచీని కవ్వించాలని , రాలేదు కాబట్టి వెయ్యలేదు …….
బుజ్జిజానకి : అందమైనకోపంతో భుజంపై కొరికేసింది .
కెవ్వుమని కేకవేశాను ……
వంట గదిలోనుండి అమ్మమ్మ నవ్వులు …….
ఉండు అమ్మమ్మకు చెబుతాను అంటూ లెవబోతే ….. చేతిని గట్టిగా చుట్టేసి కూర్చోబెట్టేసింది .
బుజ్జిజానకి : భుజంపై ముద్దులు కురిపించి , మనలో అమ్మకు ఎవరంటే ఎక్కువ ఇష్టం ? .
అమ్మకూచీ …… స్స్స్ …..
బుజ్జిజానకి : మళ్లీ అడుగుతున్నాను , మనలో ఎవరంటే ఎక్కువ ఇష్టం ? .
చెబుతాను చెబుతాను నేనంటే నేనంటే అంటూ నవ్వుకుంటున్నాను .
బుజ్జిజానకి : డ్రాయింగ్స్ ఎక్కడ ? .
వెయ్యలేదు అమ్మకూచీ ……
బుజ్జిజానకి : అమ్మ – పెద్దమ్మ మొదటగా నీదగ్గరకే వచ్చి ఎంత ప్రేమను పంచారో అన్నీ డ్రాయింగ్స్ ఇప్పుడే ఇక్కడే వెయ్యాలి ….. వేస్తావుకదా ? .
అమ్మకూచీ కోరాడమూ నేను డ్రా చెయ్యకపోవడమూనా …… , అమ్మకూచీ పెదాలపై చిరునవ్వులు చూసి అమ్మ పొంగిపోవాలి , డ్రాయింగ్ పేపర్స్ – పెన్సిల్స్ – కలర్స్ కావాలికదా అమ్మకూచీ …….
బుజ్జిజానకి : నా ….. మన గదిలో ఉన్నాయి .
మన …… అంటూ అమ్మకూచీ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
బుజ్జిజానకి : అవును మన గదిలోనే ఉన్నాయి , తీసుకురావాలంటే నిన్ను వదిలి వెళ్ళాలి నావల్లకాదు , అమ్మమ్మను ……
నో నో నో ….. మనకోసం అమ్మమ్మ చూడు ఎంతలా కష్టపడుతున్నారో ……
బుజ్జిజానకి : అర్థమైంది ….. లవ్ సో స్వీట్ ఆఫ్ యు , నిజంగా దేవుడివే ….. అయినాకూడా వదిలివెళ్లాలని లేదు అంటూనే వదల్లేక వదల్లేక వదిలి ఒక్క అడుగువేసి మళ్లీ వెనక్కువచ్చి బుగ్గపై ముద్దుపెట్టి క్షణంలో వచ్చేస్తాను అంటూ చీరలోనే పరుగులుతీసింది .
అఅహ్హ్ ….. రెండు కళ్ళూ చాలలేదు ఆ సౌందర్యాన్ని చూడటానికి , అమ్మకూచీ వెనుక something is మిస్సింగ్ అనుకుని బయటకువెళ్ళాను , రోజస్ ….. ఇంతవరకూ మీ మీ మొక్కలలో పరిమళించి అమ్మకూచీ – దేవతలకు సంతోషాలను పంచారు ఇక ఇప్పుడు అమ్మకూచీ కురులలో పరిమళించి మరింత సౌందర్యాన్ని పంచాలి అంటూ కొమ్మలతోపాటుగా పొడవుగా రెండు చేతుల నిండుగా కట్ చేసి ముల్లులన్నీ తీసివేశాను .
మహేష్ మహేష్ …… అంటూ ప్రియమైన అమ్మకూచీ పిలుపులు వినిపించడంతో , కమింగ్ అంటూ పూలను వెనుక దాచుకుని లోపలికివెళ్ళాను .

ఎక్కడికి వెళ్ళావు నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అంటూ నా గుండెలపైకి చేరిపోయింది – చెప్పి వెళ్ళొచ్చుకదా అంటూ నా హృదయంపై ప్రేమతో ముద్దుపెట్టింది .
వొళ్ళంతా జిళ్ళుమంది , చెప్పి వెళితే సర్ప్రైజ్ ఎలా అవుతుంది అమ్మకూచీ అంటూ గుచ్చుగా ఉన్న రంగురంగుల గులాబీ పూలను చూయించాను .
బుజ్జిజానకి : Wow బ్యూటిఫుల్ లవ్లీ మహేష్ …… బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ….. లవ్ …. థాంక్యూ థాంక్యూ సో మచ్ నాకేనా ? .
