గులాబీ రంగు చనుమొనలతో 2 5

నేను ఒకదాన్ని తీసుకొని కామిని చేసినట్లే కుకీని పాలలో ముంచాను. ఏదో కారణం చేత కామిని సిగ్గుపడింది.

“నేను మాత్రమే అలా చేస్తుంటానని అనుకున్నాను,” అని కామిని అంది.

“కుకీ తినే పద్దతి ఇదే,” అని నేను చెప్పాను.

“అదే అనుకుంటాను, మా అమ్మానాన్నలు అది చిన్న పిల్లల అలవాటు అని, నేను ఇంకా ఎదగాల్సి ఉందని అనేవాళ్ళు. అయినా నేను ఆ అలవాటుని వదిలించుకోలేకపోయాను” అని కామిని అంది.

“ఎవరైనా మీ గురించి ఏమి అనుకుంటున్నారో అని దాని గురించి పట్టించుకోవడం ఎందుకు ?” అన్నాను.

“చెప్పడం సులభం, చేయడం కష్టం, ముఖ్యంగా ఇక్కడ గొడవలు పెట్టుకునే అమ్మాయిలందరితో చాలా కష్టం. వీణ వాయించడం లేదా తోటపని చేయడం, ఇది మా అభిమాన కార్యాచరణ” అని కామిని అంది.

“మీరు గొడవల్లో పాల్గొనే మనిషిలా నాకు అనిపించరు” అన్నాను.

“మీరు గమనించారో లేదో తెలియదు కానీ నేను అన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తితో వుంటాను. కొన్నిసార్లు వేరేవాళ్లు నన్ను ఎలా చూడాలని కోరుకుంటారో అలానే నేను వాళ్ళని చూడడానికి ట్రై చేస్తాను. ఎవరైనా నా గురించి నా వెనుక మాట్లాడుకుంటే, అది నాకు నచ్చుతుందో లేదో నాకు పక్కాగా తెలియదు” అంది.

కామిని పట్ల నా గౌరవం పెరుగుతూనే ఉంది. “నేను ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడతానో, వాళ్లందరిలో మీరు బెస్ట్ అని చెప్పాలి. నేను అదృష్టం చేసుకున్న విదేశీయుడిని అనుకుంటున్నాను” అని చెప్పాను.

“ధన్యవాదాలు,” అని కామిని కుకీలంత తీయగా నవ్వుతూ చెప్పింది.

ఆమె నాతో కలిసి ఉండాలని కోరుకుంటుందా అని అడగాలనిపించింది, అయితే అది కొంచెం తొందరపాటు చర్య అవుతుందని అనిపించింది. ఇక్కడ వారికి ఎలాంటి సాంస్కృతిక నియమాలు ఉన్నాయో నాకు ఇంకా తెలియదు, అయినా అమ్మాయిలకి ఎక్కువ ఆధిపత్య పాత్ర (dominant role) ఉన్నట్లు అనిపించింది.

“మీరు ఇంతకుముందు వున్న మీ పాత ప్రపంచాన్ని ఇష్టపడ్డారా ?” అని కామిని అడిగింది.

నేను మరో కుకీ తింటూ ఆకాశం వైపు చూశాను. “నేను అక్కడ బాగానే బ్రతికాను, అయితే అలాంటి జీవితం కోసం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది.”

“నాకు అర్థమైంది. మీరు ఖచ్చితంగా కష్టపడి పనిచేసే వ్యక్తిలా నాకు అనిపిస్తున్నారు,” అని ఆమె కళ్ళు నా కండల మీద నిలుపుతూ చెప్పింది.

“నేను ఇక్కడ ఒక రోజు కంటే ఎక్కువ గడపకపోయినా, నాకు ఈ ప్రపంచమే ఎక్కువ ఇష్టమని చెప్పగలను.”

“ఓహ్, మీరు చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు” అంది.

“నా భుజాల మీద ఎలాంటి బరువు లేదు, ఒత్తిడి లేదు. నేను స్వేచ్ఛగా ఉన్నాను. అందుకే తీసుకోగలను” అన్నాను.

“ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండాలి. మీరు ఒక పక్షి బంధింపబడి ఉన్నట్లు ఉండలేరు కదూ ?” అడిగింది.

“అవును,” అని నేను ఒప్పుకున్నాను.

నాకు అకస్మాత్తుగా ఒక వింత అనుభూతి కలిగింది, ఎవరో నన్ను చాటుగా చూస్తున్నారన్న అనుమానం వచ్చింది. దాంతో నేను వెనక్కి తిరిగి చూశాను. పైకప్పు మీద ఒక అమ్మాయి కనిపించింది. నన్ను చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి, ఆమె త్వరగా కిందకి దూకింది.

“ఆయేషా ! నువ్వు అలా నా అనుమతి లేకుండా లోపలికి చొరబడకూడదు” అని కామిని గట్టిగా చెప్పి కుర్చీ నుండి పైకి లేచింది.

“క్షమించండి,” అని ఆమె నవ్వుతూ అంది. మేము ఆమెని పట్టుకుందామని చూసేలోపు పారిపోయింది.

“ఈ గ్రామంలో గొడవలు పెట్టుకునే రాణి ఎవరో మీకు తెలుసా ?” కామిని అడిగింది.

“ఆయేషానా ?” అన్నాను.

“మీరు కరెక్టుగా ఊహించారు. నా ఇంట్లో ఒక అందమైన అతిథి ఉన్నాడని ఆమె బహుశా అందరికీ చెబుతుంది అనుకుంటా” కామిని అంది.

“నాకేం ఇబ్బంది లేదు” అని చెప్పాను. భూమి మీద నేను ధనికుడిని అవడం మొదలు పెట్టాక, పేరు పొందిన ప్రజాదరణకి అలవాటు పడ్డాను. అయితే ఇక్కడి సంగతి వేరు. కామిని తనకి వీణ వాయించడం వస్తుంది అని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది.

“మీరు వీణ వాయించగలరా ?” అని అడిగాను.

“మీకు నేను వాయిస్తుంటే వినాలని ఉందా ?” అని కామిని ఆత్రంగా అడిగింది.

“వద్దులే, ఇప్పుడు మీరు కూడా విశ్రాంతి తీసుకోండి. ఇప్పటివరకు మీరు నాకోసం చాలా కష్టపడ్డారు” అని చెప్పాను. నాకు కొంచెం అపరాధ భావం కలగడం మొదలైంది. తాను నాకు రుచికరమైన భోజనం తయారు చేసింది. తర్వాత కుకీలు ఇంకా పాలు తెచ్చిపెట్టింది. నా ప్రశ్నలకి సమాధానాలు చెప్పింది.

“మీరు వినాలని అనుకుంటే వాయించగలను, నాకేం ఇబ్బందీ లేదు. అయితే మీరు రహస్యంగా వింటున్న ఇంకో మనిషి గురించి మర్చిపోండి” అంటూ కామిని తన వీణని చేతిలోకి తీసుకుంటూ చెప్పింది.

“అలా అయితే, OK” అని కుర్చీలో వెనక్కి వాలిపోయాను.

“నేను ఏమి వాయించాలని మీరు కోరుకుంటున్నారు ?” కామిని అడిగింది.

“మీకు ఇష్టమైన ఏ పాట అయినా నాకు ఓకే నే” అన్నాను.

కామిని తన కుర్చీని నా దగ్గరికి జరిపి, సూర్యుడు దిగిపోతూ ఉండగా వాయించడం మొదలుపెట్టింది. అది చాలా అద్భుతంగా, విశ్రాంతిగా, వినసొంపుగా ఉంది. డిజిటల్ బాంబు సౌండ్ లేదా అలాంటి నేపథ్య శబ్దం లేకుండా ఒకే ఒక సంగీత వాయిద్యం. నా ఆందోళనలు, బాధలు, సమస్యలన్నింటినీ మరచిపోయాను, మరోలోకం లోకి వెళ్ళిపోయాను.

కామిని నెమ్మదిగా వాయించడం ఆపివేసింది, మా ఇద్దరినీ నెమ్మదిగా నిశ్శబ్దంలోకి జార్చింది. సూర్యుడు దాదాపు అస్తమించాడు.

“బహుశా నేను ఇక వెళ్లాలనుకుంటా,” అని నా సీటు మీది నుండి లేస్తూ చెప్పాను.

“ఇప్పటికే చాలా ఆలస్యం అయిపొయింది. ఇంత రాత్రి ఎలా వెళతారు ?” అని కామిని ఆందోళనగా చూస్తూ అడిగింది.

“నా దగ్గర ఆయుధాలు వున్నాయి కదా” అని నేను భుజాలు ఎగరేస్తూ చెప్పాను. దొంగలంటే నాకు ఎప్పుడూ భయం లేదు. గహన నాకిచ్చిన ఉన్నతమైన సామర్థ్యాలు, నైపుణ్యాలు ఎలాగూ ఉందనే వున్నాయి.

“కానీ, మీరు బాగా అలసిపోయారు కదా !” కామిని అంది.

ఆమె చెప్పింది పచ్చి నిజం. నా కళ్ళు బరువెక్కాయి. దానికి తోడు ఆమె పాటలు నన్ను మత్తులోకి తీసుకెళ్లాయి. “ఇక్కడ ఏదైనా హోటల్ లేక సత్రం లాంటిది ఉందా ?” అని అడిగాను.

“ఇది ఒక చిన్న గ్రామం, ఇక్కడ అలాంటివి ఏవీ లేవు. ఒక పని చెయ్యండి, నా సోఫా చాలా మెత్తగా సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు ఇక్కడ పడుకోవచ్చు” కామిని చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *