పెళ్లి తరువాత..పెళ్లి ముందు..3 101

పార్టీ అయిపోయెంత వరకూ రమేష్ గాడు మమ్మల్నే గమనిస్తూ ఉన్నాడు. రూప తో దగ్గరగా కలిసి మెలిసి తిరుగుతూ ఉండడం, చనువుగా తనని ముట్టుకోవడం, తను కూడా నా మీద పడిపోతూ నవ్వడం లాంటివి చూస్తూనే ఉన్నాడు., అవ్వన్నీ చూస్తూ ఉండగా దాన్ని ఇంకా రెచ్చగొట్టాలనే ఉద్దేశం తో వాడి ఫ్రెండ్ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ను కలుపుకుని వాడి ముందు నన్ను బాడ్ చేయడం మొదలు పెట్టాడు. అదంతా తెలీని నేను మామూలుగానే రూప తో ఎప్పటిలా ఎలా ఉంటానో అలా ఉన్నా. పార్టీ అయిపోతూ ఉండగా నేనూ రూపా ఇద్దరం తినడానికి వెళ్ళాం. నేను చైర్ మీద కూర్చుని తింటూ ఉంటే తను నా ముందు నిలబడి నాకు మాటలు చెప్తూ తింటూ ఉంది. అలా తింటూ ఉండగా దూరంగా నిలబడి మా వైపే చూస్తున్న రూప అమ్మ నెమ్మదిగా మా దగ్గరికి వచ్చింది. వస్తూ తినేప్పుడు కూడా మాటలేనా మీకు అంది. రూప తన అమ్మ వంక చూస్తూ మాట్లాడితే ఏమైంది నీకు అంది. రూప అమ్మ నా పక్కన ఉన్న చైర్ లో కూర్చుంటూ నీకు చాలా ఎక్కువైందే, మీ నాన్న ఏం అనడం లేదు అనేగా ఇదంతా, ఉండు త్వరలోనే నీ కథ ఎంటో చూస్తా అంది. రూప అదేం పట్టించుకోకుండా ఏమైనా చేసుకోపో అన్నట్లుగా చూసి అంతలోనే ఎదో గుర్తొచ్చి నా వైపు తిరిగి తిన్నాక ఫోటోలు దిగుదామా, అలా అని అంటూ అక్కడ ఫోటోగ్రాఫర్ పెట్టిన పోస్టర్ ను చూపించి అంది. అందులో ఒక జంట డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో పెళ్లి ఫోటోలు తీయించుకుని ఉండడం కనిపించింది. అది చూసి నేను సమాధానం ఇచ్చే లోగా రూప అమ్మ రూప ను చూసి హా దిగు దిగు, తరువాత మీ నాన్న వచ్చి పల్లు రాలగొడతాడు అంది. వెంటనే రూప కోపంగా తన అమ్మ ను చూసింది. రూప అమ్మ నన్ను రూప ను ఇద్దరినీ చూస్తూ ముందు మీ ఇద్దరికీ దూరం పెంచాలి లేకపోతే మరీ ఎక్కువ చేస్తున్నారు అని అంది. అంతే వెంటనే రూప కోపంగా ప్లేట్ పక్కన పెట్టేసి., కూర్చున్న నా దగ్గరికి వచ్చి నా తొడ మీద కూర్చుంది. అలా కూర్చుని వాళ్ళ అమ్మ వంక చూసి ఈ మాత్రం దూరం చాలా అంది. రూప అమ్మ వెంటనే చుట్టూ చూసింది. అక్కడ పెద్దగా జనాలు ఎవ్వరూ లేరు. వెంటనే కోపంగా చిన్న పిల్లవా ? లేవ్వు ముందు అని అంది. రూప నేను లేవను అన్నట్లుగా చూసింది. రూప అమ్మ ఇంకా ఎదో అనేలోపు మా వైపు కు రూప అమ్మ ఫ్రెండ్ ఒకరు రావడం కనిపించింది. అంతే వెంటనే రూప అమ్మ రూపను చూసి నీ సంగతి ఉందిలే తరువాత అని అంటూ పైకి లేచి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ రూప ను చూసి కనీసం బయట వాళ్ళ ముందు అయినా మర్యాదగా ఉండు అని తన ఫ్రెండ్ రావడం చూపించి లేవమని ఇండైరక్ట్ గా చెప్తూ నవ్వు ముఖం పెట్టుకుని వస్తున్న తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళింది. అలా తన దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. ఇక్కడ రూప ఇంకా నా మీదే కూర్చుని ఉంది. అది చూసి రూప అమ్మ ఇది మారదు అని అనుకుంటూ తన ఫ్రెండ్ కు మేము కూర్చుంది కనిపించకూడదు అని తనని అటు వైపుకు తీసుకువెళ్ళింది.
అదంతా చూస్తున్న నేను రూప తో., ఆంటీ తో ఎందుకు గొడవ చెప్పు ? లేవొచ్చు గా ఏమవుతుంది అన్నా మెల్లగా. అంతే ఆ మాట కు రూప సర్రున తల వెనక్కి తిప్పి నా వంక చూసింది. నేను కోపంగా తల తిప్పి చూస్తున్న రూప ను చూసి కొంచెం వాయిస్ తగ్గించి రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా ఫేస్ పెట్టి..
అంటే, ఆంటీ ఫీల్ అవుతుంది కదా అని అన్నా.

2 Comments

  1. Next story epudu bro
    I love your story
    Thankyou

  2. Super ga vundi story , Manchi love feel vundi . Plz tondaraga update ivvaochuga.

Comments are closed.