రేయి surprise బాగుందా 2 100

ప్రకాష్ : విక్కి నాకూ నువ్వు ఇచ్చిన proofs నీ మళ్లీ ఒకసారి బాగా చెక్ చేశాను కానీ మనకు తెలియని ఇంకో విషయం ఉంది

విక్కి : ఏంటి ప్రకాష్ అది

ప్రకాష్ : ఆ రోజు సలీం కాల్చిన బిల్డింగ్ లో షర్మిల చెప్పినట్టు అయితే మనకు రెండు బాడి ల post-mortem రిపోర్ట్ వచ్చి ఉండాలి కానీ ఇక్కడ ఒక్కటే ఉంది అంటే ఆ బాబు బ్రతికే ఉండి ఉంటాడు అని మళ్ళీ చెక్ చేశా

విక్కి : అయితే ఇప్పుడు ఆ బాబు ఉన్నాడా లేడా

ప్రకాష్ : షర్మిల చేసిన ద్రోహం తట్టుకోలేక సలీం వాళ్లను చంపాలి అనుకున్నాడు కానీ అతను ఏమీ చేయలేని పరిస్థితి అందుకే రాయుడు ఫ్యామిలీ లోనే రాయుడు నీ చంపడానికి ఒక ఆయుధం తయారు చేశాడు సలీం

విక్కి : ఏంటి ఏదో ఏదో చెప్తున్నావ్ అసలు విషయం చెప్పు

ప్రకాష్ : సలీం ఆ పిల్లడి నీ చంపలేదు ఒక అనాధాశ్రమం లో చేర్పించాడు వాడికి guardian అయ్యాడు ఆ కుర్రాడు బాగా చదివి పోలీస్ గా సెలెక్ట్ అయ్యి సలీం కీ క్లోజ్ అయిన ఒక మినిస్టర్ చేత్తో అరకు లోనే పోస్టింగ్ తెచ్చుకున్నాడు అతనే రాజు

అలా ఫోన్ లో మాట్లాడుతూ ఉండగానే వెనుక నుంచి గన్ కాల్పులు వినిపించాయి అప్పుడు అక్కడ ఉన్న సిబిఐ ఆఫీసర్ నుదుటి లో బుల్లెట్ దించి గన్ షర్మిల వైపు ఎక్కు పెట్టి నిలబడాడు రాజు

షర్మిల వైపు గన్ ఎక్కు పెట్టిన రాజు వింత గా నవ్వుతూ రెండు సార్లు కాల్చాడు అందులో ఒక బుల్లెట్ ఆమె కడుపు లోకి దూసుకొని వెళ్లింది, ఇంకోటి చాత్తి లోకి దిగింది తరువాత పక్కన ఉన్న కుర్చీ నీ లాకుని ఎదురుగా సెల్ లో ఉన్న ACP శ్రీధర్ వైపు తిరిగాడు రాజు, ఒక సారిగా రాజు నీ అలా చూడగానే శ్రీధర్ వెన్ను లో వణుకు మొదలైంది “రాజు please నను వదిలేయి నీకు ఎంత డబ్బు కావాలి అన్న ఇస్తాను నను ఏమీ చేయకు” అని సెల్ లోపలి నుంచి చేతులు బయటికి పెట్టి రాజు కాలు పట్టుకున్నాడు శ్రీధర్, రాజు మెల్లగా లేచి శ్రీధర్ తల పైన చేత్తో నీమురుతు “అయ్యో సార్ మీరు పెద్ద వారు నా కాలు మోకితే నా ఆయుషు తగ్గుతుంది మీ ఆయుషు పెరుగుతోంది కాబట్టి ఆయుషమ్మాన్ భవ “అని తల లోకి వరుసగా మూడు బుల్లెట్స్ దింపేసాడు అప్పుడు శ్రీధర్ తల నుంచి రక్తం ధారాళంగా కారుతుంది అది చూసి పూజా భయం తో కేకలు వేస్తూ విక్కి వెనుక దాకుంది.

ఆ అరుపు కీ వెనకు తిరిగిన రాజు గన్ నీ వెనకు దాచి పెట్టి” అయ్యే సారీ వదిన అరె తప్పుడు వరుసా నేను రమేష్, ప్రమోద్ కంటే పెద్ద వాడిని అయినప్పుడు
నువ్వు నాకూ హా మరదలు అవుతావు, సారీ అసలే కడుపు తో ఉన్న నువ్వు ఇలాంటి ఘోరాలు చూడాల్సి వచ్చింది” అని అన్నాడు రాజు ఆ మాటలకి ఇంకా కోన ఊపిరి తో ఉన్న షర్మిల గట్టిగా శ్వాస పిల్చుకొని” బాబు విక్కి ఈ రాక్షసుడి నుంచి నా పూజా నీ మా వంశం నిలబెట్టే ఆ వారసున్ని నువ్వే కాపాడాలి “అని విక్కి వైపు నిస్సహాయం గా చూస్తూ చేతులు ఎత్తి నమస్కారము పెట్టి ప్రాణాలు వదిలింది.

1 Comment

  1. Good

Comments are closed.