కాదు చీరలోని అమ్మకు అంటూ అందించాను .
బుజ్జిజానకి : అమ్మకు అంటే మరింత సంతోషం అంటూ అందుకుని మరింత గట్టిగా చుట్టేసి హృదయంపై పెదాలను తాకించింది .
అఅహ్హ్హ్ …… అంటూ తియ్యదనంతో జలదరిస్తూ కాలం ఇలాగే ఆగిపోవాలని , ఈ అందమైన మధురానుభూతిని ఆస్వాదిస్తూనే ఉండిపోవాలనిపిస్తోంది .
బుజ్జిజానకి : ఏమైంది మహేష్ ….. వణుకుతున్నావు ? .
తెలిసి కూడా అడుగుతున్నావు కదూ అంటూ నుదుటితో నుదుటిని తాకించాను .
స్స్స్ ……
లవ్ …… sorry sorry sorry ……
బుజ్జిజానకి : ఇప్పటికైనా చిన్నగానైనా కొట్టావు సంతోషం – కదలకు కదలకు నాకైతే ఇలాగే ఉండిపోవాలని ఉంది .
( నా మనసులోనిది కూడా అదే ) ఆనందిస్తున్నాను .
మహేష్ – మహేష్ కూచీ ….. ఐస్ క్రీమ్ , నేనేమీ చూడలేదు నేనేమీ చూడలేదు ఇదిగో వెళ్లిపోతున్నాను sorry sorry అంటూ వంట గదిలోకి వెళ్లిపోయారు .
అమ్మకూచీ ……
బుజ్జిజానకి : ష్ ష్ ష్ ….. అమ్మమ్మ ఏమీ చూడలేదని వెళ్లిపోయారుకదా అంటూ మరింత ప్రేమతో చుట్టేసింది .

అమ్మా ….. అమ్మకూచీని కౌగిలించుకోవాలని ఉంది అంటూ కళ్ళుమూసుకుని తలుచుకున్నాను .
అంతే ఒకేసారి రెండు బుగ్గలపై పంటిగాట్లు ……
స్స్స్ స్స్స్ ……
బుజ్జిజానకి : ఏమైంది ? , అమ్మ పర్మిషన్ ఇచ్చిందా ? .
అంటే నువ్వు కొరకలేదా ? .
బుజ్జిజానకి : అమ్మ ఎలాగో ok అంటుంది , నేనెందుకు కోరుకుతాను ….. కమాన్ కమాన్ అంటూ నా కౌగిలింత కోసం ఆతృత – ఆశతో ఎదురుచూస్తున్నట్లు పరవళ్లు తొక్కుతోంది .
అంటే అమ్మ – పెద్దమ్మ ఇద్దరికీ కోపం తెప్పించానన్నమాట , కొరికి చెప్పాలా ….. ? – స్స్స్ స్స్స్ ….. , ok ok ఆలస్యం చెయ్యనులే ……
బుజ్జిజానకి : ఎవరితో మాట్లాడుతున్నావు , అమ్మ అయితే ఇంతసేపు చెయ్యదు , త్వరగా …… నావల్ల కావడం లేదు .
అమ్మ పర్మిషన్ ఇచ్చేసింది అమ్మకూచీ యాహూ యాహూ అంటూ రెండుచేతులతో చుట్టేసి నుదుటిపై పెదాలను తాకించాను .
అఅహ్హ్హ్ ….. మ్మ్ ….. పెదాలపై తియ్యదనంతో నా హృదయంపై బుగ్గను వాల్చి హాయిగా కళ్ళుమూసుకుంది , బుగ్గపై ముద్దుతో సరిపెట్టుకోవాలి అంటూ చిలిపిదనంతో నవ్వుతోంది .
నవ్వుకుని , వెచ్చగా – మహాద్భుతంగా ఉంది నీకౌగిలిలో అమ్మకూచీ ….. , ఇలాగే ఉండిపోవాలని ఉంది .
బుజ్జిజానకి : ఇలాంటి అనుభూతి ఉంటుందనికూడా తెలియదు మహేష్ , వదిలావో కొరికేస్తాను అంటూ నవ్వుకున్నాము .
అలా ఎంతసేపు ఉండిపోయామో సమయాన్నే మరిచిపోయాము ఒకరికొకరి తొయ్యనైన కౌగిలిలో ……..

