థర్డ్ MISSION 7 28

అక్కయ్యలు : మీ ప్రాణమైన అల్లరి పిల్లాడు చెప్పాడుగా మీరే ఇవ్వండి అంటూ నావైపు తియ్యనైనకోపంతో చూస్తున్నారు .
అంటీలు : మా ప్రాణమేమీ కాదులే , మేమే ఇస్తాము , బాబుకు క్యూట్ డ్రెస్ అండ్ చైన్ …… , బాబు నవ్వాడు నవ్వాడు …..
దేవతలే స్వయంగా ప్రేమతో ఇస్తే ఆ మాత్రం ఆనందం ఉంటుంది .
అంటీలు : నిన్నెవ్వరూ అడగలేదు ……
Sorry దేవతలూ ……

మేడమ్ : అక్కయ్యలూ ….. మీచేతులతోనే అలంకరించండి .
అంటీలు : లవ్ టు లవ్ టు లవ్ టు చెల్లీ ….. అంటూ చైన్ ను మెడలో అలంకరించారు .
మేడమ్ పెదాలపై తియ్యదనం ……
బుజ్జిజానకి : చాలా బాగుంది దేవతలూ అంటూ బాబు మరియు దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అంటీలు : లవ్ యు ….. , చెల్లీ – అక్కయ్యా – అమ్మా అంటూ ముగ్గురికీ పట్టుచీరలు – జ్యూవెలరీ అందించారు .
పెద్దమ్మ : ( ప్రాణమైన వాళ్లందరికీ నేను ఇచ్చేదానిని , ఫస్ట్ టైం దేవతల్లాంటి చెల్లెళ్ళు ప్రేమతో ) కళ్ళల్లో ఆనందబాస్పాలతో నావైపు చూస్తున్నారు .
ఎంజాయ్ పెద్దమ్మా ……
మేడమ్ : ఏనాటి రక్త సంబంధమో ఇలా మళ్లీ కలిశాము అక్కయ్యలూ లవ్ యు లవ్ యు సో మచ్ ……
అమ్మమ్మ : థాంక్యూ తల్లులూ …….
అంటీలు : సంతోషంలో పరవళ్లు తొక్కుతున్నట్లు మురిసిపోతున్నారు , ఈ సంతోషం చూడాలనే ఆలస్యమైనా మనసుకు నచ్చినవి సెలెక్ట్ చేసాము , బుజ్జితల్లీ…… హ్యాపీనా ? .
బుజ్జిజానకి : చాలా అంటే చాలా అత్తయ్యలూ అంటూ గుండెలపైకి చేరింది .
అంటీలు : ఇప్పుడు మా ముద్దుల బుజ్జితల్లికి ఇవ్వవచ్చా ? .
బుజ్జిజానకి : లవ్ టు లవ్ టు అత్తయ్యలూ …… ( అమ్మకూచీ – దేవతల ఆనందాలను మైమరచి అలా చూస్తుండిపోయాను ) అమ్మకూచీ నవ్వుకుని ఫ్లైయింగ్ కిస్ వదిలింది , అత్తయ్యలూ …… వంద గుంజీలు పూర్తవ్వకముందే ఆపేసాడు .
లేదు లేదు లేదు దేవతలూ …… మీరు అలాగే హ్యాపీగా ఉండండి వంద ఏమిటి వెయ్యి తీస్తాను .
అంటీలు : ప్రస్థుతానికి వంద చాలులే అంటూ నవ్వుకున్నారు , అమ్మో అల్లరి పిల్లాడు చూస్తే గోల చేస్తాడు అంటూ కంట్రోల్ చేసుకున్నారు , మా బుజ్జితల్లికోసం పట్టు పరికిణీ – పట్టు లంగావోణీ – పట్టు చీర – 5 డ్రెస్సెస్ – 7 వారాల నగలు అంటూ అన్నీ పరిచారు ……
బుజ్జిజానకి : అత్తయ్యలూ …… అంటూ అలా స్వీటెస్ట్ షాకింగ్ సర్ప్రైజ్ లో ఉండిపోయింది .
