రేయి surprise బాగుందా 2 100

అంతే అందరూ లైట్ హౌస్ వైపు పరిగెత్తారు కానీ అక్కడ సలీం లేడు అప్పుడు అవతలి ఒడ్డు దెగ్గర ఇంకో లైట్ హౌస్ కనిపించడం తో వాళ్లు ఒక స్పీడ్ బోట్స్ తో అక్కడికి వెళ్లారు పైకి ఏకుతుంటే అందరూ విక్కి నీ అడిగారు అసలు ఏమీ జరిగింది అని” పూజా ఒక red skull tattoo చూశాను అని చెప్పింది కదా అది సలీం చేతి మీద నిన్న రాత్రి చూశాను” అని చెప్పాడు అంతే వాళ్లు టాప్ ఫ్లోర్ కీ వెళ్లే సరికి సలీం ఒక కాంబాట్ గన్ తో కాలుపులు మొదలు పెట్టాడు కానీ అప్పటికే వినీత తన గన్ తో సలీం చేతి మీద కాల్చింది దాంతో సలీం గన్ కింద పడేశాడు.

అప్పుడు వినీత సలీం తల కీ గన్ ఎక్కు పెట్టి నిలబడి ఉండగా విక్కి అడగడం మొద్దలు పెట్టాడు “అసలు పూజా నీ ఎందుకు కిడ్నాప్ చేశావ్ ఎవరూ చేయమన్నారు” అని అడిగాడు దానికి సలీం కొంచెం ఓపిక తెచ్చుకోన్ని చెప్పడం మొదలు పెట్టాడు “నాకూ డీల్ ఇచ్చింది షర్మిల అంతకు ముందు కూడా రమేష్ భార్య నీ చంపినది నేనే ఇప్పుడు పూజా నీ కూడా చంపడానికి కిడ్నాప్ చేయలేదు, పూజా నీ జాగ్రత్తగా దాచడానికి అలా చేయమని నాకూ ఒకడు చెప్పాడు పూజా నీ చంపవద్దని చెప్పాడు” అని అలా చెప్తూ తన ఇంకో చేత్తో పక్కన ఉన్న గన్ తీసుకోబోతుంటే అప్పుడు ముందు నుంచి గన్ పేలిన శబ్దం వచ్చింది అప్పుడు ఒక బుల్లెట్ వచ్చి సలీం గుండెల్లో దిగింది ఎవరూ కాల్చింది అని అందరూ వెనకు చూస్తే రాజు ఉన్నాడు.

రాజు కంగారు గా వచ్చి” ఎవరికి ఏమీ కాలేదు కదా అయిన అంతా అజాగ్రత్తగా ఉంటే ఎలా వాడు గన్ తో కాల్చే వాడు” అని కొద్దిగా కంగారు గా చెప్పాడు “అసలు నువ్వు ఇక్కడ ఏమీ చేస్తున్నావ్” అని అడిగింది వినీత “ఎవరో నలుగురు వాళ్ల బోట్స్ ఎత్తుకొని వచ్చారు అని బార్ కీ వచ్చిన నాకూ అక్కడ ఉన్న మత్స్యకారులు చెప్తే ఇలా వచ్చాను “అని చెప్పాడు” ఉన్న ఒక clue కూడా పోయింది” అని విక్కి కోపంతో ఊగి పోతున్నాడు అప్పుడే రాజు ఫోర్స్ కోసం ఫోన్ చేయడానికి పక్కకు వెళ్లాడు అప్పుడు సలీం చేతి కింద ఏదో రాసి ఉంది ఏంటి అని ప్రకాష్ వెళ్లి చూశాడు
” షర్మిల బెడ్ రూమ్ “అని రాసి ఉంది

సలీం భాయ్ చనిపోయే ముందు రాసిన దాని చదివిన ప్రకాష్ అది ఎవరికీ కనిపించకుండా, సలీం భాయ్ చేతితో ఆ రాసినది మొత్తం చెరిపేసాడు తర్వాత విక్కి నీ పక్కకు పిలిచి జరిగింది చెప్పాడు “నేను వెళ్ళి పూజా తో హాస్పిటల్ లో ఉంటానూ నువ్వు నిఖిల్ ఇద్దరు వెళ్లి అది ఏంటో చూడండి” అని వినీత నీ తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాడు,విక్కి నిఖిల్ ఇద్దరు అరకు కీ వెళ్లారు ఆ తర్వాత “RR పాలెస్” కీ చేరుకున్నారు మెల్లగ సెక్యూరిటీ వాళ్లకు కనిపించకుండా లోపలికి వెళ్లారు అప్పుడు షర్మిల dinning hall లో భోజనం చేస్తోంది ఒంటరిగా దాంతో నిఖిల్ నీ అక్కడే ఉండి ఏమైనా తేడా వస్తే సిగ్నల్ ఇవ్వు అని చెప్పి లోపలికి వెళ్ళాడు.

