రేయి surprise బాగుందా 2 100

ఇంతలో విక్కి కీ ఇంకో మెసేజ్ వచ్చింది “Hope you like the gift my friend” అని ఉంది కోపం లో ఫోన్ తీసి నేలకు వేసి కొట్టాడు.

ఆ తర్వాత అందరూ సలీం బార్ కీ వెళ్లారు ప్రకాష్ కోపం లో ఎంత తాగుతున్నాడో తెలియకుండా తాగుతున్నాడు, నిఖిల్ కూడా అలాగే తాగుతూ ఉన్నాడు విక్కి మాత్రం అసలు ఏమీ జరుగుతుందో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాడు, అప్పుడే వాళ్ల టెబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు సలీం భాయ్ “తమ్ములారా మీ ప్రశ్నలకు సమాధానం మొత్తం RR పాలేస్ లోనే దొరుకుతుంది ఈ వైజాగ్ చుట్టూ ఉన్న అని ప్రాంతాల్లో నాకూ భయపడతారు కానీ నేను భయపడేది ఆ రాయుడు కుటుంబానికి ఎందుకంటే వాళ్లు ఒక సైగ చేసిన నా పని అయిపోతుంది, మీకు ఇంకా ఒక విషయం చెప్పాలి అంటే పూజా నీ కిడ్నాప్ చేసింది రాక్షసుడు కాదు అది అంతా ఆ షర్మిల ఆడించిన నాటకం 3 సంవత్సరాల క్రితం రమేష్ బాబు కూడా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇంటికి వచ్చిన మరుసటి రోజే ఆ అమ్మాయి శవం అడవిలో తేలింది అంటే ఆ ఇంట్లోకి వెళ్లే దైర్యం బయట వాడికి లేనప్పుడు ఆ ఇంట్లో వాళ్లే చేయాలి కదా “అని చెప్పాడు సలీం

” ఇది అంతా మాకు ఎందుకు చెప్తున్నావ్ ” అని అడిగాడు విక్కి” నిఖిల్ నా దెగ్గర చిన్నప్పటి నుంచి పని చేస్తున్నాడు కాబట్టి మీకు ఈ మాట చెప్పడం వరకే నేను చేయగల సహాయం “అని లేచి వెళ్లిపోయాడు, సలీం భాయ్ వెళ్లి పోగానే వీలు ముగ్గురు” RR & CO ” కంపెనీ ఆఫీసు కు వెళ్లారు ప్రకాష్ నీ చూసి సెక్యూరిటీ వాళ్లు వాళ్ల ముగ్గురిని లోపలికి పంపారు అక్కడ కంపెనీ డైమండ్ జుబ్లీ ఫంక్షన్ జరుగుతుంది వీలు కూడా వెళ్లి గుంపు లో కలిసి పోయారు వచ్చిన vip లు రాయుడు నీ, షర్మిల నీ పొగడ్తలతో ముంచేతారు కానీ సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడో స్టేజ్ మీదకు దూసుకొని వచ్చాడు రమేష్

“వీలు గోపోలు కారు కన్న కొడుకు చచ్చి పోయిన పట్టించుకోవడం మానేసి ఇక్కడ ఫంక్షన్ లు చేసుకుంటున్నారు వీలు మీకు దేవులు ఏమో కానీ సొంత కొడుకు కోడలు నీ చంపే కిరాతకులు “అని రమేష్ మాట పూర్తి అయ్యే లోపే ఒక పెద్ద బాంబ్ రమేష్ కింద పేలింది అంతే ఒక సారిగా గాలి లోకి ఎగిరి అంతే వేగం లో వచ్చి నేలకు తాకింది రమేష్ శరీరం.

రమేష్ శరీరం నెలకు తాకి నుజ్జు నుజ్జు అయింది అది చూసి ఎక్కడి అక్కడ ఉన్న జనాలు అంతా చెల్లా చెదరు అయ్యారు, కానీ అంత జరిగిన కూడా వెంకట రాయుడు, షర్మిల కు చీమ కట్టినట్లు కూడా అనిపించలేదు రమేష్ శవం జనాలా తొక్కిసలాట లో ఉన్న కూడా వాళ్లు మాత్రం కార్ లో ఇంటికి వెళ్లిపోయారు విషయం తెలిసి వినీత అక్కడ ఎంక్వయిరీ కీ వచ్చింది తనతో పాటు రాజు కూడా వచ్చాడు రాజు మొత్తం ప్రెస్ వాళ్లు రాకుండా చూస్తున్నాడు జరిగేది ఎంత ఏదో వింత గా పక్క ప్లాన్ ప్రకారం జరుగుతుంది అని అర్థం అయింది విక్కి కీ forensic వాళ్లతో శ్రీధర్ కూడా అక్కడికి చేరుకున్నాడు.

