రేయి surprise బాగుందా 1 182

అప్పుడు దారిలో విక్కి కీ ఒక పాతకాలం నాటి షిప్ కనిపించింది దాని మీద” గోల్డెన్ డక్ “అని రాసి ఉంది” ఆ షిప్ ఎవరిది “అని అడిగాడు విక్కి” అది RR&CO వాళ్ల 1st షిప్ సార్ బ్రిటిష్ వాళ్లు ఇండియా వదిలి వెళ్లే ముందు ఆ షిప్ నీ అప్పటి MRO అయిన రుద్ర రాయుడు కీ దాని గిఫ్ట్ గా ఇచ్చారు అంట సార్ అప్పటి నుంచి వాళ్ళకు బాగా కలిసి వచ్చింది అంట అప్పుడు మొదలు అయిన వాళ్ల నియంతృత్వం ఇప్పటికి కొనసాగుతోంది” అని చెప్పాడు టాక్సీ డ్రైవర్, విక్కి కీ ఎందుకో ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి అని అనిపించింది ఆ తర్వాత మధ్యాహ్నం కీ అరకు చేరుకున్నాడు కార్ దిగి తను వచ్చిన అడ్రసు what’s app లో మళ్లీ సరిగా చూసుకున్నాడు అప్పుడు తన ఎదురుగా ఉన్న పాలేస్ వైపు చూసి కొంచెం ఆశ్చర్య పోయాడు ఎందుకు అంటే ఆ పాలేస్ పైన “RR PALACE” అని రాసి ఉంది అలాగే ఆలోచిస్తూ లోపలికి వెళుతుండగా గేట్ దెగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది విక్కి నీ ఆప్పారు “సార్ మీ wedding card చూపించండి” అని అక్కడ ఉన్న సెక్యూరిటీ అతను అడిగాడు

అప్పుడు విక్కి “సార్ అంటే నేను పెళ్లి కూతురు ఫ్రెండ్ నీ తనే ఫోన్ చేసి రమ్మనింది wedding card ఇవ్వలేదు” అని చెప్పాడు సెక్యూరిటీ అతను విక్కి నీ చూసి తన Bluetooth తో ఏదో మెసేజ్ ఇచ్చాడు అప్పుడు గేట్ స్క్రీన్ మీద పూజా వీడియో వచ్చింది తను కన్ఫర్మామ్ చేశాక లోపలికి పంపారు “ఇది ఏమీ సెక్యూరిటీ రా బాబు “అని మనసులో తిట్టుకుంటు లోపలికి వెళ్ళాడు విక్కి తను లోపలికి వెళ్లగానే ఎదురుగా ఉన్న మెట్లు మీద నుంచి చేతులకు చెరో వైపు మెహందీ పెడుతూ వెనకాల జుట్టు సరి చేస్తూ ఒకరు డ్రస్ సరి చేస్తూ ఉండగా యువరాణి లాగా స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవకన్య లాగా వైభవంగా కిందకి వచ్చింది పూజా తనని అలా చూడగానే విక్కి చాలా సంతోషం వేసింది

మెట్లు దిగి విక్కి ముందు కు వచ్చిన పూజా “ఏంటరా అలా చూస్తూన్నావు” అని జుట్టు సరి చేసుకుంటూ అడిగింది పూజా “ఎంత ఎదిగి పోయావే అసలు నువ్వే నా అని నాకూ నమ్మకం కుదరడం లేదు ఏది ఏమైనా మొత్తానికి సాధించావ్” అని పూజా నీ మెల్లగ కౌగిలించుకొన్నాడు విక్కి అప్పుడే ఎవరో విక్కి బుజం మీద తటారు దాంతో వెనకు తిరిగాడు అప్పుడు విక్కి ఎదురుగా ఒక ఆరు అడుగుల ఎత్తు తెల్లని చర్మ చాయ కూడిన మొహం తో అర్మనీ సూట్ వేసుకొని ఒక యువకుడు నిలబడాడు” తను నా వైఫ్ అలా ఎవరూ పడితే వాళ్లు తన మీద చేయి వేయకుడదు” అని కొంచెం కఠినమైన గొంతు తో అన్నాడు “హే ప్రమోద్ స్టాప్ joking” అని వెళ్లి అతని పక్కన నిలబడింది పూజా, “విక్కి meet my fiance ప్రమోద్ and ప్రమోద్ he is my best friend విక్కి” అని పరిచయం చేసింది ప్రమోద్ నవ్వుతూ “సారీ బ్రో జోక్ చేశాను ఫీల్ అయ్యారు అనుకుంటా ” అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు “no problem బ్రో” అని విక్కి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు తరువాత ప్రమోద్ చుట్టూ చూసి ఒక అతని పిలిచాడు అతను రాగానే బుజం మీద చేయి వేసి దెగ్గర గా లాకుని “విక్కి ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ పేరు ప్రకాష్” అని పరిచయం చేశాడు విక్కి, ప్రకాష్ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచుకున్నారు ఆ తర్వాత ప్రకాష్, ప్రమోద్ ఎవరో పిలుస్తే వెళ్లారు అప్పుడు విక్కి పూజా వైపు తిరిగి

“అవునే నాకూ ఏదో surprise ఉంది అన్నావు ఎక్కడ” అని అడిగాడు అప్పుడు పూజా ఏదో చెప్పబోతుంటే వెనుక మెట్ల మీద నుంచి ఎవరో అమ్మాయి జారీ పడి పొత్తుంటే వెంటనే వెళ్లి ఆ అమ్మాయి నడుము పట్టుకుని బుజం కింద చేయి వేసి పట్టుకున్నాడు అప్పుడు చూశాడు ఆ అమ్మాయి మొహం ఆ అమ్మాయి భయం తో కళ్లు గట్టిగా మూసుకుని ఉంది ఆ అమ్మాయి నీ చూసిన వెంటనే “హే బేబి డాల్” అన్నాడు అంతే ఈ గొంతు ఎక్కడో విన్నటు ఉందే అని కళ్లు తెరిచింది విక్కి నీ చూసి “రేయి నువ్వా” అని తల కొట్టుకుంది అప్పుడు పూజా కింద నుంచి “రేయి surprise బాగుందా” అని అడిగింది