అత్తయ్యలు : యాహూ యాహూ యాహూ ….. ఇలా చూడాలనే కదా మనసంతా సంతోషాలతో నిండిపోయింది బుజ్జితల్లీ అంటూ ప్రాణంలా అక్కున చేర్చుకుని ముద్దుల వర్షమే కురిపిస్తున్నారు లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ అంటూ ………
అందరూ సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు , ప్రక్కనే పూలు ఉండటం చూసి అక్కయ్యలు పూలవర్షం కురిపించి మురిసిపోతున్నారు .
బుజ్జిజానకి : అత్తయ్యలూ అత్తయ్యలూ అత్తయ్యలూ …… అత్తయ్యలను అమ్మ తరువాత అమ్మ అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైంది , లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అత్తయ్యలూ అంటూ పట్టరాని సంతోషంతో ముద్దులవర్షమే కురిపిస్తోంది .
ఆ ఆనందాలు కొంతసేపు నిర్విరామంగా కొనసాగాయి , ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ ఆనందిస్తున్నారు .
అమ్మ ఆనందాలకు అవధులులేనట్లు , గుంజీలు తీస్తూనే ఎంజాయ్ చేస్తున్న నా బుగ్గలపై ముద్దులు ఆగడం లేదు .
నాకెందుకమ్మా ….. ఈ సంతోషాలకు కారణం దేవతలైతేనూ ……
( ఆ దేవతలను ….. నీ అమ్మకూచీ చెంతకు చేర్చినది నా మహేషే కదా , లవ్ యు సో మచ్ మహేష్ ….. , ఇక చూడలేననుకున్నాను )
ఇక్కడితో ఆగవు అమ్మా ….. , మీరలా చూస్తూ ఎంజాయ్ చెయ్యండి .
సంతోషంలో కొరికేశారు .
స్స్స్ …… మీరూ స్టార్ట్ చేశారా ? .
అమ్మ నవ్వులు …….

పెద్దమ్మ : బుజ్జిజానకీ – తల్లులూ …… ఆకలివెయ్యడం లేదా ? .
అమ్మకూచీ – అక్కయ్యలు చిరునవ్వులు చిందిస్తున్నారు , ఐదుగురు దేవతలు – ఒక దేవుడు సంతోషాలనే ఆహారంగా పంచుతుంటే ఇక ఎక్కడ ఆకలివేస్తుంది చెప్పండి అంటూ ఐదుగురు దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టి నావైపుకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందిస్తున్నారు .
దేవతలు : లవ్ యు లవ్ యు లవ్ యు …… కానీ మాకైతే మన దేవతమ్మ వంటల రుచి చూడాలనిపిస్తోంది , లోపలికి వస్తూ కారులో క్యారెజీలు ఉండటం గమనించాములే ……
అక్కయ్యలు : క్యారెజీలతో కారు మొత్తం నిండిపోయింది చెల్లీ ….. , అందుకే కదా మేము స్కూటీలలో వచ్చింది .
బుజ్జిజానకి : దేవతమ్మ చేతి వంట ….. , దేవతల చేతి వంటలకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలని ఆశిద్దాము , వింటుంటేనే నోరూరిపోతోంది – ఇంతవరకూ ఆకలివెయ్యలేదు కానీ ఇప్పుడు బాగా ఆకలివేస్తోంది దేవతలూ ……
అంటీలు : లవ్ యు బుజ్జితల్లీ ….. అంటూ మురిసిపోతున్నారు .
అక్కయ్యలు : మ్మ్ మ్మ్ దేవతమ్మ వంటలు ….. మాకుకూడా ఆకలి ఆకలి …..
దేవతలంతా నవ్వుకున్నారు .
రోజుల తరువాత పెద్దమ్మ లోకపు పెద్దమ్మ చేతి వంట టేస్ట్ చెయ్యబోతున్నాను , ఫస్ట్ టైం తినబోతున్న దేవతలు – అమ్మకూచీ – అక్కయ్యలు ….. రుచిలో మైమరిచిపోతారేమో అంటూ లోలోపలే ఆనందిస్తున్నాను .

