వొక రాక్షసుడి పేరు – Part 1 182

విక్రమ్ అలా సీన్ చెప్తూంటే నిన్న తనకి జరిగిన సంఘటనా రేపు షూటింగ్ లో సీన్ ఒక్కటే అవ్వడం తనకు షాక్ ఇచ్చింది ఆ తర్వాత విక్రమ్ పిలిస్తే మళ్లీ ఈ లోకంలో వచ్చింది ఆ తర్వాత రాగిణి సరే అని ఇంటికి వెళ్లి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు షూటింగ్ కీ వచ్చింది.

ఈ షూటింగ్ స్పాట్ పక్కనే ఒక బిల్డింగ్ construction లో ఉంది అక్కడ ఆ బిల్డింగ్ పైన ఒక హోర్డింగ్ బోర్డు క్రేన్ సాయం తో ఎక్కిస్తున్నారు ఇక్కడ కింద పార్క్ లో రాగిణి జాగింగ్ చేస్తూన్నటు వచ్చి అలసిపోయి ఒక బెంచ్ దెగ్గర కూర్చొని ఉంటే అప్పుడే ఒక చిన్న బాబు వచ్చి తనకు ఒక లెటర్ ఇచ్చినట్లు షూటింగ్ జరుగుతోంది అప్పుడు సడన్ గా ఆ హోర్డింగ్ బోర్డు క్రేన్ తీగలు తెగి స్పీడ్ గా వచ్చి రాగిణి నీ తాకబోతున్న సమయానికి విక్రమ్ వెళ్లి తనను పక్కకు లాగాడు అలా లాగిన టైమ్ కీ రాగిణి కాలు బెణికింది తనను వెంటనే హాస్పిటల్ కీ తీసుకొని వెళ్లారు ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్ చెప్పారు దాంతో షూటింగ్ కీ బ్రేక్ పడింది.

ఇది జరిగిన రెండు రోజుల తరువాత విక్రమ్ వర్షా ఒక హోటల్ కీ డిన్నర్ కీ వెళ్లారు అక్కడ డిన్నర్ చేసిన తర్వాత చాలా మంది విక్రమ్ ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడారు అప్పుడు విక్రమ్ అందరికీ ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉండగా సడన్ గా ఎవరో ఒక 45 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి సూట్ వేసుకొని ఒక బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు టేబుల్ పైన కత్తి తో విక్రమ్ మీదకు దాడి చేశాడు కానీ అదృష్టం కొద్దీ అది విక్రమ్ చెయ్యి మీద గీసుకోని పోయింది సెక్యూరిటీ వాళ్లు వచ్చి ఆ దాడి చేసిన వ్యక్తి నీ లాకుని వెళ్లారు అప్పుడు అతను గట్టిగా “రేయి మహి నిన్ను వదలను ఎప్పటికైనా నీ చావు నా చేతిలోనే” అని కోపంగా చెప్పాడు.

విక్రమ్ తన మీద జరిగిన దాడి కీ భయపడ లేదు అలాంటి ఒక రోజు వస్తుంది విక్రమ్ కీ ముందే తెలుసు కానీ ఒక్కసారి తన మీద దాడి చేసిన ఆ వ్యక్తి ఎవరో ఎక్కడో చూసినట్టు అనిపించింది అప్పుడు గుర్తుకు వచ్చింది ఆయన మమతా వాళ్ల నాన్న రాహుల్ రాయ్ ముంబాయి లో బిజినెస్ మ్యాన్ స్కూల్ తరువాత మమతా నీ కూడా వాళ్లు ముంబాయి తీసుకొని వెళ్లారు అని గుర్తుకు వచ్చింది విక్రమ్ కీ

7 మార్చి 2015 (ముంబాయి)

బాండరా వెస్ట్ లోని ఒక పెద్ద లగ్జరీ కాలనీ లో తన ఇంట్లో కూర్చొని టివి చూస్తూ ఉన్నాడు మహేంద్ర అలియాస్ మహి అప్పుడే నిల్చోడానికి కూడా ఓపిక లేనట్లు మొహం అంతా పీకుపోయి పిచ్చి దానిలా మహి నీ వెతుక్కుంటూ వచ్చింది మమతా అంత దీన స్థితిలో ఉన్న మమతా నీ చూసి ఏమాత్రం చలించలేదు మహి అలా లోపలికి వచ్చిన మమతా నిలబడ్డానికి ఓపిక లేక కింద పడి పాకు కుంటు వచ్చి మహి కాలు పట్టుకుంది

మమతా : మహి ప్లీజ్ మహి రెండు రోజులో నాకూ ఐఐటి ఏంట్రేంస్ టెస్ట్ ఉంది ప్లీజ్ నాకూ పౌడర్ ఇవ్వు

మహి : నువ్వు డబ్బులు ఇవ్వు ఇస్తా ఇది ఏమైనా ప్రాసాదం అనుకున్నావా ఫ్రీ గా ఇవ్వడానికి