షర్మిల బెడ్ రూమ్ లోకి వెళ్లిన విక్కి అల్మారా, లాకర్ అని వేతికాడు కానీ ఏమీ దొరకలేదు అప్పుడు అల్మారా పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడుతుంటే వెళ్లి పట్టుకున్నాడు కానీ అప్పుడే బెడ్ కీ ఒక లాకర్ కనిపించింది విక్కి కీ వెంటనే దాని తేవడానికి ట్రై చేసాడు కానీ దానికి password అడుగుతుంది దాంతో విక్కి బాగా ఆలోచించడం మొదలు పెట్టాడు నాలుగు డిజిట్ నెంబర్ ఏమీ అయి ఉంటుంది అని, అప్పుడు తట్టింది 1951 ఎందుకు అంటే ఆ నెంబర్ తో ఇంట్లో నాలుగు కార్ల్ ఉన్నాయి, ఆ నెంబర్ తో షర్మిల మేడ లో ఒక చైన్ ఉంది కాబట్టి అదే నెంబర్ ట్రై చేశాడు అది తెరుచుకుంది దాంట్లో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి అని తెరిచి చూస్తే అది ఒక బ్లాక్ స్క్రాప్ మాఫియా కీ సంబంధించిన అగ్రిమెంట్, అంతేకాకుండా డ్రగ్స్, weapons స్మగ్లింగ్ కీ సంబంధించిన అని వివరాలు అక్కడ ఉన్నాయి.

అప్పుడే అక్కడ విక్కి కీ రమేష్ పెళ్లి ఫోటో దొరికింది అది చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే అది తన కొలీగ్ “కిరణ్మయి” 1 సంవత్సరం క్రితం ఏదో assignment మీద వెళ్లుతున్నా అని చెప్పి మాయం అయింది ఇప్పుడు ఇలా చూసి షాక్ అయ్యాడు విక్కి, అప్పుడు ఒక చిన్న clarity వచ్చింది విక్కి కీ “ఈ ఫ్యామిలీ అసలు కథ బయటకు తీసుకురావడానికి రమేష్ నీ పెళ్ళి చేసుకుని ఇక్కడ ఆధారాలు కోసం వేత్తకడం మొదలు పెట్టింది” అని అర్థం అయింది విక్కి కీ కానీ అప్పుడే ఆ లాకర్ లో ఒక డైరీ కనిపించింది.

దాని తెరిచి చదవడం మొదలు పెట్టాడు “నా పేరు వెంకట్ మా నాన్న బ్రిటిష్ వాళ్ల దగ్గరి నుంచి గిఫ్ట్ గా వచ్చిన ఒక షిప్ లో ఉన్న ఇనుము మొత్తం స్క్రాప్ చేసి దాంతో వచ్చిన డబ్బు తో Import & Export బిజినెస్ మొదలు పెట్టి దాంట్లో కోట్లు సంపాదించి అరకు లో పెద్ద పాలెస్ కట్టాడు నను లండన్ లో చదివించాడు అక్కడ చదువు అయిపోగానే అరకు వచ్చాను అప్పుడు చూశాను అరుణ నీ మా పనిమనిషి రంగమ్మ కూతురు లండన్ లో 10 సంవత్సరాలు ఉన్న కూడా అంత అందాని చూడలేదు అనుభవించలేదు కానీ దీని నా సొంతం చేసుకోవాలి అనుకున్న అలా దాని ప్రేమ పేరుతో దెగ్గర అయి నా కోరిక తీర్చుకున్నా కానీ అది నా వెంట పడుతుంది అని తెలుసు అందుకే దానికి మాయ మాటలు చెప్పి బాంబే లో నా ఫ్రెండ్ దగ్గరికి పంపించా తరువాత నా మామ కూతురు నీ పెళ్ళి చేసుకుని నా బాబు నీ అడ్డుతప్పించు మొత్తం బిజినెస్ లు స్వాధీనం చేసుకున్న కానీ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అరుణ మళ్లీ వచ్చింది కానీ ఈ సారి ఒక కొడుకు నీ తీసుకొని వచ్చింది దాంతో నేను దాని మళ్లీ నమ్మించి ఒక రోజు నా గెస్ట్ హౌస్ లో ఉంచాను “అక్కడి దాకా మాత్రమే ఆ డైరీ లో రాసి ఉంది విక్కి మిగిలిన దాని కోసం మొత్తం డైరీ వెతికాడు అప్పుడే నిఖిల్ నీ కొట్టుకుంటూ లోపలికి వచ్చారు సెక్యూరిటీ వాలు.

1 Comment

  1. Good

Comments are closed.