పూర్ణ చంద్రుడు Part 4 8

“ఏంటి షాక్ అయ్యావా jersey devil’s నీ ధర్మశాల లోకి తీసుకొని వచ్చింది నీ తమ్ముడూ ఆది నే కాకపోతే ఆ సల్మాన్ గాడు overaction చేసి చచ్చాడు నీకు తెలియదు కదా నీ తమ్ముడూ ఆది నీ చంపినది నేనే మొత్తం మొదలు పెట్టింది వాడే కానీ చివరికి వాడే తప్పుకోవాలి అని చూశాడు అందుకే చంపేశాము ఒక మనిషి గా పుట్టిన నన్ను నా చెల్లి నీ Vampires గా మార్చిన మీ అందరి మీద పగ తీర్చుకోవడం కోసం అవకాశం కోసం చూశా ఇప్పుడు దొరికింది ఎలా వదులుతా” అన్నాడు ఆ తర్వాత సడన్ గా వేగంగా గాలి రావడం చూసిన శ్రీను తన గోడలి తో రెడీ గా ఉన్నాడు అప్పుడు శ్రీ వైపు చూసి తన మీదకు గొడ్డలి విసిరాడు దానికి శ్రీ షాక్ అయ్యింది కానీ అది వెనుక వస్తున్న Vampire కీ తగిలింది అంతలోనే వాళ్ల చుట్టూ ఒక ఐదుగురు Vampires వాళ్ళని చుట్టుముట్టారు వాళ్లు దాడి చేయగానే శ్రీను ఇద్దరు Vampires నీ తన గొడ్డలి తో కత్తి తో వాళ్ళకి గాట్లు పెట్టి తరువాత తల ల పైన నరికి చంపాడు అది చూసి శ్రీ, పద్దు షాక్ అయ్యారు వీడు ఏమైనా Vampires hunter ఆ అని తరువాత చూస్తే ఒక పెద్ద సైన్యం రావడం మొదలైంది మిగిలిన వాళ్లని శ్రీ, పద్దు చంపారు శ్రీను వెంటనే పృధ్వీ నీ వాళ్ళకి అప్పగించి వాళ్ళని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పాడు కానీ వాళ్లు వెళ్లము అన్నారు కానీ శ్రీను “ఇప్పుడు టైమ్ నాలుగున్నర మనం లేట్ చేస్తే మీకే రిస్క్ వీడిని ధర్మాసనం దగ్గరికి తీసుకొని వెళ్లండి vendatins, clementi’s కలిస్తే నే వాళ్లని ఆపగలరు నేను చనిపోతా నాకూ అర్థం అయ్యింది మా అమ్మకు నేను తనని ఎప్పుడు ప్రేమిస్తునే ఉంటాను అని చెప్పండి మీరు ఇద్దరు నిజంగానే నను ప్రేమిస్తే ఇక్కడి నుంచి వెళ్లి పొండి” అని వాళ్ల వెనుక వచ్చిన ఒకడినీ నరికి భస్మం చేశాడు తరువాత “go” అని అరిచాడు అప్పుడు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చంపుతున్నాడు శ్రీను అప్పుడు ఆ మాస్టర్ వచ్చి శ్రీను నీ కొట్టి చేతులు విరిచాడు “వీడిని చంపోద్దు నాకూ వీడు నచ్చాడు వీడిని రేపు వీడిని ప్రేమించిన వాళ్లతో చంపిస్తా” అని లేచి “రేపు బుద్ధ పున్నమి నా పగ తీరే రోజు నేను ఈ లోకాని ఏలే రోజు” అని చెప్పాడు.

శ్రీ, పద్దు ఇద్దరు సూర్యుని కాంతి వాళ్ల మీద పడే లోపు ధర్మశాల కీ చేరుకున్నారు ఆ తర్వాత శ్రీ వాళ్ల ఇంటికి వెళితే అక్కడ శ్రీ వాళ్ల అమ్మ శ్రీ నీ కొట్టింది చూస్తే స్వప్న నీ కట్టెసి ఉంచారు శేషు నీ కొట్టి రక్తపు మడుగులో పడేశారు.

