సేల్స్ స్టార్ 1 297

నా మేనేజర్ సతీష్ నన్ను సమర్దిచాడు. “టు బి హానెస్ట్, ప్రియా చాలా ట్రై చేసింది. కానీ, ఆ ప్రోకుర్మేంట్ లో వున్న అతని తో డీల్ చెయ్యటం చాల కష్టం.”

“ప్రియ ఈ ఎకౌంటు మీద మూడేళ్ళు గా ట్రై చేస్తోంది. తను చెబుతున్నట్టు గా, తానేమీ మంచి రిలేషన్స్ డెవలప్ చేసినట్టు నాకైతే అనిపించటం లేదు.”

“ప్రియ సమర్ధత మీద నాకు పూర్తి భరోసా వుంది. తన రికార్డు చూస్తె మీకే అర్థం అవుతుంది.” అన్నాడు సతీష్ కాన్ఫిడెంట్ గా. రాజీవ్ కొద్ది గా ఆలోచిస్తున్నట్టు నా వైపు తిరిగాడు. “నన్ను తప్పు గా అర్ధం చేసుకోకు ప్రియా. నాకూ నీ వర్క్ మీద, సత్తా మీద చాల కాన్ఫిడెన్స్ వుంది. నువ్వు నీ జాబ్ ని చాల సమర్దవంతం గా చేస్తావని నాకు తెలుసు.”

“థాంక్ యు సర్”

“నా వర్రీ అల్లా జినో కార్ప్ ఎకౌంటు మనకి వస్తుందా లేదా అనే.. వాళ్ళు నాసిక్ లోను, పూణే లోను రెండు ఫ్యాక్టరీలు మొదలేడుతున్నట్టు తెలిసింది. ఈ కొత్త ప్లాంట్స్ కాంట్రాక్ట్స్ మనకి వస్తే, మన గోల్స్, నీ టార్గెట్లు కూడా తేలిగ్గా సాధించచ్చు.”

“నేను ఈ ఎకౌంటు సాధించటానికి పూర్తి ప్రయత్నం చేస్తాను సర్. ”

“సతీష్, నాకు మైక్రో మేనేజ్ చెయ్యటం ఇష్టం లేదని నీకు తెలుసు. కాని ఈ ఎకౌంటు మనకి చాలా ఇంపార్టెంట్. అందుకే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటి నించి జినో కార్ప్ ఎకౌంటు ని ఉదయ్ హేండిల్ చేస్తాడు”

ఉదయ్ సడన్ గా తన పేరు వినేసరికి అలెర్ట్ అయ్యాడు. “ఇది అంత మంచి ఐడియా కాదేమో సర్, ఉదయ్ ఇప్పడికే, చాల అకౌంట్ లు హేండిల్ చేస్తున్నాడు, మరీ స్ట్రెచ్ అవుతాడేమో..” అన్నాడు సతీష్.

“ఉదయ్ చాలా కష్ట పడతాడు. తన కొత్త అకౌంట్ ల ట్రాక్ రికార్డు చాలా బావుంది. నా వుద్దేశం లో ఈ ఎకౌంటు ని సాధించాలంటే ఉదయ్ ఏ సరియైన వాడు. నో అఫెన్స్ ప్రియా” అన్నాడు రాజీవ్. “అంత గా అయితే, ఉదయ్ ఎకౌంటు లు కొన్ని మిగిలిన వాళ్లకి ఇవ్వండి.”

“నాకేం ప్రాబ్లం లేదు సర్” అన్నాను భుజాలు ఎగరేసి. నిజంగా నే, నాకు ఈ తల నెప్పి వదిలించుకోవటం మంచిది అనిపించింది.”

2 Comments

  1. very good

Comments are closed.