వొక రాక్షసుడి పేరు – Part 1 180

రాహుల్ రాయ్ విక్రమ్ మీద దాడి చేసిన మరుసటి రోజు ఉదయం విక్రమ్ తన ఆఫీస్ లో సీన్స్ అని డిస్కస్ చేస్తూ ఉంటే సెక్యూరిటీ అధికారి లు వచ్చారు ఆఫీస్ కీ వచ్చింది Acp అతను రావడం రావడం తో విక్రమ్ కాబిన్ లో శివ నీ బయటికి తోసి విక్రమ్ వైపు చూస్తూ సిగరెట్ వెలిగించాడు

Acp : నిన్న మీ మీద దాడి చేసిన ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా

విక్రమ్ : తెలియదు

Acp : మరి అంత మంది ఉండగా మిమ్మల్ని ఎందుకు ఎటాక్ చేశాడు

విక్రమ్ : నన్ను చూసి ఎవరో అనుకున్నాడు అనుకుంటా నా పేరు కూడా అతనికి తెలియదు ఎవరో మహి అనే పేరు వాడాడు

Acp : ఎస్ అది నేను కూడా విన్న కానీ ఎందుకు అతని చంపారు

విక్రమ్ : what nonsense officer నేను అతని చంపడం ఏంటి

అప్పుడు Acp రాహుల్ రాయ్ స్మార్ట్ వాచ్ తీసి అందులో hidden కెమెరా లో రికార్డ్ అయిన చివరి వీడియో తీసి చూపించాడు అందులో విక్రమ్ ఒక కత్తి తో రాహుల్ నీ పొడిచి చంపడం ఉంది అప్పుడే విక్రమ్ కీ ఫోన్ వచ్చింది ఎత్తాడు కంగారు లో అవతలి నుండి “హలో బ్రదర్ నీ మీద ఎటాక్ చేసిన ఆ ముసలోడిని లేపేసా వాడు బ్రతికి ఉంటే నీకు నాకూ ఇద్దరికి రిస్క్” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు విక్రమ్ కీ అంతా మాయ లా ఉంది అలా విక్రమ్ ఆలోచనలో ఉండగా Acp “you are under arrest” అన్నాడు

ఇక్కడ విక్రమ్ నీ సెక్యూరిటీ అధికారి లు అరెస్ట్ చేస్తుంటే అక్కడ హాస్పిటల్ లో రాగిణి పొజిషన్ ఇంకోలా ఉంది.

రాగిణి సాయంత్రం హాస్పిటల్ పార్క్ లో నడుస్తూ ఉంది అప్పుడు ఒక నర్స్ వచ్చి ఒక బోకెట్ రాగిణి కీ ఇచ్చింది అందులో ఒక డైరీ కూడా దాగి ఉంది అది సుప్రజా డైరీ దాంతో రాగిణి కొంచెం ఆశ్చర్య తో కొంచెం ఆత్రం తో ఆ డైరీ తెరిచి చూసింది అందులో ఒక లెటర్ కూడా ఉంది ముందు ఆ లెటర్ తెరిచి చూసింది

“హయ్ చందమామ

ఆ రోజు నువ్వు హైదరాబాద్ వచ్చిన రోజు నిన్ను చూశాను ఆ తర్వాత నీ బాధ కీ కారణం నీ Instagram లో నీ బెస్ట్ ఫ్రెండ్ చనిపోయిన విషయం గురించి పోస్ట్ చేశావు అందుకే తన చావు కీ కారణం నీకు తెలుస్తుంది అనే ఆశ తో పైగా నీ మనసు కుదుట పడుతుంది అని చాలా కష్టపడి ఈ డైరీ తీసుకొని వచ్చాను

నీ అజ్ఞాత ప్రేమికుడు “అని రాసి దాంతో రాగిణి ఆ డైరీ తెరిచింది

(2014)

కొత్త ఆశలతో కొత్త ఉత్సాహం తో చెన్నై లో అడుగు పెట్టింది సుప్రజా క్లాస్ లో అందరీకంటే చాలా తెలివైన పిల్ల అనిపించుకోవడం తనకు ముఖ్యం అదే క్లాస్ లో చందు అనే ఇంకో స్టూడెంట్ ఉన్నాడు వాడు కూడా ఆంధ్రా నుంచే వచ్చాడు అని తెలుసుకుంది అతని తో మాట్లాడుదాం అంటే ఎగ్జామ్స్ రోజు తప్ప ఇంక ఎప్పుడు క్లాస్ లో కనిపించే వాడు కాదు 1st ఇయర్ లో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి తన results చూసి సంతోషించింది కానీ కాలేజీ 1st వచ్చింది మాత్రం చందు దానికి సుప్రజా మాత్రమే కాదు మొత్తం కాలేజీ షాక్ అయ్యింది దాంతో కాలేజీ స్టాఫ్ అంతా చందు చీట్ చేసి పాస్ అయ్యాడు అనుకోని ఎగ్జామ్స్ లో వచ్చిన important questions collect చేసి మొత్తం కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు మధ్య ఆడిటోరియంలో టెస్ట్ పెట్టారు అన్నింటికీ చందు టక టక సమాధానాలు ఇచ్చి అందరినీ మళ్లీ ఆశ్చర్య పరిచాడు దాంతో సుప్రజా మెల్లగా చందు మీద ఇంటరెస్ట్ పెంచుకుంది.

ఒక రోజు సుప్రజా క్లాస్ కీ వచ్చే సరికి తన బెంచ్ పైన ఒక గులాబీ పువ్వు ఉంది అది చూసి అప్పటికే క్లాస్ లో ఉన్న చందు నీ చూసింది అప్పుడు తన మొహం పక్కకు తిప్పి సిగ్గు పడింది ఆ తర్వాత రోజు చందు, సుప్రజా ఇద్దరు అందరీకంటే ముందే వచ్చి క్లాస్ లో కూర్చుని మాట్లాడకుంటు ఉండే వారు ఒక రోజు అలాగే మాట్లాడుతూ ఉండగా సడన్ గా సుప్రజా పెదవీ పై ముద్దు పెట్టాడు దాంతో సుప్రజా చందు నీ గట్టిగా కొట్టింది దానికి చందు అలిగి వెళ్లిపోయాడు.

ఒక వారం వరకు చందు కాలేజీ కీ రాలేదు దాంతో సుప్రజా లో ఏదో తెలియని బాధ చందు నీ తనే hurt చేశాను అన్న అభద్రత భావం తో చందు ఇంటికి వెళ్లింది అక్కడ చందు వీడియో గేమ్ ఆడుతూ ఉన్నాడు సుప్రజా తలుపు కోడితే వెళ్లి తలుపు తీశాడు అప్పుడు సుప్రజా డైరెక్ట్ గా లోపలికి వచ్చి చందు కీ పెదవి పై ముద్దు పెట్టి చందు నీ కొట్టడం మొదలు పెట్టింది, చందు నవ్వుతూ ఉన్నాడు దానికి సుప్రజా “కొడుతూ ఉంటే నవ్వుతావు ఏంటి రా” అని అడిగింది అప్పుడు చందు “మరి నవ్వకుండా అంత కోపం ఉన్నదానివి ముందు కోట్టకుండా ముద్దు ఎందుకు పెట్టావు” అని అడిగాడు, దానికి సుప్రజా సిగ్గు పడుతూ “అంటే 1st టైమ్ కదా ఎలా react అవ్వాలో తెలియక కొట్టాను ఆ తర్వాత మళ్లీ కావాలి అనిపించింది అందుకే మరుసటి రోజు వస్తే ఇద్దాం అనుకున్న నువ్వు మొత్తం మూడ్ పాడు చేశావ్ “అని అలిగింది దాంతో చందు తనని దగ్గరి కి తీసుకొని ఓదార్చాడు.

(ప్రస్తుతం)