అక్కడికి వెళ్లిన తర్వాత శేఖర్ తో పాటు కొంతమంది పెద్దలను శవపేటిక లో పెట్టి ఉంచారు శ్రీను రాగానే మొత్తం Vampires అందరూ మోకాలి పైన నిలబడి అతనికి తల వచ్చారు, అప్పుడు శ్రీను వెళ్లి శేషు పైకి లేపి ఏంటి ఇది అంత అని అడిగాడు దానికి శేషు “నీ సందేహాలు నాకూ అర్థం అయ్యింది ఊరి జనం కీ ఆ రోజు రాత్రి ఏమీ జరిగిందో గుర్తు లేదు అది మా తాత తయారు చేసిన ఒక మాయ ద్రవం అది మేము ఊరి నీళ్ల ట్యాంక్ లో కలిపి అందరికీ Vampires and ఒక werewolf వాళ్ల మధ్య ఉన్నారు అని వాళ్లు మరిచిపోయేలా చేశాము మామూలుగా పాత పద్ధతుల్లో మా గురించి తెలిసిన మనుషులను చంపాలి కానీ మా కొత్త నాయకత్వం లో అది జరగకుడదు అని తీర్మానించారు, కానీ మాలో చాలా మంది ప్రాణాలు కాపాడి, నీ ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ద పడి మాలో తిరిగి చాలా మందికి ప్రాణం పోసిన నిన్ను మించిన నాయకుడు మాకు ఎక్కడ దొరుకుతాడు శ్రీను అందుకే ఈ ఊరి జనం దృష్టి లో నువ్వు ఆ రోజు అడవిలో అగ్ని ప్రమాదం జరిగింది అని నమ్మించాం ఇక్కడ నీకు రాజు గా పట్టాభిషేకం చేస్తున్నాం” అని చెప్పాడు.
దానికి శ్రీను “నేను ఈ స్థానం తీసుకోలేను జాతి వైరం వల్ల మన రెండు జాతులు ఎప్పుడు కలిసి ఉండలేదు కాకపోతే Vampires సింహాసనం మీద ఒక werewolf రాజు గా ఉండడం తప్పు అని నేను అంటాను కాబట్టి ఈ స్థానానికి నిజమైన హక్కు దారులు మీరే అందులో ఆవేశం, సామర్ధ్యం ఉన్న శ్రీ కావచ్చు, వివేకం, యుక్తి ఉన్న పద్దు కూడా అవ్వోచ్చు, లేదా స్నేహం కోసం, ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇవ్వడానికి వెనుకాడని నీ లాంటి వాడు కూడా కావచ్చు” అని అన్నాడు దానికి అందరూ ఓకే కంఠం లో శేషు, శేషు అని అరిచారు “నాకూ నాయకత్వం చేతకాదు బ్రో” అని అన్నాడు శేషు, దానికి శ్రీను “నాయకత్వం అనేది ముందు ఉండి నడిపించాల్సిన బాధ్యత, కష్టం వస్తే తన వాళ్ళని కాపాడుకోవాలి అనే commitment ఇవి నీలో ఉన్నాయి అంతే కాకుండా ఈ సింహాసనం మొదటి నుంచి మీ వంశం దే కనుక నాయకత్వం నీ రక్తం లోనే ఉంది లేకపోతే ఒక మంచి నాయకుడిని చూసి వాడి రక్తం తాగి నాయకత్వ లక్షణాలు పెంచుకో” అని అన్నాడు దానికి అందరూ నవ్వారూ ఆ తర్వాత ఒక వైన్ బాటిల్ ఇచ్చి “శ్రీను మా అందరినీ కాపాడిన నువ్వు ఈ రోజు మా పెద్దలకు అంతిమ యాత్రలో చివరి వీడుకోలు పలుకు అప్పుడే వాళ్లకు శాంతి కలుగుతుంది” అని చెప్పింది పద్దు దాంతో శ్రీను రక్తం తో నిండిన ఆ వైన్ నీ తాగి శవపేటికలన్నిటికి నిప్పు పెట్టాడు.
ఆ తర్వాత Vampires లోని పెద్దలు కొంతమంది శ్రీను ఇంటికి వచ్చి రేపు శ్రీను కీ పద్దు కీ పెళ్లి చెయ్యాలని స్వప్న తో చెప్పారు దానికి స్వప్న కూడా ఒప్పుకుంది అలా మరుసటి రోజు ఉదయం కాలేజీ auditorium లో వాళ్ల పెళ్లి జరుగుతూ ఉంటుంది అప్పుడు శ్రీను రెడీ అవుతుంటే సడన్ గా శ్రీ వచ్చింది, మొదటి సారి శ్రీను కీ పద్దు నీ చూసి నోట మాట రాలేదు చీర కట్టుకుని, sleeveless జాకెట్ వేసుకొని, నడుము చుట్టూ ఉన్న డ్రాగన్ tattoo నీ expose చేస్తూ వచ్చి శ్రీను కీ బుగ్గ మీద ముద్దు పెట్టి “happy married life మళ్లీ ఎప్పుడైనా నీకు పద్దు బోర్ కోడితే నేను నీకు ఉన్న మరిచిపోకు” అని చెప్పి వెళ్లింది దాంతో శ్రీను బాడి మొత్తం జలదరించింది అలా అంగరంగ వైభవంగా శ్రీను, పద్దు పెళ్లి జరిగింది దాంతో స్వప్న ఒక కవర్ శ్రీను కీ ఇచ్చింది “ఇంక నువ్వు ఇంట్లోకి రావ్వోదు” అని చెప్పింది దానికి శ్రీను ఏమైంది అని అడిగాడు దానికి స్వప్న “పెళ్లి చేసుకుని అమ్మ సంపద మీద బ్రతకడానికి సిగ్గు ఉండాలి పొయ్యి నీ పెళ్లాన్ని నువ్వే పోషించుకో” అని చెప్పి నవ్వింది దాంతో తన చేతిలో ఉన్న కవర్ తీసి చూశాడు అందులో ఒక డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ఉంది అది చూసి శ్రీను ఆనందం తో స్వప్న నీ కౌగిలించుకోని ముద్దు పెట్టాడు ఆ తర్వాత శ్రీను, పద్దు ఇద్దరు కలిసి బెంగళూరు కీ వెళ్లారు అక్కడే కొత్తగా జీవితం మొదలుపెట్టారు.
