పై ప్రాణం పైనే పోయింది 6 163

డాక్టర్ గా అతడి పరిస్థితి చూస్తూ తనకి శారీరిక ఉపశమనం కలిగించాలన్నది ఆమెలో కల్గిన మొదటి భావన కాగా..అతడి శారీర్యం ఆమెలో మరో విధమైన భావనలను రేకెత్తించిన మాట నిజం..
తను తన మనస్సుని నియంత్రిన్చుకొంటూ..మొదటగా తాను మీదున్న టవల్ (తాను వాకింగ్ ముగించాక చెమటను తుడుచుకోనేందు కని వొకటి తనతో తెచ్చుకోవటం పరిపాటి) తో అతడి శరీరాన్ని శుభ్రంగా తుడిచేసి..పక్కనే వెళ్తున్న వొకరిద్దరు మొగ వారి సహాయంతో మూల్గుతున్న ఆ శరీరాన్ని తన పెద్ద కారు వెనుక సీట్ లోకి చేర్పించి తను వాకింగ్ ఐడియా వదిలేసి ఇంటికి తిరిగి చేరింది..
ముందు కధ వినే ముందు..ఈ మాలినీ గురించి కొంచం విపులంగా తెలుసుకోవటం మంచిది..
మాలిని తండ్రి, తెలుగు ఆయన, సత్యనారాయణ శర్మ
తల్లి బెంగాలీ శోభన..వారిది college లో లవ్ మ్యారేజ్..
తన తల్లి దండ్రులు ఆ పెళ్ళికి ఇష్టపడక పోవటంతో సత్యనారాయణ శోభన ను పెళ్లి చేసుకొని కలకత్తా లో ఇంజనీర్ గా సెటిల్ అయిపోయాడు..
తల్లి దండ్రులు పదేళ్ళ తర్వాత సత్యనారాయణ తమ వోక్కగానొక్క కొడుకు కావటంతో రాజీ పడి పోయారు..
అప్పటికే తాము కలకత్తా లో స్థిరపడిపోయి వుండటంతో సత్యనారాయణ దంపతులు రాజమండ్రి దగ్గిర వున్న ఆయన స్వస్థలానికి shift కాలేక పోయినా అడపాదడపా వచ్చిపోతూ వచ్చారు పెద్దవాళ్ళు కాలం చేసే వరకూ..
మాలిని సత్యనారాయణ దంపతులకు వోక్కత్తే సంతానం..
ముద్దుగా పెంచారు..
దేముడి అనుగ్రహం వలన చదువు బాగా అబ్బింది..
అపురూపంగా దేముడు తనకి చక్కటి అందచందాలూ కూడా చేకూర్చాడు..

సాధారణంగా విద్య అందం తోడై వొకే ఆడదానికి అమరటం బహు అపురూపం..
లక్ష్మీ సరస్వతులు అత్తా కోడళ్ళు..వోకరున్న చోట మరొకరు ఇమడలేరని పెద్దలంటారు..
లక్ష్మి అందాల ఐశ్వర్య రాశి అయితే సరస్వతి చదువుల దేవత అంటారు..
ఈ సందర్భంలో మనం మరొక మూడో angle కూడా మనం గమనిస్తే చాలా ఆశక్తి కరంగా వుంటుంది…
శివుడికి భార్యలు ఇద్దరు..పార్వతి..గంగ..
పార్వతి ప్రసన్నతకు..సౌమ్యతనానికి ప్రతీక అయితే గంగమ్మ అదురుపాటు..పొగరుతనానికి..పేరుబడింది..
పార్వతీ దేవి విష్ణు మూర్తిని అన్నగా సంబోధిస్తుంది కాబట్టి తను లక్ష్మీ దేవికి ఆడబిడ్డ అవుతుంది..
మానవ సంద్రాయాల ప్రకారం అనాది కాలం నుండి వదినా ఆడబిడ్డలకి చుక్కెదురే..
కలగలుపు తనం వుండటం అరుదు..
అందుకే నేమో లక్ష్మీ పుత్రికలు అనబడుతూ ఐశ్వర్యం అందం మాత్రం వున్న ఆడవారికి సౌమ్యతా లక్షణం అరుదు గా వుంటుంది..
కారణం, సవితి పార్వతి మీది అక్కసుతో గంగమ్మ తన తల్లి మాదిరి (గంగా భవాని శ్రీ విష్ణువు పాదం లోంచి ఉద్భవించింది..అంటారు..మరి) లక్ష్మీ పుత్రికలను తన అదురుబాటు తత్వంతో ఆవరించి వుండటం సహజమే ..మరి..
అదే విధంగా..సరస్వతీ కటాక్షులైన..స్త్రీ పురుషులకి ఆ పార్వతీ దేవి తోడై (సరస్వతి ఆమెకు తల్లి వరస మరి-సరస్వతి లక్ష్మి కి కోడలైతే..ఆ లక్ష్మి కి ఆడబిడ్డ, ఆ సరస్వతికి తల్లి వరసే కదండీ..) తన తల్లికి మద్దతుని ఇవ్వటంలో ఆశ్చర్యం లేదు..
కొన్ని అపురూప సందర్భాలలో అత్తా కోడళ్ళు కలిస్తే..పార్వతమ్మ కూడా తోడుకాగా..గంగమ్మ అక్కసు తో దూరం పోతుందిట..
Sum and substance ఏమిటంటే..ఆస్తి అందం (రెండూ కాకుండా వొక్కటి వున్నా కూడా) వున్న స్త్రీలకు సౌమ్యత కన్నా దురుసుతనమే ఎక్కువగా వుండటం పరిపాటి..