రేయి surprise బాగుందా 1 182

ఇది అంత విన్న ముగ్గురు ఒకే సారి నవ్వడం మొదలు పెట్టారు” ఏంటి ఇది లవ్ స్టోరీ ఆ “అని నవ్వుతూన్నాడు నిఖిల్, ప్రకాష్ నవ్వుతూ” బ్రో దీనికంటే నువు చెప్పక పోయి ఉంటే బాగుండు బ్రో “అని అందరూ నవ్వుతూంటే వినీత వెనక నుంచి వచ్చి విక్కి నీ కొంచెం పక్కకు రమ్మని అడిగింది

విక్కి కూడా లేట్ చేయకుండా వినీత వెనక వెళ్లాడు ఎవరూ లేని ఒక రూమ్ లోకి వెళ్లారు లోపలికి వెళ్లగానే వినీత విక్కి నీ hug చేసుకుంది “నిజం గా నేను అంటే అంత ఇష్టమా” అని అడిగింది “ఇప్పటికిప్పుడు నా ప్రాణం వదిలేయమంటే వదలడానికి నేను రెడీ గా ఉన్న” అని చెప్పాడు విక్కి “అయితే prove చేయి” అని అడిగింది వినీత వెంటనే విక్కి కిటికీ లో నుంచి బయటకు దుక్కాడు కానీ వినీత వాడి చేయి పట్టుకుని లోపలికి లాగింది తరువాత వాడిని గట్టిగా hug చేసుకుని “i love you” అని చెప్పింది “అయిన ఒక అమ్మాయిని అంత మంది ముందు ముద్దు ఆ అమ్మాయి వెనక వాల నాన్న ఉన్నాడు అని చూసుకోవా ఆ రోజు నాకూ నీ ముద్దు లో నువ్వు నను ఎంత కావాలి అని అనుకున్నావో తెలిసింది ఇప్పుడు నువు కార్చిచిన్న కన్నీటి లో నను ఎంత మిస్ అయ్యావో అర్థం అయింది నువు కిటికీ నుంచి దూకినపుడు నీ ప్రేమ తెలిసింది “అని గట్టిగా hug చేసుకుని i love you I love you I love you “అని చెప్పింది

విక్కి కూడా వినీత నీ గట్టిగా hug చేసుకున్నాడు ఆ తర్వాత వినీత walkie-talkie లో “మేడమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మీరు తొందరగా రండి ఓవర్” అని వినిపించగానే వినీత విక్కి నీ పక్కకు తోసి బయటకు వెళ్లింది విక్కి కూడా బయటకు వెళ్లాడు. తను ప్రోగ్రామ్ రూమ్ వైపు వెళుతుంటే అప్పుడు ప్రమోద్ ఎవరో అమ్మాయి తో కోపం గా మాట్లాడుతూ కనిపించాడు ఆ అమ్మాయి మాత్రం ప్రమోద్ మీద మీద పడి మాట్లాడుతూంది ప్రమోద్ ఆ అమ్మాయి నీ పట్టించుకోవడం లేదు ఆ తర్వాత ఏదో ఫోన్ వస్తే ఆ అమ్మాయి వెళ్లి పోయింది ప్రమోద్ కూడా వెళ్లిపోయాడు ఇది అంతా చూసినా విక్కి కీ ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని అర్థం అయింది

తరువాత విక్కి కూడా పార్టీ లోకి వెళ్లాడు అప్పుడు ప్రకాష్ వెనక నుంచి వచ్చి విక్కి నీ పిలిచాడు “విక్కి తను నా చెల్లి తార” అని పరిచయం చేశాడు అప్పటి వరకు విక్కి కీ అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని ఉన్న అనుమానం బలం అయింది

విక్కి తార కీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు కానీ తార మాత్రం పొగరు గా విక్కి చేయి నీ పక్కకు తోసి సెల్ ఫోన్ లో ఏదో చూసుకుంటూంది ప్రకాష్ దానికి విక్కి వైపు సారీ అని చూశాడు విక్కి కూడా పర్లేదు అన్నట్టు చూశాడు. అప్పుడు ఒక సారిగా పార్టీ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి అంతే పోలీస్ లు అంతా మొత్తం దారి క్లియర్ చేస్తూ నిలబడారు ఏమీ జరుగుతుందో అర్థం కాని విక్కి తలుపు వైపు చూశాడు. బాగా ఖరీదైన సూట్ వేసుకొని టీవీ గా నడుచుకుంటు వస్తున్నాడు ఒక అతను అతని పక్కనే మెడ లో ఒక డైమండ్ నెక్లేస్ వేసుకొని కాస్ట్లీ చీర కట్టుకుని నడుచుకుంటు వచ్చింది అతని భార్య. వాళ్ళని చూసి ప్రకాష్ వైపు తిరిగి “ఎవరూ బ్రో వాళ్లు” అని అడిగాడు “ప్రమోద్ వాళ్ల అమ్మ నాన్న వెంకట రాయుడు, షర్మిల రాయుడు ” అని చెప్పాడు ప్రకాష్

విక్కి : మినిస్టర్ రేంజ్ లో వస్తున్నారు కదా
ప్రకాష్ : వాళ్ల ఫర్మిషన్ లేనిదే ఈ వైజాగ్ చుట్టూ పక్కల ఒక ఉన్న హర్బర్ లో నుండి ఒక షిప్ బయటికి పోదు ఒక container దిగదు మొత్తం స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ దాకా వాళ్లకు కనెక్షన్స్ ఉన్నాయి
విక్కి : అవునా అంత పవర్ ఫుల్ ఆ మరి ఇంత పోలీస్ సెక్యూరిటీ ఎలా అని అడిగాడు
ప్రకాష్ : అక్కడ వాళ్ల వెనుక వస్తున్నాడే అతనే ACP శ్రీధర్ ఈ ఫ్యామిలీ కీ ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పోలీస్ ఈ సెక్యూరిటీ కోసం వినీత నీ పెట్టాడు