రేయి surprise బాగుందా 2 100

ప్రకాష్ వాళ్లకు కార్ నీ అడ్డం గా ఉంచి దాని మెల్లగ ముందుకు నడుపుతు వీళ్ల ముగ్గురిని కవర్ చేస్తున్నాడు అప్పుడు కార్ వెనుక ఉన్న నిఖిల్ పూజా కీ వేసిన జాకెట్ నీ చూడగానే ఎదురుగా ఉన్న రాజు వైపు కాల్పులు మొదలు పెట్టాడు దాంతో alert అయినా రాజు తన దగ్గర ఉన్న అడ్వాన్స్ గన్ తీసుకొని నిఖిల్ నీ కాల్చాడు దాంతో నిఖిల్ కాలు లో ఒక బుల్లెట్ చేతికి ఒక బుల్లెట్ తగిలి కింద పడ్డాడు ఆ తరువాత కార్ పైన కాల్పులు మొదలు పెట్టాడు, డీజిల్ ట్యాంక్ కీ బుల్లెట్స్ తగలడం తో కార్ లో మంటలు లేచాయి దాంతో ప్రకాష్ బయటికి దూకేసాడు, విక్కి నిఖిల్ నీ భుజాలకు వేసుకొని పక్కకు లాకూ వెళ్లాడు, వినీత ఒక container వెనక దాకున్ని రైట్ టైమ్ కోసం చూస్తోంది అప్పుడు విక్కి కూడా వినీత పక్కన కూర్చుని నిఖిల్ అక్కడ పడుకోబెట్టాడు, అప్పుడు ఆ షిప్ వైపు చూస్తే ఒక్కటే దారి ఉంది లోపలికి వెళ్లేందుకు అంతే విక్కి నిఖిల్ గన్ ప్రకాష్ వైపు వేసి, వినీత ని ప్రకాష్ నీ వేరు వేరు గా రాజు వైపు కాల్చమని చెప్పి రాజు బిజీగా ఉన్నపుడు, షిప్ లోపలికి వెళ్ళాడు అప్పుడు రాజు నీ షూట్ చేయడానికి పొజిషన్ చూస్తుంటే పక్కన ఎవరో కదిలినటు అనిపిస్తే చూశాడు విక్కి వెంకట రాయుడు నీ కట్టేసి పూజా కీ వేసినట్లు రాయుడు కీ కూడా జాకెట్ వేసి ఉంచాడు “హే అసలు ఏమీ జరుగుతుంది ఇక్కడ ఆ పిచ్చి నా కొడుకు నను ఎందుకు కిడ్నాప్ చేశాడు” అని అడిగాడు రాయుడు “వాడు పిచ్చి నా కొడుకు కాదు నీ కొడుకే” అని అన్నాడు విక్కి “ఏంటి నువ్వు అనేది” అని ఆశ్చర్యంగా అడిగాడు రాయుడు “వాడు నువ్వు ప్రేమించి, నమ్మించి, చంపించీన్న అరుణ కొడుకు “అని అసలు విషయం చెప్పాడు విక్కి.

దాంతో రాయుడు ఆలోచనలో పడ్డాడు అప్పుడు విక్కి కీ ఒక ఆలోచన వచ్చింది కావాలి అని రాజు కీ మిస్ అయ్యేలా పక్కకు కాల్చి దొరికి పోయాడు అప్పుడు రాజు విక్కి వైపు రాగానే రాయుడు కళ్లలో నీళ్లు తిరిగాయి” బాబు నేను పాపం చేశాను రా ప్రేమ పేరుతో మీ అమ్మ నీ మోసం చేసి వాడుకున్నా, తరువాత నా తప్పు ఎక్కడ బయటకు వస్తుందో అని బయటపడి తనని చంపించా నిన్ను అనాధ నీ చేసి కళ్ల ముందే అయిన వాళ్లు ఉన్న వాళ్లు నా వాళ్లు అని చెప్పుకోలేని దీన స్థితిలో నిన్ను పెరిగేలా చేశాను నను క్షమించు రా “అని కళ్లలో నుంచి నీళ్లు ధారాళంగా కార్చాడు, దాంతో రాజు మనసు మెల్లగ కరిగింది వెంటనే తన తండ్రి నీ పైకి లేపి గుండెలకు హత్తుకున్నాడు ఆ తర్వాత ఇద్దరూ అలా ఒకరి కౌగిలి లో ఒక్కరూ ఒదిగి పోయిన టైమ్ లో విక్కి మెల్లగ వెళ్లి పూజా జాకెట్ విప్పి తనని షిప్ లో నుంచి బయటకు తోసేసి ఆ జాకెట్ నీ రాజు మీదకు విసిరాడు దాంతో రాయుడు వెనకు జరిగి “ఇప్పుడు కాల్చండి” అని గట్టిగా అరిచాడు “రేయి పిచ్చోడా నా వారసులన్ని చంపి నా పెళ్లం నీ చంపావూ ఎలా నిన్ను నా కొడుకు నీ చేసుకుంటా అనుకున్నావ్ రా ఉంచుకున్నా దానికి పుట్టినోడా” అని రాజు మీద విషం కకాడు రాయుడు రాజు ఆలోచనలో ఉండగా ఒక బుల్లెట్ వచ్చి అతని కడుపులో దిగింది ఇంకోటి అతని తొడలో దిగింది, విజయ గర్వం తో రాయుడు విక్కి వైపు చూసి” హే వచ్చి కట్లు విప్పు “అన్నాడు” కన్న కొడుకుని చంపడానికి రెడీ అయినోడివి నను వదులుతావా అందుకే ఇప్పుడు నీ కొడుకు చేతిలోనే చావు” అని విక్కి వెళ్లుతుంటే అక్కడే ఉన్న తాడు విక్కి కాలు కీ అడ్డు వేసి కింద పడేలా చేసి గన్ తో రాయుడు నుదుటి లో బుల్లెట్ దింపాడు రాజు.