శ్రీధర్ రావడం రావడంతో అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళని బయటికి పంపేసి క్రైమ్ సిన్ లో తను మాత్రమే ఉండి మొత్తం చూసుకుంటున్నాడు విక్కి మాత్రం వాడు ఏదో దాచడానికి చూస్తున్నాడు అని అర్థం అయింది, శ్రీధర్ కీ ఫోన్ రావడంతో పక్కకు వెళ్లాడు అప్పుడు విక్కి వినీత తో “బేబి డాల్ చిన్న హెల్ప్ చేయి ఆ forensic వాళ్లను ఎలాగైనా పక్కకు తప్పించు ఆ శ్రీధర్ కచ్చితంగా ఏదో ఒక ప్లాన్ లో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న ఏదో ఒకటి మనకు ఉపయోగపడుతుంది please” అని అడిగాడు
“విక్కి ఇది చాలా డేంజర్ స్టెప్ నా జాబ్ పోతుంది లేదా జైలు కూడా పోవచ్చు” అని చెప్పి కొద్ది సేపు ఆలోచించి “సరే నీకోసం చేస్తాను” అని చెప్పి forensic వాళ్లను కొంచెం పక్కకు తీసుకుని వెళ్లింది.

విక్కి కరెక్ట్ గా మైక్ పెట్టిన స్పాట్ కింద చూశాడు అప్పుడు అక్కడ ఒక విచిత్రమైన ప్లేట్ కనిపించింది ఏంటి అని చూస్తే అది వైట్ మెషిన్ దాని కింద బాంబ్ కీ సంబంధించిన బాటేరి వైర్ లు ఉన్నాయి అప్పుడే శ్రీధర్ వచ్చి విక్కి చేతిలో ఉన్న ఆ ప్లేట్ లాకున్నాడు “ఇలా ఎవిడెన్స్ నీ దొంగతనం చేయడం తప్పు మిస్టర్ జర్నలిస్ట్” అని అరెస్ట్ చేయబోయే టైమ్ లో వినీత శ్రీధర్ తల కీ గన్ పెట్టి విక్కి కీ ప్లేట్ ఇచ్చి పారిపొమ్మని చెప్పింది, విక్కి పారిపొతుంటే పోలీస్ లు firing మొదలు పెట్టారు అప్పుడే ప్రకాష్ కార్ లో ఫాస్ట్ గా వచ్చి విక్కి నీ ఎక్కించుకొని కాపాడాడు.

తరువాత వినీత శ్రీధర్ నీ అడ్డుపెట్టుకొని తప్పించుకుంది, కార్ నీ సరాసరి సలీం భాయ్ బార్ కీ పోనీ ఆనాడు నిఖిల్, ఎందుకంటే సలీం కీ బాంబులు మీద మంచి పట్టు ఉంది అని చెప్పాడు దాంతో సలీం దగ్గరికి వెళ్లారు, సలీం భాయ్ ఆ ప్లేట్ నీ బాగా చూసి “ఇది కచ్చితంగా బయటి వాళ్ల పని కాదు అంతేకాకుండా ఇది రమేష్ కోసం పెట్టిన బాంబ్ కాదు” అని చెప్పాడు ముగ్గురు ఒకరి మెహలు ఒకరు చూసుకున్నారు
దాంతో ఆ ప్లేట్ నీ చూపించాడు అక్కడ 140 kgs దెగ్గర మార్క్ వేసివుంది అంటే ఇద్దరు మనుషులు నిలబడితే వచ్చే తూకం తో ప్లాన్ చేసారు కానీ రమేష్ ఒక్కడి వైట్ 140 kg లు దాంతో రమేష్ ఆ స్పాట్ లో నిలబడి ఉండటం తో రమేష్ బరువు వల్ల ఆ బాంబ్ ముందే పేలింది.

1 Comment

  1. Good

Comments are closed.