నా అదృష్టం 539

సిరి: వావ్.. యాహూ.. థ్యాంక్యూ అన్నయ్యా.
పిన్ని: ఇది చదివే చదువుకు టౌన్ దాకా ఎందుకు. 10 వ తరగతి వరకు చదివితే చాలు, తరువాత పెళ్ళిచేసేస్తే సరిపోతుంది.
సిరి ఆ మాట విని డల్ అయ్యింది.
నేను: అదేంటి పిన్ని దానికి అప్పుడే పెళ్ళేంటి మరీ పాతకాలంలో లాగా.
పిన్ని: నీకు తెలీదులే రమేష్, దీనికి చదువు ఇంక అవసరం లేదు.
నేను: అదేంటి పిన్ని, పిల్లల్ని బాగా చదివించాలని నువ్వే చెప్తుంటావు గా.
పిన్ని: దానికి వచ్చే మార్కులు చూడు.
నేను: సిరి చాలా తెలివైన పిల్ల, ఇక్కడ సరైన స్కూళ్ళు లేవు. టౌన్ లో అయితే తను బాగా చదువుతుంది.
పిన్ని ఏం మాట్లడకపోవడంతో ఇంక ఆ టాపిక్ అక్కడతో ఆగిపోయింది.
నేను: అయినా తనకు అప్పుడే పెళ్ళి చెయ్యాలని ఎందుకనుకుంటున్నారు పిన్నీ.
పిన్ని: ఇది స్కూల్ లో వేసే వెధవ వేషాలకు పెళ్ళి చేసి పడేస్తే మేలని…
నేను ఏమైందని అడిగేంతలో నన్ను దస్తావేజులు తీసుకుని* అర్జెంటుగా సుబ్బయ్య గారి ఇంటికి రమ్మని మా బాబాయి మనిషిని పంపించాడు.

నేను తనతో వెళ్ళి, అక్కడ పని అయ్యి బాబాయి నేను వచ్చేప్పుడు మా ఇంటికి ఫోన్ చేసి ఇక్కడి సంగతులన్నీ నాన్నకు చెప్పాము. నాన్న అలాగే అని అమ్మ మాట్లాడుతుందంట అని అమ్మకు ఇచ్చాడు.
అమ్మ: కన్నా, ప్రయాణం బాగా జరిగిందా.
నేను: బాగా జరిగిందమ్నా.
అమ్న: పిన్ని, సిరి అందరూ బాగున్నారా.
నేను: ఆ బాగున్నారు.
అమ్మ: ఏంటి ఆ* విషయం అంత డల్ గా చెప్తున్నావు.
నేను: అది తర్వాత చెప్తాలే.
అమ్మ: సరే, నేను పంపించినవి పిన్నీ వాళ్ళకు ఇచ్చావా.
నేను: లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తరువాత ఇస్తా.
అమ్మ: మరిచిపోకుండా ఇవ్వు.
నేను: అలాగే.
అమ్మ: సరే అయితే నేను ఇంక ఉంటా, అవతల కీర్తి వచ్చే టైమయ్యింది, వంట చెయ్యాలి.
నేను: (ఆశ్చర్యంగా) కీర్తి వస్తే నువ్వు వంట చెయ్యటం ఎందుకు. ఆంటీకి ఒంట్లో బాగా లేదా.
అమ్మ: అదేమి లేదు గాని, నీకు తెలీదు కదా ఆంటీ వాళ్ళు పది రోజులు టూర్ కి వెళ్ళారు. కీర్తికి ఇంకా నాలుగు రోజులు ఎగ్జామ్స్ ఉండడంతో ఆంటీ ఎలా చెయ్యాలా అని మధన పడుతుంటే నేనే మా ఇంట్లో ఉంచండి మేము చూసుకుంటాం, మీరు హాపీగా టూర్ వెళ్ళిరండి అని చెప్పాను.
అయినా ఆంటి, మీకెందుకండి శ్రమ అంది, కానీ మరేం ఫర్వాలేదు మీరు ఇంకేమి ఆలోచించకుండా తనని మా ఇంట్లో ఉంచి వెళ్ళండి ఎలాగు రమేష్ కూడా లేడు కదా, కీర్తి ఏ డిస్టర్బెన్సూ లేకుండా చదువుకుంటుంది అని చెప్పా.
నేను: (కోపంగా) అంటే నేను డిస్టర్బెన్స్ చేసే వాడిలా కనిపిస్తున్నానా.
అమ్మ: (నవ్వుతూ) ఊరికే అన్నాను లే రా, చివరికి ఆంటీ మొహమాటపడుతూనే ఒప్పుకుంది.
నేను: (ఛా.. కీర్తితో ఓంటరిగా ఉండే మంచి ఛాన్స్ మిస్ అయ్యిందే అనుకుంటూ)ఆంటీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు.
అమ్మ: నిన్న సాయంత్రం.
నేను: ఇంత అర్జెంటుగా ఏంటంట, కీర్తి ఎగ్జామ్స్ అయిపోయిన తరువాత తనని కూడా తీసుకెళ్ళొచ్చుగా.
అమ్మ: అంకుల్ వాళ్ళ కొలీగ్స్ ఈ ప్రోగ్రామ్ గురించి ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నారంటా. కొలీగ్స్ అందరూ వెళ్ళాలంటే, ఇప్పుడైతే అందరికీ కుదురుతుందంటా. అంకుల్ కి కీర్తి ఎగ్జాన్స్ విషయం తెలీక ఈ ప్రోగ్రాం కి ఓకే చెప్పేసేడంటా. మళ్ళీ వీళ్ళు వెళ్ళకపోతే వాళ్ళ కొలీగ్స్ ఫీల్ అవుతారని వాళ్ళు చాలా మధన పడుతున్నారు. నేను కీర్తిని మా ఇంట్లో ఉంచమనడంతో, వాళ్ళూ చాలా ధైర్యంగా వెళ్ళారు, అంది అమ్మ.

1 Comment

  1. ఒరేయ్ సల్లిగా story రాస్తే మొత్తం రాయు లేకుంటే రయకు
    మధ్యలో ఎందుకురా అపడం
    రాయడం చేత కాక పోతే
    అద్దం ముందర అతులు చూసుకునే ఎదవ

Comments are closed.