ఏమి బహుమతి ఇస్తారు? 2 112

హేమ సూర్య కి పెళ్ళికి ముందే తెలుసు. తన అందానికి పడిపోయి తనకి ఒక ప్రేమలేఖ కూడా రాసాడు. అయితే హేమ దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో సైలెంట్ అయిపోయాడు. తర్వాత రాజ్, హేమ ప్రేమలో పాడడం, వాళ్ళ పెళ్లి జరిగిపోవడం అయిపొయింది. ఆ తర్వాత సూర్య ఆమె గురించి ఆలోచించడం మానేసాడు.
“నాది చెత్త బుట్ట లేఖరా, ప్రేమ లేఖ కాదు” నవ్వుతూ అన్నాడు సూర్య. “ఇంతకీ ఎంతలో కావాలి?”
“నెలకి వన్ లాక్ ఈ ఎం ఐ అయితే బెటర్ అనుకుంటున్నాము. మరీ ఎక్కువ అయితే కంఫర్ట్ ఉండదు. అంటే వన్ అండ్ హాఫ్ క్రోర్. రైట్?”
“బాగుందిరా, మంచి హౌస్ వస్తుంది. ఇంతకీ ఎక్కడ కావాలి”
“కొంచెం గార్డెనింగ్ కి ల్యాండ్ ఎక్కువ ఉంటె బాగుంటుందని అంటోందిరా మీ వదిన. తనకి హౌస్ కూడా కొంచెం స్పెషియాస్ గా ఉండాలి కొంచెం అవుట్ స్కర్ట్స్ అయితే బెటర్. ఎలాను ఇద్దరం కార్స్ లోనే కదా ఆఫీస్ వెళ్ళేది”
“సరే రాజ్, నేను ఎంక్వయిరీ చేస్తా. రెండు మూడు హౌసెస్ నువ్వు చెప్పినట్లు ఉన్నాయి. వాటి వివరాలు నేను మెసేజ్ పెడతాను. నువ్వు వాటిని చూసి నచ్చినది చెప్తే నేను మాట్లాడతా, మొత్తానికి నువ్వు ఇప్పుడొక ఇంటివాడివి అవుతున్నావన్నమాట” నవ్వుతు అభినందనగా అన్నాడు సూర్య.
‘ఇంటివాడినే అవుతున్నానో లేదంటే కొండంత అప్పు చేస్తున్నానో తెలియడం లేదు. బ్యాంకు మేనేజర్ లోన్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు”
“హహహ, మేము కూడా అప్పులు చేసే వ్యాపారాలు చేస్తుంటాము. అప్పులు లేనిదే ఈ రోజుల్లో ఎవ్వరు ఏమీ చెయ్యరు. చెయ్యలేరు” అన్నాడు సూర్య.
“నిజమేరా, ఇంతకీ ఈ స్నేహ ఎవర్రా?” నవ్వుతూ అడిగాడు రాజ్.
“మా మామ కూతురురా. దూరపు చుట్టమే. రేపు XXX టెక్నాలజీస్ లో ఇంటర్వ్యూ అంట. తనోచ్చింది. త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది.”
“అరె చెప్పవేం రా? అది మన హేమ కంపెనీ నే. ఇంక స్నేహకి అక్కడ జాబ్ వచ్చేసినట్లే అనుకో. సేలరీ కూడా బెటర్ గా ఫిక్స్ చేస్తుందిలే. తన డీటెయిల్స్ కూడా పంపు. నేను హేమకి చెప్తాను.”
“హహహ, అయితే స్నేహ ని ఇక్కడే ఫిక్స్ చేసేసావా? నాకు కష్టం అవుతుందేమో రా”
“ఎందుకురా నీకు కష్టం? వాయిస్ బాగుంది, అంటే మనిషి ఇంకా బాగుంటుంది.”
“ఏంటీ, గొంతు వినే మనిషిని అంచనా వేసేస్తావా? నువ్వు సూపర్ రా, తను బాగుంటుందిలే.”
“అంటే నీకు నచ్చింది అన్నమాట, మరైతే ఇంకెందుకు ఆలస్యం, వరస కుదిరింది, మనసులు కలిస్తే ఇంక పెళ్లి చేసేసుకొని నువ్వు కూడా ఒక ఇంటివాడివి అవ్వు. అన్నట్టు ఇంకోమాట నువ్వు కాస్త కంట్రోల్ లో ఉండు మరి ఈ రోజు” నవ్వుతు అన్నాడు రాజ్.
“అలాంటిది ఏమీ లేదులేరా. ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు కదా”
“హహహ సరేలే, హావ్ అ నైస్ టైం. ఇంకా ఉంటా. నువ్వు నా పనిమీదనే ఉండు ఇంక. బై.”
“సరేరా, విష్ యు బెస్ట్ అఫ్ లక్”
ఇద్దరు ఫోన్ పెట్టేసారు.
ఈ ఫోన్ అయ్యేలోగా రాజ్ ఇంటికి ఆల్మోస్ట్ చేరుకున్నాడు.

సూర్య స్నేహ గురించి ఆలోచించాడు. స్నేహ పేరుకు తగ్గట్లే స్నేహంగా ఉంటుంది. చాలా మంది ఫ్రెండ్స్. ఎవ్వరితో అయినా ఓపెన్ గా మాట్లాడుతుంది. అదే ఆమె ప్రత్యేకత. మనసులో ఏమీ దాచుకోదు. ఎదుటి వారి నుండి కూడా ఆలానే ఆలోచిస్తుంది. సూర్య మాట్లాడుతున్నంత సేపు తను అతనేమి మాట్లాడుతున్నాడో వింటున్నది. మధ్యలో తన గురించి ఎదో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

1 Comment

  1. Story super plz continue

Comments are closed.