థర్డ్ MISSION 7 28

స్స్స్ స్స్స్ అంటూ రుద్దుకోవడానికి చేతులు వదలగానే పంటిగాట్లపై ముద్దుపెట్టి ఎదురుగా సోఫాలోకి చేరిపోయాను బుద్ధిగా ……

ఆ అబ్బాయి వెళ్లిపోయాడుగా అంటూ లోపలికివచ్చారు …… , ఇంకా ఇక్క….డే ఉ…..న్నాడా ? , ఏమే ….. లోపల అబ్బాయి ఉండగా తలుపులెందుకు వేశావు ? .
అమ్మమ్మ : నేను వెయ్యలేదు ఫ్రెండ్స్ , గాలికి అవే క్లోజ్ అయ్యాయి అంటూ లోలోపలే నవ్వుకుంటున్నారు .
బామ్మలు : కనీసం దూరంగా అయినా కూర్చున్నారులే …….
లేదే అంటూ అమ్మకూచీ లేచివచ్చి నాచేతిని చుట్టేసి హత్తుకుని కూర్చుంది .
బామ్మల ముఖాలు చూడాలి …… నవ్వు ఆగడంలేదు .
బుజ్జిజానకి : ఇంటికి వచ్చిన దేవుడిని ……
బామ్మలు : అర్థమైంది అర్థమైంది …… మీ దేవుడిని వదలకుండా ఇంట్లోనే ఉంచేసుకోండి .
బుజ్జిజానకి : పెద్దవారు ఎలా చెబితే అలా …… , థాంక్యూ బామ్మలూ ….. మీరుకూడా ok అన్నారు సంతోషం అంటూ నన్ను చుట్టేసింది .
అమ్మమ్మ : ఫ్రెండ్స్ ….. ఐస్ క్రీమ్ తిని వెలుదురుకానీ రండి .
బామ్మలు : పిల్లలు వచ్చే సమయం అయ్యింది వెళ్ళాలి .
బుజ్జిజానకి : పిల్లలకు తీసుకెళతారు ఇవ్వు అమ్మమ్మా ……
అమ్మమ్మ : సరే అంటూ తీసుకొచ్చి ఇచ్చారు .
బామ్మలు : మా మహి మనసు బంగారం , దూరం దూరం కూర్చో ……
బుజ్జిజానకి : ఊహూ ….. దేవుడు …..
బామ్మలు : దేవుడు దేవుడు ….. గాలికూడా దూరకుండా హత్తుకునే కూర్చో మేము వెళ్ళొస్తాము .
బుజ్జిజానకి : అల్వేస్ వెల్కం బామ్మలూ బై బై ……

బామ్మలు వెళ్ళాక ముగ్గురం నవ్వుకున్నాము , మహేష్ ….. ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అంటూ మాఇద్దరి కురులపై ముద్దులుపెట్టి వెళ్లారు .
బుజ్జిజానకి : వదలద్దు అన్నానుకదా ? .
అయిపోయాను నీఇష్టం అంటూ కళ్ళుమూసుకున్నాను .
బుజ్జిజానకి : లవ్ … స్వీట్ ఆఫ్ యు అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , చేతికి చార్ట్ అందించింది .
కళ్ళు తెరవగానే చిరునవ్వులు చిందిస్తూ నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి ప్రేమతో చుట్టేసింది .
లవ్ ….. థాంక్యూ అమ్మకూచీ అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , అమ్మకూచీ ….. నిన్న నీ సంతోషాలను చూస్తూ అమ్మ ఎంత సంతోషిస్తున్నారో అని హృదయంపై చేతినివేసుకుని కళ్ళుమూసుకున్నాను .
అలా నిద్రపోగానే అమ్మ – పెద్దమ్మ ముద్దులు అంటూ డ్రా చేసాను .

మహేష్ – మహేష్ కూచీ ….. ఐస్ క్రీమ్ , అన్నీ ఫ్లేవర్స్ ఉన్నాయి మీకిష్టమైన ఫ్లేవర్ తినండి అంటూ బాక్స్ తీసుకొచ్చి మాముందు ఉంచారు అమ్మమ్మ ……
నాట్ నౌ అమ్మమ్మా …… , అమ్మకూచీకి ఇవ్వండి .
