కామిని తన ఇంటిని చూపించింది. “ఇదే నా అందమైన ఇల్లు” అని చెప్పింది. ఆమెకి అనేక రకాల పళ్ళు, కూరగాయలు వున్న ఒక తోట వుంది. అక్కడ కొన్ని కోళ్లు కూడా వున్నాయి.
“మీ ఇల్లు చాలా అందంగా వుంది” అని చెప్పాను. ఈ ఇల్లు కూడా నేను ఇంతకుముందు చూసిన ఇళ్లలాగే అదే శైలిలో కట్టబడివుంది. అదే తాటి ఇంకా కలపతో చేయబడ్డ పైకప్పు, అయితే కామిని తన తలుపుకి కొన్ని వస్తువులని వేలాడదీసింది. కిటికీ అంచుల్లో పూలకుండీలు వున్నాయి.
తన ఇంటి తలుపు తెరిచి నేను వెళ్ళడానికి వీలుగా పక్కకి తప్పుకుంది. “ఇక్కడికి ఒక సూపర్ స్టార్ వచ్చాడు అన్న విషయం అందరికీ తెలిసేలోపు, త్వరగా లోపలికి వెళ్ళండి” అని చెప్పింది.
నేను నవ్వాను. “పర్లేదులే, చూద్దాం ఏమ్ జరుగుతుందో.”
“మనం భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చు. చికెన్ శాండ్విచ్ చెయ్యనా ?” అని అడిగింది.
“హా, అది నాకు OK” అని అన్నాను.
“అది చేయడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు,” అని కామిని అంది.
నేను ఇంటిలోకి వెళ్ళినప్పుడు, అది చిన్నగా ఉండడంతో వంగి వెళ్లాల్సి వచ్చింది. హాలులో నా బూట్లు విప్పి ఒక మూల పెట్టాను. కామిని నన్ను తన లివింగ్ రూములోకి తీసుకెళ్లింది. అప్పుడుగానీ నాకు అర్ధం కాలేదు, ఇంటిలో వేరువేరు గదులు లేకుండా ఇల్లు మొత్తం ఒకే గదిలా ఉండడం తెలిసింది. దాదాపు నా ఇల్లు లాగే వుంది అయితే చిన్నగా వుంది.
“ఇక్కడ చాలా హాయిగా వుంది,” అని అన్నాను.
“నేను కూడా అదే ఇష్టపడతాను, నేను మీకు వంట మొదలుపెడతాను, బహుశా చాలా ఆకలితో వుండివుంటారు, మీరు ఆ సోఫాలో కూర్చోండి” అని కామిని సంతోషంగా చెప్పింది.
“పర్లేదు” అని చెప్పాను. నా ఆకారానికి ఆ సోఫా చిన్నదైంది, అయితే కామిని బాధ పడుతుందని సౌకర్యవంతంగా కూర్చున్నట్లు కనిపించాను.
కొద్దిసేపటికి నాకు పాన్ వేడెక్కుతున్న శబ్దం వినిపించింది. తర్వాత వేయిస్తున్న చికెన్ వాసన వచ్చింది. నేను కామిని వైపు చూసాను, తన బంగారు రంగు జుట్టు నా చూపుని ఆకర్షించింది. నేను తననే చూస్తున్నానన్న సంగతి కామినికి తెలిసింది. దాంతో ఆమె బుగ్గల మీద సిగ్గు వచ్చి చేరింది.
“మీకు ఉల్లిపాయలంటే ఇష్టమేనా ?”
విచిత్రంగా వుంది, ఇక్కడకూడా అవి దొరుకుతాయా అనిపించింది. “అవంటే నాకు చాలా ఇష్టం…. అయినా మీరు ఏమి చేసి పెట్టినా తింటాను, మీరు ఇబ్బంది పడకండి”.
“మీకు ఏమి అర్థం అయింది ?” అని చేతిలో వున్న గరిటెతో నిలబడి అడిగింది.
మళ్ళీ నేను ఆమె అందానికి ముగ్దుడ్ని అయిపోయాను. ఎత్తైన బుగ్గలు, తియ్యగా ఎర్రగా వున్న పెదవులు, నీలి కళ్ళు, చాలా అందంగా వుంది. “నేను, అంటే, అదీ…. మీరు నాకు ఏమి వండి పెట్టినా అందుకు కృతజ్ఞుడిని”.
“అలా అనకండి, మీరు నా అతిధి, మీరు సంతృప్తికరంగా ఉండాలని నాకు అనిపిస్తుంది” అని కామిని చెప్పింది. ఆమె ఒక కట్టింగ్ బోర్డ్ ఇంకా కొన్ని ఉల్లిపాయలు తెచ్చి వాటిని తరిగి గిన్నెలో వేసింది. ఆమె కప్ బోర్డు నుండి ఒక విప్ తెచ్చి కొట్టడం మొదలుపెట్టింది.
