సేల్స్ స్టార్ 1 288

“గ్రేట్ మీటింగ్ యు గోట్లేజీ, మనం మళ్ళీ కలుద్దాం” అంటూ ఉదయ్ గోట్లే తో కరచాలనం చేసి వడి గా నడవటం మొదలెట్టాడు. నేను పక్కన ఉన్నానా లేదా అని చూసుకోకుండా. నేను కూడా గోట్లే కి గుడ్ బై చెప్పి ఉదయ్ వెనకాల పరుగెత్తాను. లిఫ్ట్ డోర్ మూసుకునే వరకు గోట్లే నా గుండెల వైపు చివరి సారి తన్మయతత్వం చూస్తూ ఉంది పోయాడు.

“వాట్ ద ఫక్..” నా గొంతు నాకే పెద్ద గా వినిపించింది.

“ష్.. ఇప్పుడే కాదు.. మనం ఇంకా క్లైంట్ ఆఫీసు లోనే వున్నాం… ” అంటూ ఉదయ్ నా పెదాల్ని తన వ్రేలితో ముయ్యబోయాడు.

విసురు గా అతని చేతిని విదిలించి శివం ఎత్తినట్టు ఊగి పోతూ అతని వెనకాలే కారు వరకూ నడిచాను. నేను మళ్ళీ అరవటం మొదలెట్టానో లేదో, ఉదయ్ ఫోన్ మోగింది. బ్లూ టూత్ ఆన్ చేసి కాల్ తీసుకున్నాడు.

“ఓహ్ హలో నాథ్ గారూ, మీరు చెప్పినట్టు గానే, మీ స్పెసిఫికేషన్ కి ధర కి తగ్గట్టు గానే మళ్ళి కోట్ మీద వర్క్ చేస్తున్నాను.”

ఉదయ్ క్లైంట్ తో మాట్లాడుతున్నంత సేపూ, నేను వేరే వైపు చూస్తూ కూర్చున్నాను. ఉదయ్ డ్రైవ్ చెయ్యటం మొదలెట్టాడు. ఫిలిం సిటీ కి దగ్గర రాగానే, ఒక పచ్చిక దగ్గర కార్ ఆపాడు. కాల్ అయిపోయింది కాబోలు, ఇయర్ పీస్ తీసేసాడు.

“నీకు కోపం రావటాన్ని నేను పూర్తి గా అర్థం చేసుకోగలను” ఉదయ్ గొంతు మళ్ళీ మార్దవం గా ఉంది.

“యు ఫకింగ్ అసోల్”.. నేను విరుచుకు పడ్డాను. నేను ముందే చెప్పాను, నాకు ఈ ఎకౌంటు అవసరం లేదని. నువ్వు, గోట్లే గాడు కలిసి గంగలో కలవండి, నాకెందుకు ? ఇందులోకి నన్ను లాగి మరీ తన్నాల్సిన పనేమిటి?”

“సారీ.. కానీ..”

“నేను నీకు రిపోర్ట్ చెయ్యటం ఏమిటి ? ఏంటా బుల్షిట్” అంటూ బుసలు కొట్టాను. “నీ స్టంట్స్ నా దగ్గర గాడు. రేపే నేను సతీష్ ని కలిసి విషయం అంతా చెబుతాను, నీకు వార్నింగ్ ఇస్తాడో, తీసి పారేస్తాడో చూసుకో. జీవితం లో ఇంత అవమానం ఎప్పుడూ ఎదురవ్వలేదు.. ”

అలా ఓ పది నిమిషాల పాటు చడా మాడా తిట్ట్టాక నా ఆవేశం కొంచం చల్లారింది. నేను మాట్లాడుతున్నంత సేపూ, ఉదయ్ నిశ్శబ్దం గా వింటూ వున్నాడు. నన్ను ఆపే ప్రయత్నం చెయ్యలేదు.

“పద బయల్దేరుదాం” అన్నా.. నా ఊపిరి అలిసిపోయిన ఫీలింగ్ తో.

“నువ్వు చెప్పటం ఐందా?. నేను చెప్పేది సావధానం గా వింటావా?” అన్నాడు నెమ్మది గా.

2 Comments

  1. very good

Comments are closed.