దేవతమ్మ : నీ దేవతల చేతి వంటలతో ఎవరైనా పోటీ పడగలరా మహేష్ కూచీ ….. – ఉదయం వంటలు అద్భుతం అంతే , దేవతల చేతి వంటతో పోల్చావు అధిచాలు …….
అంటీలు : మన దేవతమ్మ చేతి వంట మరింత అద్భుతంగా ఉంటుంది , ఎప్పుడెప్పుడు తిందామా అని ఆశతో ఉంటే మీరు మాటలు పెట్టారు ……
బుజ్జిజానకి : దేవతమ్మ ఏమో దేవతలను – దేవతలేమో దేవతమ్మను …… పొగుడుకోండి పొగుడుకోండి ఎంతైనా దేవతలు దేవతలే , మేమైతే ఫుల్ గా కుమ్మేస్తాము .
అక్కయ్యలు : అంతే చెల్లీ ……
బుజ్జిజానకి : పదండి అక్కయ్యలూ అన్నింటినీ తీసుకొద్దాము .
పెద్దమ్మ : అమ్మో ఇంకేమైనా ఉందా …… ? , మేమెందుకు ఉన్నది అంటూ ముద్దులుపెట్టారు .
నేనెందుకు ఉన్నది ……
అంటీలు : తమరి సహాయం ఏమీ అక్కర్లేదు , మనమే తీసుకొద్దాము పదండి దేవతమ్మా …… , నీ 100 గుంజీలు తియ్యడం అయిపోతే వెళ్లి డైనింగ్ టేబుల్ పై బుద్ధిగా కూర్చో ….. , దేవతమ్మా – చెల్లీ రండి అంటూ ఐదుగురు దేవతలూ గుమ్మం బయటకు అడుగుపెట్టడం ఆలస్యం ……

మహేష్ మహేష్ లవ్ ….. sorry sorry అంటూ అమ్మకూచీ వచ్చి 987 988 …… గుంజీలు తీస్తున్న నా గుండెలపైకి చేరింది .
వెనుకే అక్కయ్యలు వచ్చారు .
బుజ్జిజానకి : ఏంటీ 989 …… , 100 గుంజీలే కదా తియ్యమన్నది అంటూ కళ్ళల్లో చెమ్మ , ఇక చాలు ఆపు ఆపు మహేష్ ……
990 ….. మరొక్క పది తీస్తే దేవతల స్వీట్ పనిష్మెంట్ పూర్తవుతుంది .
బుజ్జిజానకి : అయితే నేనూ 1000 గుంజీలు తీస్తాను …..
అక్కయ్యలు మేముకూడా అంటూ మాతోపాటు గుంజీలు తీస్తున్నారు .
సో స్వీట్ అంటూ అమ్మమ్మ ….. బాబు బుగ్గపై ముద్దులుపెడుతూ ఆనందిస్తున్నారు .
నో నో నో అమ్మకూచీ – ఆక్ …… దేవతలను కొరికేసాను వెయ్యి కాదు లక్ష గుంజీలైనా తియ్యాల్సిందే అంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను , అందుకుగానూ మీకు బోలెడు బోలెడు లవ్ …… థాంక్స్ నేనే చెప్పుకోవాలి , ముందైతే మీరు గుంజీలు తియ్యడం ఆపండి , దేవతల బుగ్గలపై నా పంటిగాట్లు …… అఅహ్హ్హ్ జీవితాంతం గుర్తుండిపోతుంది , లవ్ ….. థాంక్యూ అమ్మకూచీ అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
బుజ్జిజానకి : మరి అంత ఆనందం ఆస్వాదించేలా చేస్తే కేవలం చిన్న ముద్దు అదికూడా నుదుటిపై ……
అక్కయ్యలు : నుదుటిపై అంటే ప్రాణం కంటే ఎక్కువైన ముద్దు చెల్లీ …… , మాకైతే ఆ చిన్న ముద్దుకూడా లేదు ప్చ్ ప్చ్ ప్చ్ ……
ఇంకేమైనా ఉందా …… , నేనేదో మాటవరసకు అంటే మీ అక్కయ్యలు నిజంగానే లక్ష గుంజీల శిక్షను వేయించేలా ఉన్నారు , 1000 …… హమ్మయ్యా హ్యాపీలీ finished ……
బుజ్జిజానకి : మావింకా పదే అయ్యింది ……
నువ్వుకూడానా అమ్మకూచీ …… , అదిగో లోపలికివస్తున్న దేవతలు ….. మీరు గుంజీలు తియ్యడం చూస్తే కొరికినప్పుడు కంట్రోల్ చేసుకున్నారు ఇప్పుడిక ……
బుజ్జిజానకి – అక్కయ్యలు : దేవతలు కొడితే ఆనందమే కదా …….