“మీలా అతిధి మర్యాదలు చేసే మనిషిని నేనెప్పుడూ చూడలేదు” అని చెప్పాను.
ఆమె నావైపు తిరిగి తియ్యగా నవ్వింది. “మీరు చాలా దూరం నుండి వచ్చారు అని తెలుసుకోవడానికి ఇదొక సంకేతం. అయినా మీ పొగడ్తకి నా ధన్యవాదాలు.”
ఆమె గ్యాస్ స్టవ్ వైపు తన చేతి వేలుని ఎత్తి చూపించగానే దాని కొన నుండి మంటలు వచ్చాయి. నాకు ఆమె అది ఎలా చేసిందో తెలుసుకోవాలని అనిపించి నోరు తెరిచి అడగబోయి మళ్ళీ నోరు మూసుకుని కూర్చున్నాను. కామిని గుడ్డు అట్టుని వేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో పాన్ లో కొన్ని బ్రెడ్ ముక్కలని కాల్చింది. భోజనం వాసన గది మొత్తం నిండడంతో కామిని కిటికీ తెరిచింది. నాకు ఇప్పుడు ఆకలి ఇంకా ఎక్కువైంది.
గోడమీద కామిని ఫోటో ఒకటి ఇంకా ఒక కిండర్ గార్టెన్ లాంటిది ఉండడం చూసాను. ఆమె ఒకేసారి చాలామంది పిల్లలని దగ్గరికి తీసుకుని ముద్దులు పెడుతూ చాలా ముద్దుగా కనిపించింది. ఆమెని నేను మొదటిసారే కలవడం చాలా సంతోషంగా అనిపించింది.
“మీరు బయట తింటారా లేదా లోపల తింటారా ?” అని కామిని అడిగింది.
నేను బయట చూసాను. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, ప్రకాశవంతంగా కనిపించింది. “సూర్యకాంతి బాగానే వస్తుంది, మనం బయట కూర్చుంటే బావుంటుందేమో” అని అన్నాను.
“నేను కూడా అదే అనుకుంటున్నాను, నాకు ఎండ అంటే చాలా ఇష్టం”.
కామిని టేబుల్ బయట పెట్టింది. నాకోసం అన్ని పనులు ఆమె స్వయంగా చేస్తుంది. నాకు ఆశ్చర్యం వేసింది. “నా సహాయం మీకు అవసరం లేదా ? అని అడిగాను.
“నేను పూర్తి ఆరోగ్యంతో వున్నాను. నేను ఈ పనులు హాయిగా చేయగలను. మీరు కూర్చొని విశ్రాంతి తీసుకోండి, అదే మీరు నాకు చేసే సహాయం” అని చక్కటి చిరునవ్వుతో చెప్పింది. ఆ నవ్వులో నాకు ప్రేమ కనిపించింది.
“ధన్యవాదాలు,” అని అన్నాను.
“మీకు స్వీట్లు అంటే ఇష్టమా ?” అని కామిని శాండ్విచ్ పూర్తి చేస్తూ అడిగింది.
“మీ దగ్గర ఏమేం ఉన్నాయి ?” అని అడిగాను.
“ఇంట్లోనే చేసిన కుకీలు ఉన్నాయి, వాటిని మనం డెసర్ట్ గా తినొచ్చు” అని కామిని సంతోషంతో చెప్పింది.
“అయితే తిందాం” అన్నాను.
“అయితే రండి, శాండ్విచ్ లు రెడీగా వున్నాయి” అని చెప్పి నాలుగు శాండ్విచ్ లు వున్న ఒక ప్లేట్ పట్టుకుని వెళ్లి బయట వున్న టేబుల్ మీద పెట్టింది. నేను బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వంగవలసి వచ్చింది.
“మీ ఆకారం పెద్దది కాబట్టి నేను మీకోసం రెండు కుర్చీలు పెట్టాను. అవి కూడా సరిపోతాయో లేదో మరి” అని కామిని అంది.
అవి యావరేజ్ కుర్చీల కన్నా కొంచెం చిన్నగానే వున్నాయి. నేను రెండింటి మీద కూర్చున్నాను. “నాకు సరిపోయాయి, బానే వుంది” అని చెప్పాను.
కామిని మూడు శాండ్విచ్ లని నా ప్లేట్ లో పెట్టి తాను ఒక శాండ్విచ్ పెట్టుకుంది.
“అదేంటి ? మీకు ఒకటి సరిపోతుందా ?” అని అడిగాను.
“మీరు నాకన్నా మూడు రెట్లు పెద్దగున్నారు” అని కామిని నవ్వుతూ చెప్పింది.
“అయితే మీరు ఒక పక్షిలా తింటారన్నమాట,” అని అన్నాను.
కామిని నవ్వింది. “అలా అని కాదు, నాకు వండటం ఇంకా తినడం రెండూ చాలా ఇష్టం. నాకు బాగా ఆకలిగా ఉంది, అయితే అదొక్కటి సరిపోతుంది.”
