గోపీ – Part 3 146

షాపింగ్ అయిన తరువాత ఇద్దరూ ఓ ఖరీదైన రెస్టారెంట్లోనికెళ్ళారు.గోపీ వడివడిగా వెళ్ళి వారు ఎక్కడ కూచోవచ్చో ఊహించి ఆ టేబల్ కు వెనుక వైపున కూచొన్నాడు.ఫల్గుణి శయనలిద్దరూ కార్ లాంజ్ లోనుండి నేరుగా వచ్చి లక్కీగా గోపీ కి వెనుక టేబల్ దగ్గర ఉన్న సోఫాలో కూచొని ఏవో ఆర్డర్ చేసారు.కాసేపు పిచ్చాపాటి మాటాడిన తరువాత శయన అసలు విశయంలోనికొచ్చింది.చూడు పల్లూ మీ అమ్మతో కాకుండా నిన్ను ఒంటరిగా రమ్మన్నానంటే విశయం అటువంటిది.మీ అమ్మానాన్నలకు తెలియకుండా నీవు పెట్టిన ప్రపోసల్ వల్ల నీకెంత లాభం ఉందో నాకూ అంతే లాభం ఉంది.కాని మీ వాళ్ళకు తెలియకుండా,అదీ విదేశాల్లో. . . నన్ను పార్టనరుగా చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడంలో నీ ఉద్ద్యేశ్యం అర్థం కాలేదు.మేమా మీ అంతస్తుకు తగ్గవారే కాదు. మీ ఖర్చులే లక్షల్లో ఉంటుంది.ఇక మీకున్న వ్యాపారాల్లో వచ్చే లాభాల గురించి అంచనా వేయడానికే నా ఊహ సరిపోవడం లేదు.నీ అలోచనలేమిటో తెలుసుకోవచ్చా పల్లూ..
ఫల్గుణి గట్టిగా నిట్టూర్చి . . . ఆంటీ మిమ్మల్ని నమ్మాను కనుకనే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి మిమ్మల్ని ఎంచుకొన్నాను. మాలా ఉన్న గొప్పింటోళ్ళ జీవితాలు దూరపు కొండలు ..చూట్టానికి నున్నగానే కనిపిస్తాయి.
కానీ ప్రతీదీ ఓ వ్యాపారమే …విలాసవంతమైన జీవితాలూ సంబందాలు అన్నీ అన్నీ కూడా ..అందులో బయటికి రాని కన్నీళ్ళెన్నో ..నీవు ఊహించగలవా ఆంటీ . . .అందరూ అనుకొన్నట్టుగా నేను వావివరుసలు లేకుండా విచ్చలవిడి జీవితాన్ని గడుపుతున్నానని నాకు మంచీ చెడూ లాంటి విశయాలేవీ తెలియవని. . .ఇలా సొసైటీలో నాకు చాలా చెడ్డపేరుంది కదూ…కాని ఇవన్నీ మా అమ్మ మా అన్నయ్య లిద్దరూ సాగిస్తున్న ఒక వ్యాపార ప్రకటన ..తద్వారా ఆడపడుచుకు ఇవ్వాల్సిన ఆస్థి మీద నెమ్మది నెమ్మదిగా పట్టుబిగిస్తున్నారు. మానాన్నకు ఇవన్నీ తెలుసు కాని నష్టాన్ని అంచనా వేసే స్థితిలో లేడు. అంత బిజీ ఆయన …నాకు ఎటువంటి లోటూ లేదు.కాని ఈ ప్రచారం వల్ల నేను ఏ రకమైన ఇంటికి కోడలుగా వెళతానో ఊహించలేకున్నా … అందువల్లనే ఇప్పటినుండే నా ప్రయత్నమంతా..
శయనకు విశయం అర్థం అయ్యింది. ఇటు గోపీకి కూడా..
శయన:- చూడు పల్లూ నీ సమస్యకు పరిష్కారం చెప్పే స్థితిలో నేను లేను..కాని నీవు వారికి భయపడి నీ దారి నీవు చూసుకోవడంవల్ల వారికి ఇంకా అలుసు ఇచ్చినట్లవుతుంది. మీ అమ్మకు మీరిద్దరే కదా పిల్లలు…ప్రత్యేకంగా నీ ఆస్థి మీదే ఎందుకు కన్ను ..ఎప్పటికప్పుడు మీ ఆస్థులు పెరుగుతూనే ఉన్నాయి కదా …ఇంకా నీకు ఇవ్వాల్సినదానిమీద ఎందుకంత పట్టింపు.. . .
ఫ:-ఆంటీ మా నాన్న ఆలోచనల ప్రకారం ఇల్లరికం వచ్చే వారైతే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. ఇల్లరికానికి మా అమ్మ వైపు బందువులలో ఎవరినో ఒకరిని మా అమ్మ ఎంచుకొన్నట్లు కర్నాకర్ణిగా విన్నాను.ఐతే వారి కుతంత్రాలు కుళ్ళూ అవినీతీ ఇవన్నీ మాన్నాన్నకు తెలుసు,అందువల్ల ఆయన ససేమిరా అన్నాడు.అలా కాకుండా నేను ఎవరైనా ఇంటికి కోడలుగా వెళ్ళే పక్షంలో ఇంతా అని కొన్ని వేల కోట్లు కట్నంగా,దానిపై నా ఆస్థిని కూడా పరుల పాలు చేయవలసి వస్తుందనేది మా అమ్మ గోడు.. . దీనికి మా అమ్మ అన్నయ్యలు చేయవలసిందంతా చేస్తున్నారు. అందుకే అటు వారిని నొప్పించకుండా ఇటు నేను బాధపడకుండా ఇలా మధ్యేమార్గంగా ఈ దారిని ఎంచుకొన్నాను.
మంచిది పల్లూ నీవు చాలా సున్నితమైన మనసున్నదానివి,ఇది మీ అమ్మకు అర్థం కాలేదు. ఆమె మనసంతా డబ్బు మీదుంది.సరే నా దగ్గర ఒక ఐడియా ఉంది..బహుశా దానివల్ల వారిలో మార్పు తీసుకు రావచ్చు.. . .అంటూ ఆగింది శయన

2 Comments

  1. What about next part

Comments are closed.