బుజ్జిజానకి : నేను తినిపిస్తాను అంటూ నోటికి అందించింది .
వనీలా ….. మ్మ్ టేస్టీ …..
బుజ్జిజానకి : అవునా అంటూ అదే స్పూన్ తో తిని మ్మ్ మ్మ్ డబల్ టేస్టీ అంటూ ఫీల్ అవుతోంది .
అమ్మకూచీ ….. నాకు తినిపించిన స్పూన్ ….. , అమ్మమ్మా ….. మరొక స్పూన్ ఇవ్వండి .
బుజ్జిజానకి : ఇస్తావా అమ్మమ్మా ….. ? .
అమ్మమ్మ : అంత ధైర్యం నాకెక్కడ ఉందమ్మా ….. , నా సీరియల్ టైం అంటూ అటువైపుకు తిరిగి కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్నారు .
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా …… , వేరే స్పూన్ తో తినిపించాలా మహేష్ ? .
తలను అన్నివైపులా ఊపాను .
బుజ్జిజానకి : బ్రతికిపోయావు అంటూ తినిపించి నవ్వుకుంది .
నాకు కావాల్సింది కూడా ఇదేకదా అంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను మ్మ్ మ్మ్ ….. , అమ్మమ్మా ….. అమ్మకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టం ? .
అమ్మమ్మ : చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అంటూ అటువైపుకు తిరిగే బదులిచ్చారు .
బుజ్జిజానకి : అర్థమైంది అంటూ చాక్లెట్ ఐస్ క్రీమ్ అందుకుని తినిపించి తిని , లవ్ ….. సో స్వీట్ అంటూ ఆనందబాస్పాలతో ముద్దుపెట్టింది బుగ్గపై …..
పెద్దమ్మకు ….. స్ట్రాబెర్రీ ఇష్టం ? .
బుజ్జిజానకి : అయితే స్ట్రాబెర్రీ అంటూ అందుకుని తినిపించి ముద్దుపెట్టింది , అంటీకి కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్ …… , మరి దేవతలకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టం ? .
నాకూ తెలియదు ….. , ఇక మిగిలినది డ్రై ఫ్రూట్ ఇస్ క్రీమ్ కాబట్టి అదే అవ్వాలి అంటూ నవ్వుకుంటూ మొత్తం తినేసాము .
బుజ్జిజానకి : ఐస్ క్రీమ్స్ అన్నీ అయిపోయాయి ……
డ్రాయింగ్స్ కూడా పూర్తయ్యాయి అంటూ లేచి మోకాళ్లపై కూర్చుని డ్రాయింగ్స్ పై గులాబీ పూలను ఉంచి అందించాను .
పులకించినట్లు ….. లవ్ సో స్వీట్ ఆఫ్ యు మహేష్ అంటూ అందుకుని , లేపి ప్రక్కన కూర్చోబెట్టుకుని చేతిని చుట్టేసింది , wow ….. అచ్చు నాలానే ఒడిలో పడుకోబెట్టుకుని జోకొడుతూ నిద్రపుచ్చింది , అంటే నాతో ఉన్నది కొద్దిసేపే అన్నమాట , చూసావా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అదే నాకూ – అమ్మమ్మకు ఇష్టం అంటూ ప్రేమతో చుట్టేసింది .

బాబు లేచినట్లు ఏడవటంతో వెళ్లి ఎత్తుకున్నాము , అమ్మమ్మ నుండి ఐస్ క్రీమ్ తెప్పించి తినిపిస్తూ ముద్దుచేస్తున్నాము .
అమ్మకూచీ అమ్మకూచీ …… తొందరగా తొందరగా బయటకువెళ్లి కాంపౌండ్ చాటున దాక్కుంటే నీ ప్రియమైన వాళ్లకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు ఎదుకంటే నీకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ప్లాన్ చేస్తున్నారు .
