సేల్స్ స్టార్ 1 288

నీలూ, వాళ్ళ ఆయన, శరత్, నేను ఒక టేబుల్ చుట్టూ కూర్చుని వున్నాం. మొగ వాళ్ళు క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నారు. నా కళ్ళు మళ్ళి ఉదయ్ కోసం వెతికాయి. పూల్ లో ఉన్నాడు. మాకు పది అడుగుల దూరం ఉండచ్చు. కొత్త గాచేరిన ఇంటర్న్ జూలీ మీద నీళ్ళు స్ప్లాష్ చేస్తున్నాడు, ఆటకాయితనంగా. తను కూడా తక్కువేమీ కాదన్నట్టు ఉదయ్ కి దగ్గర గా వచ్చి స్ప్లాష్ చేస్తోంది. వాళ్ళిద్దరూ నీళ్ళల్లో ఒకరినొకరు తోసుకోవటం, పట్టుకోవటం, ఒకరి నించి ఒకరు విదిలించుకోవటానికి ప్రయత్నించటం, ముసిముసి నవ్వులు నవ్వుకోవటం కనిపిస్తూనే వుంది. ఇద్దరూ చాతీ దాకా నీళ్ళల్లో ఉన్నారు. ఉదయ్ జూలీ ని హగ్ చేసుకోవటం, సిగ్గు తో ఎర్ర బడ్డ జూలీ తన ముఖాన్నిఉదయ్ చాతీ కి అదుముకోవటం తెలుస్తూనే వుంది. జూలీ విదిలించుకోవటం మానేసి, ఉదయ్ చాతీ మీద తన పెదాలతో ముద్దు పెట్టింది. ఉదయ్ చిరు నవ్వు నవ్వుతూ తన మెడ మీద ముద్దు పెట్టాడు. సడన్ గా జూలీ ఈ లోకం లోకి వచ్చి ఎవరైనా చూసారా అన్నట్టు చుట్టూ చూసింది. నేను, ఇంకో ఇద్దరు గమనించినట్టు తనకి అర్థం ఐంది. సిగ్గు పడుతూ ఉదయ్ నించి దూరం గా స్విం చేసుకుంటూ వెళ్ళింది.

నా కళ్ళు మళ్ళి జూలీ మీద నించి ఉదయ్ మీదకి మళ్ళాయి. ఉదయ్ నా వైపే తీక్షణం గా చూస్తూ కనిపించాడు. నా మీద నించి కళ్ళు మరల్చకుండా పూల్ ఒడ్డు కి స్విం చేస్తూ వచ్చాడు. పూల్ బయటి కి వచ్చిన ఉదయ్ నడుం మీద నీటి బిందువులు మెరుస్తున్నాయి. బైటికి వచ్చి మా టేబుల్ వైపు రాసాగాడు. వస్తున్నంత సేపూ ఏదో మంత్రం వేసినట్టుగా తన చూపుని ని నా కళ్ళ మీద నించి తిప్పలేదు.

టేబుల్ దగ్గరికొచ్చి, “హలో ప్రియా, హలో నీలూ, మిమ్మలని చేసుకున్న అదృష్టవంతులు వీళ్ళేనా?” అంటూ మా మొగుళ్ళ వైపు చూసాడు.

“హాయ్ ఉదయ్! ఇతను ఉదయ్ అని మా సేల్స్ టీం కొత్త సూపర్ స్టార్” అంటూ నీలూ ఉదయ్ ని వాళ్ళ ఆయన కి పరిచెయం చేసింది.

“నైస్ టు మీట్ యు” అంటూ శరత్ ఉదయ్ కి తన పక్క ఉన్న చైర్ చూపించాడు. “రండి”.

ఉదయ్ మా మొగుళ్ళ తో మాటలు కలిపేసాడు. కొద్ది నిముషాల్లోనే వాళ్ళని చాలా ఇంప్రెస్స్ చేసాడు అంటే అతిశయోక్తి కాదు. మా మాటలు వెకేషన్ గురించి,యౌరప్ ట్రిప్స్ గురించి మళ్ళాయి. నేను కూడా అప్పుడప్పుడూ నాలుగు మాటలు వేస్తూనే వున్నాను.

నా మనసు మాత్రం పరిపరి విధాలు గా పోతోంది. పక్క పక్క నే కూర్చుని వుండటం తో, శరత్ ని ఉదయ్ నీ పోల్చి చూస్తున్నాను. అప్పుడప్పుడే కొద్దిగా బట్ట తల, చిన్న పొట్ట తో మా అయన – పక్కన ఒక గ్రీకు వీరుడి లాగ వున్నాడు ఉదయ్. ఒకటి రెండు సార్లు నేను ఉదయ్ వైపు చూస్తున్నప్పుడు, ఉదయ్ కూడా నా వైపు చూస్తూ కనిపించాడు. కళ్ళల్లో ఏదో చిలిపి నవ్వు. నీలూ కూడా నేను ఉదయ్ ని చూడటం గమనించినట్టు వుంది.

2 Comments

  1. very good

Comments are closed.