పూర్ణ చంద్రుడు Part 4 2

ఇది ఇలా ఉంటే అక్కడ శ్రీను నీ గబ్బిలం లాగా మారిన వాళ్ల రెక్కలు కు కట్టెసి అడవి మొత్తం లాకుని వెళ్లారు తరువాత శ్రీను నీ వేలాడదిశారు అప్పుడు శ్రీను ఒంటి మీద నుంచి కారుతున్న రక్తం వాసన కీ అందరికీ పిచ్చి ఎక్కి గోల చేయడం మొదలు పెట్టారు “మాస్టర్ ఈ రక్తం లో చాలా పొగరు ఉంది ఎలాగైనా వీడిని చంపే అవకాశం ఇవ్వండి” అని అడిగారు దానికి మాస్టర్ వచ్చి శ్రీను నీ boxing bag లాగా కొట్టి “చెప్పాను కదా మిత్రులారా వీడి చావు వీడిని బాగా ప్రేమించే ఆ అమ్మాయిల చేతిలోనే” అని శ్రీను కళ్లలో కళ్లు పెట్టి చూశాడు “ఏంట్రా ఆ పొగరు ఒక వంద సంవత్సరాల నిద్ర నుంచి లేచిన Vampire అంటే భయం గౌరవం లేదా నీకు” అన్నాడు మాస్టర్ దానికి శ్రీను గట్టిగా నవ్వుతూ “నువ్వు శక్తివంతమైన vampire వే కానీ ఆ పిచ్చి డాక్టర్ తయారు చేసిన Vampire నువ్వు కాదు అది నిజమైన గబ్బిలం కాకపోతే అది ఆడ గబ్బిలం అప్పుడు అది కడుపు తో ఉంది అందుకే దాని hibernation లో పెట్టారు కానీ అది గాలి లేక చనిపోయింది దానికి పుట్టిన బిడ్డ నువ్వు ఇన్ని రోజుల ప్రపంచంలో ఎక్కడో దాక్కుని అవకాశం ఉన్న కూడా ఎందుకు 126 సంవత్సరాల ఆగి పగ తీర్చుకోకుండా ఇప్పుడే వచ్చావో నాకూ తెలుసు” అని అన్నాడు దానికి ఆ మాస్టర్ ఒక్కసారిగా stun అయ్యాడు గట్టిగా చప్పట్లు కొడుతూ “వీడు మగాడు రా నా పుట్టుక నుంచి నా గురించి పూస కూడా మిస్ అవ్వకుండా చెప్పాడు అవును రా మా అమ్మ నీ చంపేశారు తరువాత నన్ను తీసుకొని వెళ్లి పిచ్చి పిచ్చి పరీక్షలు చేశారు ఆ తర్వాత లండన్ లో ఏదో చెత్త కుప్పలో పడేశారు నాగరికత కీ తగ్గట్టుగా నను నేను మార్చుకుని వచ్చా నీకు ఒక విషయం తెలుసా ఈ ధర్మశాల లో ఉన్న ఈ Vampires ఎందుకు ఇంత శక్తి తో ఉన్నాయో ఈ ఊరి లో ఉన్న కాలేజీ వెనుక ఒక మర్రి చెట్టు ఉంది తెలుసా అందులో మా అమ్మ తో Vampires గా మారిన వాళ్లు తమ ప్రాణ త్యాగం చేసి ఈ ఊరిలో ఉన్న వాళ్ళ వారసులకు తమ శక్తి నీ ఇచ్చారు అది కూడా ఇదే బుద్ధ పున్నమి రోజు ప్రతి 126 సంవత్సరాల తరువాత వచ్చే బుద్ధ పున్నమి నాడు ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు కలిసి ఉదయించి, అస్తమిస్తారు కాబట్టి ఈ రోజు ఆ ప్రాణాలు బయటికి వస్తాయి ఆ శక్తి నాకూ వస్తే ఈ ప్రపంచం మొత్తం నా పాదాక్రాంతం అవుతుంది, నీకు ఒక అవకాశం ఇస్తా నాతో కలిసిపో నేను రాజు నీ అవుతా నువ్వు సేనాధిపతి ఏమైనా చేసుకో నేను అడ్డు చెప్పను ఆలోచించు Vampire సామ్రాజ్యం లో ఒక మనిషి సేనాధిపతి ఏమంటావ్” అని అడిగాడు దానికి శ్రీను “నువ్వు ఇచ్చే ఎంగిలి నెత్తుటి కూడు తినడానికి నా వాళ్లని చంపి guilty తో చావడం కంటే ఇప్పుడే వీరుడిలా చస్తా నీకు ఇప్పుడే చెప్తున్న నను ఇప్పుడే చంపేయి లేదు అంటే చాలా బాధ పడుతావ్” అన్నాడు దానికి మాస్టర్ “వీడి లో పొగరు తగ్గడం లేదు సరే రా నువ్వు నచ్చావ్ కాబట్టి నీ చావు ప్రకృతి కీ వదిలేస్తా” అని చెప్పి శ్రీను నీ తీసుకోని వెళ్లి పులులు తిరిగే ప్రాంతంలో వేశారు.

