సేల్స్ స్టార్ 1 288

“ఇదంతా బానే వుంది. మరి రేట్ సంగతి ఏమిటి?” ఉదయ్ ముగించగానే గూట్లే అడిగాడు.

“ప్రియా…” అంటూ ఉదయ్ ప్రియ వైపు చూస్తూ చిటికెలు వేసాడు.

ప్రియ లాప్ టాప్ లో కంపెనీ ప్రైసింగ్ ప్రోగ్రాం ఓపెన్ చేసి కొన్ని నంబర్లు ఎంటర్ చేసింది.

“నాసిక్ ప్లాంట్ ఐతే Rs. 78,50,000. మరి..”

“వాట్? ఇది కరెక్ట్ గా లేదు. నాకు తిక్క లేచిందంటే…” ఉదయ్ మొహం లో కోపం.

“అవుకు రేట్ చాలా ఎక్కువ గా వుంది” అన్నాడు గూట్లే నవ్వుతూ.

“మనం డిస్కౌంట్లు అన్నీ ఇచ్చాకే ఈ రేట్ వస్తోంది” ప్రియ వివరణ ఇవ్వబోయింది.

“షట్ అప్ ప్రియా.. జస్ట్ షట్ అప్..” అంటూ ఉదయ్ ప్రియ మీద లేచాడు. “నీకిచ్చిన ఒక్క పనీ సరిగ్గా చెయ్యలేవు. ఫైనాన్స్ వాళ్ళ తో మళ్ళీ మాట్లాడు. రేట్ డీసెంట్ గా వుండాలని నా మాట గా చెప్పు.”

“నేను ట్రై చేసాను.. ” ఉదయ్, ప్రియ ఇదంతా ముందే మాట్లాడుకోవటం మూలంగా ప్రియ కి ఇదేమి కొత్త అనిపించ లేదు.

“నువ్వేమి చెయ్యలేవు. ఎందుకూ పనికి రావు” అంటూ ఉదయ్ టేబుల్ మీద చేతులు చరిచాడు.

ఏమనుకున్నాడో, “పర్లేదు లే, తనని మళ్ళీ ట్రై చేయ్యనిద్దాం…” అన్నాడు గూట్లే.

“ముందు నువ్వు బయటికి నడువు. లాబీ లోంచి ఫైనాన్స్ వాళ్ళకి కాల్ చెయ్యి. వేరే నంబర్ల తో గానీ మళ్ళీ లోపలకి రాకు. ”

“ఒకే..” అంటూ ప్రియ రూం లోంచి లాబీ లోకి వచ్చి కూర్చుంది. ఫైనాన్స్ వాళ్ళ కి ఫోన్ లేదు, ఏమి లేదు. మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఇంటర్నెట్ న్యూస్ చదువుతూ కూర్చుంది. ఇరవై నిమిషాల తర్వాత రిసెప్షనిస్ట్ ప్రియ ని లోపలి వెళ్ళమని పిలిచింది.

“ఫైనాన్స్ వాళ్ళు నంబర్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఉదయ్”

“సరే, అవన్నీ నువ్వే చూసుకో, సరేనా?”

“మీ కాన్ఫిగరేషన్ బానే వుంది. మాకు తప్పకుండా పనికొస్తుంది.” అన్నాడు గూట్లే.

“చూసి నేర్చుకో, సేల్స్ అంటే ఇలా చెయ్యాలి” ఉదయ్ ప్రియ వైపు ఒక చూపు విసిరాడు.

“నేనీ ప్రోపోసల్ ని మా కంట్రీ లెవెల్ ఎక్సిక్యుటివ్ లకి చూపించాలి. ఇంకా మా ఆసియా-పసిఫిక్ బూసులకి.”

“వాళ్ళందరినీ మన ప్రోపోసల్ చాలా ఇంప్రెస్ చేస్తుంది అంటున్నారు గుట్లేజి.” అన్నాడు ఉదయ్.

“ఈ వీకెండ్ ఖండాలా లో మా కార్పోరేట్ లీడర్ షిప్ కాన్ఫరెన్స్ వుంది.” అన్నాడు గూట్లే నా వైపు ఓ బ్రోచర్ తోస్తూ. “నాతొ బాటు మా బిగ్ బాసులంతా వుంటారు. మా CEO కూడా రావచ్చు.”

2 Comments

  1. very good

Comments are closed.