థర్డ్ MISSION 7 28

లవ్ యు లవ్ యు అమ్మమ్మా అంటూ అందుకుని అమ్మకూచీకి తినిపించి తిన్నారు .

బుజ్జిజానకి : 12:30 అవుతోంది 10 కు వెళ్లిన అత్తయ్యలు ఇంకా రాలేదు అంటూ గుమ్మం దగ్గరకువెళ్లి చూస్తోంది .
అక్కయ్యలు : ఇప్పటివరకూ తమ్ముడు ఒక్కడే ఇప్పుడు చెల్లి కూడానా …… సరిపోయింది , వస్తారులే అంతవరకూ ఏదైనా ఆట ఆడుదాము .
బుజ్జిజానకి : ఏ ఆట ఆడుదాము అక్కయ్యలూ ……
పెద్దమ్మ : కళ్ళకు గంతలు ……
Ok ok ok ……
పెద్దమ్మ : టచ్ చెయ్యడం కాదు గట్టిగా పట్టేసుకోవాలి …… అంటూ అక్కయ్యలు – బుజ్జిజానకి వైపు కొంటెగా కన్ను కొట్టారు .
లవ్ యు లవ్ యు లవ్ యు దేవతమ్మా అంటూ పరుగునవెళ్లి హత్తుకున్నారు – ముద్దుల వర్షం కురిపిస్తున్నారు .

పెద్దమ్మ : అప్పచ్చెలు వెయ్యండి మరి ? .
మీరు మీరు మీరు …… అంటూ అందరమూ ఆడిగాము .
పెద్దమ్మ : మిగతా ముగ్గురు దేవతలు వచ్చాక మేమూ జాయిన్ అవుతాము అంతవరకూ మీరు ఆడండి మేము చూసి తరిస్తాము .
అయితే ఒక అంటూ ఐదుగురం వేశాము …… , అమ్మకూచీ చివరన రావడంతో సంతోషంగా గంతలు కట్టుకోవడానికి ముందుకువచ్చింది .
అక్కయ్యలు ముగ్గురూ ….. అమ్మకూచీ బుగ్గలపై ముద్దులుపెట్టారు , తమ్ముడూ ….. చెల్లి పాదాలకు టేబుల్స్ సోఫాలు తగులుతాయేమో ……
ప్రక్కకు జరిపేద్దాము …..
పెద్దమ్మ – మేడమ్ సహాయంతో గోడలకు చేర్చాము .
అక్కయ్యలు : ఇప్పుడు ఏ భయమూ లేదు .
బుజ్జిజానకి : లవ్ యు అక్కయ్యలూ …… , దేవతమ్మా ….. గంతలు కట్టండి wait wait రూల్స్ ఏమిటి ? .
ఎవరిని మొదటగా టచ్ చేస్తే వాళ్ళు ఔట్ ……
అక్కయ్యలు : టచ్ కాదు పట్టుకోవాలి ……
అదే అదే పట్టుకుంటే వాళ్ళు ఔట్ …..
పెద్దమ్మ : ఒక్కరినే కాదు అందరినీ ఔట్ చెయ్యాలి చివరన ఎవరు మిగులుతారో వాళ్ళు నెక్స్ట్ గంతలు కట్టుకోవాలి .
ఇలాంటి రూల్స్ ఎప్పుడూ వినలేదే ……
పెద్దమ్మ ….. అక్కయ్యలు – అమ్మకూచీ వైపు కన్నుకొట్టడంతో , yes yes మాకు ok అంటూ వంత పాడటంతో ఇక గేమ్ స్టార్ట్ అయ్యింది .