శ్రీను నీ అడవుల్లో వదిలేసి మాస్టర్ తన సైన్యం తో ధర్మశాల కీ బయలుదేరాడు, ఇక్కడ అందరూ సిద్ధం అయ్యారు పద్దు వచ్చి స్వప్న కీ తన తాత తయారు చేసిన ఒక వెండి విల్లు కొన్ని వెండి బాణాలు ఇచ్చింది స్వప్న ఇంకా చూస్తే అందులో కొన్ని బాంబులు కూడా ఉన్నాయి Vampires తో పాటు స్వప్న కూడా యుద్ధం కీ సిద్దం అయ్యింది, మాస్టర్ సూర్యుడు అస్తమిస్తూ, చంద్రుడు ఉదయిస్తూన్న తరుణం లో తన రక్తం చుక్క ఒకటి నెల మీద రాల్చాడు దాంతో ఆ రక్తం చుక్క భూమిలో కలిసి ఒక పెద్ద భూకంపం లాగా వచ్చి ఊరు మొత్తం కన్పించింది కాలేజీ వెనుక ఉన్న మర్రిచెట్టు మీద ఒక పిడుగు పడి అందులో నుంచి మెరుపులు రావడం మొదలైంది.

మాస్టర్ వదిలిన రక్తపు బొట్టు వల్ల ఆ మర్రి చెట్టు మీద పిడుగు పడి ఆకాశం లో మేఘాలు కమ్ముకొని ఉరుముల తాకిడితో వాతావరణం మొత్తం భయంకరంగా మారింది, ఇది అంత గమనిస్తున్న vendatins మరియు clementi’s ఏమీ జరుగుతుందో తెలియని పరిస్థితి లో ఉన్నారు “వీడు మనం అనుకున్న దానికంటే బలంగా ఉన్నాడు ఎలా ఆపాలి” అని అడిగింది విద్య అప్పుడు శేఖర్ “మిత్రులారా మనం ఇన్ని రోజులు పాటు ఈ ఊరి నీ ప్రశాంతంగా పరిపాలన చేశాము మన శక్తులను ఎప్పుడు తప్పుగా వాడలేదు ఈ రోజు ఒకడు బయట నుంచి వచ్చి ఇది నాది అని అంటే ఊరుకుంటామా వాడికి కావాల్సింది మన తల అయితే ఈ తల తెంపే వీరులు ఇంకా పుట్టలేదు అని నిరూపించాలి నా వంతు గా ఈ యుద్ధం లో మన గెలుపు కోసం నా అమరత్వం నీ త్యాగం చేసి నా కూతురు కీ, కొడుకు కీ, మేనకోడలు కీ పంచుతున్నా” అని చెప్పాడు శేఖర్ దాంతో clementi’s లోని ఒక పెద్ద మనిషి తన అమరత్వం నీ త్యాగం చేసి పద్దు కీ ఇచ్చాడు అలా వయసు లో లేని Vampires తమ అమరత్వం నీ భవిష్యత్తు తరాలకు ఇచ్చి వాళ్లకు శక్తి పెంచారు కానీ అనిత మాత్రం తన అమరత్వం యవనం వదులుకోవడానికి సిద్ధం గా లేదు “త్యాగాలు ఆపి పని మొదలు పెడదాం” చెప్పింది అనిత దాంతో అందరూ ఒకసారి గా బయటకు వచ్చి చూశారు ఒక వంద మంది కీ పైగా సైన్యం వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు మాస్టర్ “మీకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాను నాతో కలిసిపోండి లేదా అంతం అయిపోండి” అన్నాడు దానికి శ్రీ వెంటనే ఒక బాగ్ తీసుకోని వెళ్లి ఆ మాస్టర్ ముందు పడేసి తిరిగి వెన్నకు వెళ్లింది ఆ మాస్టర్ సైగ చేయడం తో ఒకడు ఆ బాగ్ తెరిచి చూస్తే అందులో పృధ్వీ తల ఉంది అది చూసిన ఆ మాస్టర్ కోపంగా తన కాలి తో పృధ్వీ తల మీద అడుగు వేశాడు అప్పుడు పృధ్వీ తల పగిలింది దాంతో ఆవేశంగా గర్జించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *