సేల్స్ స్టార్ 3 77

నా గొంతు ఎండిపోయినట్టు అయింది.

“మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకున్నాం రా. ఆవిడ చాలా కలుపుగోలుగా మాట్లాడింది. చాలా రోజుల తర్వాత నిన్ను చూసారు గా, సేన్ గారు ఎక్సపోర్త్స్ డిపార్టుమెంటుకి నిన్ను మేనేజర్ గా వేయిస్తే బావుంటుంది, పెద్దాయన తో మాట్లాడతాను అని వాళ్ళావిడ తో అన్నాట్ట.”

ఈ మాటలు నాలో ఆసక్తి రేపాయి. అమ్మ ఇంకా నా కళ్ళల్లోకి చూస్తూనే వుంది.

“ఎక్సపోర్ట్స్ డిపార్టుమెంటు మేనేజర్ అంటే ఏమిటి ? మంచిదేనా?”

“చాలా మంచి పొజిషన్ అది! పెద్ద జీతం, హోదా. ఇంతకు ముందు దాకా దుబే గారు చేసారు. ఆయనకి వేరే ఏదో మంచి అవకాశం వచ్చి ఈ మధ్యే వెళ్లి పోయారు.”

“అయినా, సేన్ గారు నన్నెందుకు తీసుకుంటారు దీనికి?”

“నేనూ అదే అడిగారా ఆవిడని. ఆవిడ విన్నదేదో నాకు చెప్పింది. అలాంటిది ఏమైనా జరిగేటట్లైతే, వాళ్ళ ఆయనే నీతో డైరెక్ట్ గా మాట్లాడతాడు అంది.”

మళ్ళీ అడిగింది. “జీతం ఎంత వుండచ్చు ఈ పొజిషన్ కి?”

“ఓ ముప్పై వేల వరకు ఉంటుందనుకుంటా.. , చాలా ఫారిన్ ట్రిప్పులు వుంటాయి కూడా. అయినా, నాకు ఆ పనికి సంబంధించి పెద్దగా తెలీదు. నన్నెందుకు తీసుకుంటారు లే.. ఏదో మంచితనం గా వాళ్ళల్లో వాళ్ళు అనుకుని వుంటారు.”