అమ్మకూచీ గంతలు కట్టుకుని ఎక్కడ ఎక్కడ అంటూ చేతులతో తడుముతూ వెతుకుతోంది .
పెద్దమ్మ – మేడమ్ ….. లెఫ్ట్ రైట్ స్ట్రెయిట్ మహేష్ కూచీ బుజ్జిజానకీ ….. అంటూ హెల్ప్ చెయ్యడంతో మొదట స్వాతి అక్కయ్యను పట్టేసుకుని కౌగిలిలో బంధించేసింది .
స్వాతి అక్కయ్య : ఔట్ అయిపోయాను – లవ్ యు చెల్లీ అంటూ ముద్దుపెట్టి , మేడమ్ చెంతకు చేరి చెల్లీ చెల్లీ ….. స్ట్రెయిట్ స్ట్రెయిట్ అంటూ వాసంతి అక్కయ్యను పట్టించేసింది .
వాసంతి అక్కయ్య : దొంగది పట్టించేసింది అంటూ అమ్మకూచీ బుగ్గపై ముద్దుపెట్టి పెద్దమ్మ గుండెలపైకి చేరింది .
అక్కయ్యలిద్దరూ ….. పెద్దమ్మ – మేడమ్ తో హైఫై కొట్టి లెఫ్ట్ లెఫ్ట్ స్ట్రెయిట్ ముందుకు మరింత ముందుకు అంటూ నన్ను పట్టించేసి నవ్వుతున్నారు .
బుజ్జిజానకి : మహేష్ …… దొరికిపోయావు అంటూ గట్టిగా చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది .
చెల్లీ చెల్లీ ……. సూపర్ , ఇక గంతలు విప్పెయ్యి నెక్స్ట్ గంతలు కట్టుకోవాల్సినది కాంచన ……
బుజ్జిజానకి కళ్ళుతెరిచి , ప్చ్ ప్చ్ అక్కయ్యలూ ….. మహేష్ ను లాస్ట్ లో మిగిల్చాల్సింది .
పెద్దమ్మ : ఏ సమయానికి ఏమి జరగాలో అది జరుగుతుంది మహేష్ కూచీ ……
బుజ్జిజానకి : దేవతమ్మ చెప్పారంటే ఏదో ఉండే ఉంటుంది , లవ్ యు ….. , నెక్స్ట్ గేమ్ నెక్స్ట్ గేమ్ అంటూ కాంచన అక్కయ్యకు గంతలు కట్టారు .
ప్లాన్ ప్రకారం అన్నట్లు అలా వరుసగా అక్కయ్యలు ఒకరి తరువాత ఒకరు గంతలు కట్టుకుని చిరునవ్వులు పంచారు , అలా ఫైనల్ గా నావంతు వచ్చింది .

యాహూ యాహూ అంటూ చుట్టూచేరి కళ్ళకు గంతలు కట్టి , మాతోనే మాట్లాడవా అంటూ అక్కయ్యలు ….. బుగ్గలపై కొరికేశారు .
మా అక్కయ్యలతోనే మాట్లాడవా అంటూ నా భుజంపై కొరికేసింది .
కెవ్వున కేకలువేశాను , స్స్ స్స్స్ స్స్స్ …… పెద్ద దేవతమ్మా ……
పెద్దమ్మ : నా సపోర్ట్ తల్లులకే నేనేమీ చేయలేను .
అమ్మకూచీ – అక్కయ్యలు నవ్వుకుని , నొప్పివేస్తోందా మహేష్ – తమ్ముడూ అంటూ ముద్దులుపెట్టి చుట్టూ తిప్పారు .
అఅహ్హ్ ….. ఇప్పుడు కాస్త హాయిగా ఉంది , నన్నే కొరికేస్తారా ఉండండి మిమ్మల్ని పట్టుకోవడమే కాదు బుగ్గపై కొరికేస్తాను .
లవ్ టు లవ్ టు అంటూనే మళ్లీ కొరికేసి పట్టుకో చూద్దాం అంటూ చుట్టూ తిప్పేసి నలుదిక్కులకూ పరుగులుతీశారు .
అమ్మా అమ్మా ….. ఎంత గట్టిగా కొరికారు దొరికారో అయిపోయారు , దేవతమ్మా – మేడమ్ …… మీ తల్లులకు మాత్రమే కాదు నాకూ హెల్ప్ చెయ్యాలి .
సమయం వచ్చినప్పుడు తప్పకుండా సహాయం చేస్తాము అంటూ పెద్దమ్మ – మేడమ్ హైఫై కొట్టుకున్నారు .
నేను చేస్తాను మహేష్ అంటూ బాబును ఎత్తుకున్న అమ్మమ్మ ముందుకువచ్చారు .
థాంక్యూ అమ్మమ్మా …….

మహేష్ ముందుకు ముందుకు ఎడమ ప్రక్కకు కొద్దిగా ముందుకువెళ్లు గోడ ఉంది కదలలేదు …… దొరికిపోయింది .
థాంక్యూ అమ్మమ్మా ….. పట్టేసుకున్నాము ఎవరబ్బా అమ్మకూచీ అంటూ పట్టువిడవకుండా కౌగిలిలో బంధించేసాను , ఎంత గట్టిగా కొరికావు …..
బుజ్జిజానకి : ప్రేమతో …… , బంధించాల్సిన అవసరం లేదు మహేష్ ….. నీకౌగిలిలో హాయిగా కరిగిపోతాను .
అఅహ్హ్ ….. ఇప్పుడైతే నీ తియ్యనైన పలుకలకు కరగను అంటూ బుగ్గపై కొరికేసాను .
కెవ్వుమంటూ కేకవేసింది అమ్మకూచీ ……
చుట్టూ నవ్వులు ఆగడం లేదు .
నవ్వుకుని , అక్కయ్యలూ ….. ఇక మీవంతు , బయట కారు ఆగినట్లు వినిపించింది , కానీ అదేదీ పట్టించుకునే స్థితిలో నేను లేను ……

పెద్దమ్మ – మేడమ్ : మహేష్ కూచీ ….. ఇప్పుడు హెల్ప్ చేద్దామురా అంటూ గుండెలపైకి చేర్చుకున్నారు , కన్ ….. మహేష్ లెఫ్ట్ లెఫ్ట్ మరింత లెఫ్ట్ మేము చెప్పినట్లు చేస్తే ముగ్గురు అక్కయ్యలను కార్నర్ చేసి ఒకేసారి పట్టేసుకోవచ్చు …….
లవ్ టు దేవతమ్మా …… నాకు కావాల్సింది కూడా అదే ఒకేసారి పట్టు విడవకుండా పట్టేసుకుని కొరికేస్తాను పగ తీర్చుకుంటాను .
పెద్దమ్మ – మేడమ్ – బుజ్జిజానకి : కాస్త ముందుకు మరింత మరింత చేతులను విశాలంగా చెయ్యి ……
లివ్ టు దేవతమ్మా – మేడమ్ , థాంక్యూ బుజ్జిజానకీ …… అంటూ చేతులను విశాలంగా చాపి కబడ్డీ కబడ్డీ అంటూ కార్నర్ చేసినట్లు ముందు ముందుకు వెళ్ళాను …… , ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ …… , సౌండ్స్ లేకపోతేనేమి మీ శ్వాస చాలు అక్కయ్యలూ పట్టేస్తాను కొరికేస్తాను అంటూ ముగ్గురినీ ఒకేసారి చుట్టేసి పెదాలతో బుగ్గలను కనిపెట్టి పంటిగాట్లుపడేలా కొరికేసి , యాహూ యాహూ యాహూ …… నాతోనే పెట్టుకుంటారా దెబ్బకుదెబ్బ అంటూ గంతలు తీసి పైకి విసిరేసి సంతోషంతో కేకలువేస్తున్నాను , ఆశ్చర్యం ఎదురుగా నవ్వులను కంట్రోల్ చేసుకుంటున్న అక్కయ్యలు – అమ్మకూచీ ……
నా వెనుక ఒక్కసారిగా నా దేవతలు కెవ్వున కేకలు ……
అంటే పట్టుకున్నది – కొరికినది అక్కయ్యలను కాదు నా దేవతలను అన్నమాట …. అంటూ నుదుటిపై చెమటతో వణుకుతూ వెనక్కు తిరిగాను .
దేవతలు తమ బుగ్గలపై పంటి గాట్లను రుద్దుకుంటూ భద్రకాళీ అవతారాలలోకి ఎప్పుడో మారిపోయారు .
నేను భయంతో వణకడం చూసి వెనుక అందరి ముసిముసినవ్వులు ……

