సేల్స్ స్టార్ 1 288

నేను మాట్లాడటం మానేసి వినటం మొదలెట్టాను.

“ప్రియా, నా మాటలని నమ్ము. నువ్వు చాల స్మార్ట్, ఇంటిలిజేంట్ గర్ల్. చాల గట్టి దానివి, అలాగే, చాల అందగత్తె వి కూడా. నాకు నువ్వంటే చాలా అభిమానం, ఇష్టం.”

“నో..”

“ఇంత తెలివైన దానివి, అక్కడ జరిగిన డ్రామా ని గుర్తించలేక పోయావా?”

“డ్రామా?”

“అవును. ద్రామానే. నువ్వు ఇప్పడి దాక ఈ ఇడియట్ గోట్లే చుట్తో ఎన్ని రోజులు తిరుగుతున్నావు? మూడేళ్ళు, కదా?”

“అవును”

“ఐనా వాడు నీకు ఒక్క ఆర్డర్ అయినా ఇచ్చాడా?”

“నీకు తెలుసు, వాడు అడుగుతున్నా రేట్ మనకి సరిపడదని..”

“అదంతా మర్చిపో.. నా పాయింట్ ఏమిటంటే, వాడు మన కంపెనీ రిలేషన్స్ తో హ్యాపీ గా లేదు, ముఖ్యం గా, నీతో. ఎందుకనేదీ నాకైతే తెలియదు. మీ ఇద్దరి మధ్య ఇంతక ముందు ఏమైందో, నాకేమి ఐడియా లేదు. వాడు మాత్రం, నీకు ఒక్క ఆర్డర్ కూడా ఇవ్వటానికి సుముఖం గా లేడు”

ఇదంతా ఎందుకు చెబుతున్నాడో అర్థం కాలేదు. వింటూ కూర్చున్నాను.

“మూడేళ్ళు, డజన్ల కొద్దీ మీటింగులు. జీరో ఆర్డర్స్. వాడు నీ వైపు చూసే విధానం చూసాను. వాడి కన్ను నీ మీద వుంది. వెధవ పీనుగ. నీతో మీటింగులు అంటూ తిప్పించుకోవటం వాడి సరదా..”

“ఓహ్.. నువ్వు కూడా గమనిస్తావే..” అన్నాను ఎగతాళిగా..

“నేనేం కళ్ళు మూసుకుని లేను. నా ఉద్దేశం లో వీడు ఒక మగ మహారాజు అనుకుంటాడు. ఆడవాళ్ళంతా అసమర్ధులు గా, వంటిన్ట్లోనో, పడగ్గడికో అంకితం అని వీడి ఉద్దేశం. వాడి దృష్టి లో నువ్వొక ఆట బొమ్మ.”

ఉదయ్ కళ్ళ లోకి చూస్తె, నిజాయితీ కనిపించింది.

“ఈ విషయం నా దగ్గర ముందు ఎందుకు తేలేదు?”

“నేను రియాక్ట్ ఐన విధం నాకేమాత్రం ఇష్టం లేదు. వాడి పధ్ధతి రెండు నిముషాలు గమనించాక, తప్పని సరై ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిన్నెందుకు బయటికి వెళ్ళమన్నానో తెలుసా.. నిన్ను తిడుతూ అక్కడే కూర్చోపెట్టటం ఇష్టం లేక.”

“వాడు నా గురించి ఏమన్నాడు?”

2 Comments

  1. very good

Comments are closed.