పూర్ణ చంద్రుడు Part 4 2

శ్రీను, స్వప్న నీ పైకి లేపి తనకు ఏమీ కాలేదు అని చూస్తూ ఉన్న సమయంలో మాస్టర్ అక్కడ ఉన్న ఒక వెండి బాణం తీసుకొని వచ్చి శ్రీను కీ చాత్తి మధ్య లో గుచ్చాడు దాంతో శ్రీను గాయం కారణంగా నొప్పి తట్టుకోలేక కింద పడి గిలగిల కొట్టుకుంటూ ఉన్నాడు అప్పుడు మాస్టర్ “శత్రువు ఎదురుగా ఉన్నపుడు, అమ్మ, ప్రేమ, దోమ అని సమయం వృథా చేయకుడదురా” అని చెప్పి చెట్టు దగ్గరికి వెళుతూ అందరినీ చంపేయండి అని సైగ చేశాడు మాస్టర్ అప్పుడు స్వప్న ఆ బాణం తీసి శ్రీను గాయం మీద చెయ్యి పెట్టి బాధ పడుతు ఉంది అప్పుడు పద్దు, శ్రీ ఇద్దరు వచ్చి శ్రీను నీ చూశారు అదే టైమ్ లో devil’s వాళ్ల పైన దాడి చేయబోతే కొన్ని తోడేలు వాళ్ళకి చుట్టూ కాపలా ఉండి పోరాడుతు ఉన్నాయి, శ్రీను బాధ చూడలేక శ్రీ తన జాకెట్ తన మెడ పైన గాటు పెట్టుకొని రక్తం కారే లాగా చేసింది దానికి పద్దు నో అని చెప్పిన శ్రీ నవ్వుతూ శ్రీను కీ దగ్గరిగా వెళ్లింది అప్పుడు పైన ఆకాశం లో గులాబీ రంగు లో పున్నమి కాంతి లో ఉన్న చంద్రుడిని చూసిన శ్రీను ఒక్కసారిగా werewolf గా మారి శ్రీ రక్తపు వాసనకి తనను ఎత్తుకొని వెళ్లి కోరికి పీకుతిని ఆ రక్తం ద్వారా వచ్చిన శక్తి తో గట్టిగా ఊళ వేశాడు ఆ ఊళ శబ్దం కీ మొత్తం Vampires చెవులు పగిలి పోయాయి.

మాస్టర్ ఆ చెట్టు దగ్గరికి వెళ్లాడు అప్పుడు ఆ చెట్టు కు ఉన్న ఊడలు మెల్లగా ఆ మాస్టర్ సైగలకు కదులుతూ అతని పట్టుకున్నాయి అప్పుడే శ్రీను వచ్చి వాడిని కోటాడు దానికి ఆ మాస్టర్ ఎగిరి ఆ చెట్టుకు గుద్దుకోని వచ్చి పడ్డాడు, అప్పుడు ఆ మాస్టర్ “నువ్వు ఇంకా చావలేదా” అని చిటికె వేశాడు అప్పుడు ఒక ఊడ వచ్చి శ్రీను నీ చుట్టుకుంది దాంతో ఆ మాస్టర్ శ్రీను నీ చెట్టుకు వేలాడదీసి కొట్టడం మొదలు పెట్టాడు అప్పుడు శ్రీను తన పంజా తో ఆ ఊడలను తెంపి మాస్టర్ చెయ్యి పట్టుకుని గాల్లోకి ఎత్తి కిందకు వేసి కొట్టాడు మాస్టర్ లేచే లోపు వాడి కాలు మీద కాలు వేసి విరిచి వాడిని ఎత్తి భుజం మీద వేసుకొని వాడి శరీరం మొత్తం విరిచాడు, అప్పుడు vendatins, clementi’s అందరూ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నారు మాస్టర్ నీ కింద వేసి శేషు వైపు చూసి రమ్మని సైగ చేశాడు శ్రీను, “మీ తాత, నాన్న చావుకు కారణమైన వీడిని నీ చేత్తో నే చంపి వాళ్ల త్యాగాలకు అర్థం ఇవ్వు” అన్నాడు శ్రీను అప్పుడు స్వప్న మాస్టర్ దగ్గరికి వచ్చి “ఇందాక ఏమని చెప్పాను నువ్వు ఒక మాస్టర్ పీస్, నా కొడుకు ఇంకో మాస్టర్ పీస్ ఆ నా కొడుకు ఎప్పటికీ one and only piece” అని చెప్పింది స్వప్న మాట పూర్తి కాగానే శేషు మాస్టర్ తల తెంపి గట్టిగా గర్జించాడు సడన్ గా ఆ చెట్టు నుంచి మెరుపులు ఎక్కువ రావడం మొదలు అయ్యాయి దాంతో Vampires అందరూ వెనకు జరిగారు.