దేవ ….. అంటీలూ ….. మీరెప్పుడు వచ్చారు ? , పట్టుకుని కొరకాలనుకున్నది మిమ్మల్ని కానే కాదు .
అంటీలు : స్స్స్ స్స్స్ స్స్స్ ….. మరి ఎవరిని ? .
కూల్ కూల్ అంటీలూ ….. , మీ స్వరానికే చెమటలు పట్టేస్తున్నాయి .
అంటీలు : మమ్మల్ని కాకపోతే ఎవరిని ? .
నిజం చెబితే మరింత డేంజర్ ….. అయిపోయాను , ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది నా పరిస్థితి .
అంటీలు : మౌనంగా ఉంటే సరిపోదు ఎవరికి కొరకాలనుకున్నావు ? .
అంతే వెక్కిళ్ళు వచ్చేసాయి .
అమ్మమ్మ మొదలుకుని పెద్దమ్మ – మేడమ్ – అక్కయ్యలు – అమ్మకూచి ….. చేతులలో నీళ్లతో చుట్టూ చేరారు .
ఆ పరిస్థితిలో మొత్తం అన్నీ గ్లాసులలోని నీళ్లను త్రాగేసాను .
చుట్టూ నవ్వులు ఆగడం లేదు .
అంటీలు : వెక్కిళ్ళు ఆగిపోయాయికదా చెప్పు ఎవరిని ? .
అదీ అదీ ……

నేను చెబుతాను దేవతలూ ….. , తల్లులనే ….. అని చెప్పారు పెద్దమ్మ .
అంటీలు : తల్లులనా ? .
అవును నలుగురు తల్లులనూ కొరికేద్దామనుకున్నాడు అక్కయ్యలూ అంటూ మేడమ్ కూడా ……
అంతే షాక్ లో నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాను .
అవును అత్తయ్యలూ …… మేము ఆడుకోవడానికి రావడం లేదని నన్నూ – అక్కయ్యలను కొరికేస్తాను అంటూ ఇల్లంతా పరిగెత్తిస్తున్నాడు , చెప్పండి అక్కయ్యలూ …… అత్తయ్యలు వచ్చేశారుకదా ఇక ఏ భయమూ లేదు .
అక్కయ్యలు ….. ఎవరికి సపోర్ట్ చెయ్యాలో తెలియక మౌనంగా నవ్వుకుంటున్నారు .
మేమేవ్వరికి చెబుతాము అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది అంటూ చిలిపిదనంతో నవ్వుతూ దేవతల వైపుకు చేరిన పెద్దమ్మ – మేడమ్ – అమ్మకూచీలవైపు దీనంగా చూస్తున్నాను .
బుజ్జిజానకి : ఎంజాయ్ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి , అత్తయ్యలూ ….. నాకంటే గట్టిగా మిమ్మల్ని కొరికేసాడు – అసలుకు ఈ పంటిగాట్లు అక్కయ్యల బుగ్గలపై పడేవి మీరు రాకపోయుంటే ……
అంటీలు : బుజ్జిజానకీ ……. ఎర్రగా కందిపోయింది నొప్పివేస్తోందా ? .
బుజ్జిజానకి : అడుగుతున్నారా అత్తయ్యలూ …… స్స్స్ .
అంటీలు : లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ అమ్మకూచీ బుగ్గ గాట్లపై ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : మ్మ్ మ్మ్ మ్మ్ హాయిగా ఉంది అత్తయ్యలూ ……
అంటీలు : కోప్పడితే మాట్లాడినందుకు ఆనందిస్తాడు – కొడితే స్పృశించామని ఎంజాయ్ చేస్తాడు ……
బుజ్జిజానకి : అయితే ఊరికే వదిలేస్తారా అత్తయ్యలూ ……
పెద్దమ్మ : శిక్షపడితేనే గుర్తుంటుంది దేవతలూ ……
అంటీలు : ప్రామిస్ చేసి తల్లులతో ఎందుకు మాట్లాడావు ఏకంగా కొరకడానికే సాహసం చేసావు ……
అమ్మకూచీ – పెద్దమ్మ – మేడమ్ వైపు కన్నుకొట్టి , లవ్ ….. sorry అంటీలూ అంటూ లెంపలేసుకుని గుంజీలు తియ్యడం మొదలెట్టాను .
అంటీలు : మొదలెట్టేసాడు , ఇలా నవ్వించేస్తాడు , వంద గుంజీలు తియ్యి ……
వంద ఏమిటి అంటీలూ మీరు ఆర్డర్ వేస్తే వెయ్యి అయినా సంతోషంగా తీస్తాను , 1 2 3 ……
అంటీలు : అల్లరి అల్లరి …… అల్లరి మాత్రం ఆపడు , బుజ్జితల్లి సంతోషాన్ని పాడుచెయ్యడం ఇష్టంలేదు కాబట్టి వదిలేస్తున్నాము , గుంజీలు మాత్రం తియ్యాల్సిందే …… , బుజ్జితల్లీ ….. ప్రేమతో బోలెడన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాము ఉండు తీసుకొస్తాము అంటూ బయటకు నడిచారు .
పెద్దమ్మ – మేడమ్ : మేము హెల్ప్ చేస్తాము అంటూ గుంజీలు తీస్తున్న నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి వెనుకే వెళ్లారు .

లవ్ ….. థాంక్యూ అమ్మకూచీ – అక్కయ్యలూ ….. అంటూ అమ్మకూచీని చుట్టేసాను సంతోషంతో ……
అక్కయ్యలు : హమ్మయ్యా తమ్ముడు బాధపడలేదు .
దేవతల శిక్షలూ ఇష్టమే …… , ఇక ఎవ్వరు చెప్పినా మీతో మాట్లాడనే మాట్లాడను .
అక్కయ్యలు : ఎలానో మేమూ చూస్తాము అంటూ మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మలు వచ్చేస్తున్నారు ……
అమ్మకూచీ నుదుటిపై ముద్దుపెట్టి , 10 11 12 …..
అమ్మకూచీ – అక్కయ్యలు నవ్వుకున్నారు .

ఐదుగురు దేవతలూ …… రెండు చేతుల నిండుగా పట్టుకురావడం చూసి , ఒసేయ్ అమ్మలూ …… షాప్ నే తెచ్చేసినట్లున్నారు అంటూ హెల్ప్ చేశారు .
హమ్మయ్యా …… అంటూ సోఫాలలోకి వాలిపోయారు .
అంటీలు : మరి మన కుందనపు బొమ్మకు గిఫ్ట్స్ అంటే ఈ మాత్రమైనా ఉండకపోతే ఎలా ? , బుజ్జితల్లికే కాదు మీ అమ్మమ్మకు – దేవతమ్మకు – మేడమ్ కు – బాబుకు మరియు మరియు అంటూ నావైపుకు చూసి అంతే అంతే అన్నారు , టైం సరిపోలేదు కానీ బుజ్జితల్లిపై మాకున్న ప్రేమకు ఇవి ఏపాటివి ……
అమ్మకూచీ కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు అత్తయ్యలూ అంటూ హత్తుకుని పొంగిపోతోంది .
అంటీలు : లవ్ యు బుజ్జితల్లీ ….. , మీ అక్కయ్యలతో సమానం అని నిన్ననే చెప్పాముకదా ……
అక్కయ్యలకంటే ఎక్కువ ……
అంటీలు : కోపం ……
బుజ్జిజానకి : అత్తయ్యలూ ….. షాపింగ్ చేసి అలసిపోయారు నేను బదులిస్తాను కదా …… , హలో మహేష్ …… ముందైతే గుంజీలు తియ్యి .
అంటీలు : లవ్ యు బుజ్జితల్లీ ……

అక్కయ్యలు : అమ్మకూచీ బుగ్గలపై ముద్దులుపెట్టి , ఒక్క నిమిషం చెల్లీ అంటూ అంటీలను ప్రక్కకు అంటే గుంజీలు తీస్తున్న నాదగ్గరకు పిలుచుకునివచ్చారు , అమ్మలూ ….. ఇన్ని గిఫ్ట్స్ ఎలానే ? .
అంటీలు : షాపింగ్ కు ఇక్కడినుండి బయలుదేరామా ? , మీ నాన్నలకు ఎలా తెలిసిందో ఏమిటో ….. మీకిష్టమైన వాళ్లకోసం షాపింగ్ చేయబోతున్నారు కదూ అంటూ ఎంతవేశారో మొబైల్లో చూయించారు ఆనందిస్తూ ……
అక్కయ్యలు : 10 lakhs ….. అంటూ ఆశ్చర్యపోతున్నారు .
అంటీలు : మేమూ ఇలానే షాక్ అయ్యాము , మరింత షాక్ ఏమిటంటే తక్కువైతే చెప్పండి మళ్లీ వేస్తాము అన్నారు తెలుసా …… మనకు నిన్నటి నుండీ మంచి రోజులు వచ్చేసాయి .
అక్కయ్యలు : నావైపున చూస్తూ న్యూ ఇయర్ రోజునే మనకు దేవుడే మంచిరోజులు తీసుకొచ్చాడమ్మా అంటూ కళ్ళల్లో చెమ్మతో అడిగారు నువ్వే కదా అంటూ ……
నాకేం సంబంధం నాకేం తెలియదు అంటూ కళ్ళతోనే బదులిచ్చి గుంజీలు తీస్తున్నాను .
అక్కయ్యలు : చెమ్మలను తుడుచుకుని , అమ్మలూ …… అందరికీ ప్రేమతో ఇద్దాము రా మరి అంటూ ముందుకు తోసి వెనుక నా బుగ్గలపై ముద్దులుపెట్టి , లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ పెదాలను కదిలిస్తూ వెళ్లారు .

