రేయి surprise బాగుందా 2 100

“అరెరె మా పిన్ని కీ నీ మీద ఎంత నమ్మకం వచ్చింది బ్రో నీ దొంగ మొహం దానా చావు” అని మళ్ళీ 2 బుల్లెట్ లు షర్మిల గుండెల్లో దింపి ఒక క్రూరమైన నవ్వు నవ్వుతూ పూజా వైపు చూశాడు పూజా భయం తో విక్కి వెనుక వణికి పోతుంది “మై డియర్ పూజా ఒక సారి నువ్వు బయటికి వస్తే నీ కడుపులో పెరుగుతున్న ఆ విష శిశువు నీ మాత్రమే చంపుతా లేదు అంటే నిన్ను చంపాలి లేట్ చేయకు మర్యాదగా బయటికి రా” అని గన్ లో బుల్లెట్స్ చూసుకుంటున్నాడు రాజు అదే రైట్ టైమ్ అనిపించింది విక్కి కీ వెంటనే పక్కన ఉన్న కుర్చీ తీసుకొని ఎగిరి రాజు పైకి దుక్కాడు అప్పుడే గన్ లోడ్ చేస్తున్నా రాజు అది గమనించలేదు, కుర్చీ ఒక సారిగా రాజు తల పైన పడే సరికి రాజు కూడా నెలకు ఒదిగాడు అతని చేతిలో ఉన్న గన్ కూడా జారీ వెళ్లి ఎక్కడో పడింది.

అలా రాజు, విక్కి పొట్టా పొట్టి గా తలపడారు ఆ తర్వాత విక్కి కొంచెం పై చేయి చూపించాడు ఆ తర్వాత రాజు నీ ఒక గోడకి అణిచి గొంతు పట్టుకుని అడిగాడు “చెప్పు అసలు తార నీ ఎందుకు చంపావ్” అని అడిగాడు విక్కి, దానికి రాజు పిచ్చి ఏక్కినటు నవ్వుతూ “వాహ్ ఏమీ బుర్ర రా నీది నేనే దాని చంపా అని ఎలా తెలిసింది నీకు” అని అడిగాడు “మోన్న రాత్రి పాలేస్ లో ఉన్న సెక్యూరిటీ కెమెరా లు చెక్ చేస్తే నువు తార ప్రమోద్ చనిపోయిన రోజు సాయంత్రం ఇద్దరు కలిసి వెళ్లినట్లు రికార్డు అయింది” అని చెప్పాడు విక్కి,

“తార నీ నేను చంపాలి అని అనుకోలేదు ఎందుకంటే నేను అది ప్రేమించుకున్నాం, అది అంటే నాకూ ప్రాణం అందుకే ఆ రోజు వాళ్లు దాని రేప్ చేశారు అని తెలిసాక వాళ్ల చావులు నా చేతిలో అని ఫిక్స్ అయ్యా అందుకే నీ నిచ్చపు ఫ్యామిలీ లోకి పూజా లాంటి మంచి అమ్మాయి వెళ్లకుండా ఉండాలి అనే ఆ రోజు షర్మిల సలీం కాకా తో పూజా నీ చంపేయమ్మంటే నేనే కిడ్నాప్ చేయించి దాని దాచిపెట్టా ఆ తర్వాత పూజా బ్రతికే ఉంది అని తెలిస్తే danger అని తన చేతి ముద్రలు ఉన్న కత్తి నేను ప్రమోద్ డెడ్ బాడి దగ్గరే వదిలేశా తరువాత తార నీ నేను ముంబాయి పంపిదాం అనుకున్న కానీ అది నాకూ నా అన్నయ్య కూడా కావాలి అని ఏడుపు మొద్దులు పెట్టింది అది ఇక్కడే ఉంటే రిస్క్ అని దాని చంపక తప్పలేదు “అని చెప్పాడు,” మరి రమేష్ నీ ఎందుకు చంపావు “అని అడిగాడు విక్కి” ఆ బాంబ్ నా బాబు, ఆ దొంగ మొహం దాని కోసం పెట్టించా కానీ ఆ తాగుబోతు నా కొడుకు మధ్యలో వచ్చి మొత్తం నాశనం చేశాడు “అని చెప్పాడు రాజు.

అప్పుడు రాజు తన జేబులో ఉన్న ఒక చిన్న బ్లేడ్ తీసుకొని విక్కి చేతి మీద గీసాడు దాంతో విక్కి వాడిని వదిలేశాడు ఆ తర్వాత రాజు కింద ఉన్న గన్ తీసుకొని పూజా తల మీద పెట్టాడు, అప్పుడు విక్కి ముందుకు అడుగు వేస్తుంటే రాజు గన్ తో విక్కి ఎడమ బుజం పైన కాల్చాడు

రాజు కాల్చిన బుల్లెట్ వేగంగా వెళ్లి విక్కి ఎడమ బుజం కీ తాకి ఆ బుల్లెట్ తగిలిన వేగం లో వెనకు ఎగిరి పడ్డాడు, అలా ఎగిరి పడిన విక్కి అక్కడ ఉన్న గోడకి తగిలి స్పృహ కోల్పోయాడు, కానీ రాజు అన్న ఒక మాట మాత్రం అతని చెవులో ప్రతి ధ్వనిస్తునే ఉంది “ఈ కథ ఎక్కడ మొదలు అయిందో అక్కడే శాశ్వతంగా ముగిస్తాను” అని రాజు పూజా నీ లాకుని వెళ్లాడు, బుల్లెట్ గాయం తో నెలకు ఓదిగిన విక్కి నిస్సహాయం గా పడి ఉన్నాడు అలా ఒక అర గంట సేపు అలాగే పడి ఉన్నాడు విక్కి, ఆ తర్వాత ఎవరో తన మొహం మీద నీళ్లు చల్లడం తో లేచి కూర్చున్నాడు, అప్పుడు వినీత ఏడుస్తు విక్కి నీ గట్టిగా హత్తుకుంది” మీరు ఇక్కడి కీ ఎలా వచ్చారు” అని కొంచెం నొప్పితో బాధపడుతూ అడిగాడు విక్కి.

“నీతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే సడన్ గా గన్ సౌండ్ వినీ భయం తో వీళ్లని తీసుకొని వచ్చా” అని చెప్పాడు ప్రకాష్, తరువాత అందరూ కార్ లో రాజు నీ పట్టుకోవడానికి బయలుదేరారు “వాడు అక్క నీ ఎక్కడికి తీసుకువెళ్లి ఉండొచ్చు “అని కంగారూ గా అడిగాడు నిఖిల్ అప్పుడు రాజు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి విక్కి కీ” ఈ కథ ఎక్కడ మొదలు అయిందో అక్కడే ముగిస్తాను అని రాజు చెప్పాడు అంటే వాడు పూజా నీ ఎక్కడికి తీసుకువెళ్లి ఉంటాడు” అని అడిగాడు విక్కి “పాలెస్ కీ తీసుకువెళ్లి ఉంటాడా “అని అడిగాడు ప్రకాష్ “నో వాడు అక్కడికి తీసుకువెళ్లి ఉండడు కచ్చితంగా అడవి లో ఉన్న గెస్ట్ హౌస్ లో చంపడానికి ప్లాన్ చేసి ఉంటాడు “అని చెప్పింది వినీత.

కానీ విక్కి కీ రెండు కాదు ఏదో ఉంది అని ఆలోచిస్తే అప్పుడు అతనికి బుర్ర లో వచ్చిన పేరు” గోల్డెన్ డక్ “, దాంతో” హే ఈ కథ అంతా మొదలు అయింది ఆ షిప్ వల్ల గోల్డెన్ డక్ ఆ షిప్ వచ్చాకే వీళ్ల లైఫ్ మారింది, అంతే కాదు రాజు intention ఈ కుటుంబం లో చిన్న జ్ఞాపకం కూడా వదలకుండా నాశనం చేయడం అందుకే వాడు ఆ షిప్ తోనే ఈ కథ నీ ముగించాలి అనుకున్నాడు” అని చెప్పాడు విక్కి దాంతో అందరూ అదే correct అనుకోని పోర్ట్ వైపు వెళ్లారు, అప్పటికే రాజు అక్కడ పోర్ట్ లో పూజా నీ షిప్ లో పడేసి ఒక బాగ్ నిండా ఉన్న Grenades jacket నీ తీసి అది బలవంతంగా పూజా కీ వేశాడు అప్పుడే ప్రకాష్ కార్ తో వేగంగా పోర్ట్ లోకి దూసుకొని వచ్చాడు ఆ వెంటనే వినీత, తన దెగ్గర ఉన్న 3 గన్ లు ఒకటి నిఖిల్ కీ, ఇంకోటి, విక్కి కీ ఇచ్చింది “జాగ్రత్తగా ఉండాలి అందరూ వాడు అసలే సైకో ఎమ్ చేస్తాడో తెలీదు అంతేకాకుండా పూజా ఏ పరిస్థితుల్లో ఉందో కూడా తెలీదు” అని చెప్పి కిందకి దిగింది వినీత.

1 Comment

  1. Good

Comments are closed.