అప్పుడు శ్రీను గమనించాడు ఆ చెట్టు నుంచి విపరీతమైన శక్తి రావడం గమనించి ఒక Vampire రక్తం ద్వారా పుట్టిన శక్తి werewolf ద్వారా తగ్గోచ్చు ఏమో అని తన రక్తం చుక్కలు వేసి ఆ చెట్టు లోని శక్తి నీ తన వైపు లాకున్నాడు శ్రీను దాంతో ఒక వంద పిడుగుల శక్తి మొత్తం ఒకేసారి శ్రీను మీద పడి శ్రీను భూమి లోకి కుంగి పోతున్నాడు కానీ అలాగే ఆ శక్తి మొత్తం అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేశాడు మొత్తానికి ఆ శక్తి తన అందులోకి వచ్చింది ఆ శక్తి మొత్తం కలిపి అణిచి వేశాడు ఆ అణిచి వేతలో దాని నుంచి వచ్చిన శక్తి వల్ల చనిపోయిన vendatins, clementi’s లో చాలా మంది తిరిగి లేచ్చారు అలా దాని అదుపు చేసి స్ప్రుహ కోల్పోయి పడిపోయాడు శ్రీను.

శ్రీను తిరిగి కళ్లు తెరిచి చూసే సరికి తన ఎదురుగా వాళ్ల అమ్మ ఏదో injection చేస్తు ఉంది, శ్రీను లేవడం చూసి “రేయ్ ఆగు ఈ injection వేశాక నీ ఇష్టం” అని చెప్పి injection వేసింది ఆ తర్వాత లేచి చూస్తే శ్రీ, పద్దు ఇద్దరు రెండు bouquet లు తెచ్చి ఇచ్చారు, శ్రీ నీ చూసిన శ్రీను షాక్ అయ్యాడు “ను ను ను నువ్వు ఎలా వచ్చావ్ నేనే నిన్ను” అని ఆగిపోయాడు దానికి శ్రీ “నువ్వే నను గాయపరిచావ్ మళ్లీ తిరిగి ప్రాణం పోశావ్” అని చెప్పింది శ్రీ దాంతో శ్రీను అయోమయంగా ఉన్నాడు అప్పుడు పద్దు కొన్ని tablets తెచ్చి శ్రీను కీ వేసింది “తొందరగా రెడీ అవ్వు నీ కోసం చాలా surprise లు ఉన్నాయి” అని చెప్పింది పద్దు దాంతో శ్రీను “అవును ఎన్ని రోజులు అయ్యింది నేను లేచి తల మొత్తం ఒక భారంగా మారింది” అని అన్నాడు దానికి స్వప్న వారం రోజులు అని చెప్పింది దాంతో శ్రీను వెళ్లి రెడీ అయ్యి వచ్చాక, కాలేజీ విద్యార్థులు అందరూ శ్రీను ఇంటి ముందు నిలబడి ఉన్నారు, ఏమీ జరిగిందో ఎందుకు ఇంతమంది తన కోసం వచ్చారో తెలియలేదు శ్రీను కీ అప్పుడు అందరూ కలిసి ఒక పెద్ద flexi ఎత్తి “Thank you for saving us Hero” అని చూపించారు అప్పుడు కొంతమంది వచ్చి శ్రీను కీ bouquet ఇచ్చి “శ్రీను ఆ రోజు జరిగిన ఫైర్ ఎటాక్ నుంచి మమ్మల్ని కాపాడాలని నువ్వు నీ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ధైర్యం చేశావు చాలా థాంక్స్” అని చెప్పారు దానికి శ్రీను కీ ఏమీ అర్థం కాలేదు ఫైర్ ఎటాక్ ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు, ఆ తర్వాత శ్రీ, పద్దు ఇద్దరు శ్రీను నీ తీసుకోని ధర్మాసనం దగ్గరికి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *