రేయి surprise బాగుందా 1 182

తార : hey what the hell are you doing
విక్కి : what the fuck you doing
తార : I am doctor నేను ఎమ్ చేయాలో నాకూ తెలుసు
విక్కి : అందుకే నా చిన్న స్క్రాచ్ కీ కుట్లు వేస్తున్నావు
తార : నీకు అంత తెలిస్తే నువ్వే చేసుకో అని కోపంగా వెళ్లిపోయింది

తన వెనకే ప్రకాష్ వెళ్లాడు అప్పుడు ప్రమోద్ పూజా కీ ointment పూసి బాండ్ ఎయిడ్ వేశాడు తరువాత ప్రమోద్ బయటికి వెళ్లాడు విక్కి, వినీత ఇద్దరు కలిసి పూజా దెగ్గర ఉన్నారు పూజా కొంచెం బాధ గా కూర్చుని ఉంది “సరే రెస్ట్ తీసుకొ మేము వెళ్లతాం” అని లేచ్చారు. అప్పుడు పూజా విక్కి చేయి పట్టుకొని ఏడుపు మొదలు పెట్టింది “ఎందుకు రా నాకే ఇలా జరుగుతుంది చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు తమ్ముడు డ్రగ్స్ కీ అలవాటు పడి జైలు లో బైల్ పైన తిరుగుతున్నాడు ఇప్పుడు పెళ్లి ఆగిపోయేలా ఉంది “అని ఏడుస్తుంది

వినీత పూజా నీ దెగ్గరి కీ తీసుకొని గుండేలకు హత్తుకుంది అప్పుడు విక్కి పూజా తల పైన చేయి వేసి” నీకు ఏమీ కాదు నేను ఉన్న గా ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది నేను జరిగేలా చూస్తా “అని ధైర్యం చెప్పాడు” నువ్వు పెళ్లి అయ్యే దాకా కాదు తరువాత కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా” అని అడిగింది “హే నువ్వు అడగాలా నేను ఇక్కడే ఉంటాను నాకూ కావాల్సింది ఇక్కడే ఉంది నేను ఎందుకు వేళ్లతా “అంటూ వినీత వైపు చూశాడు.

దాంతో పూజా కోపం తో వాడిని కొడుతు నవ్వడం స్టార్ట్ చేసింది” అది అలా నవ్వుతూ ఉండు పెళ్లి ఇంట్లో పెళ్లి కూతురు ఎడ్వకుడదు నువు రెస్ట్ తీసుకొ “అని చెప్పి వినీత వైపు చూసి బయటకు రా అని సైగ చేశాడు పూజా నీ వదిలేసి ఇద్దరు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత తలుపు మూసి వెళ్లుతున్న వినీత నీ చేయి పట్టుకుని మీదకు లాకున్నాడు “రేయి ఇప్పుడు నువు ఏమీ చేయొదు నాకు అసలు మూడ్ లేదు “అని తప్పించుకోని వెళ్లుతుంటే” అందుకు కాదే అసలు ఆ జోకర్ గాడు ఎవడు అంత సీన్ చేశాడు” అని అడిగాడు “వాడు వెంకట్ రాయుడు పెద్ద కొడుకు డబ్బు ఉంటే పిల్లలు పాడు అయిపోతారు అన్నడానికి perfect example వాడు వాడు ఒక పోయిన నెల ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసాడు నేను దానికి అని proofs కలెక్ట్ చేస్తే మా ACP గాడు అవి అన్ని ఫేక్ అని చెప్పి కాల్చేసాడు ఆ తర్వాత నను ఈ ఇంటికి కాపలా గా పెట్టాడు “అని కొంచెం బాధ పడింది విక్కి తనని దగ్గర గా తీసుకున్నాడు

” అవును మధ్యలో వాడు ఎవడు అదే పోలీస్ “అని అడిగాడు” ఓ రాజు ఆ వాడు ఒక అమాయక చక్రవర్తి వాడిని చూసి క్రిమినల్స్ కూడా భయపడ్డరు సరే ఇప్పుడు ఈ విషయాలు నీకు ఎందుకు “అని అడిగింది వినీత” ఏమీ లేదు అవును ఆ ACP నీ చూస్తే 10th ఫెయిల్ లా ఉన్నాడు వాడు ACP ఎలా” అని అడిగాడు “ఆదా 15 years క్రితం ఇక్కడ ఫారెస్ట్ లో సలీం భాయ్ అని ఒక గంజాయి మొక్కలను స్మగ్లింగ్ చేసే ఒక క్రిమినల్ ఉండేవాడు ఒక రోజు ఒక బిల్డింగ్ నీ తగ్గల బెట్టాడు ఆ రోజు ఇన్వెస్టిగెషన్ కీ వెళ్లిన ఆఫీసర్ దెగ్గర ఈ ACP ఒక కానిస్టేబుల్ ఆ ఆఫీసర్ నీ సలీం చంపేసాడు కానీ వాడిని ఈ ACP అరెస్ట్ చేశాడు దాంతో ప్రమోషన్ వచ్చి ACP అయ్యాడు తరువాత ఈ ఫ్యామిలీ హెల్ప్ తో ఇక్కడే పడివున్నాడు వాడికి చేతిలో చిల్లర పడక పోతే ముద్ద కూడా దిగదు వాడికి “అని వాడి చరిత్ర మొత్తం చెప్పింది.

” పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది పూజా రూమ్ లో రెడీ అవుతోంది అప్పుడు సడన్ గా అద్దం లో ఒక బారి శరీరం తో కళ్లు నిప్పుల కణం లా రగులుతూన్న ఒక రూపం పూజా మీదకు వచ్చి కమ్మేసింది” అంతే ఒక సారిగా గట్టిగా అరిచి లేచి కూర్చుంది పూజా బెడ్ మీద మొహం నిండా చెమ్మటలు కారుతున్నాయి ఆ అరుపు విన్ని బయట ఉన్న వినీత, విక్కి లోపలికి వెళ్లారు

పూజా అరుపులు విన్న విక్కి, వినీత లోపలికి వెళ్లారు దాంతో పాటు ప్రమోద్, ప్రకాష్ కూడా వచ్చారు “హే పూజా ఎమ్ అయింది” అని అడిగాడు విక్కి పూజా ఇంకా షాక్ లోనే ఉండి ఎవరూ ఏమీ అడిగిన పిలిచిన పట్టించుకోవడం లేదు అప్పుడు ప్రమోద్ పూజా పక్కన కూర్చుని దగ్గర గా తీసుకొని అడిగాడు “ఎమ్ అయింది పూజా” అని అడిగాడు. అప్పుడే ప్రమోద్ అమ్మ నాన్న లోపలికి వచ్చారు “ఏమీ జరిగింది” అని అడిగారు పూజా తన మొహం పైన అంటుకున్న చెమట తుడుచుకుంటు “ఒక బారి శరీరం ఉన్న ఒక రూపం నను ఎత్తుకు వెళ్లినట్లు కళ వచ్చింది” అని భయపడుతు చెప్పింది. పూజా మాటలు విన్న ప్రమోద్ అమ్మ నాన్న మొహం లో ఏదో తెలియని అలజడి మొదలైంది అది అంత మౌనంగా గమనించాడు విక్కి.

కానీ వాళ్ల కంగారూ ఆప్పుకుని పూజా వైపు చూశారు షర్మిల వెళ్లి పూజా పక్కన కూర్చుని ఆప్యాయంగా తల నీమురుతు” అమ్మ పూజా నువ్వు ఇందాక జరిగిన గొడవకు బాగా దిగులు పెట్టుకున్నావ్ ఎమ్ భయపడదు మేము అంతా ఉన్నాం కదా” అని చెప్పింది పూజా ఏదో మాట్లాడబోతే తనని ఆపి “నువ్వు ఏమీ మాట్లాడవద్దు కావాలి అంటే ఈ రోజు ప్రమోద్ నీతో ఇక్కడే ఉంటాడు నీకు తోడుగా కాబట్టి హాయిగా నిద్రపో” అని చెప్పి వెళ్లి పోయారు ఇద్దరు ఆ తర్వాత విక్కి, వినీత, ప్రకాష్, ప్రమోద్ పూజా దగ్గరే ఉన్నారు కొద్ది సేపు అప్పుడు విక్కి కీ ఒక ఆలోచన వచ్చింది “అందరూ బాగా డల్ అయిపోయారు పెళ్లి ఇంట్లో ఇలాగే ఉంటార అందుకే నేను ఒక ప్లాన్ వేశాను “అని చెప్పాడు అందరూ విక్కి వైపు చూసి ఏంటి అని సైగ చేశారు.

“మనం అందరం కలిసి రేపు బయటికి వెళ్లదాం సరదాగా సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి వద్దాం” అని చెప్పాడు దానికి వినీత “పిచ్చా నీకు బయటకు వెళ్లితే ఎంత రిస్క్ తెలుసా నీకు నేను ఒప్పుకోను ప్రమోద్ సార్ అసలు ఒప్పుకోరు” అని వినీత మాట పూర్తి చేసే లోపే “చాలా బాగుంది వెళ్లదాం” అని ప్రమోద్ విక్కి కీ వత్తాసు పలికాడు.

దానికి షాక్ అయిన వినీత ప్రమోద్ తో “సార్ ఇప్పుడు మీరు బయటికి వెళ్లాలి అంటే ఎంత సెక్యూరిటీ ప్రాబ్లమ్ తెలుసా మీకు” అని నచ్చచెప్పింది. దానికి ప్రమోద్ “అయితే సెక్యూరిటీ లేకుండా ఎవరికి తెలియకుండా వెళ్లదాం ఇది నా ఆర్డర్ no more arguments” అని కరాకండి గా చెప్పాడు ప్రమోద్ దానికి వినీత ఇంక సరే అన్నట్లు తల ఊప్పింది. “అలా అయితే రేపు పొద్దున్న అందరూ కలిసి వెనుక ఫారెస్ట్ లోకి వెళ్లే గేట్ వైపు రండి” అని చెప్పాడు ప్రమోద్