వొక రాక్షసుడి పేరు – Part 1 182

సుప్రజా చావు కబురు తెలిసి తట్టుకోలేక మరుసటి రోజు మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ తిరిగి వచ్చింది రాగిణి తన రూమ్ లో పండుకొని ఉంది సాయంత్రం టైమ్ లో ఎవరో తలుపు కోడితే వెళ్లి తలుపు తీసింది ఎవరో బోకెట్ తన కోసం పంపించారు దాని మీద ఒక లెటర్ రాసి ఉంది ఆ బోకెట్ లోపల తన స్టిల్ ఫోటో షూట్ కోసం ఇచ్చిన ఫొటోలు ఉన్నాయి అవి చూసి వెంటనే ఆ లెటర్ తీసి చదవడం మొదలు పెట్టింది రాగిణి.

“హే చందమామ

నువ్వు నవ్వినప్పుడు నీ మొహం లో వచ్చే కాంతి ఆ చందురుడు అందం కూడా పనికి రాదు రోజు నేను నిన్ను చూస్తున్నా నువ్వు నా మనసును ఎప్పుడు దోచుకొని వెళ్లుతున్నావు నీ అందం ఆ చందమామ కూడా insecure ఫీల్ అవుతుంది అందుకే నీ అందం చూసి తట్టుకోలేక ఎప్పుడు ఆ మబ్బులో దాకోని ఉంటాడు నా గుండెకు మత్తుమందు నువ్వు నా నిద్ర మొత్తం ఎవరో దోచుకుంటున్నారు అనిపిస్తుంది అది ఎవరూ అని చూస్తే నువ్వే రేపు నువ్వు పెద్ద హీరోయిన్ అయిన నన్ను మర్చిపోవు అని ఆశిస్తు

నీ
అజ్ఞాత ప్రేమికుడు” అని రాసి ఉన్న ఆ ఉత్తరం చదివిన తర్వాత రాగిణి లో బాధ కొంచెం కరిగింది కానీ ఎవరూ అయ్యి ఉంటారు తన ప్రొఫెషన్ గురించి కూడా తెలుసుకొని వెంట పడుతున్నాడు అని ఆశ్చర్య పోయింది ఆ తర్వాత ఆ లెటర్ గురించి ఆలోచిస్తూ ఉంది ఇంతలో శివ నుంచి ఫోన్ వచ్చింది రేపు ఉదయం 7 గంటలకు షూటింగ్ కీ రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసాడు. దాంతో రాగిణి లో బాధ మొత్తం కరిగి ఆనందం తో డాన్స్ చేస్తూ బెడ్ పైన పడుకుని మరుసటి రోజు ఉదయం షూటింగ్ స్పాట్ కీ వెళ్లింది.

షూటింగ్ స్పాట్ లో ఎవ్వరూ లేరు అంతా ఖాళీగా ఉంది తొందరగా వచ్చానా లేక ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా అని డౌట్ వచ్చి శివ కీ ఫోన్ చేసింది కానీ శివ ఫోన్ ఎత్తడము లేదు ఆ తర్వాత రాగిణి కీ కొంచెం కోపం వచ్చి డైరెక్ట్ గా విక్రమ్ ఆఫీస్ కీ వెళ్లింది అక్కడ శివ విక్రమ్ తో లొకేషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాడు సెక్యూరిటీ వాళ్లు ఎంత ఆప్పాలి అని చూసిన రాగిణి ఆవేశం గా లోపలికి దూసుకొని వచ్చింది రావడం రావడంతో గట్టిగా అరుస్తూ ఉంది దాంతో విక్రమ్ బయటకు వచ్చి రాగిణి నీ అడిగాడు ఏమైంది అని అప్పుడు రాగిణి శివ తనకు ఫోన్ చేసిన విషయం చెప్పింది అప్పుడు విక్రమ్ శివ నీ తన కాబిన్ లోకి తీసుకుని వెళ్లి అడిగాడు ఏంటి ఇది అని అప్పుడు శివ “సార్ నిన్న సాయంత్రం మీరే కదా రేపు ఆ అమ్మాయిని షూటింగ్ రమ్మని చెప్పమని చెప్పి నాకూ ఫోన్ చేశారు” అని అన్నాడు దాంతో విక్రమ్ కొంచెం షాక్ అయ్యాడు అంతేకాకుండా ఆ ఫోన్ ఎవరూ చేశారో విక్రమ్ కీ అర్థం అయ్యింది.

“అది నేను మరిచి పోయా లొకేషన్ ఫర్మిషన్ దొరకలేదు అది నీకు చెప్పలేదు నెక్స్ట్ టైమ్ నుంచి నేను నీకు ఫోన్ చేస్తే వర్షా ఫోన్ నుంచి మాత్రమే చేస్తా అప్పుడే నువ్వు నేను చెప్పినట్లు confirm చేసుకో వెళ్లి ఆ అమ్మాయిని లోపలికి పంపు” అని చెప్పాడు శివ కూడా సరే అని వెళ్లి రాగిణి నీ లోపలికి పంపాడు

విక్రమ్ : సారీ రాగిణి చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు నీకు చెప్పడం మరిచి పోయాం

రాగిణి : పర్లేదు నేనే కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయ్యాను

విక్రమ్ : అది ఏమీ పర్లేదు సరే రేపు నీ 1st షాట్ కాబట్టి నీకు ముందే సీన్ చెప్తా అప్పుడు నీకు కొంచెం సులభంగా ఉంటుంది

రాగిణి : ఒకే సార్

విక్రమ్ : సార్ ఏంటి ఎంత అయిన నా మరదలు శ్రావ్య నువ్వు చిన్నప్పటి ఫ్రెండ్స్ అంటే నేను కూడా నీ ఫ్రెండ్ కాల్ మీ విక్రమ్

రాగిణి : అంటే నీ గురించి శ్రావ్య చెప్పడం తప్ప మనం ఎప్పుడూ కలువలేదు కదా

విక్రమ్ : మెల్లగా నీకే అలవాటు అవుతుంది సరే సీన్ వచ్చి నువ్వు ఒక ఒంటరి అమ్మాయి నీకు ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు నీకు ఒంటరితనం తప్ప ఎప్పుడు లైఫ్ లో ఒక exciting లేదు అప్పుడే ఎవరో నీకు రోజు ఒక లెటర్ పంపి నిన్ను ఎవరో ఫాలో అవుతున్నారు అని నీకు తెలుస్తుంది