టైం మెషిన్ – Part 4 76

“రండి” అంటూ ఒక చోటుకి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద షట్టర్ మూయబడి ఉంది. పక్కన ఉన్న స్కానర్ మీద హెన్రీ చెయ్యి పెట్టగానే కిర్రుమని చప్పుడు చేస్తూ ఓపెన్ అయ్యింది.
లోపల ప్రపంచంలోనే ది బెస్ట్ వెపన్స్ ఆర్గనైజ్ చేసి ఉన్నాయి.
హార్ధిక్ ని ఒక చోటుకి తీసుకెళ్ళాడు. అక్కడ రకరకాల రైఫిల్స్ అమర్చబడి ఉన్నాయి.

అందులో ఒక రైఫిల్ చేతిలోకి తీసుకుని “ఇది ప్రపంచంలోనే పవర్ఫుల్ గన్. పేరు FN FAL. బెల్జియంలో తయారుచేశారు. కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ 20వ శతాబ్దంలో జరిగిన యుద్ధాల్లో మోస్ట్ పాపులర్ రైఫిల్. 7.62mm రౌండ్ ఆఫర్ చేస్తుంది. దీనిని స్క్వాడ్ లైట్ మెషీన్ గన్, కంబాట్ రైఫిల్, స్నైపర్. ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. 90దేశాల మిలిటరీల్లో మోస్ట్ లవ్డ్ వెపన్.”

ఇంకొకటి చూపిస్తూ” ఇది M2HB 50- కాలిబర్ మెషీన్ గన్. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా వాడే మెషీన్ గన్. .50mm రౌండ్, 500 రౌండ్స్ పర్ మినిట్. ఒక మైల్ దూరం నుంచి కూడా గురి తప్పకుండా షూట్ చేస్తుంది. దీనినే ‘ది ఫిఫ్టీ’ ‘మా డ్యూస్’ అని కూడా అంటారు.”

“ఇది స్టోనర్ AR 15. అమెరికా కనిపెట్టింది. ఆటోమేటిక్ ఫైరింగ్ చేస్తుంది. అసాల్ట్ చెయ్యడానికి మోస్ట్ కన్వీనియంట్.”

“ఇది HK 416 అసాల్ట్ రైఫిల్. జర్మనీలో తయారుచేశారు. లక్ష్యాన్ని చేధించడంలో దీనికి సాటిలేదు. కానీ కొంచెం ధర ఎక్కువ”

“ఇది XM307 ACSW అడ్వాన్స్డ్ హెవీ మెషీన్ గన్. ఇది చాలా అడ్వాన్స్డ్ గ్రనేడ్ మెషీన్ గన్. దీనిని ఇద్దరు మనుషులు కలిసి ఆపరేట్ చెయ్యాలి. ఇది US ఆర్మీ డిజైన్ చేసిన స్మార్ట్ షెల్ గన్. ఇది 2000మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా అవలీలగా చేదిస్తుంది. నిమిషానికి 260 రౌండ్లు కాలుస్తుంది. 1000మీటర్ల దూరంలో ఉన్న వార్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, వెహికల్స్ కూడా దీనితో ధ్వంసం చెయ్యొచ్చు. ”

“ఇది టోటల్లీ ఆటోమేటిక్ గన్. పేరు F2000. దీనితో నిమిషానికి 850 రౌండ్లు పేలచొచ్చు. దీనిని ఒక జర్మన్ కంపెనీ తయారుచేసింది. 500 మీటర్ల రేంజ్ లో 5.56 కాలిబర్ తో కాల్పులు జరపొచ్చు.”

“ఇది ఆక్యురసి ఇంటర్నేషనల్ AS50 స్నైపర్. ఇది చాలా ఎస్ప్లోజివ్. 1800 మీటర్ల రేంజ్ లో కూడా 12.7mm కాలిబర్ గురి తప్పకుండా దూసుకుపోతుంది.”

“ఇది థామ్సన్ M1921 సబ్ మెషీన్ గన్. దీనినే మనం టామీ గన్ అని కూడా అంటాం. .45 కాలిబర్ తో నిమిషానికి 1500 రౌండ్లు అవలీలగా కాల్చి పారేస్తుంది. అందుకే దీనిని చికాగో టైప్ రైటర్ అని కూడా అంటారు. వాడటం కొంచెం కష్టమే. కానీ వాడితే మాత్రం ఫేవరేట్ అయిపోతుంది.”

“ఇది కోచ్ అండ్ హెక్లెర్ H*K MG43 మెషీన్ గన్. చాలా లైట్ వెయిట్, 5.56 కాలిబర్, 1000 మీటర్స్ రేంజ్.”

“ఇది కాలాషింకోవ్ AK 4*7. బహుశా దీన్ని గురించి తెలియని వాళ్ళు అరుదు. చాలా సింపుల్ గా ఉంటుంది. వాడటం కూడా ఈజీ. దాదాపు 100 మిలియన్ల మంది దీన్ని లైసెన్స్ తో వాడుతున్నారు.”

“ఇవి నా దగ్గర ఉన్న బెస్ట్ రైఫిల్స్. ఇప్పుడు నీకు పిస్టల్స్ చూపిస్తాను పద” అంటూ ఇంకొక చోటుకి నడిచాడు హెన్రీ. హార్ధిక్ మౌనంగా అతన్ని అనుసరించాడు.

“ఇది ప్రపంచంలోనే బెస్ట్ పిస్టల్. పేరు C*Z-75-SP-01. ”
అంటున్న హెన్రీ హార్ధిక్ తల అడ్డంగా ఊపడంతో చెప్పేది ఆపి హార్ధిక్ వైపు చూసాడు. ఏంటి అన్నట్టు..
“మీరు చెప్తుంది చాలా ఆసక్తికరంగా ఉంది కాని ఇప్పుడు నాకు వినే టైం లేదు. సో మీరు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఒక నెలకు సరిపోయేలా ఇవ్వండి. ఒక కార్గో ప్లేన్ బుక్ చేసి నాకు పంపిస్తే చాలు” అన్నాడు.
“ఓకే సర్. కానీ ఇవన్నీ పంపాలంటే సెక్యూరిటీ ప్రాబ్లెమ్స్…..” అని నసుగుతూ నిలబడ్డాడు హెన్రీ.
“అక్కడికి వచ్చాక నేను చూసుకుంటాను. ఇక్కడ మీరు మేనేజ్ చెయ్యండి చాలు. ” అన్నాడు హార్ధిక్.
“ఓకే సర్ ష్యూర్. మీరు అలా రిలాక్స్ అవ్వండి. నేను మొత్తం లిస్ట్ ఔట్ చేసి వస్తాను” అంటూ అక్కడ ఒక సోఫా చూపించి తన మనుషులతో లోపలికి వెళ్ళిపోయాడు హెన్రీ.

ఒక అరగంటలో వచ్చి “5మిలియన్ సర్ ” అన్నాడు.

ఓకే అని హార్ధిక్ తన లాప్టాప్ ఓపెన్ చేసి 10నిమిషాల్లో తన అకౌంట్ నుంచి డబ్బు హెన్రీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసాడు.
“ఓకే హెన్రీ. విల్ మీట్ అగైన్. ప్రస్తుతానికి సెలవు” అంటూ హెన్రీకి షేక్ హాండ్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు.

“వన్ మినిట్ సర్” అన్న హెన్రీ మాటకి వెనక్కి తిరిగి చూసాడు. హెన్రీ మెల్లగా టూటూ దగ్గరకి వచ్చి టూటూ నడుముకు కట్టుకున్న మెలితిరిగిన కత్తిని పట్టుకుని ” నైస్ వెపన్” అంటూ తన చేతిలో ఒక బాక్స్ పెట్టాడు. హార్ధిక్ దగ్గరకు వచ్చి “సర్ ఇది ‘డిసెర్ట్ ఈగల్’. నా ఫేవరేట్ గన్. ఇట్స్ ఫర్ యూ” అని గన్ ఇంకా దానితో పాటు 20 మ్యాగజైన్స్ అందించాడు. “అండ్ ఇట్స్ ఫర్ యువర్ టీం. ఇవి వైట్ ఫాస్ఫరస్ హ్యాండ్ గ్రనేడ్స్. ఇవి బ్యాన్ చేశారు. ఎవరికైనా అత్యంత బాధాకరమైన చావు ఇవ్వాలనుకుంటే ఇది ఒక్కటి విసిరితే సరిపోతుంది” అంటూ గ్రనేడ్ బాక్స్ చేతిలో పెట్టాడు.

“థాంక్యూ మిస్టర్ హెన్రీ. సీ యూ అగైన్” అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు.
ఇప్పుడు హార్ధిక్ నడుస్తుంటే వెనకాల దాదాపు 50 మంది మృత్యు దేవతలు నడుచుకుంటూ వస్తున్నారు.
వాళ్ళు కార్లలో బయలుదేరేసరికి రన్వే మీద ఫ్లైట్స్ సిద్ధంగా ఉన్నాయి.
విమానం ఎక్కే ముందు హాథీకి ఫోన్ చేసి ఏమేం చెయ్యాలో ముందుగానే ఇన్స్ట్రుక్షన్స్ ఇచ్చి ఫోన్ కట్ చేసి బయలుదేరాడు.
ఫ్లయిట్ లో కూర్చున్న తర్వాత టూటూ బిగిసిపోయి ఉండటం చూసి “టూటూ..?” అని పిలిచాడు హార్ధిక్.
“దొరా..?” అన్నాడు టూటూ ఉలిక్కిపడుతూ.

“ఏం ఆలోచిస్తున్నావ్? ” అన్నాడు హార్ధిక్.

“అక్కడ ఏం జరిగిందో అసలేం అర్థం కాలేదు దొరా. ఆ తుపాకులేంటి దొరా అలా ఉన్నాయి? మేము చాలా సార్లు సెక్యూరిటీ ఆఫీసర్ల దగ్గర చూసినం గానీ ఇట్లాంటివి నా జీవితంలో చూడలేదు దొరా” అన్నాడు ఆశ్చర్యంగా.
ఇంకా టూటూ నోరు అలాగే తెరుచుకుని ఉంది. హార్ధిక్ చిన్నగా నవ్వి “ఇప్పుడు చూడనివి చూశావ్ కదా. తర్వాత ఇంకా చూద్దుగాని. కొంచెం వెయిట్ చెయ్” అన్నాడు.
“అది సరే కానీ దొరా. ఇంత మార్బలం ఎందుకు దొరా?” అన్నాడు ఆశ్చర్యంగా.