“మీరు చాలా ప్రశ్నలు అడగాలని అనుకున్నారు కదా, వాటిని మొదలుపెడదామా ?” అని అడిగాను.
“మొదట ఎవరు మొదలు పెట్టాలి ?” అని అడిగింది, ఆమె బుగ్గల మీద సిగ్గు ఇంకా మెరుస్తూనే వుంది.
“మొదట అమ్మాయిలు” అన్నాను.
“సరే అయితే, మీరు ఎక్కడినుండి వచ్చారు ?”
“నేను వేరే ప్రపంచం నుండి వచ్చాను. నేను చనిపోయి గహన రాజ్యంలో మేలుకున్నాను. ఆమె నన్ను ఇక్కడికి చేరుకునేలా చేసింది” అని ఆమెకి చెప్పాను.
వెంటనే ఆమె తన రెండు చేతులని నోటి మీద వేసుకుంది. “అయ్యో, ఇది నేను తెలుసుకుని వుండాల్సింది” అంది.
“ఎందుకు అలా అన్నారు ?”
“మీరు ఏదో చాలా గొప్పపని చేసి వుంటారు. గహన మా దేవత కదా ! ఆమె తన దగ్గరికి ఎవరిని తెచ్చుకోవాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది” అని కామిని అంది.
“ఆమెని నేను ఎక్కువ వివరాలు అడిగివుంటే బావుండేదని ఇప్పుడు అనిపిస్తుంది” అన్నాను.
“ఆమె దగ్గర చాలా రహస్యాలు ఉంటాయి, నేను నేరుగా ఆమెని ఎప్పుడూ కలవలేదు అయితే మా అమ్మానాన్నలు ఆమె గురించి తరతరాల కథలు చెప్పేవాళ్ళు” అని కామిని అంది.
“మీరు చెప్పేది ఆసక్తికరంగా ఉంది,” అని అన్నాను.
“బహుశా నేను మీరు కోరుకునే కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలనని అనుకుంటున్నాను” కామిని ముఖం మెరుస్తుండగా చెప్పింది.
“చెబితే సంతోషమే. మనం ఏదైనా తింటూ మాట్లాడుకుందామా ?” అన్నాను.
“నేను మీకు ఏదైనా వండిపెట్టానా ? మీరు నాకు ఇంతకుముందు సహాయం చేశారు కాబట్టి నేను మీకు బాకీ వున్నాను” అని చెప్పింది.
నేను నా చేతిని అడ్డంగా ఊపాను. “అదొక సహాయం కాదు”.
“మీరేమైనా అనుకోండి. నాకు చేయాలని అనిపిస్తుంది” అని పట్టుబట్టింది.
నేను ఆమెతో ఇంకా సరిగ్గా మాట్లాడలేదు అయినా నేను ప్రేమలో పడుతున్నట్లు అనిపించింది. ధైర్యం చేసి, నేను ఆమె చేయి పట్టుకుని నా వేళ్ళతో ఆమె వేళ్ళని కలిపాను. నేను ఇంకో ప్రపంచంలో వున్నా, అమ్మాయిలు ఒకేలా ప్రవర్తిస్తారు అని అర్ధమైంది. ఆమె అందరు అమ్మాయిల్లాగే నా నమ్మకాన్ని ఇష్టపడింది.
“ఏదైనా రుచికరమైనది చేసి నన్ను ఆశ్చర్యపరచండి” అని చెప్పాను.
“మనం ఫెర్రీ లో వెళ్లాల్సి ఉంటుంది,” అని ఆమె అంది.
“మీరు ఇక్కడ ఉండరా ?” అని అడిగాను.
ఆమె తల అడ్డంగా తిప్పింది. “లేదు, నేను రసఖండ ప్రాంతంలో వుంటాను. అయితే రసఖండ ప్రాంతానికి చివరలో వున్న ఒక ద్వీపం లో వుంటాను. మీకు ముందే చెబుతున్నాను…అక్కడ చాలా తడిగా, సారవంతంగా ఉంటుంది.”
“ముందుగా చెప్పి మంచిపని చేశారు, ధన్యవాదాలు, మీరు ఇక్కడికి షాపింగ్ కోసం వచ్చారా ?” అని అడిగాను.
“లేదు, నేను అనాథ పిల్లల కోసం ఒక అనాథాశ్రమంలో స్వచ్ఛందంగా పని చేస్తాను. నేను వాళ్ళ కోసం వంట చేస్తాను, బట్టలు అల్లుతాను, వాళ్ళని ముద్దులు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం” ఆమె నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ చెప్పింది.
“మీరు చాలా మంచి మనిషి” అన్నాను.
“ధన్యవాదాలు.”