తరువాత మెల్లగ లేచి విక్కి వైపు వెళ్లి విక్కి నీ షూట్ చేయబోయాడు అంతే విక్కి రాజు కాల దగ్గర ఉన్న జాకెట్ లో ఒక grenade పిన్ పీకీ రాజు గుండె ల మీద కాలు తో కొట్టి షిప్ మీద నుంచి దుక్కేసాడు అంతే షిప్ మొత్తం పేలి పోయింది ఆ తరువాత అందరూ కలిసి హాస్పిటల్ కి వెళ్ళారు.

1 నెల తరువాత

వినీత తన జాబ్ కీ రాజీనామా చేసి విక్కి తో పాటు ముంబాయి కీ ప్రయాణం అయ్యింది, అదే దారిలో వాళ్లు “RR & CO” కంపెనీ దెగ్గర ఆగ్గి ఆ రోజే కంపెనీ చైర్మన్ గా ఆస్తులు మొత్తం తన మీదకు మార్చుకుంది పూజా, తనకి support గా ప్రకాష్, నిఖిల్ ఇద్దరు ఉన్నారు వాళ్లకు కంగ్రాట్స్ చెప్పి ఇద్దరు ముంబాయి కీ వెళ్లారు ఆ తర్వాత తన లైఫ్ జరిగిన ఆ వారం రోజుల అనుభవం నీ తన కథ గా రాసాడు విక్కి, ఆ తరువాత అతని బాస్ శేఖర్ కింద మీద పడి డైరెక్టర్ రోహిత్ శెట్టి నీ ఒప్పించి ఆ కథ తో సినిమా మొదలు పెట్టారు.

6 నెలల తరువాత

విక్కి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కథ చివరి లో బలంగా ఒక scene ఉండాలి అని ఆలోచిస్తూ ఉండగా అతని ఫోన్ మొగ్గింది పూజా నుంచి ఫోన్ “ఏంటి ఇప్పుడు ఫోన్ చేశారు మేడమ్ గారు” అని అడిగాడు విక్కి “రేయి 6 నెలలు అవుతున్నా ఇంకా ఆ రాజు బాడి దొరకలేదు అని పోలీస్ లు అంటున్నారు వాడు బ్రతికే ఉన్నాడు అన్ని భయం భయంగా ఉంది” అని చెప్పింది పూజా, “నువ్వు భయపడవద్దు ధైర్యంగా ఉండు” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు విక్కి, 5 నిమిషాలకు ఒక unknown number నుంచి ఫోన్ వచ్చింది “హలో ఎవరూ “అని అడిగాడు” నీ చావును “అని అవతలి నుండి ఒక బీకర గొంతు వినిపించింది.

ఆ చుట్టుపక్కల అంతా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి విక్కి కీ” పూజా నీ చంపాలి అంటే ముందు నువ్వు చావాలి నేను వస్తున్నా” అని అవతలి నుండి చెప్పాడు రాజు “I am ready” అని ఫోన్ పెట్టేసాడు విక్కి (రాజు నీ ఆ రోజు విక్కి షిప్ పేలినపుడు కొట్టాడు కదా అప్పుడు రాజు అక్కడ ఉన్న ఒక రాడ్ కీ కొట్టుకొని సముద్రంలో పడ్డాడు ఆ తర్వాత ఒక జాలరి వాళ్ల వల్లలో చిక్కుకున్నాడు అతని హాస్పిటల్ లో చేర్పించారు 6 నెలలు కొమ్మా లో ఉన్నాడు ఇప్పుడే లేచ్చాడు) రాజు కూడా ఫోన్ పెట్టేసి గన్ లోడ్ చేస్తు హాస్పిటల్ మొత్తం బాంబులతో పేలుస్తు బయలుదేరాడు

THE END

1 Comment

  1. Good

Comments are closed.