బుజ్జిజానకి : అక్కయ్యలు – దేవతలు వచ్చేస్తున్నారన్నమాట …… , లవ్ టు లవ్ టు ….. కాలేజ్ – కాలేజ్ లంచ్ టైం కూడా అయ్యింది , సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న అక్కయ్యలు – దేవతలకే సర్ప్రైజ్ …… సూపర్ సూపర్ ….. , లవ్ … థాంక్యూ మహేష్ , ఎలా తెలిసింది ? అయినా దేవుడికి అన్నీ తెలిసిపోతాయిలే ఎలా అడుగుతున్నానో చూడు అంటూ నవ్వుతోంది .
ఇలా నవ్వుతూ ఇక్కడే ఉండు , సర్ప్రైజ్ …..
బుజ్జిజానకి : నో నో నో నేనే సర్ప్రైజ్ ఇస్తాను , అక్కయ్యలు – దేవతలు ….. ఆశ్చర్యపోవాలి అంటూ నా బుగ్గపై ఏకంగా కొరికేసి బయటకు పరుగులుతీసింది .
అఅహ్హ్ …… చీరలో పరుగులుతీస్తుంటే చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు .
అమ్మమ్మ : చూసుకో చూసుకో తనివితీరా చూసుకో మహేష్ ……
Sorry sorry అమ్మమ్మా ……
అమ్మమ్మ : Sorry దేనికి నాకైతే సంతోషమే , నేనే sorry ప్రతీసారీ మీమధ్యలో పానకంలో పుడకను అవుతున్నాను , ఎండన వస్తారు కాబట్టి నేను వెళ్లి జ్యూస్ – డ్రింక్స్ – ఐస్ క్రీమ్స్ సిద్ధం చేస్తాను అంటూ నా – బాబు బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ లోపలికివెళ్లారు .
థాంక్యూ అమ్మమ్మా ….. థాంక్యూ అమ్మా ….. , బుజ్జి దేవకన్య స్వచ్ఛమైన ప్రేమను పొందుతున్నందుకు ……. , బాబు కోపంతో చూస్తుండటం చూసి నవ్వుకుని sorry sorry అంటూ ఐస్ క్రీమ్ కదా అంటూ తినిపించి ఎత్తుకున్నాను – బయటకు కనిపించనట్లు కిటికీలోనుండి చూస్తున్నాను , అమ్మకూచీ బ్యాక్ బ్యాక్ …… , సర్ప్రైజ్ కోసం పూలు తీసుకో ……
బుజ్జిజానకి : కదా …. లవ్ థాంక్యూ అంటూ పూలు కోసుకుని పూలరేకులుగా మార్చి , ఫ్లైయింగ్ కిస్ వదిలి మెయిన్ గేట్ ప్రక్కనే దాక్కుంది .

సరిగ్గా అదేసమయానికి అక్కయ్యలు స్కూటీలలో – పెద్దమ్మ కార్ లో వచ్చారు , ష్ ష్ ష్ అంటూ అక్కయ్యలు – మేడమ్ ….. చప్పుడు చెయ్యకుండా కిందకుదిగారు , పెద్దమ్మ మాత్రం సర్వం తెలిసినట్లుగా క్యాజువల్ గా దిగి కాంపౌండ్ చాటుకే చూస్తున్నారు .
అవునా అవునా అంటూ అమ్మకూచీ పెదాలపై అందమైన నవ్వులు ……
పెద్దమ్మా ….. అమ్మకూచీ కోసం కనీసం యాక్ట్ చెయ్యొచ్చుకదా ఫోజ్ కొట్టకపోతే ….
పెద్దమ్మ : లవ్ యు లవ్ యు అంటూ లెంపలేసుకుని , ష్ ష్ ష్ తల్లులూ అంటూ అక్కయ్యలు – మేడంతో కలిశారు .
లవ్ యు పెద్దమ్మా అంటూ నవ్వుకున్నాను .

చప్పుడు చెయ్యకుండా మెయిన్ గేట్ తెరిచి ఇద్దరిద్దరుగా చేతులుకలిపి అడుగుల్లో అడుగులువేసుకుంటూ లోపలికివచ్చారు , సర్ప్రైజ్ కోసం పూలు కోసుకోండి సౌండ్ లేకుండా …..
