టైం మెషిన్ – Part 4 76

“ఏముంది. నా దగ్గర పని చేసే వ్యక్తి ఒకరు నా ఆఫీస్ రహస్యాలన్నీ తీసుకుని ఇండియా వచ్చేసాడు. అతనికి ఇక్కడ ఆ ఠాగూర్స్ కంపెనీ సౌరవ్, హార్ధిక్ ఆశ్రయం ఇస్తున్నారు. వాడి దగ్గర నుంచి నా రహస్యాలు ఎలాగైనా చేజిక్కించుకోవాలి. అందుకు మీ సాయం నాకు కావాలి” అన్నాడు విస్కీ గ్లాసు ఆఫర్ చేస్తూ.

“సారీ రిచర్డ్స్ గారూ.. వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు. మీకు నేను సాయం చేస్తున్నానని తెలిస్తే ఉన్నపళంగా రోడ్డు మీదకి తీసుకొచ్చే శక్తి వాళ్ళకుంది. ఈ విషయంలో నేను వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్లలేను. క్షమించండి. అయినా ఛటర్జీ నాకు ఆప్తుడు కాదు బంధువు కాదు.. కేవలం పరిచయస్తుడు అంతే” అంటూ అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళబోయాడు.
“కూల్.. కూర్చోండి రమానాథ్ గారూ. ఒకవేళ రోడ్డు మీద పడతానేమో అని మీ భయం. అంతే కదా?”
“అవును”
“ఈ పదవిలో ఉంటే మీకేం వస్తుంది?”
“అధికారం, డబ్బు, హోదా, గౌరవం”
“అవన్నీ వేరు వేరు కాదు రమానాథ్. చమురులో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వాసెలిన్.. ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో డబ్బు అనే చమురులో ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి.”

“అవును. అయితే మాత్రం? రోడ్డు మీద పడితే డబ్బు ఎక్కడినుంచి వస్తుంది?”
“నేనిస్తాను”
“ఎంత? 5కోట్లా? 10కోట్లా? మీరు ఎంత ఇచ్చిన అవి నా సంపాదన ముందు పనికిరావు”
“మీ వయసు ఎంత?”
“58”
“మహా అయితే ఎన్నాళ్ళు పదవిలో ఉంటారు?”

“ఇంకొక 15 సంవత్సరాలు”
“ఎంత సంపాదించగలవ్?”
“కొన్ని వందల కోట్లు”
“ఎన్ని వందలు? పోనీ వందల్లో 999 చివరిది కాబట్టి అదే అనుకుందాం. నేను నీకు 10000 కోట్లు ఇస్తాను నా పని జరిపిస్తే”
ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పనయ్యింది రమానాథ్ కి. “ఏంటి మీరు అంటున్నది?” అన్నాడు తడబడుతూ.
“నిజం. ఇక్కడ అంత డబ్బు మీకు ఇబ్బంది అనుకుంటే మీ స్విస్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తా. ఒకవేళ లేకపోయినా ఇబ్బంది లేదు. అకౌంట్ క్రియేట్ చేసి మరీ అందులో డబ్బు వేస్తాను”

రమానాథ్ కి తల తిరుగుతుంది. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే కష్టమని తెచ్చుకోలేదు.

వినయంగా ” సార్.. ఆ ఫైల్స్ అంత విలువ చేస్తాయా?” అన్నాడు.
“అవును రమానాథ్. బయటకి చెప్పుకోవడం వల్ల బిల్ గేట్స్, వారెన్ బఫెట్ అంటున్నారు కానీ నాకు కనిపించని నల్లధనం చాలా ఉంది” అన్నాడు.
“అలా అయితే డీల్ సర్. నా పరపతి మొత్తం మీకోసం ఉపయోగిస్తాను. చీర్స్ ఫర్ న్యూ ఫ్రెండ్షిప్” అంటూ రిచర్డ్స్ తనకి ఆఫర్ చేసిన గ్లాసు ఎత్తి ఒక్క గుక్కలో తాగేసి టేబుల్ మీద పెట్టేసాడు.

)))))******◆ 【√\/@®€$# ♂♀】 ◆******(((((

నెక్స్ట్ ఏంటి?
“ఓకే మిస్టర్ రమానాథ్. మీరు వెళ్ళండి. నేను అవసరం అయినప్పుడు చెప్తాను.” అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు రిచర్డ్స్.

)))))******◆ 【√\/@®€$# ♂♀】 ◆******(((((

గదిలో పూజా, మల్హోత్రా, హాథీ, హార్ధిక్ కూర్చుని ఉన్నారు.
“మల్హోత్రా.. ఇదిగో మీరు అడిగిన గిఫ్ట్. ఇప్పుడు మీరు హ్యాపీ కదా?” అన్నాడు హార్ధిక్ నవ్వుతూ.
“ఏంటి నన్ను మల్హోత్రా కోసం తీసుకొచ్చారా?” ఆశ్చర్యంతో అడిగింది పూజా.
“అవును” అన్నాడు హార్ధిక్.
“సర్ కావాలంటే బుక్ చేసుకునేవాళ్ళం కదా?” అన్నాడు హాథీ హార్ధిక్ కి పిచ్చి పట్టిందా అన్నట్టు చూస్తూ.
“చేసుకోవచ్చు. కానీ పూజా మల్హోత్రాకి జీవితాంతం కావాలి” అన్నాడు హార్ధిక్.

“అలా అయినా వాడికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి తెచుకునేవాళ్ళం కదా? మనకి డబ్బుకు కొదవ లేదు కదా? దానికోసం ఇలా కిడ్నాప్ ఎందుకు?” అర్ధం కానట్టు అడిగాడు హాథీ.
“వాడు పూజకి చేసిన అన్యాయానికి వాడు లాభపడటం మన మల్హోత్రాకి ఇష్టం లేదు. అందుకే” అని అసలు విషయం చెప్పాడు హార్ధిక్.
పూజా మొహంలో రకరకాల భావాలు రంగులు మారుతున్నాయి.
“సారీ పూజా. నీకు నాతో ఉండటం ఇష్టం అనుకుని ఈ పని చేసాను. నాకు మాత్రం నీతో ఉంటే నా జీవితం మళ్ళీ ప్రారంభం అయ్యింది. నువ్వు వెళ్లిపోతాను అంటే ఇప్పుడే మా వాళ్ళని దింపేయ్యమని చెప్తాను” అన్నాడు.

అప్పటికే పూజ తల దించుకుని ఉంది. మల్హోత్రా చివరి మాటలు చెప్పగానే సడన్ గా తల పైకెత్తింది. అప్పటికే ఆమె కళ్ళలో నుండి నీళ్ళు బుగ్గల మీదుగా కిందకు జారుతున్నాయి. పరుగున వచ్చి మల్హోత్రాని కౌగలించుకుని అతని గుండెల మీద తల పెట్టుకుని ఏడుస్తుంది.
మల్హోత్రా ఆమె తలని ప్రేమగా నిమిరి “ఏయ్ పిచ్చిపిల్లా.. ఏంటిది?” అన్నాడు గోముగా.
“నాకంటూ ఇక ఈ లోకంలో ఉన్నది మీరే.. చచ్చేదాక మీతోనే ” అంటూ కౌగిలి మరింత బిగించింది.
కాసేపు వారి మధ్యలో మౌనం రాజ్యమేలింది. అది చూస్తున్న హార్ధిక్ గుండె లోపల ఒక తెలియని ఉద్వేగం చోటు చేసుకుంది.
వాళ్లిద్దరూ చేతులు పట్టుకుని నిలబడి నవ్వుతుంటే హార్ధిక్ సహా అక్కడున్న వాళ్ళందరూ మల్హోత్రా భుజం తట్టి బయటకు నడిచారు.
హార్ధిక్ వెళ్తూ వెళ్తూ ఆగి “మల్హోత్రా.. మీ ఇద్దరికీ మన సమక్షంలో రేపు పెళ్ళి జరగబోతుంది. వెళ్ళి ఆన్లైన్ లో నచ్చిన షాపింగ్ చేసుకోండి” అంటూ వెళ్ళిపోయాడు అక్కడినుంచి.

“ఏంటి సర్? ఇక్కడకు మనం వచ్చిన పని ఏంటి? మీరు చేస్తున్నదేంటి? ఇవన్నీ మనకు అవసరమా?” అన్నాడు హాథీ హార్ధిక్ పక్కన నడుస్తూ.

“వాళ్ళు మనకు అవసరం. మల్హోత్రా బ్రతకడానికి తనకంటూ ఒక ఆశ కల్పించాలి. మనిషికి ఎన్ని బంధాలు ఉంటే అంత బలహీనపడతాడు. బలహీనత ఉన్న మనిషిని లొంగదీసుకోవడం మనకు సులభం” అన్నాడు హార్ధిక్ నవ్వుతూ.
హాథీ ఆగిపోయి నోరెళ్ళబెట్టి హార్ధిక్ వెళ్తున్నవైపు చూస్తూ ఉండిపోయాడు.

)))))******◆ 【√\/@®€$# ♂♀】 ◆******(((((

రిచర్డ్స్ సెక్యూరిటీ ఆఫీసర్ జాన్ రిచర్డ్స్ గది తలుపు కొట్టాడు.