సేల్స్ స్టార్ 3 77

సడన్ గా నా మనసు లో ఓ ఆలోచన మెదిలింది. “రాత్రి జరిగిన దానికి పూర్తి బాధ్యత రెడ్డిగారిదేనా?”

నాకు తెలిసి రచన కంటే సెక్సీ గా వుండే ఆడవాళ్ళు ఎవరూ లేరు. తన కోసం పడి చచ్చే నాలాంటి వాళ్ళని ఎలా ఉడికించి వేధించాలో తనకు బాగా తెలుసు.

“ఇది తప్పు చెయ్యటానికే పుట్టింది, దీనమ్మ” అనుకున్నాను మనసులో.

బితుకు బితుకు మంటూ అదురుతున్న గుండెలతో మర్నాడు ఫ్యాక్టరీ లో అడుగు పెట్టాను. ఈ పాటికి విషయం అందరికీ తెలిసే వుంటుంది.

మా డిపార్టుమెంటు వైపు నడుస్తుంటే, కొంతమంది తగిలారు. వాళ్ళెవరూ నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నట్లు లేదు. వాళ్ళ కళ్ళల్లో నేను ఎదురు చూస్తున్న ఆశ్చర్యం, వెక్కిలింత ఇవేవీ కనిపించలేదు. ఆకాశం ఊడి నా నెత్తి మీద ఏమీ పడలేదు. ఎప్పటి లాగానే, ఆ రోజు కూడా నా పని మొదలైంది.

నాలో ఆరాటం ఇంకా తగ్గలేదు. మనసు లో మాత్రం ఏదో అవుతుంది, ఆవబోతోంది అనుకుంటూ రోజంతా ముళ్ళ మీదే వున్నాను, కానీ అలాంటిది ఏం జరగ లేదు.

ఇంటికొచ్చేసరికి నాకోసం ఓ సర్ప్రైస్ వుంటుందని ఊహించలేక పోయాను.

——————————————————————————-

శీతాకాలం రోజులు, ఇంటికొచ్చేసరికి చీకటి పడింది. ఏదో జరిగిందిఅని అమ్మ కళ్ళు చూస్తుంటే అర్థం అయింది. ఆత్రం గా నాతో ఏదో మాట్లాడటానికి నాతో పాటు మెట్లు ఎక్కి పైకి వచ్చినంత పని చేసింది.

“ఇవ్వాళ ఒక వింత జరిగింది. ఇవ్వాళ మధ్యాహ్నం ఒంటి గంట కి మిసెస్ సేన్ నాకు ఫోన్ చేసింది. ఆవిడకి నిన్న మనల్ని చూడగానే, గతం రోజులు గుర్తుకోచ్చాయిట. ఖాళీ గా వుంటే కాసేపు రండి కబుర్లు చెప్పుకుందాం. కారు పంపిస్తాను, అంది. కాసేపు ఆవిడ దగ్గర కూర్చుని వచ్చాను.”

“ఏంటి విషయం?” నా ఆశ్చర్యం దాచలేదు.

“కంగారు పడాల్సింది ఏమీ లేదు, మంచి విషయమేలే!” నా కళ్ళల్లోకి సూటి గా చూస్తూ అంది.