ఏమి బహుమతి ఇస్తారు? 1 183

“నువ్వు చూసావుగా, ఇంకా రివ్యూ చేసేది ఏమీ ఉండదులే, అయినా మేడం అడిగారు కాబట్టి ఒక్కసారి చూద్దామా?” అడిగాడు కుమార్.
అతని వైపు ఒక్కసారి చూసింది. నవ యువకుడు. ‘ముక్కు బాగుంది’ అనుకుంది. నీట్ గా డ్రెస్ చేసుకున్నాడు. ‘హెయిర్ స్టైల్ బాగుంది’. ఆమె మనసులో విశ్లేషణలు. చివరిలో ‘మంచివాడేనా??’ సందేహం. ‘అమ్మో! మోసగాడు ఏమో!’ సందేహం వచ్చిన వెంటనే చూపు తప్పించుకుంది.
“హలో వైశాలి, ఏమిటి ఆలోచిస్తున్నావు? షెడ్యూల్ చూద్దామా?” మళ్ళీ అడిగాడు కుమార్.
ఒక్కసారి ఉలిక్కిపడి “ఓహ్ సారీ! అలాగే” అంటూ టేబుల్ దగ్గరకి వెళ్లి లాప్ టాప్ ఓపెన్ చేసింది. అలా ఓపెన్ చేస్తున్నప్పుడు కొంచెంగా వంగుంది. నిరాశగా ఆమె వైపు చూసాడు. ‘అంత టైట్ చుడి వేసుకోపోతే కాస్త లూజ్ టాప్ వేసుకోవచ్చుగా’ అంతలోనే అతని చూపు ఆమె పై ఎదపై పడింది. చిన్న ముచ్చిక ఇంప్రెషన్. లాప్ టాప్ ఓపెన్ చేసి లాగ్ ఇన్ అయ్యి పక్కనే ఉన్న చైర్ మీద కూర్చుంది. “కమాన్, ఆ చైర్ మీద కూర్చో” కొంచెం దూరంగా ఉన్న చైర్ చూపిస్తూ చెప్పింది. కుమార్ ఆ చైర్ తెచ్చుకొని ఆమె పక్కనే కూర్చున్నాడు. వీల్ చైర్స్. ఫ్రీ గా రివాల్వ్ అవుతాయి. ఆమె వైపు తిరుగుతున్నప్పుడు కుమార్ మోకాలు ఆమె తొడకి తగిలింది. వెంటనే కుమార్ సైడ్ కదిలాడు. ‘పర్లేదు, మంచోడే’ మనసులో అనుకుంది వైశాలి. షెడ్యూల్ అంతా వివరించడం మొదలుపెట్టింది. ఆమె మాటలు కుమార్ కి ఎంత సేపైనా వినాలని అనిపిస్తుంది. మొత్తం అయిపోయిన తర్వాత అతని వైపు అభిప్రాయం కోసం చూసింది.
ఆమెనలా చూస్తూ “కాఫీ ఉంటె బాగుంటుంది” అనాలోచితంగా అనేసాడు.
“వాట్! ఐస్ క్రీం?” అడిగింది. కాఫీ అనబోయి ఐస్ క్రీం అని అన్నది.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. “హహహ, కాదు, నేను అన్నది కాఫీ, బట్ ఐస్ క్రీం కూడా నాకు ఓకే, నువ్వు చేసిన వర్క్ గురించి అయితే నేను ఎప్పుడు మార్చమని అడగను” నవ్వుతూ అన్నాడు.
వైశాలికి తను చేసిన తప్పు వెంటనే తెలిసింది. నవ్వి “మరి ఐస్ క్రీం కరిగిపోతుంది, కాఫీ చల్లారిపోతుంది”
“నిజమే వైశాలి, కానీ మన స్నేహం పెరుగుతుంది కదా” సమాధానం ఇచ్చాడు.
“క్రీం స్టోన్?” సజెస్ట్ చేసింది.
కుమార్ కి ఒక్కసారిగా చాలా సంతోషం వేసింది. “డన్” అన్నాడు. “ఆఫ్టర్ ఆఫీస్”
నవ్వి సరే అన్నట్లు తల ఊపింది.
ఆ రోజంతా కుమార్ చాలా హ్యాపీ గా వర్క్ చేసాడు.
‘థాంక్స్ మేమ్, క్రీం స్టోన్ లో ఈవెనింగ్ తనతో’ అని హేమకి మెసేజ్ పెట్టాడు.
‘అల్ ది బెస్ట్ అండ్ ఎంజాయ్, బట్ నెవెర్ చీట్’ రిప్లై వచ్చింది.

1 Comment

  1. Most of the Stories are left incompleted. We are eagerly waiting for the continuation but another new story is posting and left the earlier story. Admin can advise them complete the full sex story.

Comments are closed.