గోడ చాటున దాక్కున్న అమ్మకూచీకి ….. నామాటలు గుర్తుకొచ్చినట్లు నవ్వేసింది .
అటువైపుకు ఐదుగురూ చూడటానికి క్షణం ముందు పొదల చాటుకు చేరుకుని హమ్మయ్యా అనుకుని నవ్వుని ఆపుకుంటోంది .
థాంక్యూ పెద్దమ్మా అంటూ నవ్వుకున్నాను .
అక్కయ్యలు ….. పూలు కోసుకుని పూలరేకులుగా మార్చి రెండు చేతులనిండా ఉంచుకుని అతినెమ్మదిగా మెయిన్ డోర్ కు ఇరువైపులా చేరి లోపలికి తొంగి తొంగి చూసి లేరే అంటూ గుసగుసలాడుకుంటున్నారు .
అదేసమయానికి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ అమ్మకూచీ ….. అక్కయ్యల ముందు ప్రత్యక్షమై పూలు కురిపించి నవ్వుతోంది .
అవాక్కై చూస్తున్న అక్కయ్యలను హత్తుకుని ముద్దులుకురిపించి లోపలికి తీసుకొచ్చింది .
అక్కయ్యలు : మేము సర్ప్రైజ్ ఇవ్వాలని కాలేజ్ దగ్గరే ప్లాన్ చేసాము , అదేసమయానికి దేవతమ్మ రావడంతో కాలేజ్ లో అంటీని పిక్ చేసుకుని వచ్చాము .
బుజ్జిజానకి : లవ్ …. థాంక్యూ మహేష్ ….. అక్కయ్యలు చూడు ఎలా ఆశ్చర్యపోయారో అంటూ అక్కయ్యల పెదాలపై చేతులతో ముద్దులుపెడుతోంది .
అక్కయ్యలు : తమ్ముడి పని అన్నమాట అంటూ అమ్మకూచీ బుగ్గలపై ముద్దులుపెట్టి , రుసరుసలాడుతూ వచ్చి బాబుని ఎత్తుకుని నా బుగ్గలపై – చేతులపై గిల్లేసారు ……
స్స్స్ స్స్స్ స్స్స్ అంటూ చేతులుకట్టుకుని తలదించుకున్నాను .
బుజ్జిజానకి : నీ దేవతలు లేరుకదా మహేష్ ….. అక్కయ్యలతో మాట్లాడొచ్చుకదా ……
అమ్మో ఇంకేమైనా ఉందా ….. మాటంటే మాటే .
అక్కయ్యలు : విన్నారా దేవతమ్మా – అంటీ ….. , మేమేమైనా తప్పుచేసామా ? , వాళ్ళు వాళ్ళు ప్రామిస్ – కండిషన్స్ పెట్టుకుని మమ్మల్ని దూరం పెట్టడం ఏమైనా బాగుందా ? .
పెద్దమ్మ : తప్పు పెద్ద తప్పు ….. , మీరు కాబట్టి సున్నితంగా అడుగుతున్నారు – మేము గనుక మీ ప్లేస్ లో ఉండి ఉంటే కథ వేరుగా ఉండేది .
అక్కయ్యలు : నిన్నటి అక్కయ్యలు ఈ ఉంటే వేరుగా ఉండేది కానీ తమ్ముడిని ప్రాణంలా చూసుకుంటామని నాన్నలకు మాటిచ్చాము , తమ్ముడి మాటల కోసం ఎన్నిరోజులైనా సంతోషంగా ఎదురుచూస్తాము .
పెద్దమ్మ : కన్ …. మహేష్ తప్పుకదా …..
మేడమ్ : తప్పు తప్పు …… , అక్కయ్యలు ఎలాగో లేరు కదా మాట్లాడు మహేష్ ……
దేవతలకు తెలిస్తే కోప్పడతారు .
పెద్దమ్మ : ఎలా తెలుస్తుంది ? మేమెవ్వరం చెప్పము కదా ……
అందరివైపూ చూసి నాకైతే నమ్మకం కుదరడం లేదు అన్నాను .
అంతే పెద్దమ్మ – మేడమ్ – అమ్మకూచీ …… భద్రకాళీల్లా చూస్తున్నారు .
నవ్వుకుని , మిమ్మల్ని నమ్మలేను అన్నాను .
ప్చ్ ప్చ్ ప్చ్ …….
బుజ్జిజానకి : దేవతమ్మా ….. ఈ ఐదురోజులూ నేను కోరినవన్నీ తీర్చాలికదా ? .
పెద్దమ్మ : Yes yes బుజ్జిజానకీ , గో ఎహెడ్ గో ఎహెడ్ ……
బుజ్జిజానకి : మహేష్ ….
అయిపోయాను ……
అందరూ నవ్వుకున్నారు , లవ్ యు లవ్ యు అంటూ అమ్మకూచీని చుట్టేశారు .
నో నో నో అమ్మకూచీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ……
బుజ్జిజానకి : అమ్మకు – అమ్మకు ….. నువ్వంటే ఎలా ప్రాణమే , నీకు …… దేవతలంటే ఎలా ప్రాణమే …… అలా నాకు …… దేవతలు – అక్కయ్యలంటే ప్రాణం , కోరిక కోరుతున్నాను దేవుడా …… అత్తయ్యలు వచ్చేన్తవరకూ అక్కయ్యలతో కలిసిపోవాలి మాట్లాడాలి .
పెద్దమ్మ : తథాస్తు …..

అక్కయ్యలూ …….
మేమెవ్వరం చెయ్యలేనిది మహేష్ కూచీ చేసింది , లవ్ యు లవ్ యు అంటూ అమాంతం పైకెత్తేసి ఆనందిస్తున్నారు .
అక్కయ్యల కళ్ళల్లో ఆనందబాస్పాలు …… , నాన్నలు ….. ప్రాణంలా ఏలోటూ లేకుండా చూసుకోమని చెప్పినా ఏమీచెయ్యలేకపోయాము , ఇక చూసుకోండి అంటూ నాచుట్టూ చేరి బుగ్గలపై ముద్దులుకురిపిస్తున్నారు .
అంటీలు చూస్తే మాత్రం అయిపోతాము .
మేమెవ్వరం చెప్పము కదా …..
ఏంటో మీపై ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు .
మళ్లీ అందరిలో కోపం ……
మాట మార్చకపోతే అదే సంతోషం …… , అక్కయ్యలూ exam ఎలా రాశారు ? .
బుజ్జిజానకి : ఆ సంగతే మరిచిపోయాను , అక్కయ్యలూ అక్కయ్యలూ ….. exam ఎలా రాశారు ? అంటూ అక్కయ్యల చేతులను చుట్టేసి అడిగింది .
అక్కయ్యలు : మా బుజ్జిదేవకన్య అందమైన నవ్వులను చూసి వెళ్ళాక ఎలా రాశామో తెలుసా అంటూ అమ్మకూచీ పెదాలపై గట్టిగా ముద్దులుపెట్టారు , చెల్లీ …… బుగ్గపై పంటిగాట్లు ఎవరు పెట్టారు ? .
బుజ్జిజానకి : మీరు వెళ్ళాక ఇక ఇంట్లో మిగిలినది ఎవరు అక్కయ్యలూ ….. మీ ముద్దుల తమ్ముడే రక్తం రాలేదు అంతే అంత గట్టిగా కొరికేసాడు అంటూ మురిసిపోతోంది .
అక్కయ్యలు : చూస్తుంటే మా చెల్లి ఎంజాయ్ చేసినట్లుగానే ఉంది .
బుజ్జిజానకి : మాటల్లో చెప్పలేనంతలా అక్కయ్యలూ అంటూ నాబుగ్గపై చేతితో ముద్దుపెట్టి సిగ్గుపడుతోంది .
అక్కయ్యలు : అవునా అవునా అవునా అంటూ గిలిగింతలుపెడుతూ కవ్వించారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ అక్కయ్యలూ అక్కయ్యలూ …… అంటూ పరుగులుపెడుతూ పెద్దమ్మ – మేడమ్ వెనుక దాక్కుంది .
తల్లులూ బుజ్జి తల్లులూ ….. అన్నీ రెడీ మీఇష్టం అంటూ టేబుల్ పై ఉంచారు .