టీచర్ కోసం 546

“ఓక అబ్బాయ్ ప్రేమిస్తే ప్రేమించిన అమ్మాయికి తప్ప, చుట్టు పక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది, అదే అమ్మాయ్ ప్రేమిస్తే, ఆమెకు తప్ప ఎవ్వరికీ తెలీదు అని”
ఈ మాటకు నాకు సంబంధం లేదు కాని, ఎందుకో చెప్పాలనిపించి చెప్పా, ఇక విషయానికి వస్తే, పైన చెప్పిన మాట రివర్స్ చేయాలి, మొదటి ఇయర్ లో నేను ఉన్నప్పుడు, ఓక అమ్మాయ్ నన్నే చుస్తూ వుండేది, నేను తిరిగి చూస్తే నవ్వేది, అళా ఓక రోజు ఆ పాప నన్ను చూసి స్మైల్ ఇస్తుండగా, ఓక దరిధృడి కళ్లలో ఛిక్కాం. అంతే వాడు క్లాస్ లొనే కాదు కాలేజీ మొత్తం పెంట పెంట చేసాడు. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం అని..
ఇక ఎవడో మహా గొప్ప శిల్పి, మా కాలేజీ మెట్ల దగ్గర రాయ్ తీసుకుని చెక్కాడు. భరత్ లవ్స్ శ్రీప్రియ అని. వాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు మేము లవర్స్ అని, ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ అమ్మాయి కూడా చూసినా, చూడనట్లు వుండేది ఆ పిచ్చి గీతాలను. తరువాత కాలేజీ పెయింటింగ్ చేసే దాంట్లో అది కలిసి పోయింది.
అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్లు అందరు మేము లవర్స్ అని ఫిక్స్ అయ్యి పోయారు. నాకేమో ఆ పిల్ల నిజంగా లవ్ చేస్తుందో లేదో కూడా తెలీదాయే.
ఐన మన వంటికి అలాంటివి సెట్ కావు. వాటికి ఎప్పుడు మనం దూరం, ఇక అసలు విషయం లోకి వస్తే
చందు గాడు ఆపిన దగ్గర నుండి మల్లి చెప్పడం ప్రఱంభించాడు.
వాడు నీ లవర్ ప్రియకు నోట్ బుక్ ఇచ్చాడు రా, అని ఆవేశంగా చెప్పాడు. నేను వెంటనే, కోపంతో ఆవేశంగా ఎంత దైర్యం రా వాడికి నా లవర్ కె నోట్ బుక్ ఇస్తాడా అని కోపంగా లేచి, రారా మామ వాడిని నరికేద్దం అన్నను. దానికి వాడు, రేయ్ నువ్వు దీనికే అంత ఆవేశ పడుతున్నావ్, ఇక అసలు విషయం చెప్తే, ఏమైపొటావో అని చెప్తూ ఉన్నాడు.
నాకు వాడిని చూసి నవ్వు వచ్చింది. వీడు మారడు ళే అని కూర్చున్నా, వాడి అంతకు వాడు రేడియో ళా చెప్పు కుంటూ వెళ్తున్నాడు. నోట్ బుక్ ఇచ్చే టప్పుడు, వాడు ఏదో టెన్షన్ తో చెప్పాడు, రా దానికి నీ పిల్ల, నోట్ బుక్ తెరిచి ఏదో చూసింది, వాడి వైపు తిరిగి నవ్వుతూ ఏదో అంది. దాంతో వాడు నీ పిల్ల చేయి పట్టుకుని ఏమో చేసాడు రా, దానికి ఆ పాప వాడి తో ఏదో టెన్షన్ గా చెప్పి, చెయ్ విడిపించుకుని, వెల్లి పోయింది రా అంటూ ఆపేసాడు, అంతలో లాంగ్ బెల్ కొడితే, నాకు పని ఉంది రేపు మాట్లాడుకుంధం. నువ్వు మాత్రం రేపు కత్తి తెచ్చుకోవడం మరిచిపొవొద్ఢు అని అంటూ, వాడు ఏదో చెప్తున్నా పట్టించుకోకుండా బుక్స్ తీసుకుని వచేశా.
వాడు చెప్పిన దానికి నాకు భారీగా నవ్వు వచ్చింది. ఎందుకంటే, అక్కడ జరిగింది వేరు, వీడు చెప్తుంది వేరు కాబట్టి, నిజానికి అక్కడ ఎం జరిగి వుంటుందో ఊహిష్తే, ఆ సిద్దు గాడు ఆ పాప బుక్ తీసుకుని వుంటాడు, అది పొరపాటున చిరిగి పోయి ఉండొచ్చు. దానికి ఆ పాప ఏమంటుందో అని టెన్షన్ తో చెప్పి వుంటాడు. దానికి ఆ పాప నోట్స్ తీసుకుని, చూసి, దీనికి అంతలా టెన్షన్ పడాలా అని నవ్వి ఉంటుంది, దానికి వాడు ఆ పాప కు షేక్ హ్యాండ్ ఇచ్చి వుంటాడు, ఆ పాప సరే నేను వెళ్తా అని చెప్పి చెయ్ విడిపించుకుని వెల్లి వుంటుంది. దానికి వీడు ఆ పాప చెయ్యి తీసుకుని ఏదో చేసాడు రా, అని చెప్పడం, హ హ హా అని అనుకుంటూ పార్కింగ్ లో ఉన్న నా బైక్ తీసుకుని ఇంటికి బయలు దేరాను.

Updated: November 28, 2021 — 9:54 am

6 Comments

  1. Wt about ramya story bro

    1. Vidu oka story kuda complet cheyadu bro

  2. very good embrasing

  3. It’s good but should not prolonged

  4. Bro continue chey adi e vidanga ante ticher kuturu to

Comments are closed.