నైట్ షిఫ్ట్ 27 171

తెల్లారి ఎలాగో ఆయనకు నైట్ షిఫ్ట్ కావడంతో చాలా ఆలస్యంగా లేచాం. ముందు నేను లేచి స్నానం చేసి పంజాబీ డ్రెస్ వేసుకుని ఆయనను లేపి వంటింట్లోకి వెళ్ళాను. ఆయన స్నానం చేసి వచ్చేలోపు టిఫిన్ రెడీ చేసేసాను. ఆయన ట్రాక్ ప్యాంటు టీ షర్ట్ వేసుకుని సోఫా లో కూర్చుని టీవీ చూస్తున్నారు. నేను రెండు ప్లేట్ లో టిఫిన్ పెట్టుకుని వెళ్ళాను. అలా తింటూ టీవీ చూస్తున్నాం. తర్వాత వేడి వేడి కాఫీ కలుపుకుని తెచ్చి ఆయనకు ఇచ్చి నేను తాగుతున్నాను.

ఇంతలో మొబైల్ రింగ్ అవుతూ ఉంది. ఎవరా అని చూశాను. ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నుండి కాల్. లిఫ్ట్ చేశాను.
హాయ్ రమ్య. హౌ ఆర్ యూ? నేను శ్రావ్య రిసెప్షనిస్ట్ అంది.
నేను గుర్తుపట్టి హాయ్ నేను బాగున్నాను. నీవు ఎలా ఉన్నావు అని అడిగాను.
బాగున్నాను, రేపటి నుంచి క్లాస్సేస్ స్టార్ట్ అవుతున్నాయి. 10.30AM వరకు వచ్చేయి అని చెప్పింది.
అదే విషయం ఆయన తో చెప్పాను. ఆయన విని ఇంకేం రేపటి నుండి నీవు బిజీ అయిపోతావు.
నేను కూడా అవును అన్నట్టుగా తల ఊపాను.

ఓ వైపు ఇన్స్టిట్యూట్ ఇంకోవైపు తోట పనులు కూడా మొదలవుతాయి అన్నాను.
అవును కదా! అది కూడా ఉంది కదా అన్నారు. నేను అవునండి అన్నాను.
ఏం పర్లేదు, ఎలాగో మీ అమ్మ-నాన్న అక్కడే దగ్గర్లోనే కదా ఉండేది. వాళ్ళు చూసుకుంటారు. నీవు అంకుల్ తో వారంలో రెండు సార్లు, లేదంటే కుదిరినప్పుడల్లా వీలు చూసుకుని వెళ్ళు అన్నారు. కొన్ని రోజులు కష్టపడటం తప్పదు. నాకు ఎలాగో వీలు దొరకదు. లేదంటే నేనే చూసుకునేవాడిని. ఎలాగో ఆదివారం ఒకరోజు సెలవు కదా. ప్రతి ఆదివారం కాకున్నా ఓ ఆదివారం వదిలి ఇంకో ఆదివారం అయినా నేను చూసుకుంటాను అన్నారు.
సరే నండి మన ఫ్యూచర్ కోసమే కదా, ఏది చేసిన. మీరు అన్నట్లుగానే కొన్ని రోజులు కష్టపడక తప్పదు అంటూ కాఫీ తాగుతున్నాను.

సరే గాని రమ్య ఈరోజు నేను 3PM కే వెళ్ళాలి కంపెనీకి. అసలే 3రోజులు సెలవులో ఉన్నాను. 2రోజులు అని ఒక రోజు ఎక్కువగా తీసుకున్నాను. వెళ్లి ఛార్జ్ తీసుకోవాలి అన్నారు.
సరేనండీ నేను లంచ్ రెడీ చేస్తాను. అలాగే డిన్నర్ కి కూడా అంటూ లేచాను. కానీ ఫ్రిడ్జ్ లో ఎలాంటి కూరగాయలు లేవు అన్నాను.
అవును కదా, నేను వెళ్లి దగ్గరలో ఉన్న షాప్ లో ఏముంటే అవి తీసుకుని మార్కెట్ కి వెళ్లి వారం రోజులకి సరిపడేలా తీసుకుని వచ్చేయి అంటూ బైక్ కీ తీసుకుని వెళ్లారు.

ఆయన వెళ్లిన కాసేపటికి శిల్ప వచ్చింది. దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏంటి సంగతి రాత్రి బాగా ఆడుకున్నట్టు ఉన్నారు మొగుడు-పెళ్ళాం ఆట అని అడిగాను.
అవును రమ్య నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినప్పటి నుండి ఆయన తెగ ఆనందపడుతున్నారు. నిన్న, మొన్న అసలు వదలకుండా ఒక పనిగా పెట్టుకుని సుఖాలను అందించారు. ఎలాగో రాబోయే రోజుల్లో పొట్ట సైజు పెరిగితే చేసుకోవడానికి కష్టం అవుతుంది కదా. అందుకే దొరికినప్పుడే ఎంజాయ్ చేయాలని ఇప్పటి నుండే ముందు ఆలోచన చేశారు. నేను కూడా నిజమే కదా అనుకుని సుఖాలు అందిస్తూ సుఖపడుతున్నాను అంది. అందుకే లేవడం కాస్త ఆలస్యం అయ్యింది అంది.

అది అలా అనేసరికి మేము కూడా లేటుగా లేచాము లే అన్నాను.
అర్థమవుతూ ఉంది రమ్య, నీ కళ్ళు కూడా ఎరుపెక్కాయి కదా అంది. ఇంతకీ ఎక్కడ మీ ఆయన అంది.
మార్కెట్ కి వెళ్లారు అన్నాను. మీ ఆయన ఎక్కడ? ఉన్నారా వెళ్ళారా? అని అడిగాను.
ఆయన నాకన్నా ముందే లేచి రెడీ అయ్యి వెళ్లిపోయారు అంది.
ఇంతకీ డాక్టర్ దగ్గరికి వెళ్ళావా లేదా అని అడిగాను.
లేదు రమ్య, ఇంట్లోనే ప్రెగ్నెన్సీ కిట్ తో టెస్ట్ చేసుకున్నాను. ఒకటికి రెండు సార్లు చేశాను. నిన్న వెళదామని అనుకున్నాను కానీ కుదరలేదు. ఈరోజు నీతో వెళ్ళమని చెప్పి వెళ్లారు మా ఆయన.

4 Comments

  1. Can anyone suggest me best story in this website like incest, swapping or group sex

  2. కుటుంబం – read this story it’s awesome https://bit.ly/3w8cI4B

    1. Hi Priya we can go like that

Comments are closed.