ఆనందం కాదు పండగే ……
అమ్మకూచీ – అక్కయ్యలు …… చిరునవ్వులు చిందించి , ఫీల్ అవుతున్న నా బుగ్గలపై ఏకంగా కొరికేశారు , దేవతలూ దేవతలూ …… అంటూ వెళ్లి క్యారెజీలను డైనింగ్ టేబుల్ పైకి చేర్చడానికి హెల్ప్ చేస్తున్నారు .
స్స్స్ స్స్స్ ……

అంటీలు : మమ్మల్ని కొరికి అల్లరి పిల్లాడు రుద్దుకుంటున్నాడు ఏంటి ? .
అక్కయ్యలు : ఫీల్ అవుతున్నట్లున్నాడు అమ్మలూ …… , మీ నొప్పి తన నొప్పిలా ఫీల్ అవుతున్నాడు తమ్ముడు .
బుజ్జిజానకి : అవునవును దేవతలూ ……
అంటీలు : చేసిందంతా చేసి నాటకాలాడుతున్నాడు , అవసరం లేదని చెప్పు బుజ్జితల్లీ …… , ఆకలి అన్నావుకదా కూర్చో వడ్డిస్తాము , ఆ అల్లరి పిల్లాడిని కూడా పిలవండి .
బుజ్జిజానకి : ఎంతైనా అల్లరి పిల్లడంటే మీకు ఇష్టమే దేవతలూ …… , ఎంత ప్రేమతో పిలిచారో – చూడండి ఎలా మురిసిపోతున్నాడో ……
అంటీలు : నీకిష్టమైన వాళ్ళను బాధపెట్టడం ఇష్టం లేదు బుజ్జితల్లీ , నీ సంతోషం కంటే ఇంకేమి కావాలి ……
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యలూ …… , వడ్డించేంతవరకూ ఇలా హత్తుకునే ఉంటాను .
అంటీలు : కావాలంటే ఒడిలో కూడా కూర్చోవచ్చు , ఎంచక్కా తినిపిస్తాము .
బుజ్జిజానకి : అంతకంటే ఇంకేమికావాలి అత్తయ్యలూ ….. ముద్దముద్దకూ ముగ్గురి అత్తయ్యల ఒడిలో కూర్చుని తింటాను , లవ్ యు సో మచ్ అత్తయ్యలూ ……
ఎంజాయ్ బుజ్జిజానకీ …… అంటూ మేడమ్ మురిసిపోతూ అందరికీ వడ్డించి ఎదురుగా కూర్చున్నారు .
అమ్మకూచీ మొదటగా వాసంతి అంటీ ఒడిలో కూర్చుంది , దేవత ప్రేమతో తినిపించడం చూసి ఎంజాయ్ అంటూ సైగచేసాను , ప్చ్ ….. ఆ అదృష్టం నాకెప్పుడో ……
అంటీలు : ఏంటీ ……
బుజ్జిజానకి : మీ ఒడిలో కూర్చునే అదృష్టం ఎప్పుడు అని అన్నాడు అత్తయ్యలూ …….
దేవతలు కోప్పడకముందే లేచి లెంపలేసుకుని గుంజీలు తియ్యడం మొదలెట్టాను .
అమ్మకూచీ – అక్కయ్యలు నవ్వేయ్యడంతో అందరితోపాటు అంటీలు కూడా నవ్వేశారు .
బుజ్జిజానకి : అత్తయ్యలు నవ్వేశారుకదా ఇక ఆపి వచ్చి కూర్చో మహేష్ ……
భద్రకాలుల్లా కోపంతో చూస్తున్న దేవతలవైపు చూస్తూనే లోలోపల తెగ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను .
ఎంజాయ్ ఎంజాయ్ మహేష్ ….., అత్తయ్యలూ …. ఆ ఆ ……
నువ్వూ ఎంజాయ్ అమ్మకూచీ ……

పెద్దమ్మ : మీ టామ్ & జెర్రీ చిలిపిదనం కట్టిపెట్టి , వంటలు ఎలా ఉన్నాయో చెబితే బాగుంటుంది , ఒక్కరైనా చెబుతారని చూస్తున్నాను అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
బుజ్జిజానకి : నిన్న అత్తయ్యలు కూడా ఇలానే ఆడిగిమరీ పొగిడించుకున్నారు అంటూ నవ్వుతోంది , దేవతమ్మా …… ఎందుకో ఇలా చెప్పాలని ఉంది దేవలోకపు వంటల రుచి మ్మ్ మ్మ్ …… అంటూ వెళ్లి పెద్దమ్మ బుగ్గపై ముద్దుపెట్టి కాంచన అంటీ ఒడిలో కూర్చుంది ఆ అంటూ …… అటుపై సునీత అంటీ .
అంటీలు : అవునవును సరిగ్గా చెప్పావు బుజ్జితల్లీ …… , దేవలోకంలో ఇలానే ఉంటాయేమో , ఇక ఈ పాయసం అయితే అమృతం రుచి ఇలానే ఉంటుందేమో అన్నట్లుగా ఉంది .
అమృతంతో చేసినదే దేవతలూ …….
అంటీలు : నిన్ను ఎవ్వరూ అడగలేదులే , బుద్ధిగా తిను ……
అక్కయ్యలు : అమ్మాకూచీతోపాటు నవ్వి , దేవతమ్మా …… మ్మ్ మ్మ్ సూపర్ అంతే …..
అవునవును భలే రుచి చూడండి బాబు కూడా ఎలా తింటున్నాడో అంటూ మేడమ్ – అమ్మమ్మ ……
పెద్దమ్మ : లవ్ యు అల్ అంటూ నావైపు కన్నుకొట్టి అందరికీ వడ్డించారు .
మొత్తం వంటలు ఊడ్చేసేంతవరకూ లంచ్ పూర్తవ్వలేదు .

అమ్మో ఒక్క అడుగుకూడా వెయ్యలేనంతగా తినేసాము , ఏమి రుచి ఏమి రుచి ……. ఇంకా ఇంకా తినాలనిపిస్తూనే ఉంది అంటూ సోఫాలలోకి చేరిపోయారు దేవతలు …….
లవ్ యు పెద్దమ్మా అంటూ వెనుక నుండి బుగ్గపై ముద్దుపెట్టి , అమ్మకూచీని ముద్దుచేస్తున్న దేవతల ఎదురుగా వచ్చి కూర్చున్నాను .
అంటీలు : ఏంటి అలా చూస్తున్నావు ? బుజ్జితల్లికి దిష్టి తగిలేలా ఉంది .
బుజ్జిజానకి : అయ్యో అత్తయ్యలూ …… ఇంత అమాయకులేంటి ? , కొరుక్కుతినేలా చూస్తున్నది నన్ను కాదు మిమ్మల్ని …….
ష్ ష్ ష్ బుజ్జిజానకీ …… , బుద్ధిగా లేచి గుంజీలు తీస్తున్నాను .
అక్కయ్యలు : అంటే నిజమేనన్నమాట …… అంటూ నవ్వుకుంటున్నారు .
బుజ్జిజానకి : అన్నీ తెలిసి మళ్లీ అడుగుతారేంటి అక్కయ్యలూ …… , మీ తమ్ముడి మనసు మీకు తెలియదా ? , అత్తయ్యలు ….. మూడో కన్ను తెరిచేలా ఉన్నారు కూల్ కూల్ కూల్ అత్తయ్యలూ అంటూ ముద్దులతో శాంతిoపచేసింది .
చుట్టూ నవ్వులైతే ఆగడం లేదు .
