రేయి surprise బాగుందా 1 182

మరుసటి రోజు ఉదయం అందరు కలిసి అడవిలోకి ప్రయాణం అయ్యారు పూజా ప్రమోద్ విక్కి జీప్ లో వినీత కోసం వెయిట్ చేస్తున్నారు వినీత విక్కి తనని మొదటి సారి ముద్దు పెట్టుకున్నపుడు వేసుకున్న అదే డ్రెస్ వేసుకొని వచ్చింది వచ్చి విక్కి పక్కన కూర్చుంది వాళ్లను చూసిన ప్రకాష్ “మీ లవ్ బర్డ్స్ మధ్య లో నేను ఎందుకు మీరే వెళ్ళండి” అని డ్రాప్ అయిపోయాడు ప్రకాష్. తరువాత ప్రమోద్, పూజా ఫ్రంట్ లో కూర్చున్నారు విక్కి, వినీత వెనక కూర్చున్నారు కార్ కుదుపులకు విక్కి, వినీత ఒకరి మీద ఒకరు పడ్డారు అప్పుడు సడన్ గా కార్ ఆగింది ఎదురుగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి అందరూ దిగి అందులో ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడు విక్కి, వినీత వాటర్ ఫాల్స్ లో ఉండగా పూజా, ప్రమోద్ అలా వెళ్లి వస్తాం అని అడవిలోకి వెళ్లారు.

వినీత, విక్కి లేచి కార్ దగ్గరికి వెళ్లి డ్రస్ మార్చుకున్నారు తరువాత విక్కి కార్ ఇంజన్ మీద కూర్చున్నాడు అప్పుడే వచ్చిన వినీత వెళ్లి విక్కి ఒడిలో కూర్చుంది అప్పుడు చూస్తే సూర్యుడు అస్తమిస్తున్నాడు వీలు ఆ రొమాంటిక్ వాతావరణం లో ఒకరి పెదవులు ఒకరు జురుకున్నారు. అలా మరుసటి రోజు ఉదయం వరకు రెండు జంటలు ఆ అడవిలో ప్రణయ మదురిమలో తేలిపోయారు.

అలా రెండు రోజుల తరువాత పెళ్లి గణంగా జరుగుతోంది ప్రమోద్ పెళ్లి పీటల పైన కూర్చొని పూజలు చేస్తున్నాడు, ప్రకాష్ వచ్చిన గెస్ట్ లను రిసీవ్ చేసుకుంటున్నాడు, వినీత సెక్యూరిటీ పనులు చూసుకుంటూ బిజీ బిజీగా ఉంది ఇక్కడ పూజా రూమ్ లో రెడీ అవుతోంది తన దెగ్గర విక్కి, నిఖిల్ ఉన్నారు. పూజా మొహం లో ఏదో తెలియని భయం కనిపించింది విక్కి కీ “రేయి నాకూ ఈ పెళ్లి కరెక్ట్ ఏ అంటావా” అని సందేహం వ్యక్తం చేసింది పూజా దానికి విక్కి “నువ్వు ఏమీ భయపడొద్దు మేము అంతా ఉన్నాం” అని ధైర్యం చెప్పాడు అప్పుడే షర్మిల, వెంకట్ ఇద్దరు లోపలికి వచ్చి ఒక ఎర్రని పట్టు చీర పూజా కీ ఇచ్చారు “పూజా ఇది మా ఆచారం మా అమ్మమ్మ దగ్గరి నుంచి ఈ చీర కట్టుకుని పెళ్లి పీటల పైన కూర్చొని తాళి కట్టించుకున్నారు నువ్వు ఇదే చీర లో తయారు అయి రా “అని చెప్పి పూజా కీ ఆ చీర ఇచ్చాడు వెంకట రాయుడు పూజా ఆనందం గా ఆ చీర తీసుకుంది ఇంక తను చీర మార్చుకొని వస్తుంది అని అందరూ బయటికి వెళ్లారు ఒంటరిగా వదిలి.

అలా అందరూ ఎవరి పనుల్లో వాళ్లు ఉండగా పెళ్లి కూతురు నీ తీసుకురమ్మనీ చెప్పారు వెళ్లి చూస్తే పూజా రూమ్ లో లేదు అంతే కాకుండా ఆ రూమ్ కిటికీ విరిగి పడి ఉంది ఆ కిటికీ లో నుంచి బయటకు చూస్తే ఒక పాద ముద్ర కనిపించింది అది మనిషి పాదం కంటే 5 రేట్లు ఎక్కువ సైజ్ తో ఉంది.

ఆ పాద ముద్ర చూసిన వెంటనే వెంకట రాయుడు మొహం అంతా చెమటలు పట్టాయి అంతే కాకుండా షర్మిల కూడా తన చీర కొంగు తో మోహని తుడుచుకుంటుది, ఇది అంత గమనిస్తునే ఉన్నాడు విక్కి ఆ తర్వాత వినీత, విక్కి ఇద్దరు కిందకు వెళ్లి ఆ అడుగు తరువాత ఎక్కడ పడిందో తెలుసుకోవడానికి వెళ్లారు కానీ ఆ అడుగు తరువాత ఎక్కడ పడిందో చూస్తే ఇంకో 10 అడుగుల దూరం పడింది. ఆ తర్వాత మళ్లీ ఇంకో అడుగు కూడా అలాగే కనిపించింది కానీ తరువాత మాయం అయింది వాళ్ల ఇద్దరికి అసలు ఏమీ అర్థం కాలేదు అలాగే నడుచుకుంటు ముందు కు వెళ్లారు అక్కడ వాళ్ళకి ఏమీ దొరకలేదు ఇంతలో ఏదో జీప్ సౌండ్ వినిపిస్తే అట్టు వైపు చూశారు కానీ అంతలోనే ప్రమోద్ తన అమ్మ నాన్న తో పోలీస్ లతో అక్కడికి చేరుకున్నారు ప్రమోద్ మొహం లో ఏమి కంగారు భయం విక్కి కీ కనిపించలేదు.

అప్పుడే ACP శ్రీధర్ వచ్చి ప్రమోద్ నాన్న తో “సార్ మనం అనుకున్నటే జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమీ చేసినా ప్రయోజనం లేదు అనిపిస్తుంది కాబట్టి ఎంక్వయిరీ అంతా టైమ్ waste మీరు ఒక మాట చెప్తే కేసు ముసేస్తాం” అన్నాడు, దాంతో విక్కి కీ ఒక సారిగా కోపం కట్టలు తెంచ్చుకుంది “మీ పని మీరు చేయకుండా టైమ్ waste అని ఎలా చెప్తున్నారు అసలు ఇంత జరిగాక కూడా మీరు situation లో seriousness చూపించడం లేదు “అని ఒక సారిగా గట్టిగా అరిచాడు. అంతా విన్న శ్రీధర్” హలో బ్రదర్ నీకు అసలు ఏమీ జరిగిందో ఐడియా లేదు ఒక రాక్షసుడు నీ ఫ్రెండ్ నీ ఎత్తుకు పోయాడు” అని చెప్పాడు శ్రీధర్ చెప్పింది విని విక్కి కీ మళ్లీ మండింది” ఈ రోజులో రాక్షసులు ఏంటి డ్యుటీ చేయడం చాత్తా కాక చందమామ కథలు చెప్తున్నావ్” అని శ్రీధర్ షర్ట్ పట్టుకున్నాడు.