“మ్..తరువాత?” అడిగాను ఆసక్తిగా. ఆయన నవ్వి “సెల్ కంపనీ నుండి వెరిఫికేషన్ కాల్ వచ్చింది. ఫలానా నంబర్ నీరజ అనే ఆవిడ తీసుకున్నారూ, అవిడ మీ భార్యేనా..అని. కొత్త నంబర్ చెప్పమని అడిగి తీసుకున్నా. ఎక్కడో చూసినట్టు అనిపించి, చెక్ చేస్తే స్వప్న నంబర్ అని తెలిసింది. అంతకు ముందు రోజు నువ్వు తిక్కతిక్కగా బిహేవ్ చేయడం గుర్తొచ్చింది…ఒకటీఒకటీ కలిస్తే రెండు.” ఆయన ఏదో చెప్పబోతుంటే “ఆగండాగండి…అసలు ఆ కంపెనీ వాళ్ళు మీకెందుకు కాల్ చేసారు?” అన్నా. “అందుకే అన్నా…నువ్వు తింగరి మాలోకం అని, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, రిఫరెన్స్ నంబర్ అడిగితే అలవాటులో పొరపాటులా నా నంబర్ ఇచ్చేసావు..” అని పకపకా నవ్వసాగాడు. నేను ఉక్రోషంగా మీద పడ్డా. ఆయన నన్ను ఒడిసి పట్టుకున్నాడు.
హలో..ఇక చెప్పడానికి ఏమీ లేవు. మా ఆయనకీ, నాకూ బోలెడు పనులున్నాయ్..బై..బై..సీ యూ..
THE END