శేషు నీ స్వప్న నీ అక్కడ చూసిన పద్దు స్వప్న దగ్గరికి వెళ్ళింది “అత్తయ్య నీకు ఏమీ కాలేదు కదా” అని అడిగింది, దానికి స్వప్న “శ్రీను ఎక్కడ” అని అడిగింది దానికి పద్దు కన్నీరు కారుస్తూ తల దించుకుంది “దాని అర్థం ఏంటి పద్దు శ్రీను వస్తాడా, తిరిగి రాలేడా” అని అడిగింది స్వప్న దానికి పద్దు ఏమీ చెప్పకుండా గట్టిగా శేఖర్ నీ పిలిచింది దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు వాళ్ల పేర్లు పలకడానికి భయపడే పద్దు ఒక్కసారిగా వాళ్ళని పేరు పెట్టి పిలిచింది దానికి శేఖర్, అనిత ఇద్దరు వచ్చి ఏంటి అని అడిగారు అప్పుడు పృధ్వీ నీ వాళ్ల ముందు పడేసి జరిగింది చెప్పమని వాడిని కొట్టింది పద్దు, దానికి పృధ్వీ నవ్వుతూ “పర్లేదు పద్దు నీలో కూడా అంతో ఇంతో క్రూరత్వం ఉంది” అని చెబుతూ అనిత వైపు చూసి “హలో గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ మేడమ్ ఎలా ఉన్నారు నను నా చెల్లెలు నీ Vampires గా మార్చిన నిన్ను చంపడానికి నేను ఈ రోజు వరకు ఎదురు చూశా ఈ రోజు రాత్రికి మీ అందరి తెగిన తల్లల పైన ఎక్కి మా మాస్టర్ ఈ ప్రపంచాన్ని ఏలుతాడు” అని చెప్పాడు. దానికి శేఖర్ “అసలు ఏమీ జరుగుతుంది ఇక్కడ చెప్పు” అని అన్నాడు దానికి పృధ్వీ నవ్వుతూ “ఈ కథ ఈ రోజు మొదలు అయ్యింది కాదు నీ మేనల్లుడు ఆది గాడిని నీ బాబు చిన్న చూపు చూడడం మొదలు పెట్టిన రోజు నుంచి మొదలు అయ్యింది వాడు డార్జిలింగ్ వెళ్లి చదువుకుంటు తెలియకుండా గాఢ నిద్ర లో ఉన్న ఒక పురాతన vampire నీ నిద్ర లేపాడు ఆ Vampire వాడిని ఆ రోజు నుంచి బానిసను చేసుకుంది డార్జిలింగ్ లో ఉన్న jersey devil’s వాళ్లు వాడిని రోజు ఏడిపించారు వాడు ఆ పురాతన Vampires శక్తి తో వాడు వాళ్ళని బానిసలను చేసుకున్నాడు ఈ రోజు రాత్రి బుద్ధ పున్నమి ఈ ధర్మశాల స్మశానశాల అవుతుంది, దీనికి ఆది గాడు రివర్స్ అయ్యాడు వాడు మారిపోవాలి అని ప్రయత్నం చేశాడు అందుకే వాడిని చంపేశాం పేరుకు పైకి కొట్టుకుంటూ ఉన్న మేము లోపల సైన్యం తయారు చేసుకున్నాం ఆ సైన్యం గురించి ఠాకూర్ కనిపెట్టాడు అందుకే ఆది గాడి ఫోన్ నుంచి నేనే ఠాకూర్ నీ చంపమని చెప్పా” అలా వాళ్ల దారుణాలు అని చెప్పాడు దాంతో శేఖర్ సైగ చేశాడు అప్పుడు శ్రీ వెంటనే పృధ్వీ తల నీ పీకి చేతిలో పట్టుకుని catch లు ఆడుతూ ఉంది.

“మనం తొందరగా నిర్ణయం తీసుకోవాలి రాత్రికి పెద్ద సమయంలేదు ఇప్పుడు మనం అంతా ఒకటిగా ఉంటే తప్ప వాళ్ళని గెలవడం కష్టం కాబట్టి అంతకంటే ముందు మనం ఊరిలో జనం అందరినీ ఖాళీ చేయించాలి వాళ్లు మనుషులను కూడా వదలడం లేదు కాబట్టి మనకు ప్రతి ప్రాణం ముఖ్యం” అని చెప్పింది పద్దు దానికి స్వప్న నేను కూడా వస్తా అని చెప్పింది దానికి అనిత “మాకు ఒక మనిషి సహాయం అవసరం లేదు ఈ యుద్ధం గురించి మేమే చూసుకుంటాం” అని చెప్పింది దానికి స్వప్న “నేను వచ్చేది మీకు సహాయం చేయడానికి కాదు ఈ ఊరిలో ఉన్న జనం నీ ఖాళీ చేయించడానికి ఒక డాక్టర్ గా నేను వాళ్లకు ఏదో ఒకటి చెప్పి ఖాళీ చేయిస్తా” అని చెప్పింది దానికి శేఖర్ కూడా సరే అన్నాడు అలా శ్రీ, పద్దు vendatins నీ clementi’s నీ కలిపి రాత్రికి సిద్దం అవ్వడం మొదలు పెట్టారు స్వప్న హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ కొత్తగా కట్టిన block ఒకటి ఖాళీగా ఉంది అందుకే తను శ్రీను వాళ్ళ కాలేజీ కీ వెళ్లింది అక్కడ ఉన్న ఒక ఒక స్పీకర్ ఫోన్ ఉంది అది మొత్తం ఊరికి వినిపిస్తోంది స్వప్న అక్కడికి వెళ్లి “ఊరి జనం కీ ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ రోజు అడవుల్లో ఉన్న ఒక ఫ్యాక్టరీ లో accident జరిగింది కావున అందరూ ఆ విష వాయువు కీ దూరంగా ఉండాలి కాబట్టి అందరూ ఊరు నుంచి హాస్పిటల్ కి చేరుకోండి అధికారులు వస్తున్నారు రేపటికి అంత సరిదిద్దుకున్న తరువాత మీరు మళ్ళీ మీ మామూలు జీవనం కీ వెళ్ళోచ్చు వెంటనే హాస్పిటల్ లోని కొత్త block కీ రండి” అని చెప్పింది ఆ తర్వాత స్వప్న శేఖర్ కీ ఫోన్ చేస్తే శేఖర్ హాస్పిటల్ లో ఏర్పాట్లు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *