కామిని తన చేతిని నా చేతి మీద పెట్టింది. ఆ స్పర్శలో నాకు ఇంతకుముందు పరిచయం అయిన ఎంతోమంది అమ్మాయిలు ఇవ్వని ఆప్యాయత తెలిసింది. “మీకు ఇంకొన్ని శాండ్విచ్ లు చేస్తాను” అంది.
“వద్దు, నాకు సరిపోయింది. మీరు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటే తీసుకోండి” అని చెప్పాను. మరీ ఎక్కువ చొరవ తీసుకుని మళ్ళీ వండించుకోవాలని అనిపించలేదు.
“కానీ మీకు ఆకలి తగ్గలేదు కదా” అని కామిని పట్టుబట్టింది.
“ఆకలి ఉన్నమాట నిజం అయితే వంట చేసినందుకు చాలా కృతజ్ఞుడిని” అని చెప్పాను.
“నేను ఇంకోసారి మీకు వండి పెడితే నేను కృతజ్ఞురాలిని అవుతాను” కామిని చెప్పింది.
మేము ఒకరినొకరు చూసుకున్నాము, నాకు మళ్ళీ మెరుపులు వచ్చాయి. “సరే, నేను లొంగిపోయాను.”
కామిని నవ్వింది. ఎంత అద్భుతమైన అమ్మాయి. ఆమె టెర్రస్ తలుపులు తెరిచి వంటగదికి వెళ్ళింది. నేను లోపలికి వెళ్లి ఇంతలో సోఫాలో కూర్చున్నాను.
“మీరు మా లోకం గురించి తెలుసుకోవాలని ఎందుకంత ఆసక్తితో వున్నారో, కొన్ని విషయాలని చూసి ఎందుకంత ఆశ్చర్యపోతున్నారో ఇప్పుడు నాకు అర్ధమైంది. ఇక్కడి విషయాల గురించి మీకు చెప్పడం నా అదృష్టంగా భావిస్తాను. గహన కనీసం ఇక్కడి లింగ అసమతుల్యత గురించి చెప్పిందా ?” అని కామిని అడిగింది.
“చాలామంది మగాళ్లని వికలాంగులని చేసిన వ్యాధి గురించి చెప్పింది. అంతే, అంతకుమించి ఏమీ చెప్పలేదు. ముఖ్యంగా ఇక్కడి చట్టాలు, పన్నులు ఇంకా ఆచారాల గురించి ఏమీ చెప్పలేదు” అన్నాను.
“పన్నులా ? అది ఒక విదేశీ పదం” అని కామిని నన్ను వింతగా చూస్తూ చెప్పింది.
“మీరు రాజకీయ నాయకులకి లేదా వాళ్ళు పాలించే ప్రభుత్వానికి మీరు సంపాదించే దానిలో కొంత చెల్లించాలి. వాళ్ళు దాన్ని తిరిగి ప్రజలకోసం ఖర్చు చేస్తారు” అన్నాను.
“మా మీద తిరిగి ఖర్చు చేస్తారా ?” అని కామిని అడిగింది.
“మొత్తం కాదు, కొంచెం” అన్నాను.
“ఇక్కడ అలాంటిదేమీ లేదు,” అని కామిని అంది.
“అయితే ఎవరు కడతారు ?” అడిగాను.
“మేమే,” అని కామిని అంది. ఆమె చికెన్ వేయించి శాండ్విచ్ లకి వెన్న పూసింది.
“అయితే ఇక్కడ చట్టాలు లేదా చట్టం అమలు చేయడం అనేది లేదా ?” అడిగాను.
“ఆ రెండు పదాల అర్థం ఏమిటో నాకు అసలు తెలియదు,” అని కామిని అంది.
“ఎవరైనా మీ కోళ్ళని దొంగిలించారని అనుకుందాం. అప్పుడు మీరు ఏమి చేస్తారు ?” అడిగాను.
“నేను వాటిని తిరిగి తీసుకోవాలి అయితే ఆ పని చేయడానికి సరిపడా బలం, ధైర్యం రెండూ నాకు లేవు…..ఇక్కడితో ఆపుదాం. నేను మీ భోజనం పూర్తి చేస్తాను. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము” అని కామిని చికెన్ ని వేడి చేయడం మొదలుపెట్టింది.
“తప్పకుండా” అని చెప్పాను. ఆమె నా కోసం భోజనం తయారు చేస్తున్నప్పుడు నేను మాట్లాడటం మర్యాద అనిపించుకోదు అనుకున్నాను.