అంటీలు : ఆపకు పాతిక గుంజీలైనా తియ్యాల్సిందే ……
బుజ్జిజానకి : అత్తయ్యలూ ….. ఇంతకుముందు మీరు వంద గుంజీలు తియ్యమంటే మీ మాటంటే గౌరవం లేనట్లు వెయ్యి గుంజీలు తీసాడు , దానికైనా శిక్ష పడాల్సిందే ……
అంటీలు : వందనే కదా చెప్పినది , అవునవును మనం ఐస్ క్రీమ్స్ తిన్నంతవరకూ అంటే దాదాపు అర గంటకుపైనే …… , అయినా ఈ అల్లరి పిల్లాడు ఎందుకలా చేసాడు , వెయ్యి గుంజీలంటే మాటలా రాత్రికి కాళ్ళూ చేతులూ నొప్పివేస్తాయేమో ……. , అలా మేము కోరుకోలేదు బుజ్జితల్లీ ……
బుజ్జిజానకి : అక్కయ్యలూ విన్నారా …… ఎంతైనా మహేష్ అంటే అత్తయ్యలకు ఎక్కడో ఇష్టమే ……
అంటీలు : లేదు లేదు లేదు బుజ్జితల్లీ …… , మొదటి నుండీ అల్లరే అల్లరి ……

అమ్మమ్మ – మేడమ్ – దేవతమ్మ – అక్కయ్యలు …… ఎంజాయ్ చేస్తున్నారు , దేవతలూ …… ఆకు వక్క సున్నం తీసుకురమ్మంటారా ? .
అక్కయ్యలు : స్వీట్ కిళ్లీ ఉంటే ఎంత బాగుండేదో ……
పెద్దమ్మ : స్వీట్ కిళ్లీ ఏంటి తల్లులూ …… , మహేష్ కూచీ ….. నువ్వు తీసుకొచ్చిన బాక్స్ ఎక్కడ ఉంచావు ? .
బుజ్జిజానకి : అదిగో డైనింగ్ టేబుల్ మధ్యలో ఉంచాను దేవతమ్మా ….. ఇదిగో అంటూ తీసుకొచ్చింది , గిఫ్ట్ బాక్స్ ఏమోనని ఎవ్వరం ఓపెన్ చెయ్యలేదు .
పెద్దమ్మ : అమృతం అన్నారుకదా , నీటితో కోకుండా అమృతపు కొలనులో పండిన ఆకులతో చుట్టిన కిళ్ళీలు , నీ చేతులతో అందించి నీ అక్కయ్యల కోరిక తీర్చు ……
బుజ్జిజానకి : లవ్ టు దేవతమ్మా అంటూ ఓపెన్ చేసి స్వీట్ సర్ప్రైజ్ లా అలా చూస్తుండిపోయింది .
అక్కయ్యలు : చెల్లీ చెల్లీ చెల్లీ ……
బుజ్జిజానకి : గోల్డ్ కిళ్ళీలు అక్కయ్యలూ ……
అక్కయ్యలు చూసి wow wow wow గోల్డ్ ప్లేటెడ్ కిళ్ళీలు లవ్ యు దేవతమ్మా అంటూ అమ్మకూచీ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ అంటూ అందించబోతే ఆ ఆ ఆ అంటూ నోటిని తెరవడంతో ముద్దులుపెట్టిమరీ నోటికి అందించింది .
అక్కయ్యలు : మ్మ్ మ్మ్ మ్మ్ అమృతం ఇలానే ఉంటుందేమో …… అంటూ కళ్ళు మూసుకుని స్వీట్ నెస్ ఫీల్ అవుతున్నారు .
అమృతమే ఆక్ …… అంటూ ఆగిపోయాను .
అవునా తల్లుల ఊరుతున్న పెదాలను చూస్తుంటేనే …… మాకు కూడా మాకు కూడా అనడంతో మేడమ్ – దేవతలు – అమ్మమ్మకు మరియు దేవతమ్మకు ముద్దులతో తినిపించి , నాదగ్గరికి వచ్చింది .
మ్మ్ మ్మ్ మ్మ్ …….
ప్రసాదంలా చేతిని చాపాను .
బుజ్జిజానకి : ప్రేమతో మొట్టికాయవేసి చిరునవ్వులు చిందిస్తూ బుగ్గపై ముద్దుపెట్టిమరీ నోటికి అందించింది .
లవ్ ….. థాంక్యూ అమ్మకూచీ ……
బుజ్జిజానకి : థాంక్యూ కాదు తినిపించు అదికూడా ముద్దుపెట్టి ……
దేవతలు ……
బుజ్జిజానకి : దేవతలు ….. అమృత కిళ్లీ ఫీల్ లో మైమరిచిపోయారు , తినిపిస్తావా లేక దేవతలకు ……
నో నో నో అంటూ లేచి నుదుటిపై ముద్దుపెట్టి తినిపించాను .
బుజ్జిజానకి : లవ్ ….. మ్మ్ మ్మ్ సూపర్ అంటూ కిల్లీతోపాటు నా బుగ్గపై కొరికేసింది , మ్మ్ ….. మరింత టేస్టీ ….. , మహేష్ ….. కదలకు కదలకు నీ బుగ్గపై ఎర్రగా కిళ్లీ అంటూ నాలుకతో జుర్రుకుని సిగ్గుపడుతూ వెళ్లి వాసంతి అంటీని చుట్టేసి కూర్చుంది .
అప్పటికిగానీ దేవతలు కళ్ళు తెరిచి , దేవతమ్మా దేవతమ్మా అక్కయ్యా ….. సో సో సో టేస్టీ లవ్ యు లవ్ యు మాపై ఎంత ప్రేమ ఉందో ఈ స్వీట్ తోనే తెలిసిపోతోంది.
బుజ్జిజానకి : అంతటి తియ్యనైన ప్రేమ వలన మైకం కూడా వచ్చేస్తోంది , నాకైతే దేవతల ఒడిలో నిద్ర వచ్చేసేలా ఉంది .
అంతకంటే అదృష్టమా బుజ్జితల్లీ అంటూ సునీత అంటీ ఒడిలో పడుకోబెట్టుకుని జోకొడుతోంది .
బుజ్జిజానకి : ఎదురుగా ఉన్న నావైపే ప్రేమతో అందమైన నవ్వులతో చూస్తూ చూస్తూనే నిద్రలోకిజారుకుంది .
మేముకూడా exam రాసి ఫుల్ గా తిని అలసిపోయాము అంటూ మేడమ్ – దేవతమ్మ – వాసంతి అంటీ ఒడిలో చేరారు , తమ్ముడూ ….. ఇక మిగిలినది కాంచన అమ్మే వచ్చి అమ్మ ఒడిలో వాలిపో ……
లవ్ టు అంటూ లేచాను .
దెబ్బలుపడతాయి అనడంతో బుద్ధిగా వెళ్లి అమ్మమ్మ ప్రక్కన చేరాను – కాంచన అంటీ ….. బాబును ఒడిలో పడుకోబెట్టుకున్నారు .
అమ్మమ్మ : దేవుడిని పడుకోబెట్టుకునే అదృష్టాన్ని ఇస్తావా మహేష్ ….. ? .
లవ్ టు అమ్మమ్మా అంటూ ఒడిలో తలవాల్చాను .
అమ్మమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో ….. నా జానకినే పడుకోబెట్టుకున్నట్లుగా ఉంది , హాయిగా నిద్రపో దేవుడా …… , నిన్ను సంతోషపెడితే జానకి ఆనందిస్తుంది .
మీ ఆనందబాస్పాలను చూసి ఎంత ఆనందిస్తున్నారో అమ్మ ……
బుజ్జిజానకి : చాలా అంటే చాలా మహేష్ ……
నువ్వింకా నిద్రపోలేదా బుజ్జిజానకీ …..
బుజ్జిజానకి : ఇదిగో అందరినీ ఇలా చూసానుకదా ఇప్పుడు హాయిగా నిద్రపోతాను అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
క్యాచ్ పట్టేసి హృదయంలో దాచేసుకున్నాను .
అమ్మకూచీ – అక్కయ్యల నవ్వులు ……
అమ్మమ్మ అయితే పట్టరాని ఆనందంతో ప్రాణంలా జోకొడుతూ మురిసిపోతున్నారు .