సేల్స్ స్టార్ 3 77

నా భార్య కు ఇంతలాంటి అవమానం జరిగితే, ఒక భర్త గా ఎలా సహిస్తూ వుండగలను అని అడిగాను.

“చూడు.. వాళ్ళంతా పెద్ద వాళ్ళు. వాళ్లకి ఇలాంటివి మామూలు. వాళ్ళ చుట్టూ వుండే మనుషులు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళ పనుల కోసం ఇళ్ళల్లో ఆడవాళ్ళని ఎర వెయ్యటం వాళ్లకి పరిపాటి. వాళ్ళని చూసి వీళ్ళు, అందరూ అంతే, మనలని మించిన వాళ్ళు లేరు, ఎవరైనా లొంగి తీరతారు అనుకుంటూ వుంటారు.” అమ్మ మాటల్లో ఓ పెద్దరికం ధ్వనించింది. “మనం చిన్న వాళ్ళం రా.. ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడ పిల్ల వుంది. ఈ మిల్లు మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళం. కొంచం ఆలోచన తో ప్రవర్తించాలి మనం”.

ఏదో ఆలోచనలో వున్నట్టు కాసేపు మౌనంగా వుంది మళ్ళీ మాట్లాడింది. “వాళ్ళు రచన మీద వేలు కూడా మోపలేరు, నువ్వు కానీ, రచన గానీ అనుమతి ఇస్తే తప్ప. ఇప్పుడు మీ ఆవిడ ఆయన కంట పడినంత మాత్రాన ఆకాశం విరిగి భూమ్మీద ఏమీ పడిపోదులే. ఆయన పెళ్ళాం ఎక్కడో దూరం గా బొంబాయి లో వుంటోందిట, ఆయన ఏ ఆడ దిక్కూ లేకుండా వుంటున్నాట్ట. ఎవరో అన్నారు లే”.

అమ్మ మాటల్లో నాకు నిజం కనిపించింది. ఆవేశం కొంచం తగ్గింది.

“మిసెస్ సేన్ మరీ అంత సిగ్గు లేకుండా రెడ్డి గారికి బాహాటంగా సేవలు చెయ్యటం చూస్తుంటే, వింత గా అనిపించటం లేదూ?”

అమ్మ అర్థవంతం గా నవ్వింది. “సేన్ గారు ఇవ్వాళ ఈ పొజిషన్ లో వున్నారు అంటే అది అయన భార్య అందం మహిమే. ఆయన ఒకప్పుడు మామూలు మేనేజర్. భార్య ఆయన కంటే కనీసం పదేళ్లు చిన్నది. ఇంతకుముందున్న ఎం.డీ. ముసలాయనకి మచ్చిక అయింది. అప్పటి నించీ, సేన్ గారికి రెండేళ్ళకోసారి అయినా ప్రొమోషన్ వస్తూనే వుంది.”

అమ్మ మాటలు నాకు కొంత ఉపశమనం కలిగించాయి. ఆయన మీద చెయ్యి చేసుకోవటం అంత మంచిది కాదేమో. అయినా, ఆయన ఇలా చేసాడని నా దగ్గర సాక్ష్యం ఏం వుంది? జరిగింది చెబితే, విన్న వాళ్ళు నన్ను నమ్ముతారా? ఆయన్ని నమ్ముతారా?

“మరి రచనేమంది? ” అమ్మ అడిగింది.