కామిని చికెన్ ని కాల్చి నా కోసం మళ్ళీ శాండ్విచ్ లని తయారు చేసింది. అవి క్షణాల్లో పూర్తయ్యాయి, మేము కూర్చోవడానికి మళ్ళీ బయటికి వెళ్ళాము.
“మీరు అద్భుతంగా ఉన్నారు,” అని నేను వెచ్చని, క్రీమీ శాండ్విచ్ ని కొరుకుతూ అన్నాను. ఆమె వాటిని మొదటి వాటిలాగే అంతే ప్రేమతో తయారు చేసింది.
“ధన్యవాదాలు,” అని కామిని అంది, ఆమె బుగ్గలు కొద్దిగా ఎర్రబడ్డాయి.
“చట్టాలు అంటే ఏమిటో నాకు కొంచెం అవగాహన వుంది. అయితే ఇక్కడ అలాటిదేమీ లేదు. ఎవరైనా నా దగ్గర నుండి ఒక కోడిని దొంగతనం చేసి తీసుకెళితే, ప్రతీకారం తీర్చుకునే హక్కు నాకు ఉంటుంది. స్వీయ-రక్షణ ఇక్కడ ఒక ముఖ్యమైన అభ్యాసం, అది ప్రోత్సహించబడుతుంది ఇంకా రివార్డ్ కూడా ఉంటుంది” అని చెప్పింది.
నేను ఇంకొక ముక్కని కొరికాను తర్వాత, “మీరు రక్షించుకోలేకపోతే ?” అని అడిగాను.
“అప్పుడు నేను నా కేసుని ఇంకొకరికి అప్పచెప్పవచ్చు అయితే వాళ్లకి దాని కోసం కొంత చెల్లించాల్సి ఉంటుంది. అయితే మనకి అది ఎప్పుడూ లాభంగా ఉండదు” కామిని చెప్పింది.
“OK, నాకు అర్ధమైంది” అన్నాను.
“అందుకే ఇక్కడ చాలా మంది అమ్మాయిలు బలమున్న వాళ్ళతో కలిసి జీవిస్తుంటారు” కామిని చెప్పింది.
“అయితే ఇక్కడ మగాళ్లే బలహీనంగా కనిపించారు కదా ! మరి ఇంకెవరు దొంగతనం చేస్తారు ?” అని అడిగాను.
“అమ్మాయిలే, మాలో చాలా మంది మోసం చేసే దొంగలు వున్నారు” కామిని చెప్పింది.
“హ్మ్మ్, దొంగతనం జరిగితే బాధితులు ప్రతీకారం తీర్చుకోవాలి, బాగుంది. మరి ఒకవేళ ప్రతీకారం తీర్చుకోలేకపోతే ?” అడిగాను.
“దొంగ తప్పించుకున్నట్లే” కామిని అంది.
“అయితే మీకు పాలకులు లేరన్నమాట” అన్నాను.
“మాకు ఉన్నారు, రసఖండ రాజ్యపు దేవత గహన కూతురు. అయితే ఆమె మమ్మల్ని నిజంగా పాలించదు, కానీ మా జీవన విధానాన్ని కాపాడుతుంటుంది” అని కామిని అంది.
“మరి అలాంటప్పుడు ఆ ఒప్పందాలని ఎవరు అమలు చేస్తారు ? ఒకవేళ ఆ ఒప్పందాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ?” అని అడిగాను. కన్యల దీవి లో వున్న చట్టపరమైన అంశాలని తెలుసుకోవాలని అనుకున్నాను.
కామిని ముఖం నల్లగా మారింది. “అలా చేయడం చాలా అసహ్యకరమైనది, మా ప్రపంచంలో అది అత్యంత నీచమైన పని. అప్పుడు ఆ కేసుని రసఖండానికి తీసుక వెళ్లాల్సి ఉంటుంది. మీ దగ్గర అన్నీ పక్కా ఆధారాలు ఉంటే, నేరస్తుడు శిక్షించబడతాడు లేదా అతను/ఆమె ని జీవితాంతం గుర్తుపట్టేలా చేస్తారు” అని చెప్పింది.
“నాకు అర్థమైంది… అయితే వాళ్ళు పట్టుబడితేనే కదా ?” అన్నాను.
“అది నిజమే, అయితే ఒప్పందాలని తప్పించుకోవడం కష్టం, ఎందుకంటే ఒప్పందం బ్లూ రింగ్ లో నిల్వ చేయబడుతుంది. వాళ్ళ మోసాల నుండి తప్పించుకోవడానికి, వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని చంపవలసి వస్తుంది” కామిని చెప్పింది.
