రేయి surprise బాగుందా 2 100

అలా ఫోటోలు ఒక దాని తర్వాత ఒకటి చూస్తుంటే విక్కి కీ ఒక ఫోటో కనిపించింది అందులో పూజా ఒక అబ్బాయి తో lip to lip కిస్ పెట్టుకుంది అంతే కాకుండా అలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి ఇంకో ఫోటోలో ప్రమోద్, పూజా, ఆ అబ్బాయి ముగ్గురు ఉన్నారు అంతే కాకుండా పూజా ఆ అబ్బాయి ఆ ఫోటో లో engagement రింగ్ మార్చుకున్నారు, అంతే కాకుండా ఆ సూట్కేస్ లో సగం కాలిపోయిన డైరీ దొరికింది అది తెరిచి చూస్తే “అజయ్ i love you and I really miss you నేను చేసేది తప్పే కానీ తప్పడం లేదు నేను ఈ పెళ్లి చేసుకోక తప్పదు నను క్షమించు” అని రాసింది పూజా దాంతో ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు అజయ్ అని విక్కి కీ అర్థం అయింది.

అంతే దొరికిన సాక్ష్యం తో బయటకు వచ్చాడు విక్కి అలా తన రూమ్ వైపు వెళుతున్న విక్కి నీ సెక్యూరిటీ వాళ్లు ఆపి “సార్ ఇంక నుంచి మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు కాబట్టి మీరు ఇప్పుడే ఈ పాలెస్ వదిలి వెళ్లిపోవాలి అని మేడమ్ చెప్పారు” అని విక్కి luggage అతని చేతికి ఇచ్చి బయటకు పంపారు, బయటకి వచ్చిన తర్వాత విక్కి ప్రమోద్ రూమ్ వైపు చూశాడు తార ప్రమోద్ ఇద్దరు ఒకరి కౌగిలి లో ఒక్కరూ అతుకుపొయి ముద్దుల సమరం చేస్తున్నారు

తార ప్రమోద్ నీ అలా చూసేసరికి విక్కి మొహం లో రంగులు మారిపోయాయి, తరువాత సెక్యూరిటీ వాళ్లు రావడం చూసి బయటికి నడిచాడు. అప్పుడే వినీత వచ్చి విక్కి ముందు పోలీస్ కార్ ఆపి నాకూ” 3 డేస్ లీవ్ కావాలి అంటే వైజాగ్ లో నా ఫ్లాట్ లో ఉండొచ్చు నువు” అని ఎక్కించుకోని వెళ్లింది తన ఫ్లాట్ కీ. కానీ విక్కి మొహం లో ఉన్న విచారం అర్థం అయింది వినీత కు “విక్కి మనం ఇప్పుడు ఏమీ చేయలేము పూజా పోయింది కానీ తనని ఎలా కనిపెట్టాలో కూడా మనకు తెలియదు అంతే కాకుండా ఇప్పుడు నిఖిల్ ఎక్కడ ఉన్నాడో ముందు తెలుసుకోవాలి లేక పోతే వాడి ఆవేశం కీ చాలా దారుణాలు జరుగుతాయి” అని చెప్పింది, అప్పుడు గుర్తు వచ్చింది విక్కి కీ మొన్న రాత్రి గోడవ జరిగిన దగ్గరి నుంచి నిఖిల్ కనిపించడం లేదు, అలాగే పూజా అన్న ఒక మాట గుర్తు వచ్చింది” నిఖిల్ కీ ఎప్పుడు కోపం భాధ వచ్చిన వాడు సలీం బార్ లో ఉంటాడు “అని పూజా చెప్పిన మాట గుర్తుకు వచ్చింది

ఆ వెంటనే వాళ్లు హర్బర్ దెగ్గర ఉన్న ఆ బార్ వైపు వెళ్లారు కానీ దారిలో వాళ్ళకి నిఖిల్ ఎవరో జీప్ అతనితో గోడవ పడుతూ కనిపించాడు, వీలు కార్ దిగి వెళ్లారు ఆ జీప్ డ్రైవర్ నిఖిల్ నీ గుద్దాడు అని గోడవ జరుగుతుంది, విక్కి ఆప్పడానికి చూసిన వాళ్ళు ఆప్పలేదు కానీ సడన్ గా మంత్రం వేసినట్లు. అందరూ పారిపోయారు ఎందుకు అంటే అక్కడికి ఆ ఏరియా రౌడీ సలీం భాయ్ వచ్చాడు అతని చూసి డ్రైవర్. పారిపోతూంటే నిఖిల్ పట్టుకున్నాడు వాడిని గట్టిగా “ఎందుకు వీడని చంపాలి అని చూశావ్” అని అడిగాడు దాంతో అందరూ షాక్ అయ్యారు కోపంతో వాడిని లాగి ఆ జీప్ బార్నెట్ కీ వేసి కోడితే “సార్ ఇది అంతా ఆ ప్రమోద్ చేయించాడు” అని చెప్పాడు, దాంతో నిఖిల్ కోపంతో ప్రమోద్ కోసం పాలెస్ కి బయలుదేరాడు, కానీ నిఖిల్ కీ తెలియని విషయం ఆ డ్రైవర్ విక్కి కీ చెప్పాడు.

దాంతో విక్కి, వినీత ఇద్దరు కలిసి అరకు వైపు వెళ్లారు వాళ్లు 1 గంట లో అరకు చేరుకున్నారు తరువాత ఆ డ్రైవర్ చెప్పిన దారిలో వాళ్లు పూజా నీ వేతకడానికి వెళ్లారు

1 Comment

  1. Good

Comments are closed.