అంటీలు : ఏదో ముఖ్యమైన విషయం అన్నట్లు ప్రక్కకు తీసుకెళ్లారు మీ అక్కయ్యలు , లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ….. , నీకోసం – నీ దేవతలకోసం మనసుపెట్టి ప్రేమతో తీసుకొచ్చిన గిఫ్ట్స్ అందుకో బుజ్జితల్లీ ……
బుజ్జిజానకి : మొదట అంటీకు – దేవతమ్మకు ….. ముఖ్యంగా బాబుకు – మహేష్ కు …….
అంటీలు : ఆ అల్లరి పిల్లాడికి తీసుకురావడానికి మనసొప్పలేదు .
అంటే దేవ ….. అంటీల మనసుల్లో ఉన్నట్లే కదా …..
అంటీలు : ఇదేమైనా ఫీల్ మై లవ్ అనుకున్నావా ? , అలాంటిదేమీ లేదులే నువ్వు గుంజీలు తియ్యి .
సంతోషంగా దేవా …. అంటీలూ , మా అంటీల మనసుల్లో ఉన్నాను అధిచాలు ….
అందరూ నవ్వుకుంటున్నారు .
బుజ్జిజానకి : దేవతలూ ….. అయితే మొదట మీ అక్కాచెల్లికి ఇవ్వండి .
పెద్దమ్మ – అంటీ : అదెలా కుదురుతుంది , వెళ్లినది నీకోసం కాబట్టి మొదట నీకే ఇవ్వాలి .
బుజ్జిజానకి : మొదట దేవతలకు ఇస్తేనే నాకు సంతోషం ……
పెద్దమ్మ – అంటీ : మొదట మహేష్ కూచీకి ఇస్తేనే మాకూ సంతోషం ……
బుజ్జిజానకి : లేదు లేదు మొదట దేవతలకే …..
లేదు లేదు బుజ్జిజానకికే ……
Wow బ్యూటిఫుల్ ……
అక్కయ్యలు : కదా తమ్ముడూ ……
గప్ చుప్ …..
అంటీలు : Thats గుడ్ …… అంటూ నావైపు కోపంతో చూసారు , గిఫ్ట్స్ తెచ్చినది నేను కాబట్టి నాఇష్టం , బుజ్జితల్లి కోరిక తీర్చడమే ఉత్తమం …..
గుంజీలు తీస్తూనే విజిల్ వేసాను ……
అంటీలు : గుంజీలు తీస్తున్నావా …. ? , చాటుగా వింటున్నావా ? .
మాట్లాడొచ్చా అంటీలూ …..
అంటీలు : నో నో నో …… , చనువితే నెత్తిన ఎక్కి కూర్చుంటావు , బుజ్జితల్లీ …… నీ ఇష్టమే మా అందరి ఇష్టం ……
నా ఇష్టం కూడా ……
అంటీలు : నిన్నెవ్వరూ అడగలేదులే ……
Ok …..
అంటీలు : ముందుగా బాబుకు ఇవ్వండి తల్లులూ …..
దేవతలూ ….. మీచేతులతో ఇస్తే అందంగా ఉంటుంది , మధ్యలో ……
అక్కయ్యలు : మధ్యలో పానకంలో పుడకలు ఎందుకు అంటున్నావు కదూ తమ్ముడూ …….
అంటీలు నవ్వేశారు …..
యాహూ యాహూ ……
అంటీలు : అయినా మేమెందుకు నవ్వాము , వద్దే ….. ఆ అల్లరి పిల్లాడికి చనువే ఇవ్వకూడదు అంటూ మొట్టికాయలు వేసుకున్నారు .
అమ్మకూచీ నవ్వడంతో అందరూ నవ్వుకున్నారు , తల్లులూ ……