ఏమి బహుమతి ఇస్తారు? 1 183

కుమార్ ఒక ఖాళీగా ఉన్న కేబిన్ దగ్గరకి వెళ్లి కూర్చున్నాడు. వైశాలి ఎదురుగా కూర్చుంది. ఆమె వైపు చూస్తున్నాడు. అతను చూస్తున్న విషయం గమనించి వైశాలి తల దించుకుంది. ఆమెకి కొంచెం సిగ్గుగా ఉంది.
“నా పక్కన చాలా ప్లేస్ ఉంది” అన్నాడు.
“నా పక్కన కూడా” సమాధానం వచ్చింది.
ఆమె వైపు చూసాడు. ఆమె ఇంకా తల దించుకొనే ఉంది. తను ఒక విషయం మరచిపోయాడు. ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళేప్పుడు ముందుగా ఆమెని కూర్చో బెట్టి తర్వాత మాత్రమె ఆ అబ్బాయి కూర్చోవాలి.
కుమార్ వెంటనే లేచి “నీ పక్కనున్న ప్లేస్ నాకు ఎప్పటికీ దొరుకుతుందా?” అడిగాడు.
“ఏమో తెలీదు, ప్రస్తుతం అయితే నువ్వు ఐస్ క్రీం బిల్ కట్టేవరకు అయితే మాత్రం దొరుకుతుంది” అతని వైపు నవ్వుతూ సమాధానం ఇచ్చింది.
ఆమెవైపు వచ్చి పక్కన కూర్చున్నాడు. అది ఇద్దరు కూర్చునేలా ఉండే సోఫా లాంటి చైర్. ఒకరికి ఎక్కువ ఇద్దరికీ తక్కువ ప్లేస్. చాలా దగ్గరగా కూర్చోవాల్సి వస్తుంది. ఆమె ఎడమ వైపు పూర్తిగా కుమార్ కి తగులుతోంది. ఈ లోగా సర్వర్ వచ్చాడు. తనకు మెనూ లో కనబడిన పేరు చెప్పేసింది. ఆమెకి సిగ్గుగా ఉంది. కుమార్ వైపు చూసింది. అతను తన వైపే చూస్తున్నాడు. తన వక్ష భాగం అతనికి తగులుతోందని ఆమెకి తెలుస్తోంది. అతనికి కూడా ఆ విషయం తెలుసనీ అర్ధం అయ్యింది. ఈ లోగా ఐస్ క్రీం వచ్చేసింది. ఇద్దరు ఐస్ క్రీం తినడం మొదలుపెట్టారు.
“ఈ ఐస్ క్రీం కరిగిపోతూ మన స్నేహం పెరిగేట్లు చేస్తుందా?” అడిగాడు.
ఆమె చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయింది. ఇది స్నేహం మాత్రమె కాదని ఆమెకి తెలుసు. తల కొంచెం కిందగా వంచుకొని ఐస్ క్రీం ని స్పూన్ తో కలుపుతూ ఉండిపోయింది. ఆమెకి టెన్షన్ గా ఉంది. ఏమి జరగబోతోందో అర్ధం అవుతోంది. ఈ రోజు కాకపోయినా రేపైనా తనకు ప్రపోజల్ వస్తుంది. ఐస్ క్రీం అయిపోయిన తర్వాత కుమార్ బిల్ పే చేసాడు. తర్వాత ఇద్దరు బయటకి వచ్చారు.
“నన్ను మళ్ళీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చెయ్యాలి” అన్నది వైశాలి.
“ఎందుకు?” అడిగాడు కుమార్.
“నా ప్లెషర్ అక్కడే ఉంది”
ఒక్కసారిగా కుమార్ కి చాలా ఆనందం వేసింది. అంటే ఆమె తన స్కూటర్ తెచ్చుకున్నదన్నమాట. కావాలనే తన బైక్ మీద వచ్చింది. మళ్ళీ ఆఫీస్ వరకు వెళ్లి తనని డ్రాప్ చేసాక “ఐ లవ్ యు, విల్ యు మేరీ మీ?” అడిగాడు కుమార్. అతను ఇంత తొందరగా అడిగేస్తాడని అనుకోలేదు.
“నాకు….నాకు కొంచెం టైం కావాలి” సమాధానం ఇచ్చింది.
“కాదనే సమాధానం మాత్రం చెప్పొద్దు. నేను తట్టుకోలేను. కావాలంటే నన్ను ఎప్పటికి వెయిట్ చేయించు. జీవితాంతం” అన్నాడు నిజాయితీగా.

1 Comment

  1. Most of the Stories are left incompleted. We are eagerly waiting for the continuation but another new story is posting and left the earlier story. Admin can advise them complete the full sex story.

Comments are closed.