బయట మెయిన్ గేట్ తెరిచిన చప్పుడు ……
ప్చ్ – ప్చ్ ….. అన్నాము ఒకేసారి ……
నేను నేను చూసుకుంటాను మహేష్ – మహేష్ కూచీ …… నా ఫ్రెండ్సే అయిఉంటారు , ఈసమయంలో ఇళ్లల్లో ఖాళీగా ఉంటారా …… వచ్చేస్తారు , సాధ్యమైనంతవరకూ బయటే ఆపుతాను కాకపోతే సిగ్నల్ ఇస్తాను , నా బంగారు కొండలు అంటూ మాఇద్దరి కురులపై ముద్దులుపెట్టి డోర్ క్లోజ్ చేసుకుని బయటకువెళ్లారు అమ్మమ్మ ……
బుజ్జిజానకి : అమ్మమ్మకు నువ్వంటే ఇంత ప్రాణమని తెలియదు మహేష్ అంటూ చిరునవ్వులు చిందిస్తూ నా హృదయంపై పెదాలను తాకించింది .
తియ్యదనంతో జలదరించాను , అమ్మమ్మకు ….. ఈ అమ్మకూచీ సంతోషం తప్ప మరొకటి అవసరం లేదు .
బుజ్జిజానకి : నా మహేష్ సంతోషం కూడా ….. , నేనైతే వాళ్ళు లోపలికివచ్చినా వదలనే వదలను , అమ్మ – పెద్దమ్మనే హ్యాపీ వీళ్ళకేంటి …… , నాకు ….. అమ్మ – పెద్దమ్మ – దేవతలు – అక్కయ్యలు – అమ్మమ్మ మరియు ఫైనల్ గా నా దేవుడి సంతోషమే ముఖ్యం .
లవ్ …… సో స్వీట్ ఆఫ్ యు అమ్మకూచీ అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
బుజ్జిజానకి : నుదుటిపై తప్ప వేరే ప్లేస్ లేదా అంటూ హృదయంపై కొరికేసింది .
స్స్స్ స్స్స్ ……
బుజ్జిజానకి : లేదులేదులే అంటూ ముద్దుల వర్షమే కురుస్తోంది , మరి ముద్దులుపెట్టమంటే చేతులతో పెడతావు ……
మళ్లీ నుదుటిపై ముద్దుపెట్టి నవ్వుకున్నాను .
బుజ్జిజానకి : నవ్వుతో మాయ చేసేస్తావు , మ్మ్ ….. అమ్మ కౌగిలిలో ఉన్నంత హాయిగా ఉంది .
ఇదైతే ఓవర్ ….. , అమ్మ ప్రేమను – అమ్మ కౌగిలిలోని తియ్యదనం మించినది ఈ ప్రపంచంలోనే కాదు ఈ విశ్వంలోనే లేదు .
బుజ్జిజానకి : ఇందుకుకాదూ …… అమ్మకు నువ్వంటే తొలి ప్రాణం అయినది , నీ మాటలకు నేనే పరవశించిపోతున్నాను అమ్మ ఆనందాన్ని వర్ణించలేమేమో ……
( బుగ్గపై ముద్దు ….. )
నిజమే అమ్మకూచీ …… నిజం చెప్పాను అంతే , లవ్ …. థాంక్యూ అమ్మా …..
బుజ్జిజానకి : నన్నేనా ….. ? .
అమ్మ – అమ్మకూచీ ఇద్దరికీనూ …..
బుజ్జిజానకి : లవ్ యు …… , నీకౌగిలితో అమ్మ ప్రేమను తెలియజేశావు ok నా ? .
ఇలా అన్నావు బాగుంది ……
బుజ్జిజానకి : దేవుడివే , ఉమ్మా ఉమ్మా …… అంటూ పొంగిపోతోంది .

జానకీ జానకీ ……
అదిగో అమ్మమ్మ సిగ్నల్ , అమ్మమ్మ చెయ్యి దాటిపోయినట్లుగా ఉంది , లోపలికి వచ్చేస్తున్నట్లున్నారు అమ్మకూచీ ……
బుజ్జిజానకి : వస్తే రానివ్వు నాకేంటి ? .
చేతులు చుట్టేస్తేనే చూడలేకపోయారు , ఇలా గనుక చూస్తే స్పృహకోల్పోతారేమో …….
బుజ్జిజానకి : నీళ్లు జల్లితే లేచి గుసగుసలాడుతూ వెళ్లిపోతారులే ….. నేనైతే వదలను అంటూ మరింత గట్టిగా చుట్టేసింది .
అంతలో తలుపులవరకూ చేరినట్లు సౌండ్స్ వినిపించడంతో అమ్మకూచీని అమాంతం ఎత్తుకునివెళ్లి సోఫాలో కూర్చోబెట్టాను , అంతకూ వధలకపోవడంతో బుగ్గపై కొరికేసాను కాస్త గట్టిగా ……