పూర్ణ చంద్రుడు Part 4 2

స్వప్న తన కొడుకు చనిపోయాడు అని బాధ లో చావుకు తల వచ్చింది అప్పుడే సడన్ గా ఒక నీడ స్వప్న మీద నుంచి వేగంగా వెళ్లి చూస్తే తనను పట్టుకొని ఉన్న రెండు గబ్బిలాలు రెండు నిలువుగా చీల్చి చెరి ఒక వైపు పడ్డాయి అనిత తల ఎగిరి మాస్టర్ ముందు పడింది, అది చూసిన మాస్టర్ ఆ తల నీ తీసుకోవాలని కిందకి ఒంగినప్పుడు ఆ తల పైన ఒక అడుగు పడి ఆ తల ముక్కలు అయ్యింది అప్పుడు మాస్టర్ భయం తో వెనకు పడ్డాడు తన ముందు రక్తపు చుక్కలు కారుతున్న పంజా తో జూలు నిండిన శరీరం తో ఒక దేహం నిలబడి ఉంది తల ఎత్తి తన ముందు ఉన్నది ఎవరూ అని చూశాడు కొరల పళ్లతో, గులాబీ రంగు కనుగుడ్డు తో ఉన్న శ్రీను నీ చూసి షాక్ అయ్యాడు మాస్టర్, శ్రీను, ఆ మాస్టర్ మొహం లో మొహం పెట్టి గట్టిగా తోడేలు లాగా ఊళ వేశాడు.

శ్రీను నీ అలా చూసి అందరూ షాక్ అయ్యారు అప్పుడు శ్రీను వేసిన ఊళ కీ అడవిలో ఉన్న తోడేలు అని వచ్చి jersey devil’s మీద దాడి చేశాయి, తన ఎదురుగా ఉన్న శ్రీను నీ చూసి స్వప్న, మాస్టర్ ఇద్దరు షాక్ అయ్యారు అప్పుడు శ్రీను మనిషి లాగా మారి తన తల్లి దగ్గరికి వెళ్లి తనని పైకి లేపాడు తన కొడుకును మొత్తం తడిమి చూసింది స్వప్న “అమ్మ నీ సందేహం నిజమే నేను ఒక werewolf నాన్న కూడా ఆయనే నన్ను ఇలా మార్చాడు” అని చెప్పాడు దానికి స్వప్న ఏమీ అర్థంకాక ఏంటి అని అడిగింది.

(గంట ముందు)

శ్రీను మీదకు ఆ పులి దూకిన టైమ్ లో ఒక తోడేలు గుంపు వచ్చి ఆ పులుల తో పోరాడాయి అప్పుడు ఒక తోడేలు వచ్చి శ్రీను నీ చూస్తూ శ్రీను మొహం నాకూతు ఉంది, దాని చూసిన శ్రీను “ఎవరూ నువ్వు నాకూ ఎప్పుడు ప్రమాదం ఉన్న నా దగ్గరికి వస్తూన్నావ్” అని తన చేత్తో ఆ తోడేలు నుదుటి మీద తాకాడు దాంతో శ్రీను శరీరం వంద విద్యుత్ కాంతులు తాకినట్టు షాక్ కొట్టి కళ్లు తెరిచి చూశాడు శ్రీను తన చుట్టూ సూర్యుడు, చంద్రుడు ఉన్నాడు గులాబీ రంగు పొగ తో నిండిన ఒక చోట నిలబడి ఉన్నాడు అప్పుడు ఆ పొగ నుంచి ఒక ఆకారం తన వైపు రావడం గమనించి అటు వైపు వెళ్లాడు తన ముందు ఉన్న వ్యక్తి నీ చూసి షాక్ అయ్యాడు శ్రీను ఎందుకంటే తన ముందు ఉన్నది తన తండ్రి మనోహర్ “ఆశ్చర్యంగా ఉందా శ్రీను” అని అడిగాడు మనోహర్, “నాన్న నువ్వు ఇక్కడ నేను ఎక్కడ ఉన్నాను నేను చనిపోయాన” అని అడిగాడు దానికి మనోహర్ “లేదు నాన్న కానీ నువ్వు చావుకు, బ్రతుకు మధ్య ఉన్నావ్ నా లాగే” అని చెప్పాడు “అసలు ఏమీ జరుగుతుంది ఇక్కడ ఆ రోజు నేను పుట్టినప్పుడు నువ్వు చెప్పిన మాటలు నాకూ ఎలా అర్థం అయ్యాయి” అని అడిగాడు శ్రీను అప్పుడు మనోహర్ గట్టిగా ఒక ఊళ వేశాడు దాంతో మనోహర్ ఒక werewolf లాగా మారాడు అది చూసి శ్రీను ఆశ్చర్య పోయాడు “నువ్వు చూస్తుంది నిజమే శ్రీను నేను ఒక werewolf నీ కానీ ఇది నేను accidental గా మారింది ఆ రోజు రాత్రి నేను zoo కీ వెళ్లినప్పుడు ఒక బోనులో ఉన్న ఒక తోడేలు నన్ను ఆకర్షించింది నేను దాని కళ్లలోకి చూసి ఏదో మంత్రం వేసినట్టు దాని దగ్గరికి వెళ్లి దాని నుదుటి పైన తాకితే నాకు దాని గతం మొత్తం కనిపించింది దాని మీద జరిగిన experiment ద్వారా అది werewolf గా మారింది కానీ పూర్తి శక్తివంతంగ మారడానికి దానికి శక్తి చాల్లేదు అప్పుడు అది నా మీద దాడి చేసి నా గుండె పీకి దాని కళ్ల నుంచి నా లోకి దాని werewolf శక్తి నీ పంపింది ఆ శక్తి మొత్తం నాలో ఏదో తెలియని కొత్త మనిషి నీ సృష్టించింది ఆకలి కేకలు వేసి అక్కడ ఉన్న watchman నీ చంపేశా తరువాత ఆ guilt తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కానీ నా ఆత్మ నా నుంచి వేరు కాలేదు ఇంకో తోడేలు లోకి వెళ్ళింది అందుకే నేను నీతో ఇంకా కాంటాక్ట్ లో ఉన్నా” అని చెప్పి తన గుండె పీకి చేతిలో పట్టుకున్నాడు మనోహర్ అది గులాబీ రంగు లో ఉన్న వజ్రం లాగా మెరుస్తూ ఉంది అది చూసి శ్రీను లో ఏదో తెలియని trance లోకి వెళ్ళాడు అప్పుడు మనోహర్ ఆ వజ్రం నీ వెనకు పెట్టి “శ్రీను ఇది ప్రపంచంలోనే అతి విలువైన శక్తి దీని అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలి ఇది ఒక్కోసారి నిన్ను ఎక్కువ శక్తి కోసం విధ్వంసం కోసం ప్రేరేపించేలా చేస్తుంది, కానీ నీలో ఉన్న ప్రేమ, నిస్వార్థం, దయా గుణం, మంచితనం పైన దీని ప్రభావం పడకుండా చూసుకో నేను నువ్వు దీనికి అర్హుడివి అని నమ్మి ఇస్తున్న, నా నమ్మకం వమ్ము చేయవద్దు ఈ శక్తి నీ నువ్వు తీసుకొని ఈ తండ్రిని ఈ చావు బ్రతుకుల మధ్య నుంచి విముక్తుడిని చెయి” అని చెప్పి మళ్ళీ ఆ వజ్రం ఆకారం లోని గుండె తీసి చూపించాడు ఈ సారి శ్రీను ఆ వజ్రం వైపు బాధ్యత గా చూసి దాని తీసుకున్నాడు అది శ్రీను చేతిలోకి రాగానే ఒక్కసారిగా అయస్కాంతం లాగా తన గుండెల్లోకీ చొచ్చుకుని పోయింది, ఆ తర్వాత వెయ్యి విద్యుత్ కాంతుల వేగం, శక్తి శ్రీను నర, నరం లో ప్రవహించింది అప్పుడు తన తల్లి భయం తో పెట్టిన కేకలు విని వెళ్లి తనని కాపాడాడు శ్రీను.

(ప్రస్తుతం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *