పెళ్లి తరువాత..పెళ్లి ముందు..3 101

రూప అమ్మ నన్ను చూసి ఫ్రెష్ అయ్యి రాపో అని అంది. నేను సరే అంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చా. తను నన్ను పక్కన కూర్చో పెట్టుకుంది. మా అమ్మ నా వంకే చూస్తూ ఉంది రూప అమ్మ నాతో, నిన్న జరిగిన దానికి ఫీల్ అయ్యావ అంది. నేను లేదు ఆంటీ అన్నా. తను నన్ను చూసి తను చెప్పాలి అనుకున్నది చెప్పడం మొదలు పెట్టింది. నేను వయసులో ఉండడం ఇంకా రూప కూడా వయసులో ఉండడం, ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకోవడం ఇంకా నిన్న ఒకే బాత్రూం లో ఇద్దరం ఉండడం, పైగా రాత్రి తను నా మీద అలా కూర్చోవడం అన్నీ చెప్తూ వయసులో ఉన్నవాళ్లు ఇలా ఉండడం కరెక్ట్ యేనా ? చెప్పు అంది. నేను ఏం పలకలేదు తను ఇంకా కొన్ని సంఘటనలు చెప్తూ ఇలా మీ ఇద్దరూ ఈ వయసులో అలా ఉండడం ఏమైనా బాగుంటుందా చెప్పు అని అంది. నేను సైలెంట్ గా ఉండిపోయాను. మనసులో మాత్రం తనకు ఎదోకటి సమాధానం చెప్పాలి అని అనుకుంటున్నా. ఏం చెప్పాలి అని ఆలోచించు కుంటు ఉండగా అక్కడే నిలబడి నా వంక చూస్తున్న రమేష్ గాడు కనిపించాడు. నేను వాడ్ని చూసి తల వంచుకున్నా.
రూప అమ్మ నా మీద చేయి వేసి ప్రేమగా చూస్తూ నువ్వు పెద్దోడివి అవుతున్నావ్, వయసులో ఉన్నావ్ ఇలాంటి సమయాల్లో రూప తో ఒకే బెడ్ మీద పడుకోవడం ఒకే బాత్రూం లో ఉండడం, ఒకరి మీద ఒకరు పడడం లాంటివి చేయడం మంచిదేనా ? అంది. అలా అంటూ
మాకంటే మీరిద్దరి మీదా ఎలాంటి చెడు అభిప్రాయం లేకపోవచ్చు కానీ చూసే వాళ్ళకు ?
వాళ్లకు ఎలా ఉంటుంది చెప్పు ?
అందుకే చెప్తున్నా మీరిద్దరూ ఫ్రెండ్లీ గా ఉండండి తప్పు లేదు, కానీ హద్దే మీరకండి బాగుండదు..
పైగా మీరేదో తప్పుగా వ్యవహరిస్తారు అని కాదు కానీ కొంచెం అయినా పద్ధతిగా ఉండడం మనకూ చూసే వాళ్లకూ మంచిదే కదా, సమస్య వచ్చిన తరువాత కంటే అసలు సమస్యే రాకుండా చేసుకోవడం మంచింది కదా అని చెప్తున్నా అంది..
నేను మౌనంగా కూర్చుని ఉండిపోయా..
అది చూసి తను మెల్లగా, నేను చెప్పేది నీకు నచ్చక పోవచ్చు కానీ,వయసులో ఉన్నారు, చనువుగా ఉన్నారు, ఒకే బెడ్రూం లో పడుకుంటున్నారు, మేము ఈ మాత్రం అయినా చెప్పక పోతే ఎలా చెప్పు ? తనంటే మా మాట వినదు కనీసం నువ్వైనా వింటావ్ అని చెప్తున్నా..
మీరిద్దరికీ ఎలాంటి దురుద్దేశం లేదు అని నాకు తెలుసు కానీ వయసు ప్రభావం అనేది ఉంటుంది కదా, అది దాని ప్రభావం మీమీద చూపించినప్పుడు మీరు దాన్ని గుర్తించగలగాలి కదా అందుకే చెప్తున్నా ఈ జాగ్రత్త అంతే. నువ్వేం ఇంకా పిల్లోడివి కాదు, పెద్దొడివి అయ్యావ్ ఎవరితో ఎంతవరకు ఉండాలో కూడా నేర్చుకోవాలి, ఇప్పుడు నేను చెప్పేది నచ్చక పోయినా కూడా ఎందుకు చెప్తున్నానో అర్దం చేసుకో తరువాత నీ ఇష్టం, అంటూ సైలెంట్ అయిపోయింది.
అంతా వింటున్న నాకు ఏం చెప్పాలో తెలియలేదు. కానీ ఎదో ఒకటి చెప్పాలి లేక పోతే నాకూ రూప కు మధ్యలో ఒక గోడ కట్టేస్తారు అని మాత్రం అర్దం అయ్యింది. పైగా రమేష్ గాడు కూడా ఇక్కడే ఉన్నాడు. వాడికి ఇంకా ఎక్కువ అనుమానం. పైగా ఇలాంటివి అంటే అస్సలుకే నచ్చదు. అందుకే వెంటనే ఎదో ఒకటి చేసి వీళ్ళ నుండి మా ఇద్దరి బాండింగ్ ను కాపాడు కోవాలి అని అనిపించింది. ఒకవేల నేను ఇప్పుడు కానీ కాపాడు కొలేక పోతే నెక్స్ట్ ఇక ముందులా నేను రూప తో దగ్గరగా ఉండలేను. చనువుగా మాట్లాడలేను. ఎదో ఒకటి చెప్పి వీళ్ళ నుండి బయట పడాలి, ఎం చెప్పాలి ? ఎం చెప్పాలి ? అని అనుకుంటూ ఉన్నా.

2 Comments

  1. Next story epudu bro
    I love your story
    Thankyou

  2. Super ga vundi story , Manchi love feel vundi . Plz tondaraga update ivvaochuga.

Comments are closed.